కొనసాగుతున్న దాడులు.. ఇద్దరు జవాన్లు మృతి | Soldier, BSF man killed; army foils LoC infiltration bid in Kupwara | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న దాడులు.. ఇద్దరు జవాన్లు మృతి

Published Thu, Oct 27 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

కొనసాగుతున్న దాడులు.. ఇద్దరు జవాన్లు మృతి

కొనసాగుతున్న దాడులు.. ఇద్దరు జవాన్లు మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో చొరబాటుదారులు, పాక్ రేంజర్ల దాడులు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు. కుప్వారా జిల్లాలో చొరబాటుదారులు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతి చెందగా.. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్‌లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు. పాక్ రేంజర్ల దాడిలో ఏడుగురు పౌరులు సైతం గాయపడ్డారని సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు.

పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో సైతం గురువారం సాయంత్రం పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆర్మీ అధికారి కల్నల్ రాజేష్ కలియా వెల్లడించారు. చొరబాటుదారుల దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని, ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement