సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ(మంగళవారం) ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్‌లైన్ టికెటింగ్ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు.
అమీర్‌పేట వద్ద సిబ్బంధి ధర్నాకు దిగారు. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ రూట్‌లో గందరగోళం నెలకొంది. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు వాళ్లు. కరోనా టైం తప్పిస్తే.. మిగతా రోజుల్లో విరామం లేకుండా పని చేస్తున్నప్పటికీ తమకు సరైన న్యాయం జరగట్లేదని అంటున్నారు వాళ్లు.
కేవలం పదకొండు వేల జీతంతో నెట్టుకొస్తున్నామని చెబుతున్నారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళ వ్యక్తం చేశారు. ఇక ఈ పరిణామంపై హైదరాబాద్ మెట్రో స‍్పందించాల్సి ఉంది. ఆ స్పందన తర్వాత సమ్మె గురించి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment