భారతీయ వివాహాలు అంటేనే లగ్జరీగా ఉంటాయి. ఖర్చులు, వేస్ట్ రెండూ అధికంగానే ఉంటాయి. పెళ్లి అనంగానే డెకరేషన్ దగ్గర నుంచి భోజనంలో పెట్టే యూజ్ అండ్ త్రో ప్లేట్‌లు,గ్లాస్‌లు, వడ్డించే భోజనం వరకు ఎంత చెత్త వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేవిధంగా వృధా కూడా చేస్తుంటాం. అవన్నీ పర్యావరణానికి నష్టమే. ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్‌ల పేరుతో ఇచ్చే బహుమతులు.. ప్యాకే చేసే పాలిథిన్ కవర్లు వంటి చెత్త ఎంతో వస్తుంది. ఇలా వాటన్నింటికీ చెక్‌పెట్టేలా పర్యావరణమే పరవశించి దీవించేలా వివాహం చేసుకుంది ఓ జంట. వారెవ్వా వెడ్డింగ్ అంటే ఇది కదా..! అని అంతా అనుకునేలా పర్యావరణ స్ప్రుహ కలిగించేలా పెళ్లి చేసుకుంది.
మర్చంట్ నేవీలో చీఫ్ ఆఫీసర్ అశ్విన్ మాల్వాడే అతని భార్య, మార్కెటింగ్ ప్రొఫెషనల్ నుపుర్ అగర్వాల్ జీరో వేస్ట్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. అందరిలో పర్యావరణం పట్ల బాధ్యతతో వ్యవహరించాలనే ఆలోచనకు నాందిపలికేలా సరికొత్త విధంగా వివాహం చేసుకున్నారు. ముంబైలోని వెర్సోవా బీచ్‌లో బీచ్ క్లీనప్ డ్రైవ్ కారణంగా.. ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. అలా తొలిసారిగా కలుసుకున్న ఈ ఇద్దరు తమ అభిరుచులు కూడా ఒక్కటే కావడంతో వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు.
తమ అభిరుచికి అనుగుణంగా తమ వివాహం పర్యావరణహితంగా ఉండేలా ప్లాన్ చేశారు. అలానే తమ వెడ్డింగ్ డెకరేషన్‌లో మొత్తం పూలు, ఆకుపచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఊరేగింపులకు కర్బన ఉద్గారాలు తగ్గించేలా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే భోజనాల్లో మిగిలిపోయిన ఆహారం పేదలకు పంపిణీ చేశారు. దీంతోపాటు వారి పెళ్లిలో వచ్చిన వ్యర్థాలను కంపోస్ట్ చేయడమే గాక ప్రతిగా సుమారు 300కు పైగా చెట్లను నాటారు. పర్యావరణ స్ప్రుహతో ఈ జంట చేసుకున్న వివాహం అందిరికీ స్ఫూర్తిగా నిలిచింది.
(చదవండి: ఈ ఏడాది తిరుగులేదు అనేలా సంతోషభరితంగా సాగిపోవాలంటే..!)
Comments
Please login to add a commentAdd a comment