సాక్షి, నిజమాబాద్ : ‘నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కోసం రేయింబవళ్లు కష్టపడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని సాధ్యం చేశాం. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కోసం 100 రోజుల పాటు భార్యా, పిల్లలకు దూరంగా ఉండి పని చేశాం. ఇన్ని చేసినా కూడా ప్రభుత్వం మాపై నిర్లక్ష్యం వహిస్తోంద’ని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఉమ్మడి జిల్లాల టీఎన్జీవోల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నిరసనలు, ధర్నాలు చేయవద్దంటే ఇన్ని రోజులు చేయలేదని, కానీ ప్రభుత్వం అదే అలుసుగా తీసుకొని ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని వాపోయారు. సీపీఎస్ ను రద్దు చేయాలని చాలాసార్లు కోరినా..ప్రభుత్వం పట్టించేకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి అవార్డులు, రివార్డులు రావడానికి ఉద్యోగస్తులే కారణమని రవీందర్ రెడ్డి అన్నారు.
లక్ష మందితో నిరసన
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఈ నెల 25 ఏర్పాటు చేసే నిరసన సభకు లక్ష మంది ఉద్యోగులు హాజరు కానున్నట్లు రవీందర్ రెడ్డి తెలిపారు. సపాయి నుంచి ఐఏఎస్ అధికారి వరకు అన్ని డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులు హాజరు కావాలని రవీందర్ రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment