ravindar reddy
-
AP: వర్రా రవీంద్రారెడ్డి పిటిషన్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,గుంటూరు: సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్‌పై బుధవారం(నవంబర్ 20) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.చట్టనిబంధనలు,కోర్టు ఆదేశాల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కడప పోలీసులను హైకోర్టు ఆదేశించింది.పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని కడప పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.రవీంద్రారెడ్డి అరెస్టుకు సంబంధించి పుల్లూరు టోల్ ప్లాజా సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది.హైకోర్టులో వర్రా రవీంద్రారెడ్డి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు..ఈ పిటిషన్ పౌరుని హక్కులకు సంబంధించిందిఒక పౌరుడు దుస్థితిని ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలినిందితుల హక్కులను హరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇటీవలే ఒక కీలక తీర్పు ఇచ్చిందివర్రా రవీంద్రారెడ్డి రెడ్డి విషయంలో పోలీసులు పలు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారుకోర్టును తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారురవీంద్రారెడ్డి హైకోర్టు ముందు హాజరు పరచాలని ధర్మాసనం ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరు పరిచారు24 గంటల్లో వర్రా రవీంద్రారెడ్డి రెడ్డిని కోర్టులో హాజరపరచాల్సిన పోలీసులు 48 గంటల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారురాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రస్తుతం ఇలానే వ్యవహరిస్తున్నారుచట్ట నిబంధనలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదన్న హెచ్చరికలు పోలీసులకు పంపాల్సిన సమయం ఆసన్నమైందిరాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా నిర్బంధించి హింసిస్తున్నారుఅధికార పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారుఇవేవీ పోలీసులకు కనిపించడం లేదువారి జోలికి వెళ్లే ధైర్యం కూడా పోలీసులు చేయడం లేదుకొంతమంది పోలీసులను ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తాం -
12 రోజులు.. 5000 కిలోమీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ సైక్లింగ్ పోటీల్లో అత్యంత కఠినమైన రేస్ ఎక్రాస్ అమెరికా (వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ) సైక్లింగ్ ఈవెంట్. దీనికి అర్హత సాధించానని హైదరాబాద్ బండ్లగూడకు చెందిన రవీందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 10 నుంచి సైక్లింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. భారత్ నుంచి తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న తొలి వ్యక్తి తానేనని, 12 రోజులు, 12 నగరాల మీదుగా 5 వేల కిలో మీటర్ల నిరంతరాయంగా సైక్లింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఈస్ట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమై న్యూజెర్సీలో ముగుస్తుందన్నారు. ప్రపంచంలో 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు, 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో 5 గరు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ప్లస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఈ సైక్లింగ్ ఉంటుందన్నారు. పేద పిల్లలకు ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారని, గతంలో 29 మంది సైక్లిస్టులు రూ.100 కోట్ల ఫండ్ రైజ్ చేశారని గుర్తుచేశారు.గతంలో రేస్ ఎక్రాస్ ఇండియా, రేస్ ఎక్రాస్ ఆసియా పోటీల్లో విజేతగా నిలిచానని తెలిపారు. రేస్ ఎక్రాస్ అమెరికా ఈట్లోనూ 50 ఏళ్ల కేటగిరిలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ట్రయల్స్‌లో భాగంగా ప్రస్తుతం అమెరికాలో సైక్లింగ్ చేయనున్న రూట్లో ట్రయల్ వేస్తున్నారు.ఇవి చదవండి: Singer Smita: ఓల్డ్ స్కూల్ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్.. -
TS Election 2023: మహిళా రిజర్వేషన్లు అమలుతో.. తెరపైకి ఏనుగు మంజులారెడ్డి!
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సతీమణి మంజులారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఎన్నికల వ్యవహారాలతో పాటు క్యాడర్ బాధ్యతను ఆయన సతీమణి మంజులారెడ్డే చూసుకుంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించిన మంజులారెడ్డికి రాజకీయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉంది. భర్త రవీందర్‌రెడ్డితో కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చారు. 2004 లో టీఆర్ఎస్ టికెట్‌ను మొదట మంజులారెడ్డికే కేటాయించాలని భావించారు. అయితే ఆమె స్థానంలో రవీందర్‌రెడ్డికి ఇచ్చారు. రవీందర్‌రెడ్డి గెలుపు కోసం మంజులారెడ్డి ఎంతో శ్రమించారు. ఎన్నికల సమయంలో ఆమె నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రచారం చేశారు. తాడ్వాయి మండలంలో అయితే ప్రతి ఇల్లూ ఆమెకు పరిచయమే.. 2018 ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి అనూహ్యంగా ఓటమి చెందారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ఆమె అనుచరులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జాజాల సురేందర్ బీఆర్ఎస్లో చేరడంతో పార్టీలో రెండు గ్రూపులయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సురేందర్‌రెడ్డికి పా ర్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వడం, రవీందర్‌రెడ్డికి నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని భావించారు. కానీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీలో అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జరిగింది. బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి అసంతృప్తులను చేరదీసి పదవులు కట్టబెట్టడంతో కొంత వెనక్కి తగ్గారు. భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో తనకు బదులుగా తన భార్య మంజులారెడ్డిని బరిలో నిలిపేందుకు రవీందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. రవీందర్‌రెడ్డి అనుచరులు సైతం గట్టి నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తుండడంతో ఎల్లారెడ్డి రాజకీయాల్లో కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తన భార్యకు బీజేపీ టికెట్టుకోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి నష్టమేతప్ప లాభం లేదని పేర్కొంది. పాత పద్ధతిలోనే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని కోరింది. శనివారం ఇక్కడ నాంపల్లిలోని టీఎన్జీవోస్ భవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గ భేటీ జరిగింది. సమావేశంలో 18 అంశాల పై తీర్మానాలు చేశారు. తీర్మానాల ప్రతిని ప్రభుత్వానికి సమర్పించి వీటిని మంజూరు చేయించుకునేలా ఒత్తిడి తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ వి.మమత మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు 43 శాతం ఐఆర్, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరారు. ఏపీలో పని చేస్తున్న 1,200 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించాలని, ఇరు ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. బడిబాట తర్వాతే హేతుబద్ధీకరణ చేపట్టాలి బడిబాట కార్యక్రమం తర్వాతే పాఠశాలల హేతుబ ద్ధీకరణను చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాలనలో భాగంగా చేపట్టే సంస్కరణలకు ఉద్యోగులు సహకరిస్తున్నారన్నారు. ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని, వెల్నెస్ సెంటర్లను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. 010 పద్దు కింద గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ, వర్సిటీలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి జూన్, జూలైల్లో సాధారణ బదిలీ లకు అనుమతించాలన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 36 లో ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన ఇళ్లస్థలాలను టీఎన్జీవోలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లకే పదోన్నతి కల్పించాలి... పదోన్నతి కోసం ప్రస్తుతమున్న మూడేళ్ల సర్వీసును రెండేళ్లకు కుదించాలని కోరారు. రెవెన్యూ శాఖను విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనంగా 15% పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యమంలో పాల్గొన్నందున వాళ్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, అవు ట్ సోర్సింగ్ ఉద్యోగులకు సెలవు ప్రయోజనాలను కల్పించాలని, కొత్త జిల్లాలకు సరిపడా క్యాడర్‌ను మంజూరు చేయాలన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. -
జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామాలో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు కేసులో సంచలన తీర్పును వెల్లడించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీందర్ రెడ్డి రాజీనామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిన్ ఆమోదించలేదు. అంతేకాకుండా జడ్జి రవీందర్ రెడ్డి పెట్టుకున్న తాత్కాలిక సెలవును కూడా హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆయన గురురవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. కాగా మక్కా మసీదు పేలుళ్ల కేసుపై సోమవారం ఉదయం తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే జస్టిస్ రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. అనంతరం ఆయన తన రాజీనామ లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపించారు. అయితే మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలో రవీందర్ రెడ్డి రాజీనామా న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశం, సంచలనంగా మారింది. కాగా రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన రాజీనామా చేశారనే వార్తలు ప్రచారం జరిగింది. -
‘ప్రక్షాళన కోసం 100 రోజుల శ్రమించాం’
సాక్షి, నిజమాబాద్ : ‘నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కోసం రేయింబవళ్లు కష్టపడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని సాధ్యం చేశాం. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కోసం 100 రోజుల పాటు భార్యా, పిల్లలకు దూరంగా ఉండి పని చేశాం. ఇన్ని చేసినా కూడా ప్రభుత్వం మాపై నిర్లక్ష్యం వహిస్తోంద’ని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఉమ్మడి జిల్లాల టీఎన్జీవోల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరసనలు, ధర్నాలు చేయవద్దంటే ఇన్ని రోజులు చేయలేదని, కానీ ప్రభుత్వం అదే అలుసుగా తీసుకొని ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని వాపోయారు. సీపీఎస్ ను రద్దు చేయాలని చాలాసార్లు కోరినా..ప్రభుత్వం పట్టించేకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి అవార్డులు, రివార్డులు రావడానికి ఉద్యోగస్తులే కారణమని రవీందర్ రెడ్డి అన్నారు. లక్ష మందితో నిరసన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఈ నెల 25 ఏర్పాటు చేసే నిరసన సభకు లక్ష మంది ఉద్యోగులు హాజరు కానున్నట్లు రవీందర్ రెడ్డి తెలిపారు. సపాయి నుంచి ఐఏఎస్ అధికారి వరకు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు హాజరు కావాలని రవీందర్ రెడ్డి కోరారు. -
పాస్‌పుస్తకాల్లో తప్పులు రానీయొద్దు
నవీపేట(బోధన్): పట్టాపాస్‌పుస్తకాల త యారీలో ఎ లాంటి తప్పు లు దొర్లకుండా చూసుకోవాల ని జిల్లా జా యింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. స బ్ రిజిస్ట్రార్ కార్యాల య ఏర్పాటులో భాగంగా నవీపేట తహసీల్ కార్యాలయాన్ని మంగళవారం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 11న నూతన పట్టాపాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. మార్చి 12న తహసీల్ కార్యాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తహసీల్ కార్యాలయాలను పరిశీలిస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా లేని చోట అదనపు భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నవీపేటలో నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. జేసీ వెంట ఆర్డీవో వినోద్‌కుమార్, తహసీల్దార్ అనిల్కుమార్లున్నారు. ఎడపల్లిలో స్థల పరిశీలన.. ఎడపల్లి(బో«ధన్): మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని జేసీ సందర్శించారు. తహసీల్ కార్యాలయం ఎదుట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ లతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్చార్జి డీఆర్వో, ఆర్డీవో వినోద్‌కుమార్ ఉన్నారు. -
కల్తీ పాలపై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
హైదరాబాద్ : కల్తీ పాలపై బుధవారం తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. శాసనసభలో ప్రశ్నోత్తరాలలో విపక్ష సభ్యులు కల్తీపాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్తీపాల విక్రయాలను అరికట్టాలని ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పశువుల నుంచి పాలు త్వరగా తీసేందుకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వినియోగిస్తున్నారని, దీనివల్ల దుష్ప్రరిణామాలు ఉన్నాయని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. మరోవైపు రైతులు...వెటర్నరీ సిబ్బంది లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వెటర్నరీ శాఖలో ఉన్న ఖాళీలను ప్రభుత్వం తక్షణమే భర్తి చేయాలన్నారు. గోపాల మిత్ర వేతం రూ.3,500 నుంచి 2,500లకు తగ్గించారని, దీనివల్ల గోపాల మిత్రల సేవలు సరిగా అందించలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ కల్తీపాల నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య దృష్ట్యా వైద్యులు తనను పాలు తాగాలని సూచించినా...కల్తీ భయంతో పాలు కూడా తాగటం లేదన్నారు. సభ్యుల ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం ఇస్తూ కల్తీపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. -
‘విభజన’ సమస్యలు పరిష్కరించండి
* సీఎస్ మహంతికి టీఎన్జీవోల నివేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తుతున్న వివిధ సమస్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సచివాలయంలో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి నేతృత్వంలో యూనియన్ నూతన కార్యవర్గం సభ్యులు సీఎస్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎస్ దృష్టికి వారు పలు అంశాలను తీసుకెళ్లారు. సీఎస్ స్పందిస్తూ శాఖల విలీన ప్రతిపాదనలు లేవని చెప్పినట్లు యూనియన్ నేతలు వెల్లడించారు. వారు ప్రస్తావించిన అంశాలు... * ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. రాష్ట్ర స్థాయి అధికారులను స్థానికత ఆధారంగా వెంటనే బదిలీ చేయాలి. జోనల్ స్థాయి, జిల్లా స్థాయి అధికారుల విషయంలోనూ చర్యలు చేపట్టాలి. * జీహెచ్ఎంసీలోని స్థానికేతర అధికారులను బదిలీ చేయాలి. * రాంకీ సంస్థతో జీహెచ్ఎంసీ చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలి. * కోఠిలోని వైద్యశాఖ కార్యాలయాన్ని సీమాంధ్రకు కేటాయించే ప్రతిపాదనను రద్దు చేయాలి. * 17న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే వెంటనే ఉద్యమిస్తాం. * సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ సొసైటీలో కలిపే ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలి. నూతన కార్యవర్గానికి అభినందన... టీఎన్జీవో కార్యవర్గానికి రెండోసారి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డిలను రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అభినందించారు. సహకార శాఖ, డ్రగ్ కంట్రోల్, వ్యవసాయ విశ్వ విద్యాలయం, వైద్య శాఖ, ఎస్సెస్సీ బోర్డు, ఇంటర్ బోర్డు తదితర శాఖల ఉద్యోగులు సన్మానించారు.