ఎస్సైని కాల్చి చంపిన ఉగ్రవాది | Police officer killed in suspected terrorist attack in Srinagar | Sakshi
Sakshi News home page

ఎస్సైని కాల్చి చంపిన ఉగ్రవాది

Published Mon, Sep 13 2021 5:01 AM | Last Updated on Mon, Sep 13 2021 5:01 AM

Police officer killed in suspected terrorist attack in Srinagar - Sakshi

శ్రీనగర్‌: ఉగ్రవాది చేతిలో ఎస్సై హతమైన ఘటన జమ్మూకశీ్మర్‌లోని శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో తల వెనుక భాగంలో తుపాకీతో కాలి్చన దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో నమోదయ్యాయి. తీవ్రంగా గాయపడిన ప్రొబేషనరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్షిద్‌ అహ్మద్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. శ్రీనగర్‌లోని ఖన్యార్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనానంతరం పోలీసులు మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.   నిందితుల్ని గుర్తించామని, త్వరలోనే వారిని చట్టం ముందుకు తీసుకొస్తామని జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ చీఫ్‌ దిల్‌బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఓ నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో ఘటన జరిగిందని వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement