
శ్రీనగర్: కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్‌లో భద్రతా బలగాలు పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్(బ్యాట్) చొరబాటు యత్నాన్ని భగ్నం చేసి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఎల్‌వోసీ వెంట చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులను ఆర్మీ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని, అందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమైందని వెల్లడించారు.