
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్‌కు చెందిన టీఆర్‌ఎస్ రెబల్ నేత ఇబ్రహీం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరుల సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచుకున్నారు. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ రెబల్‌గా ఇబ్రహీం పోటీ చేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ముస్లిం ద్రోహి అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనారిటీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. నరేద్ర మోదీ ఏజెంట్ కేసీఆర్ అని ఆరోపించారు. మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషులుగా కోర్టు తీర్పు ఇచ్చినా.. ఈ కేసులో కేసీఆర్ సుప్రీంకోర్టులో అప్పీల్ ఎందుకు చేయలేదని నిలదీశారు. ఆలేరు ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ముస్లిం యువకులు చనిపోయారని, దానికి సంబంధించి ఇంతవరకు నివేదిక ఇవ్వలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment