ధూమపానం సేవించడం అనేది ఓ ఫ్యాషన్‌లా మారింది యువతకు. ఏదో సరదాగా ట్రై చేసి.. చివరికి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కొందరూ మాత్రం పొగరాయుళ్లుగా మారిపోవడం లేదు. మరికొందరికి మాత్రం అదొక బలహీనతలా మారిపోతోంది ఈ వ్యసనం. అయితే ఇలాంటి బలహీనతతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఈ ధూమపాన అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఎంతటి భయనాక నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే కంగుతింటారు. అయితే అతడు ఈ వ్యసనాన్ని జయించేందుకు ఇలాంటి నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం అనేది ప్రశంసించదగ్గ విషయం. ఆ నేపథ్యంలోనే ఆ వ్యక్తి సెన్సేషన్‌గా మారి వార్తల్లో నిలిచాడు కూడా. అతడెవరంటే..
టర్కిష్‌కి చెందిన ఇబ్రహీం యుసెల్(Ibrahim Yucel) పొగ తాగడం మానేయాలని(Quit Smoking) గట్టిగా బీష్మించుకున్నాడు. కానీ ఎంతలా ఆ అలవాటుని వదులుకుందామన్నా..సాధ్యం కాలేదు. తన పిల్లల పుట్టిన రోజులప్పుడు, తమ పెళ్లిరోజు అప్పుడు.. ఇక ఈ రోజు నుంచి సిగెట్ మానేస్తానని ఒట్టు పెట్టుకోవడం..మళ్లీ ఏదో ఒక బలహీన క్షణంలో తెలియకుండానే తాగడం. ప్రతిసారి తన నిర్ణయాన్ని బ్రేక్ చేసేయ్యడం ఓ భయానక బలహీనతగా మారింది.
ఇక లాభం లేదనుకుని ఏకంగా బోను(Cage) మాదిరిగా హెల్మెట్‌ని తయారు చేయించుకుని దాన్ని తలకు తగిలించుకుని లాక్ చేసేసుకున్నాడు. బయటకు కూడా మనోడు అలానే వెళ్తాడట. ఎందుకంటే ఎవర్ని చూసినా.. మళ్లీ నాలిక ఓ దమ్ము కొట్టు బ్రదర్.. అంటాదేమోనన్న భయంతో తలకు ఇలా ఇనుప ఊచల బోను మాదిరి హెల్మట్ ధరించుకుని వెళ్తున్నాడు.
ఇలా వెళ్లడంతోనే యూసెల్ ఓ సెన్సేషన్ వ్యక్తిగా మారిపోయాడు. ఆ విషయం కాస్త దావనంలా వ్యాపించి మీడియా వరకు చేరడంతో వింత వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. పదకొండేళ్ల క్రితం మీడియాలో బోనులో తలను లాక్ చేసుకున్ని వ్యక్తి అంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అయితే కేవలం భోజనం చేసేటప్పడూ లేదా ఏదైనా తినాలనుకున్నప్పుడూ మాత్రమే భార్య లాక్‌ని ఓపెన్ చేస్తుందట.
ఆయన ఒకప్పుడు రోజుకి రెండు సిగరెట్ ప్యాకెట్లు హాంఫట్ చేసేవాడట. దీనివల్ల కలిగే అనారోగ్య ప్రమాదాల రీత్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు యూసెల్. ఈ వ్యసనం నుంచి బయటపడాని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు యూసెల్. మరీ యూసెల్ ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డాడా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(world Health Organisation) కూడా ప్రతి ఏడాది ఈ పొగాకు కారణం దాదాపు ఎనిమిది మిలియన్ల మంది మరణిస్తున్నట్లు చెబుతోంది. మధ్య తరగతి కుటుంబాల్లోనే ఈ వ్యసనానికి సంబంధించిన మరణాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
He quit because his father died of lung cancer. pic.twitter.com/RAWSVJvCXY
— Clover Lavender (@AyoolaMatthee) November 7, 2024
(చదవండి: కామ్య... అఖండ ఖ్యాతి..! 17 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించింది..!)
Comments
Please login to add a commentAdd a comment