శ్రీనగర్ కాల్పుల్లో గిద్దలూరు జవాను మృతి | soldier died in srinagar firing | Sakshi
Sakshi News home page

శ్రీనగర్ కాల్పుల్లో గిద్దలూరు జవాను మృతి

Published Tue, Oct 27 2015 9:04 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

soldier died in srinagar firing

గిద్దలూరు: కాశ్మీర్‌లో జరిగిన తీవ్రవాదుల కాల్పుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయాడు. గిద్దలూరు మండలం ముండ్లపాడుకు చెందిన కంకర సుబ్బారెడ్డి (47)  ఆర్మీలో పనిచేస్తున్నాడు.

ఆయన సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడాడు. తాను త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పాడని కుటుంబసభ్యులు చెప్పుతున్నారు. ఒక గంట తర్వాత సుబ్బారెడ్డి కాల్పుల్లో గాయపడ్డారని అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అర్థరాత్రి సమయంలో సుబ్బారెడ్డి చనిపోయారని ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. కాగా, సుబ్బారెడ్డికి భార్య, ఇంటర్ చదివే కుమారుడు, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. సుబ్బారెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement