నేను ఆమెను మోసం చేశా : సూఫీ
షాకింగ్ న్యూసే, కానీ తప్పడం లేదు : అంజలి
ఒక్క ఫోటో షూట్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఇండో-పాక్‌కు లెస్బియన్ జంట అంజలి చక్ర, సూఫీ మాలిక్ షాకింగ్ న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లైన ఈ జంట తమ ఐదేళ్ల బంధానికి స్వస్తి పలికారు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
2019లో సంచలన ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశారు అంజలి, సూఫీ జంట. భారతదేశానికి చెందిన అంజలి, పాకిస్తాన్‌కు చెందిన సూఫీ సంప్రదాయ దుస్తుల్లో, వర్షంలో డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలతో తమ బంధాన్ని బహిర్గతం చేశారు. అంతేకాదు న్యూయార్క్‌లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లో ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటరనుకున్న ఈ లవ్‌బర్డ్స్ తాజాగా పెళ్లిరద్దు చేసుకోవడం హాట్ టాపిక్‌గా నిలిచింది.
"ఇది షాక్‌గా అనిపించవచ్చు, కానీ మా ప్రయాణం మారుతోంది. సూఫీ చేసిన మోసి కారణంగా మేము మా పెళ్లిని రద్దు చేసుకోవాలని, మా సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాము" అని అంజలి ఒక పోస్ట్‌లో పేర్కొంది.
మరోవైపు అంజలిని మోసం చేసినట్లు సూఫీ స్వయంగా అంగీకరించింది. ‘‘నేను గుర్తించ లేనంత తప్పిదం, ద్రోహం చేశాను. మోసం చేసా. నాకు తెలియకుండానే ఆమెను విపరీతంగా బాధపెట్టాను. నా తప్పిదానికి కట్టుబడి ఉన్నా. ఆమెను క్షమాపణలు కోరుతున్నా’’ అంటూ సూఫీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది.
2019లొ అంజలి, సూఫీ జంట్ తమ బంధాన్ని ఒకఫోటోషూట్ ద్వారా ప్రకటించారు. టర్నెట్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment