12 రోజులు.. 5000 కిలోమీటర్లు! | Hyderabad's Ravinder Reddy Wins The America World Ultra Cycling Championship Trophy | Sakshi
Sakshi News home page

12 రోజులు.. 5000 కిలోమీటర్లు!

Published Wed, Jul 31 2024 1:17 PM | Last Updated on Wed, Jul 31 2024 1:17 PM

Hyderabad's Ravinder Reddy Wins The America World Ultra Cycling Championship Trophy

అమెరికాలో సైక్లింగ్‌ పోటీలు

భారత్‌ నుంచి ఎంపికైన తొలివ్యక్తి

హైదరాబాదీ రవీందర్‌రెడ్డి ఘనత

సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ సైక్లింగ్‌ పోటీల్లో అత్యంత కఠినమైన రేస్‌ ఎక్రాస్‌ అమెరికా (వరల్డ్‌ అల్ట్రా సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ) సైక్లింగ్‌ ఈవెంట్‌. దీనికి అర్హత సాధించానని హైదరాబాద్‌ బండ్లగూడకు చెందిన రవీందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ 10 నుంచి సైక్లింగ్‌ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. భారత్‌ నుంచి తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న తొలి వ్యక్తి తానేనని, 12 రోజులు, 12 నగరాల మీదుగా 5 వేల కిలో మీటర్ల నిరంతరాయంగా సైక్లింగ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఈస్ట్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమై న్యూజెర్సీలో ముగుస్తుందన్నారు. ప్రపంచంలో 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు, 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో 5 గరు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ప్లస్‌ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఈ సైక్లింగ్‌ ఉంటుందన్నారు. పేద పిల్లలకు ఫండ్‌ రైజింగ్‌లో భాగంగా ఈ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారని, గతంలో 29 మంది సైక్లిస్టులు రూ.100 కోట్ల ఫండ్‌ రైజ్‌ చేశారని గుర్తుచేశారు.

గతంలో రేస్‌ ఎక్రాస్‌ ఇండియా, రేస్‌ ఎక్రాస్‌ ఆసియా పోటీల్లో విజేతగా నిలిచానని తెలిపారు. రేస్‌ ఎక్రాస్‌ అమెరికా ఈట్‌లోనూ 50  ఏళ్ల కేటగిరిలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ట్రయల్స్‌లో భాగంగా ప్రస్తుతం అమెరికాలో సైక్లింగ్‌ చేయనున్న రూట్‌లో ట్రయల్‌ వేస్తున్నారు.

ఇవి చదవండి: Singer Smita: ఓల్డ్‌ స్కూల్‌ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement