హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసలు జోరందుకుంటున్నాయి. జంపింగ్ నేతలు, అనుచరులతో పార్టీల కార్యాలయాల్లో సందడి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నేత ఇబ్రహీం శనివారం కాంగ్రెస్లో చేరారు. కార్యకర్తలు, అనుచరులతో కలసి గాంధీభవన్కు వచ్చిన ఇబ్రహీం కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కె.నగేష్ కూడా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో పార్టీలో చేరారు.
ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, నటుడు బాబూ మోహన్ కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కలసి ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎంపీ వివేక్ మళ్లీ సొంతగూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి.
కాంగ్రెస్ గూటికి గులాబీ నేతలు
Published Sat, Mar 29 2014 2:51 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement