Offensive
-
ఏఎస్సీఐ సంచలన రిపోర్ట్ - డిజిటల్ మీడియాలోనే ఎక్కువగా అవే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) అభ్యంతరకర ప్రకటనలు అత్యధికంగా డిజిటల్ మీడియాలోనే దర్శనమిచ్చాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ (ఏఎస్సీఐ) ఒక నివేదికలో తెలిపింది. అయిదింట నాలుగొంతుల అభ్యంతర యాడ్లు డిజిటల్ మీడియా నుంచే ఉన్నట్లు వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే 2023–24 ప్రథమార్ధంలో ఏఎస్సీఐ 27 శాతం అధికంగా 3,501 ప్రకటనలను సమీక్షించింది. సమీక్షాకాలంలో ఫిర్యాదుల సంఖ్య 34 శాతం పెరిగి 4,491కి చేరింది. ఏఎస్సీఐ ప్రాసెస్ చేసిన ప్రకటనల్లో ఇన్ఫ్లుయెన్సర్ల కేసులు 22 శాతం ఉన్నాయి. ఎనిమిది ఉల్లంఘనలతో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. రంగాల వారీగా చూస్తే .. అత్యధికంగా హెల్త్‌కేర్‌లో, ఆ తర్వాత సంప్రదాయ విద్య, వ్యక్తిగత సంరక్షణ, గేమింగ్ విభాగాల్లో ఉల్లంఘనలు జరిగాయి. నాలుగింట మూడొంతుల ఫిర్యాదులను ఏఎస్సీఐ సుమోటోగా చేపట్టగా, వినియోగదారుల నుంచి వచ్చినవి 21 శాతం ఉన్నాయి. ఉల్లంఘనల్లో వాటాలు చూస్తే డిజిటల్ మీడియా 79 శాతం, ప్రింట్ మాధ్యమం 17 శాతం, టీవీ మాధ్యమం 3 శాతంగా ఉన్నాయి. -
తీవ్రతరమవుతున్న యుద్ధం... తదుపరి దశ దాడులకు దిగుతున్న రష్యా!
Russian rockets and missiles have pounded cities in strikes: రష్యా బలగాలు క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌లోని నగరాలను నేలమట్టం చేశాయి. దీంతో ఆయా నగరాల్లో వేలాదిమంది మృతి చెందారు. తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులు జరిపిన రష్యా బలగాలు ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్ దాడులను నిరోధించేలా తమ కార్యకలాపాలను తీవ్రతరం చేసింది రష్యా. అదీగాక ఉక్రెయిన్ సైన్యాన్ని నిరోధించేలా దాడులు తీవ్రతరం చేయమని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదేశించారు కూడా. ఈ మేరకు రష్యా భూ, వాయు, జల మార్గాల్లో దాడులను వేగవంతం చేసింది. ప్రస్తుతం డోనెట్స్క్కి తూర్పు ప్రాంతమైన ఉక్రెయన్‌లోని కీలక నగరం స్లోవియన్స్క్‌పై దాడి చేసేందుకు రష్యా బలగాలు రెడీ అవుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఈ మేరకు తూర్పు ఉక్రెయిన్ నుంచి దాడులకు తెగబడ్డ రష్యా ఒక్కో నగరాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంటూ...తదుపరి దశ దాడులకు సన్నహాలు చేస్తోంది. అంతేకాదు రష్యా దక్షిణ ఉక్రెయిన్‌లో ఆక్రమించిన ప్రాంతాలలో రష్యా తన రక్షణ స్థానాలను పటిష్టం చేసుకుంటూ దాడులుకు సమయాత్తమవుతోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలు సాయంతో సుమారు 30 రష్యన్ లాజిస్టిక్స్, మందుగుండు సామగ్రి కేంద్రాలపై విజయవంతమైన స్ట్రైక్స్ స్ట్రింగ్ జరిపింది. దీనికి ప్రతస్పందనగా రష్యా దాడులను తీవ్రతరం చేయడమే కాకుండా క్షిపిణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. ఏదీఏమైన రష్యా ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ... ఉక్రెయిన్‌ని మట్టికరిపించే దిశగా విధ్వంసకర దాడులకు తెగబడుతోంది -
‘నీకున్న విజ్ఞత.. పెద్దలకు కూడా లేదు’
వాషింగ్టన్: ఆడవారి టాపిక్ వస్తే చాలు.. మనలో చాలా మంది నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటారు. అలా మాట్లాడటం చాలా గొప్పగా ఫీలవుతుంటారు. అలాంటివారు ఈ చిన్నారిని చూసి బుద్థి తెచ్చుకోవాలి. వయసులో చిన్నదే కావచ్చు కానీ ఆలోచనలో మాత్రం చాలా మంది ‘పెద్ద’లకంటే ఎన్నో రెట్లు పెద్దది. అందుకే ఈ చిన్నారి చేసిన పని ప్రశంసలు అందుకుంటుంది. ఇంతకు ఎవరా చిన్నారి.. ఏమా పని.. ఆ వివరాలు.. రిథమ్ పచేకో అనే పదేళ్ల చిన్నారి ముర్రేలోని గ్రాంట్ ఎలిమెంటరీ స్కూల్లో నాల్గవ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పచేకో మ్యాథ్య్ టీచర్ హోం వర్క్‌లో ఓ లెక్క ఇచ్చింది. ఓ పట్టికలో నలుగురు నాల్గవ తరగతి విద్యార్థినిల బరువులు ఇచ్చి వారిలో తక్కువ బరువున్న విద్యార్థిని కంటే ఇసాబెల్ ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమంది. అయితే ఈ లెక్క పచేకోకు నచ్చలేదు. దాంతో వర్క్‌బుక్ మీద తాను ఈ లెక్కను చేయలేనని తెలపడమే కాక అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. పచేకో తన నోట్స్‌లో ‘ఏంటిది.. ఇది వారిని చాలా బాధపెడుతుంది. నేను ఇంత కఠినంగా ఉండాలనుకోవడం లేదు. ఈ లెక్కను నేను చేయడం లేదు. మీరిచ్చిన సమస్య చాలా బాగుంది. కానీ ఓ మనిషి మిగతా వారి కంటే ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమనడం నాకు నచ్చలేదు. అందుకే మీరిచ్చిన హోం వర్క్‌ను నేను చేయడం లేదు’ అని తెలిపింది. పచేకో మ్యాథ్స్ టీచర్ కూడా ఆ చిన్నారి చూపిన విజ్ఞతకు సంతోషించింది. వెంటనే దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నెటిజన్లు కూడా పచేకో చేసిన పనిని అభినందిస్తున్నారు. అంతేకాక ఇలాంటి తలకు మాసిన సిలబస్‌ను తయారు చేసిన అధికారులను విమర్శిస్తున్నారు. పచేకో తల్లిదండ్రులు దీనిపై స్పందిస్తూ.. ‘మా కూతురు చేసిన పనికి మేం ఎంతో గర్విస్తున్నాం. ఇంత చిన్న వయసులోనే తాను ఎంతో విజ్ఞతను చూపింది. ఏది మంచో దాని వైపే తాను నిలబడింది. చాలా సున్నితమైన అంశంపై నా కుమార్తె మరింత సున్నితంగా స్పందించింది. తన పట్ల మేం ఎంతో గర్వపడుతున్నాం’ అని తెలిపారు. -
కశ్మీర్లో చొరబాటు యత్నం భగ్నం
శ్రీనగర్: కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో భద్రతా బలగాలు పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్(బ్యాట్) చొరబాటు యత్నాన్ని భగ్నం చేసి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఎల్వోసీ వెంట చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులను ఆర్మీ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని, అందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమైందని వెల్లడించారు. -
అసభ్యకరంగా ప్రవర్తిస్తే సమాచారం ఇవ్వండి
కస్తూర్బా విద్యార్థినులతో సీఐ రంగా మోమిన్‌పేట: మహిళలు, బాలికలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ ఏవీ రంగా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులకు ‘బాలికల, మహిళల చట్టాల’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. బాలికలు పాఠశాలకు వచ్చి వెళ్లే సమయాల్లో ఎవరైనా అసభ్యకరంగా వ్రవర్తిస్తే వెంటనే 100కు గాని స్థానిక పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని చెప్పారు. మహిళలకు అండగా ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. బాలికలు, మహిళలు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. బాల్య వివాహాలు గ్రామాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని, వాటిని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని సీఐ రంగా కోరారు. ప్రతి కుటుంబంలోని బాలబాలికలు చదువుకునే విధంగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యాచారాలు, గొలుసు చోరీలు, మహిళల అక్రమ రవాణా లాంటివి మీ ఎదుట జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థినులకు సూచించారు. వివరాలు ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలి పారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజు, స్థానిక ఉప సర్పం చ్ నర్సింలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.