Ibrahim
-
తలనే లాక్ చేశాడు..! తాళం మాత్రం భార్య చేతిలో..
ధూమపానం సేవించడం అనేది ఓ ఫ్యాషన్‌లా మారింది యువతకు. ఏదో సరదాగా ట్రై చేసి.. చివరికి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కొందరూ మాత్రం పొగరాయుళ్లుగా మారిపోవడం లేదు. మరికొందరికి మాత్రం అదొక బలహీనతలా మారిపోతోంది ఈ వ్యసనం. అయితే ఇలాంటి బలహీనతతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఈ ధూమపాన అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఎంతటి భయనాక నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే కంగుతింటారు. అయితే అతడు ఈ వ్యసనాన్ని జయించేందుకు ఇలాంటి నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం అనేది ప్రశంసించదగ్గ విషయం. ఆ నేపథ్యంలోనే ఆ వ్యక్తి సెన్సేషన్‌గా మారి వార్తల్లో నిలిచాడు కూడా. అతడెవరంటే..టర్కిష్కి చెందిన ఇబ్రహీం యుసెల్(Ibrahim Yucel) పొగ తాగడం మానేయాలని(Quit Smoking) గట్టిగా బీష్మించుకున్నాడు. కానీ ఎంతలా ఆ అలవాటుని వదులుకుందామన్నా..సాధ్యం కాలేదు. తన పిల్లల పుట్టిన రోజులప్పుడు, తమ పెళ్లిరోజు అప్పుడు.. ఇక ఈ రోజు నుంచి సిగెట్ మానేస్తానని ఒట్టు పెట్టుకోవడం..మళ్లీ ఏదో ఒక బలహీన క్షణంలో తెలియకుండానే తాగడం. ప్రతిసారి తన నిర్ణయాన్ని బ్రేక్ చేసేయ్యడం ఓ భయానక బలహీనతగా మారింది. ఇక లాభం లేదనుకుని ఏకంగా బోను(Cage) మాదిరిగా హెల్మెట్‌ని తయారు చేయించుకుని దాన్ని తలకు తగిలించుకుని లాక్ చేసేసుకున్నాడు. బయటకు కూడా మనోడు అలానే వెళ్తాడట. ఎందుకంటే ఎవర్ని చూసినా.. మళ్లీ నాలిక ఓ దమ్ము కొట్టు బ్రదర్.. అంటాదేమోనన్న భయంతో తలకు ఇలా ఇనుప ఊచల బోను మాదిరి హెల్మట్ ధరించుకుని వెళ్తున్నాడు. ఇలా వెళ్లడంతోనే యూసెల్ ఓ సెన్సేషన్ వ్యక్తిగా మారిపోయాడు. ఆ విషయం కాస్త దావనంలా వ్యాపించి మీడియా వరకు చేరడంతో వింత వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. పదకొండేళ్ల క్రితం మీడియాలో బోనులో తలను లాక్ చేసుకున్ని వ్యక్తి అంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అయితే కేవలం భోజనం చేసేటప్పడూ లేదా ఏదైనా తినాలనుకున్నప్పుడూ మాత్రమే భార్య లాక్‌ని ఓపెన్ చేస్తుందట. ఆయన ఒకప్పుడు రోజుకి రెండు సిగరెట్ ప్యాకెట్లు హాంఫట్ చేసేవాడట. దీనివల్ల కలిగే అనారోగ్య ప్రమాదాల రీత్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు యూసెల్. ఈ వ్యసనం నుంచి బయటపడాని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు యూసెల్. మరీ యూసెల్ ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డాడా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(world Health Organisation) కూడా ప్రతి ఏడాది ఈ పొగాకు కారణం దాదాపు ఎనిమిది మిలియన్ల మంది మరణిస్తున్నట్లు చెబుతోంది. మధ్య తరగతి కుటుంబాల్లోనే ఈ వ్యసనానికి సంబంధించిన మరణాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. He quit because his father died of lung cancer. pic.twitter.com/RAWSVJvCXY— Clover Lavender (@AyoolaMatthee) November 7, 2024 (చదవండి: కామ్య... అఖండ ఖ్యాతి..! 17 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించింది..!) -
ఎవరిని చూసుకుని ఈ జులుం?
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘నువ్వేం చూస్తావు రా.. నన్ను నువ్వేం చేస్తావు.. మళ్లీ చెబుతా విను.. ఇక్కడి నుంచి దెం..ని పోండి’ అంటూ చూపుడు వేలితో హెచ్చరిస్తూ, భీకరమైన గొంతుతో.. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని సీఐ ఇబ్రహీం దుర్భాషలాడుతూ బెదిరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఎవరిని చూసుకుని ఆ సీఐ ఇలా రెచ్చిపోయారంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఖాకీ డ్రస్సు విప్పేసి ‘పచ్చ’ చొక్కా, ప్యాంటు ధరించాలని ప్రజలు సూచిస్తున్నారు. వీధి రౌడీని మరిపిస్తూ మందు బాబులా చిందులేసిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మిగనూరు సోమప్పసర్కిల్లో ఆ పార్టీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. సీఐ ఇబ్రహీంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చెన్నకేశవరెడ్డికి క్షమాపణలు చెప్పాలని ఆయన కుమారుడు ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.సీఐపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేస్తామని చెప్పారు. సీఐ ఇబ్రహీంను సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. అతడిని విధుల నుంచి తప్పించాలన్నారు. ఇబ్రహీంపై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వీడియో వైరల్ఎమ్మిగనూరు నియోజకవర్గం పార్లపల్లిలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సీఐ ఇబ్రహీం.. చెన్నకేవశరెడ్డిని బెదిరించిన తీరు, సీఐ బాడీ లాంగ్వేజ్, దబాయిస్తూ మాట్లాడిన మాటలు, అయినప్పటికీ సహనం కోల్పోకుండా చెన్నకేవశరెడ్డి మాట్లాడిన తీరు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. చెన్నకేశవరెడ్డి వయస్సు 82 ఏళ్లు. తన రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అత్యంత గౌరవంగా గడిపారు. ఏ పార్టీ, ఏ వ్యక్తి అతన్ని అగౌరవ పరిచిన సందర్భం లేదు. అధికారులు, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలను కూడా ఎంతో గౌరవంగా సంభోదిస్తూ ‘అజాత శత్రువుగా, పెద్దాయన’గా గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తిని అరేయ్.. ఒరేయ్.. అంటూ సీఐ బెదిరించడాన్ని జిల్లా వ్యాప్తంగా అంతా తప్పుపడుతున్నారు. చెన్నకేశవరెడ్డి సహనంతో మాట్లాడుతున్నా, అకారణంగా సీఐ రెచ్చిపోయి బెదిరించడం సరికాదని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. ఘటన జరిగిన తీరిదిపార్లపల్లె 38వ నీటి వినియోగదారుల సంఘానికి శనివారం ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వారికి మద్దతుగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి బంధువులు విరూపాక్షిరెడ్డి, బాలిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి స్కూలు లోపలికి వెళ్లారు. వీరికి ఓటు హక్కు కూడా లేదు. వీరు వెళ్లిన తర్వాత గేటుకు తాళం వేశారు. చెన్నకేశవరెడ్డి తన కుటుంబ సభ్యులను పోటీ చేయించేందుకు 8 గంటలకు అక్కడికి వెళ్లారు. 9 – 9.45 గంటల వరకూ నామినేషన్లు. అయితే టీడీపీ మినహా మిగిలిన వారెవ్వరినీ సీఐ ఇబ్రహీం లోపలికి వెళ్లనివ్వలేదు. ‘లోపల టీడీపీ వాళ్లు ఉన్నారు. మమ్మల్ని నామినేషన్ వేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు..’ అని మాజీ ఎమ్మెల్యే అడిగారు. దీనికి సీఐ ఇబ్రహీం వేలితో హెచ్చరిస్తూ, తన చేతిని ప్రైవేటు పార్ట్స్ వైపు చూపిస్తూ.. తీవ్రంగా బెదిరించారు. ‘దెం..ని పోండి’ అని బూతులు మాట్లాడారు. అయినప్పటికీ చెన్నకేశవరెడ్డి ఓర్పుగానే తన వాళ్లను లోపలికి పంపాలని అడిగారు. ఆపై ఇతర పోలీసులు వచ్చి చెన్నకేశవరెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్‌కు దూరంగా ఉన్నా కూడా అక్కడ ఉండకుండా పంపించేశారు. చెన్నకేశవరెడ్డి వర్గీయులను నామినేషన్ కూడా వేయించలేదు. గేటు వేసిన తర్వాత టీడీపీ వ్యక్తులను నిచ్చెనపై నుంచి లోపలికి పంపి ఎన్నికలు ముగించేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వయస్సును కూడా గౌరవించకుండా సీఐ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ అకీల్ మృతి?
బీరుట్: వాకీటాకీల పేలుళ్లతో మొదలైన ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఘర్షణ రోజురోజుకూ క్షిపణులు, డ్రోన్ల దాడులతో మరింత ముదురుతోంది. శుక్రవారం తమ ఉత్తర సరిహద్దు ప్రాంతాలపై హెజ్బొల్లా దాడులు చేసినందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ఏకంగా లెబనాన్ దేశ రాజధాని బీరుట్ నగర సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. శుక్రవారం సాయంత్రం బీరుట్కు దక్షిణాన ఉన్న దహియే జిల్లాలోని జన సమ్మర్ద జామాస్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో 12 మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 66 మంది గాయపడ్డారు. హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ఈ ప్రాంతంపై జరిగిన ఈ దాడిలో ఒక బహుళ అంతస్తుల భవంతి నేలమట్టమైంది. మృతుల సంఖ్య పెరిగే వీలుంది. హెజ్బొల్లా సీనియర్ మిలటరీ అధికారి, ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అకీల్ సైతం చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొంది. అకీల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని ప్రకటించింది. హెజ్బొల్లా ‘రద్వాన్ ఫోర్స్’ సాయుధ యూనిట్‌తో ఇతను సమావేశం అయిన సందర్భంగా దాడి చేసి అంతమొందించామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి అవిచాయ్ అడ్రేయీ చెప్పారు. అయితే అకీల్, ఇతర కమాండర్ల మరణాన్ని హెజ్బొల్లా ధృవీకరించలేదు. అయితే అదే ప్రాంతంలో అకీల్ ఉన్నమాట వాస్తవమేనని హెజ్బొల్లా అధికార ప్రతినిధి చెప్పారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. జూలైలో జరిపిన దాడుల్లో సీనియర్ హెజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ చనిపోయారు. 170 రాకెట్లతో విరుచుకుపడిన హెజ్బొల్లాహెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాహ్ గురువారం టెలివిజన్ ప్రసంగం వేళ తమ రాకెట్ లాంఛర్లను ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేసినందుకు ప్రతిగా హెజ్బొల్లా శుక్రవారం ఉదయం ఉత్తర ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల రక్షణ స్థావరాలు, బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపైకి హెజ్బొల్లా పలు దఫాల్లో 170 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇందులో జరిగిన ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఎవరీ ఇబ్రహీం అకీల్? రద్వాన్ ఫోర్స్ ఆపరేషన్స్ కమాండర్. గతంలో హెజ్బొల్లా అత్యున్నత సాయుధ విభాగం ‘జిహాద్ కౌన్సిల్’ సభ్యుడు. ఇతనిపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, నావికాదళ బ్యారెక్‌లపై ఉగ్రదాడుల్లో 300 మందికిపైగా చనిపోయారు. వీటిలో అకీల్ పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తోంది. 1980 దశకంలో కొందరు జర్మన్లు, అమెరికన్లను బంధించాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. తహ్సీన్ అనే మారుపేరుతో తిరిగే ఇతని వివరాలు చెప్పినా, పట్టిచి్చనా రూ.58 కోట్లు ఇస్తానని గతేడాది అమెరికా నజరానా ప్రకటించింది. 2019లోనే ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. -
ముంబయ్ పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పరిస్థితి విషమం
-
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం
-
‘‘రైజినా డైలాగ్’’కు ఇరాన్ దూరం
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే నెలలో జరిగే ‘‘రైజినా డైలాగ్’’ సదస్సుకు ఇరాన్ హాజరు కావడం లేదు. ఈ సదస్సుకి హాజరుకావాల్సిన ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సిన్ అమీర్ అబ్దుల్లా భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్ఛ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించనున్న రైజినా డైలాగ్పై ప్రచార వీడియోలో ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఒక మహిళ జుట్టు కట్ చేసుకుంటున్న విజువల్స్ ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఫొటో పక్కనే, మహిళ జుట్టు కత్తిరించుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో ఉండడంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధ్యక్షుడితో పాటు నిరసనకారుల్ని చూపించడాన్ని ఆక్షేపించిన భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం ప్రచార వీడియోలో ఆ భాగాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం దానిని తొలగించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇరాన్ ఈ సదస్సుకి హాజరుకాబోవడం లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన చర్చ జరపడానికి 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం రైజినా డైలాగ్స్‌ను నిర్వహిస్తోంది. -
మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతిచ్చిన బద్ధ శత్రువు
కౌలాలంపూర్: మలేసియా సీనియర్ నేత, సంస్కరణలవాదిగా పేరున్న అన్వర్ ఇబ్రహీం(75) ఆ దేశ నూతన ప్రధానమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 112 సీట్లు కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్వర్ నేతృత్వంలోని అలయెన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు గెలుచుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కక హంగ్ ఏర్పడటంతో రాజు జోక్యం చేసుకున్నారు. అన్వర్ సారథ్యంలోని ఐక్య కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు బద్ధ వ్యతిరేకి, దీర్ఘకాలం అధికారంలో ఉన్న యునైటెడ్ మలయీస్ నేషనల్ ఆర్గనైజేషన్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. దీంతో సందిగ్ధానికి తెరపడింది. నేషనల్ ప్యాలెస్‌లో గురువారం రాజు సుల్తాన్ అహ్మద్ షా ప్రధానిగా అన్వర్‌తో ప్రమాణం చేయించారు. చదవండి: కిమ్‌కి అంత భయమా?.. ట్రంప్‌ని మించి పోయాడు! -
జో బైడెన్‌తో భేటీ కాను
దుబాయ్: బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, స్థానిక పౌరసేనలకు మద్దతు వంటి అంశాల్లో తమ వైఖరి మారబోదని ఇరాన్ కాబోయే అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కుండబద్దలు కొట్టారు. వీటిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చించబోనని, ఆయనతో భేటీ అయ్యే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 1988లో 5,000 మందిని సామూహికంగా ఉరితీసిన ఘటనలో రైసీ పాత్ర గురించి మీడియా ప్రస్తావించగా.. తనను తాను మానవ హక్కుల పరిరక్షకుడిగా అభివర్ణించుకున్నారు. ఇప్పుడు దేశ అధ్యక్షుడిగా మానవ హక్కులను కాపాడడం తన విధి అన్నారు. ఇరాన్‌పై విధించిన అన్ని రకాల అణచివేత ఆంక్షలను ఎత్తివేయాల్సిన బాధ్యత అమెరికాపై ఉందని వ్యాఖ్యానించారు. తమ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్, స్థానిక మిలీషియా సంస్థలకు మద్దతుపై మాట్లాడాల్సింది, చర్చించాల్సింది ఏమీ లేదని పేర్కొన్నారు. తమ శత్రుదేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దూకుడును అడ్డుకోవడానికి యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థకు ఇరాన్ అండగా ఉండటం తెల్సిందే. -
పెళ్లికి ముందు అబ్బాయికి అనుభవం అడగరే?
కర్ణాటక, శివాజీనగర: ఉద్యోగం ఇచ్చేటపుడు ఏమి అనుభవం ఉందని అడిగేవారు, పెళ్లిచూపుల్లో అబ్బాయికి ఏమి అనుభవం ఉందని ఎందుకు అడగరు? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలు గురువారం విధాన పరిషత్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు మహిళలకు అవమానకరమని బీజేపీ ఎమ్మెల్సీ తేజస్వినిగౌడ వాకౌట్ చేయగా, ఇతర సభ్యులు ఆయనపై మండిపడ్డారు. భారత రాజ్యాంగంపై చర్చ ఆరంభించిన ఇబ్రహీం ఈ మాటలనగానే తేజస్విని గౌడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాషాయ సభ్యులు నారాయణస్వామి, రవికుమార్, అరుణ్ శహాపుర, సుబ్రమణి తదితర సభ్యులు లేచి నిలబడి ఆమెకు మద్దతు పలికారు. ఇబ్రహీం ఆడ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు పిల్లాడికి అనుభవాన్ని అడిగారా? అని ప్రశ్నించారు. ఈ దశలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇబ్రహీం క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఇబ్రహీం పట్టించుకోకుండా చర్చను కొనసాగిస్తుండగా తేజస్వినిగౌడ సభ నుంచి వెళ్లిపోయారు. బీజేపీ సభ్యులంతా ఇబ్రహీం క్షమాపణ చెప్పాలని పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. వ్యాఖ్యలు ఉపసంహరణ విపక్షనేత ఎస్.ఆర్.పాటిల్, జేడీఎస్ సభ్యుడు బసవరాజ హొరట్టి తదితర సభ్యులు ఈ విషయమై సమాలోచన జరిపారు. చివరకు బసవరాజ హొరట్టి ఇబ్రహీం ఆ మాటను మాట్లాడకుండా ఉండాల్సింది. ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. దీంతో ఇబ్రహీం తన మాటలను ఉపసంహరించుకున్నట్లు తెలపడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. మళ్లీ ఈవీఎంలపై రగడ ఈవీఎంలలో గోల్మాల్ జరుగుతోందని ఇబ్రహీం వ్యాఖ్యానించడంతో మళ్లీ మాటల యుద్ధం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు ఉండరాదని, బ్యాలెట్ పేపర్ తీసుకురావాలని చెబితే మీకెందుకు కష్టమని ఇబ్రహీం ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తేనే ఈవీఎంలు సమస్య అవుతాయి, కాంగ్రెస్ గెలుపొందినప్పుడు అవి కనిపించవా? అని ప్రశ్నించారు. ఈవీఎంలు దుర్వినియోగం జరగవని అన్నారు. -
కూతురిని చూసుకునేందుకు వస్తూ..
సాక్షి,మైలవరం(కృష్ణా) : వారం రోజల క్రితం భార్య పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో, కూతురును తొలిసారిగా చూసుకునేందుకు ఆతృతగా వస్తున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాను డ్రైవ్ చేసుకుంటూ వస్తూ వేరే వాహనాన్ని ఢీకొని కారు పల్టీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. ఇబ్రహీంపట్నం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని కర్ణాటక బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న భవానీపురానికి చెందిన ఒమ్మి హరి ఉదయప్రసాద్ యాదవ్ (28) చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. బ్యాంకుకు శని, ఆదివారం సెలవులు రావటంతో ఉదయప్రసాద్ యాదవ్ తన కారులో శుక్రవారం ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యలో ముగ్గురు ప్రయాణికులను కూడా కారులో ఎక్కించుకున్నాడు. ఇబ్రహీంపట్నం సమీపంలోకి వచ్చే సమయానికి కారు గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి రోడ్డుపక్కన పల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఉదయప్రసాద్ యాదవ్ తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పక్క సీట్లో ఉన్న విశాఖపట్నంకు చెందిన కొడగల మునీంద్ర తలకు బలమైన గాయమైంది. వెనక సీట్లో కూర్చున్న అక్కిరెడ్డి శేఖర్ (విశాఖపట్నం), బెజ్జం నాగరాజు (గుంటూరు) కు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం విజయవాడ వైద్యశాలకు తరలించారు. మృతుడికి ఏడాది క్రితం వివాహమైంది. భార్య వారం రోజుల క్రితం ఆడ పిల్లకు జన్మనిచ్చింది. భార్య, కుమార్తెను చూసేందుకు వస్తుండగా ఉదయప్రసాద్ యాదవ్ మృత్యువాతకు గురి కావటంతో ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ రెబల్ నేత..
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్‌కు చెందిన టీఆర్ఎస్ రెబల్ నేత ఇబ్రహీం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరుల సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచుకున్నారు. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ రెబల్‌గా ఇబ్రహీం పోటీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ముస్లిం ద్రోహి అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనారిటీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. నరేద్ర మోదీ ఏజెంట్ కేసీఆర్ అని ఆరోపించారు. మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషులుగా కోర్టు తీర్పు ఇచ్చినా.. ఈ కేసులో కేసీఆర్ సుప్రీంకోర్టులో అప్పీల్ ఎందుకు చేయలేదని నిలదీశారు. ఆలేరు ఎన్కౌంటర్లో ఐదుగురు ముస్లిం యువకులు చనిపోయారని, దానికి సంబంధించి ఇంతవరకు నివేదిక ఇవ్వలేదని అన్నారు. -
రెచ్చిపోయిన ఫేస్బుక్ ప్రేమోన్మాది
హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతి పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అడ్డువచ్చిన మరో మహిళకు కూడా మంటలంటుకున్నాయి. ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరివాడిలో నివసిస్తున్న ఆబేదాబేగం, షేక్ ఇస్మాయిల్‌కు ఆరుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. బార్కాస్‌కు చెందిన ఇబ్రహీం(30) వృత్తిరీత్యా మొబైల్ టెక్నీషియన్. గతేడాది ఫేస్బుక్ ద్వారా ఇస్మాయిల్ కూతురు షబానాబేగంతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఈ విష యం తెలుసుకున్న షబానా కుటుంబ సభ్యులు బార్కాస్ కు వెళ్లి విచారించగా అతడికి వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఇరువురిని కలవకుండా చేసి, టప్పాచబుత్రా పోలీ స్స్టేషన్లో ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుందామంటూ ఇబ్రహీం రోజూ ఒత్తిడి తెస్తుండగా షబానాబేగం నిరాకరిస్తోంది. దీంతో శనివారం ఉదయం కుమ్మరివాడిలోని షబానాబేగం ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని షబానా బేగంపై పోసి నిప్పంటించుకుని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. షబానా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న షబానా వదిన ఆజిమాబేగం వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి తీవ్ర గాయాలపాలైంది. షబానాబేగం, ఇబ్రహీం,అజిమాబేగంలను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
బాలుడిని ప్రశ్నించిన పోలీసులు
టోలీచౌకిలోని ప్రామిసింగ్ కాన్సెప్ట్ హైస్కూల్లో మూడో తరగతి విద్యార్థి(8) దాడిలో గాయపడి మృతి చెందిన ఇబ్రహీం తండ్రి ముజీబ్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు దాడి చేసిన బాలుడిని మంగళవారం ప్రశ్నించారు. ఆ రోజు జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా సదరు బాలుడు సరిగా సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో బాలుడిని జువైనల్ న్యాయ సలహాకేంద్రానికి తరలించారు. అక్కడి కమిటీ సిఫారసుల మేరకు బాలుడిని జువైనల్ హోంకు తరలించాలా..? తల్లిదండ్రులకు అప్పగించాలా? అన్నది నిర్ణయిస్తామని పోలీసులు తెలిపారు. -
బయోమెట్రిక్ కోసం వెళ్లి..
- వడదెబ్బతో ఒకరి మృతి జవహర్‌నగర్ రేషన్‌షాపు వద్ద బయోమెట్రిక్ కోసం ఎండలో నిలబడిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ గిరిప్రసాద్‌నగర్‌లో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలు.. గబ్బిలాలపేటలోని రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ విధానం కోసం బుధవారం అధికారులు వేలిముద్రలు తీసుకున్నారు. ఈక్రమంలో గిరిప్రసాద్నగర్కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం(44) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిలబడి వేలిముద్రలు ఇచ్చాడు. ఇంటికి వచ్చిన అతడు మంచినీళ్లు తాగిన వెంటనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్నుమూశాడు. అతడు వడదెబ్బతోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. -
‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!
-
ఛోటారాజన్ ల్యాప్‌టాప్‌లో దావూద్ గుట్టు!
-
రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఇబ్రహీం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి సీఎం. ఇబ్రహీం నియమితులయ్యారు. కేబినెట్ మంత్రి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఆయనను ఈ పదవిలో నియమించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఇబ్రహీం గత శాసన సభ ఎన్నికల్లో శివమొగ్గ జిల్లా భద్రావతి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనను శాసన మండలికి పంపడానికి ప్రతిపక్ష నాయకుని హోదాలో సిద్ధరామయ్య చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన సీఎల్పీ నాయకత్వ పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జోక్యంతో అలక మానారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇబ్రహీంకు ఏదో ఒక పదవి ఇప్పించాలని సీఎం తాపత్రయ పడ్డారు. ఎట్టకేలకు సంవత్సరం తర్వాత ఆయన ప్రయత్నం ఫలించింది. -
కాంగ్రెస్ గూటికి గులాబీ నేతలు
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసలు జోరందుకుంటున్నాయి. జంపింగ్ నేతలు, అనుచరులతో పార్టీల కార్యాలయాల్లో సందడి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత ఇబ్రహీం శనివారం కాంగ్రెస్‌లో చేరారు. కార్యకర్తలు, అనుచరులతో కలసి గాంధీభవన్‌కు వచ్చిన ఇబ్రహీం కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కె.నగేష్ కూడా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో పార్టీలో చేరారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, నటుడు బాబూ మోహన్ కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలసి ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎంపీ వివేక్ మళ్లీ సొంతగూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి.