మోడీ వస్తున్నారు - ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు! | Modi to visit Jammu Kashmir on Friday | Sakshi
Sakshi News home page

మోడీ వస్తున్నారు - ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు!

Published Thu, Jul 3 2014 10:54 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోడీ వస్తున్నారు - ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు! - Sakshi

మోడీ వస్తున్నారు - ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు!

జమ్మూ కాశ్మీర్ కి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రానున్నారు. దీంతో రెచ్చిపోయిన పాక్ సేనలు గత 24 గంటల్లో రెండు సార్లు అంతర్జాతీయ సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించాయి. రెండు సార్లూ మట్టి కరిచాయి. ముగ్గురు పాక్ తీవ్రవాదులు ఖతం అయ్యారు.


పూంఛ్ జిల్లాలోని కృష్ణాఘాటీ సెక్టర్ లోనే ఈ రెండు చొరబాటు యత్నాలు జరిగాయి. తొమ్మిది మంది ఉగ్రవాదులు చొరబాటు యత్నానికి పాల్పడినప్పుడు కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ఉగ్రవాదులుచనిపోయారు. మిగతా వారు వెనుతిరిగారు.


మన జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత మోడీ తొలిసారి జమ్మూ కాశ్మీరుకు రానున్నారు. ఆయన జమ్మూలో ఉధమ్ పూర్ కట్రా రైల్వే సేవలను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి శ్రీనగర్ వెళ్లి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement