అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతున్నరిపబ్లిక్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలి ముందస్తుగా గట్టి ప్రచారం ప్రారంభించారు. ఇటీవలే అమెరికా విదేశాంగ విధానంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే అమెరికాను వ్యతిరేకించే దేశాలకు విదేశీ సాయంలో కోత విధిస్తానని తేల్చిచెప్పారు. అలాగే పాక్‌లాంటి చెడ్డ దేశాలకు వందల మిలయన్ల డాలర్లు ఇవ్వనని కరాకండీగా చెప్పారు. ఈ మేరకు నిక్కీ మంగళవారం ఆ వ్యాఖ్యలనే పునరుద్ఘాటిస్తూ.. బలహీనమైన అమెరికానే చెడ్డ వ్యక్తులకు చెల్లిస్తుందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గతేడాది పాక్, ఇరాక్, జింబాబ్వేలకు వందల మిలియన్ల డాలర్ల సాయం అమెరికా చేసిందన్నారు.
బలమైన అమెరికా అలా చేయదని, అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదని ట్విట్వర్ వేదికగా పేర్కొన్నారు నిక్కీ హేలీ. మరో ట్వీట్‌లో అమెరికా ప్రపంచ ఏటీఎం కాకుడదని, తాను అధికారంలోకి రాగానే విదేశాంగ విధానంలో తీవ్ర మార్పులు చేస్తామని, శత్రువులకు డబ్బులు పంపకుండా గట్టి ప్రణాళికలు పొందుపరుస్తామని చెప్పుకొచ్చారు. అంతేగాదు గర్వించదగ్గ అమెరికా ఎప్పుడూ ప్రజల కష్టార్జితాన్ని వృధా చేయదంటూ బైడెన్ పరిపాలనపై విచుకుపడ్డారు. అలాగే అమెకాను ద్వేషించే దేశాల సరసన నిలిబడే దేశాలకు నిధులందించ కూడదంటూ బైడెన్ ప్రభుత్వాన్ని తిట్టిపోశారు.
ఇదిలా ఉండగా, అధ్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన తదుపరే అమెరికా విదేశా విధానంపై తనదైన శైలి విమర్శలు గుప్పిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు నిక్కీ. దీంతో 2024 అమెరికా అధ్యక్ష రేస్‌కి సంబంధించిన తాజా ఓపెనియన్ పోల్‌లో అనుహ్యంగా బైడెన్ కంటే ముందంజలో ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఐతే ఫిబ్రవరి 16 మరియు 19 మధ్య నిర్వహించిన రాస్ముస్సేన్ సర్వే ఆధారంగా మాత్రం నిక్కీ హేలీ.. ట్రంప్ కంటే వెనుకబడి ఉందని తెలిపింది. కాగా, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024న జరగాల్సి ఉంది.
(చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి)
Comments
Please login to add a commentAdd a comment