salary issue
-
వేలల్లో జీతాలు.. లక్షల్లో అప్పులు...
దిగువ మధ్యతరగతికి చెందిన రాజేష్ తండ్రి కష్టంలో బీటెక్ చేశాడు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో కష్టపడి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుని మొత్తానికి ఒక ఐటీ కంపెనీలో చేరాడు. అంతవరకూ తండ్రి రామారావు పంపే ఐదారువేలను అతి పవిత్రంగా చూసుకుంటూ ఆచితూచి ఖర్చుపెడుతూ ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడు.. ఒక్కసారిగా ఐటీ ఉద్యోగం ఆయన జీవితాన్ని మార్చేసింది.. ఇన్నాళ్ల నాటి ఆయన సంతోషాలను తీసుకుని ఒత్తిడిని నెత్తినపెట్టింది. ఊరికి వెళ్ళేటపుడు హాయిగా బస్సులో వెళ్లే రాజేష్ ఇప్పుడు సెకెండ్ క్లాస్ ఏసీ లేకుంటే ప్రయాణం కుదరడం లేదు. మామూలు టిఫిన్లు మానేశాడు.. రెండు ఇడ్లీలు కూడా రెస్టారెంట్లోనే తింటున్నాడు. మామూలు బట్టలు నాసిరకంగా కనిపిస్తున్నాయి. అన్నీ బ్రాండెడ్.. మామూలు ఆండ్రాయిడ్ మొబైల్ చూసి ఫ్రెండ్ నవ్వాడని దాన్ని పారేసి లక్షన్నర పెట్టి ఐ- ఫోన్ కొన్నాడు. టీషర్ట్స్, చెప్పులు, వాచీ.. ఆఖరుకు తాను ప్రతినెలా క్రాఫ్ చేయించుకునే సెలూన్‌ను కూడా మార్చేశాడు.. దాన్నిపుడు స్పా అంటున్నారు.. జంట్స్ హైటెక్ సెలూన్ అన్నమాట. మామూలు హీరో హొండాను అమ్మేసి పెద్ద బైక్ మూడు లక్షలు పెట్టి కొన్నాడు. ఫ్రెండ్స్‌తో రూమ్ షేరింగ్ తప్పు అనిపించింది.. ఇంకాస్త పెద్ద ఫ్లాట్‌కు మారాడు.. రెంట్ పదిహేనువేలు.. ఒక్కడికే ఇంత ఇల్లు ఎందుకురా అని నాన్న అంటే ఈమాత్రం లేకపోతే మనకు గౌరవం ఉండదు నాన్నా అని నమ్మించాడు.. ఓహో.. నిజమే కావచ్చు అనుకున్నాడు అమాయకపు పల్లెటూరి రామారావు. కాలం మారింది. కరోనా దెబ్బకు ఉద్యోగం పోయింది.. పరిస్థితి తిరగబడింది.. ఉద్యోగం పోయినా అప్పులు ఊరుకోవు. ప్రతిరోజు బ్యాంక్ వాళ్ల ఫోన్లు.. క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కట్టకపోతే పెనాల్టీ.. ఇవన్నీ వెరసి రాజేష్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాయి.. రెండు మూడేళ్ళలో రాజేష్ మొత్తం హై క్లాస్ అయిపోయాడు. జీతం డెబ్బై వేలు అయినా అందులో అరవైవేల వరకు ఖర్చులు, ఇన్స్టాల్మెంట్స్కు పోతున్నాయి. నేలయ్యేసరికి మిగిలేది ఏమీ ఉండడం లేదు. తండ్రికి అయినా అయిదారువేలు పంపే పరిస్థితి లేకపోతోంది. డబ్బు భలే జబ్బు మొదట్నుంచి లావిష్, విలాసంగా బతికే కుటుంబాలు వేరు.. కానీ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, ఒకేసారి ఆర్థిక స్థోమత పెరిగినవాళ్లు ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అందరితోబాటూ మనమూ భారీగా రిచ్చుగా లేకపోతే పదిమందిలో తమకు విలువ తగ్గుతుందనే ఆత్మన్యూనతా భావన వారిని మరింత చిక్కుల్లోకి నెట్టేస్తోంది. అవసరం ఉన్నా లేకున్నా భారీ ఖర్చులు.. వీళ్ళ జీతం చూసి బ్యాంకులు సులువుగా లోన్లు ఇస్తూ కుర్రాళ్లను తమగుప్పిట్లో పెట్టుకున్నాయి. పైసా చేతిలో లేకున్నా క్రెడిట్ కార్డుతో కొనేసే అవకాశం కూడా ఉండడంతో.. హోటల్ బిల్లులు.. బట్టలు.. ఫోన్లు ఇవన్నీ ఎడాపెడా కొనేస్తున్నారు. తాహతుకు మించి అద్దెలు కట్టి ఇద్దరు దంపతులు ఉన్న చోటకూడా ట్రిపుల్ బెడ్ రూమ్స్ అద్దెకు తీసుకుంటున్నారు. ప్రతివారం సినిమాలు.. మల్టీప్లెక్సులు.. పబ్బులు.. రెండువారాలకోసారి పార్టీలు.. ఇవన్నీ వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి అనుకుంటున్నారు తప్ప తమ జీవితాలను కిందికి తొక్కేస్తున్నాయని గ్రహించేలోపు పరిస్థితులు చేయిజారిపోతున్నాయి. తన టీములో పనిచేసే కొలీగ్‌కు కార్ ఉంది కాబట్టి మనం కొనేయాలి. ఆయన లక్షన్నర పెట్టి టీవీ కొన్నాడు కాబట్టి మనం కొనకపోతే పెద్ద నేరం. ఏటా మూడుసార్లు కనీసం యాభైవేలు ఖర్చు చేసి టూర్లు వెయ్యాలి.. బ్రాండెడ్ వస్తువులు లేకపోతే నామోషీ.. పదిమందిలో నిలవలేం.. వారిముందు ఐదు వందల విలువైన చెప్పులు వేస్తే నవ్వుతారు కాబట్టి చెప్పులు కనీసం పదివేలకు తగ్గకూడదు. తరచూ పార్టీలు ఇవ్వకుంటే మనకు గౌరవం ఉండదు కాబట్టి అప్పు చేసి అయినా పార్టీలు ఇవ్వాలి. ఇవన్నీ ప్రస్తుతం యువతను మింగేస్తున్న అవలక్షణాలు . ఎవరో ఏమో అనుకుంటారు అనే భావనలో తమనుతాము మోసం చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవేళ కాలం తిరగబడి ఉద్యోగం తేడా జరిగి.. ఆర్నెల్లు ఖాళీగా ఉండాల్సి వస్తే ? అప్పుడు ఏమి చేస్తారు. సేవింగ్స్ కూడా పెద్దగా ఉండవు.. ఈ టీవీలు.. అద్దె ఫ్లాట్స్.. కార్లు.. యాపిల్ వాచీలు.. ఇవేమి వాళ్ళను కాపాడే పరిస్థితి ఉండదు.. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. జీతం ఉండగానే పొదుపు చేసుకోవాలి. ముందు తరాల కోసం కాకున్నా మీకోసం మీరు పొదుపు చేసుకోవాలి. మన తాత తండ్రులు నాలుగురేసి పిల్లల్ని అలవోకగా పెంచేవాళ్ళు.. ప్రయోజకులను చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క పిల్లాడితో ఉన్న జీవితాన్ని ఈదలేకపోతున్నారు.. కారణం ఏమిటి? అప్పట్లో బాధ్యత.. ఆదాయాన్ని బట్టి ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు అవసరం లేని ఖర్చులు.. విలాసాలు.. ఫాల్స్ ప్రిస్టేజిలు.. యువతను అప్పుల్లోకి దించేస్తున్నాయి. అలాగని అందరూ అలాగే ఉన్నారని కాదు.. ఇల్లు.. స్థలాలు.. పొలాలు.. బంగారం కొంటూ బాధ్యతగా ఉంటున్నవాళ్లూ ఉన్నారు.. ఇలా ఉద్యోగాలు చేస్తూ అప్పులపాలై ఒత్తిడిమధ్య నలిగిపోతున్నవాళ్లూ ఉన్నారు. -సిమ్మాదిరప్పన్న. -
స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార కేసులో తమ ముందు హాజరు కావాలన్న ఆదేశాలను బేఖాతరు చేయడంపై మండిపడింది. ఓ దశలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసేందుకు సైతం హైకోర్టు సిద్ధమైంది. శాసనసభ సమావేశాల వల్ల అత్యవసర పని ఉండటంతో కోర్టు ముందు పూనం మాలకొండయ్య హాజరుకాలేకపోయారని, తదుపరి విచారణకు తప్పక హాజరవుతారని ప్రభుత్వ న్యాయవాది నివేదించడంతో హైకోర్టు మెత్తబడింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు కొన్నేళ్లుగా జీతం చెల్లించకపోవడంపై విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి.సుజాత 2018లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం అప్పటి వైద్య విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్య అప్పటి డైరెక్టర్ బాబ్జీ, ప్రభుత్వ దంత వైద్య కళాశాల అప్పటి ప్రిన్సిపల్ మురళీమోహన్లను స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు మురళీమోహన్ ఒక్కరే శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యారు. పూనం మాలకొండయ్య, బాబ్జీ హాజరు కాలేదు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ బాబ్జీ పదవీ విరమణ చేసి ప్రస్తుతం ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు హైకోర్టు జారీ చేసిన నోటీసే అందలేదన్నారు. తదుపరి విచారణకు ఆయన కూడా హాజరవుతారని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌కు జీతం చెల్లించాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని అధికారులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా? అంటూ నిలదీసింది. జీతం చెల్లించండి.. అంటూ మిమ్మల్ని యాచించాలా? 2018 నుంచి పిటిషనర్‌కు జీతం చెల్లించకుంటే బతికేది ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. ఈ వ్యవహారంలో అవసరమైతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు అకౌంటెంట్ జనరల్ హాజరుకు ఆదేశాలిస్తామంది. -
ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు చెక్.. 411 మందికి గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు ఏళ్ల తరబడిగా ఎదుర్కొంటున్న వేతన సమస్యను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పరిష్కరించారు. ఇకపై వారు వేతనాలు సకాలంలో అందుకొనేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్(ఆప్కాస్)కు వారి సేవలను అనుసంధానం చేసారు. వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న 160 పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో వంటపని, పారిశుద్ధ్యం ఉద్యోగులుగా పని చేస్తున్న వారిలో 411 మందికి ప్రైవేటు సంస్థల ద్వారా వేతనాలను చెల్లించేవారు. అయితే, ఈ విధానంలో ఆ ఉద్యోగులకు వేతనాలు అందడం ఆలస్యం అవుతుండటంతో ఉద్యోగులు విధుల నుంచి తప్పుకుంటున్న కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందుకే తమ వేతనాలు అందరితో పాటుగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు తెలిపారు. కాగా, ఈ సమస్య మంత్రి మేరుగు నాగార్జున దృష్టికి రావడంతో వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్న ఈ ఉద్యోగుల సేవలను ప్రీ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకే మంజూరైన పోస్టుల స్థానంలో ఉపయోగించుకోవాలన్నారు. అలాగే, వారి వేతనాలను ఆప్కాస్ ద్వారా ఆలస్యం లేకుండా ప్రతినెలా అందరితో పాటుగా చెల్లించాలిని అధికారులు ప్రతిపాదించగా మంత్రి.. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. అనంతరం, ఈ ప్రతిపాదనపై సీఎం జగన్ ఆమోదముద్ర వేసారు. దీంతో, ఈ ఉద్యోగులు ఇప్పటి వరకూ వేతనాల కోసం పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. అదే విధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఉద్యోగులు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడే దుస్థితికి కూడా తెరపడింది. ప్రస్తుతం ఆప్కాస్కు అనుసంధానం చేసిన 411 మంది పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టల్ ఉద్యోగులలో 37 మందిని శ్రీకాకుళం, 52 మందిని విజయనగరం, 17 మందిని విశాఖపట్నం, 120 మందిని తూర్పుగోదావరి, 82 మందిని కృష్ణా,62 మందిని ప్రకాశం, 41 మందిని అనంతపురం జిల్లాలకు చెందిన హాస్టళ్లకు కేటాయిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తమ సమస్యను పరిష్కరించడంలో తమ కష్టాలు తీర్చిన సీఎం జగన్‌కు, చొరవ చూపిన మంత్రి మేరుగు నాగార్జునకు ఉద్యోగులు తమ ధన్యవాదాలు తెలిపారు. -
హైదరాబాద్: సమ్మె బాటలో మెట్రో రైల్వే ఉద్యోగులు?!
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ(మంగళవారం) ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్‌లైన్ టికెటింగ్ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు. అమీర్‌పేట వద్ద సిబ్బంధి ధర్నాకు దిగారు. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ రూట్లో గందరగోళం నెలకొంది. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు వాళ్లు. కరోనా టైం తప్పిస్తే.. మిగతా రోజుల్లో విరామం లేకుండా పని చేస్తున్నప్పటికీ తమకు సరైన న్యాయం జరగట్లేదని అంటున్నారు వాళ్లు. కేవలం పదకొండు వేల జీతంతో నెట్టుకొస్తున్నామని చెబుతున్నారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళ వ్యక్తం చేశారు. ఇక ఈ పరిణామంపై హైదరాబాద్ మెట్రో స్పందించాల్సి ఉంది. ఆ స్పందన తర్వాత సమ్మె గురించి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఆశా వర్కర్లకు పూర్తి జీతం చెల్లిస్తాం
సాక్షి, అమరావతి: ఆశా వర్కర్లకు పూర్తిగా రూ.10 వేల జీతాన్ని చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల వేతనాల చెల్లింపు విషయంలో వస్తోన్న పుకార్లపై ఆయన స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. వేతనాల చెల్లింపులో ఆశా వర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్ గాని, పాయింట్ల వ్యవస్థ గాని లేదన్నారు. పెరిగిన జీతాలను ఆగస్టు మొదటి నుంచి అమలు చేస్తున్నామని.. సెప్టెంబర్ నుంచి పెంచిన జీతాలు ఇస్తామన్నారు. బకాయి పడ్డ జీతాలను కూడా వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. పాదయాత్రలో ఆశా వర్కర్ల పరిస్థితులను అర్థం చేసుకున్న జగన్ వారికి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఈ హామీని అమల్లోకి తీసుకు వచ్చారని ఆళ్ల నాని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనిని సీఎం జగన్ చేస్తూంటే ఓర్వలేక.. ప్రతిపక్షం, కొన్ని శక్తులు తప్పుడు ప్రచారంతో ఆశా వర్కర్లలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని మండి పడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని.. ఆశా అక్కచెల్లమ్మలు దీన్ని గుర్తించాలని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఇక ప్రతివారం ‘కాఫీ టుగెదర్’) -
108కు బ్రేకులు..
నల్లబెల్లి (వరంగల్) : అందరిని ఆదుకునే ఆపద్భందుకు బ్రేకులు పడ్డాయి. అరకొర వేతనాలు.. 12 గంటలకు పైగా పని.. ఉంటే ఉండండి.. పోతే పొండి అనే యాజమాన్యం బెదిరింపులతో 108 ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. 2005 ఆగస్టు 15న ప్రారంభించిన 108 సర్వీసులు ఇప్పటివరకు నిరంతరాయంగా ప్రజలకు సేవలందిస్తున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 108 అంబులెన్స్‌ల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 37 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 13 ఏళ్ల నుంచి అత్యవసర సమయాల్లో రోగులను రాత్రి పగలనక అంకిత భావంతో ఆస్పత్రులకు తరలిస్తూ ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులతో పాటు ఇప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 108 ఉద్యోగులందరికీ భరోసాగా ఉంటామని ప్రకటిస్తూ హమీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సాక్షిగా 108 ఉద్యోగులకు తీపి కబురు అందిస్తామని ప్రకటించారు. దీంతో అప్పట్లో 108 ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అప్పటి నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను వేడుకున్నా ఫలితం లేదు. చేసేది లేక సమ్మె బాట పట్టారు. గతంలో మూడు సార్లు.. 108 ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం 2011, 2013, 2015 సంవత్సరాల్లో సమ్మెకు దిగారు. ప్రభుత్వమే 108 నిర్వహణ కొనసాగించాలని, జీఓ నం బర్.3 ప్రకారం వేతనాలు చెల్లించాలని, రోజుకు 8 గంటల పని సమయం నిర్ణయించాలని, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని, పబ్లిక్ ప్రైవేటు పాట్నర్షిఫ్ (పీపీపీ) విధానాన్ని రద్దు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ప్రభుత్వం 108 ఉద్యోగుల డిమాండ్ నెరవేరుస్తామని హామినిచ్చింది. కానీ ఇంత వరకూ నెరవేర్చలేదు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి మళ్లీ ఆగస్టు 11 నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో ఇటీవల లెబర్ కమిషనర్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్లతో పాటు సంబంధిత అధికారులు, జీవీకే సంస్థ నిర్వాహకులకు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 1650 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. పూట గడవని బతుకులు.. 108 ఉద్యోగులు అంకిత భావంతో చేస్తున్న పనిగొప్పది. అత్యవసర సమయాల్లో ఎంతో మందిని సరైన సమయాల్లో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడుతూ కుటుంబాలకు అండగా ఉండేది. రాత్రనక.. పగలనక 12 గంటలు విధులు నిర్వహిస్తే సంస్థ నిర్వాహకులు రూ.13 వేల నుంచి 14 వేల వరకు ఇస్తున్నారు. అంబులెన్స్‌లో కనీస సౌకర్యాలు ఉండవు. అంబులెన్స్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరితే వేధింపులకు గురిచేస్తూ పని చేస్తే చేయండి లేదంటే మానేసుకొమ్మని బెదిరింపులకు పాల్పడుతున్నారంటే వారి బాధలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయినా.. నేడో రేపో ప్రభుత్వం తమను గుర్తిస్తుందనే ఆశతో ఇన్నాళ్లు పనిచేస్తూ వస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీ కార్మికుడు రోజులో 8 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ 108 ఉద్యోగులు మాత్రం రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు. అదనంగా పనిచేసిన 4 గంటలకు ఎటువంటి ఓవర్ టైం పేమెంట్ ఇవ్వడంలేదు. అంతే కాకుండా 12 గంటలు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్దామనుకునే సమయంలో ఏదైనా కేసు వస్తే మరో రెండు గంటలు అదనంగా పని చేయాల్సి వచ్చేది. ఇలా నిత్యం 12 నుంచి 14 గంటల పని భారం తప్పేది కాదు. సిబ్బంది సరిపడా లేకపోవడంతో సమయానికి సెలవులు కూడా ఇవ్వడం లేదని పలువురు 108 ఉద్యోగులు వాపోతున్నారు. అత్యవసర సేవలపై ప్రభావం.. 108 ఉద్యోగులు ప్రజలను అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్పత్రులకు తరలిస్తున్న సమయాల్లో సంబంధిత వైద్యుల సూచనల మేరకు అవసరమైన చికిత్స అందిస్తూ అండగా నిలుస్తున్నారు. సమ్మె కారణంగా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అత్యవసర సేవలు అందడం ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో అంబులెన్సులు 40 ఉన్నాయి. పైలెట్లు, ఈఎంటీలు 220 మంది మొత్తం ఉద్యోగులు ఉన్నారు. 172 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 108ను పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్షిఫ్ (పీపీపీ) పద్ధతిలో 2009 సంవత్సరంలో జీవీకే సంస్థకు కట్టబెట్టారు. ఈ విధానం 108 ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తూ 108 నిర్వహణ ప్రభుత్వమే కొనసాగించాలి. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని జీవీకే సంస్థ బెదిరిస్తుంది. – అశోక్ పల్లె, తెలంగాణ 108 ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. -
జీవో 151 అమలు చేయాల్సిందే
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కనీస వేతనం రూ.18కు పెంచుతూ విడుదల చేసిన జీవో నంబరును 151ను అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. విశాఖ మున్సిపల్ వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు జి.సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ కనీస వేతనం పెంచుతూ విడుదలైన జీవోను రెండేళ్లయినా జీవీఎంసీ అధికారులు అమలు చేయకపోవడం దారుణమన్నారు. వేతనాలు పెంచడానికి చర్య తీసుకోని అధికారులు పారిశుధ్యం పనులను ప్రైవేటికరించడానికి ఉద్దేశించిన జీవో 279ను మాత్రం అమలు చేయడం బాధాకరమన్నారు. జీవో 279ను వెంటనే రద్దు చేయాలని, జీవో 151ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. కార్మికులకు ఇవ్వవలసిన గ్లౌజ్‌లు, సబ్బులు, షూ, నూనె వెంటనే పంపిణీ చేయాలన్నారు. కార్మికులు సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 15వ తేదీ తర్వాత సమ్మె దిగుతామని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ జి ల్లా మాజీ అధ్యక్షుడు అజశర్మ, సీఐటీయూ నగర అధ్యక్షుడు కుమార్, యూనియన్ నాయకులు నాగేశ్వరరావు, రాజు, నాయుడు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్ల అర్ధనగ్న ప్రదర్శన
నిర్మల్అర్బన్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నిర్మల్అర్బన్ తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట రేషన్‌డీలర్లు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక, డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాల యంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా, రెచ్చగొట్టే విధానాలను అవలంభించడం సరికాదన్నారు. సంఘం నాయకులు రాజేందర్, గోపాల్‌దాస్, లింగన్న, రమణ, గంగాధర్, తదితరులున్నారు. సోన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్లు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రేషన్‌డీలర్లు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంతుల రాజేందర్, డీలర్లు దశరథ్, రామన్న, రాజు, గండయ్య తదితరులు పాల్గొన్నారు. ఒంటి కాలిపై నిరసన.. లక్ష్మణచాంద: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాల రేషన్‌డీలర్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఒంటి కాలిపై నిల్చొని నిరసనను తెలిపారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు ఓస మల్లయ్య, సభ్యులు మోహన్, రాజేశ్వర్, శ్రీనివాస్, రాజాగౌడ్, ప్రతాప్‌రెడ్డి , మరియా, తదితరులు పాల్గొన్నారు. -
తపాలా ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
బేతంచెర్ల : గ్రామీణ తపాలా ఉద్యోగుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆ సంఘం నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక పోస్టాఫీసు వద్ద తపాలా ఉద్యోగుల సమ్మె కొనసాగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ, మండల, జిల్లాస్థాయిలో తపాల సేవలు స్తంభించిపోయినా కేంద్ర ప్రభుత్వం స్పందిచకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తపాలా ఉద్యోగుల సమస్యలతో పాటు, కమలేశ్‌చంద్ర కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగులు విజయ్‌కుమార్, రమేశ్, మధు శివరామయ్య, ఖలీల్, రంగమ్మ, రామలక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీయిచ్చిందని టీఎంయూ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన సంఘాలతో సచివాలయంలో మంత్రుల కమిటీ బుధవారం భేటీ అయింది. వేతన సవరణ, ఉద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. జీతాలు పెంపుతో పాటు, 44 శాతం ఫిట్మెంట్, మిగతా అంశాలకు సంబంధించి అన్ని విషయాలపై చర్చించినట్టు అశ్వద్దామరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి తీసుకెళతామని మంత్రుల కమిటీ హామీయిచ్చిందన్నారు. తమ సమస్యలు పరిష్కారిస్తే సమ్మె నోటీసు వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాలతో చర్చించి వచ్చే జూన్ 30లోపు జీతాలపై నివేదిక సమర్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్, హరీశ్‌రావుపై తమకు నమ్మకం ఉందన్నారు. తమ అధికారులు తప్పుడు లెక్కలు చూపించారని వాపోయారు. మూడు రోజుల్లో మళ్ళీ మంత్రుల కమిటీతో భేటీ అవుతామన్నారు. -
జీతం పెంచాలంటూ ఆందోళన
డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ముట్టిడించిన ఆశా వర్కర్స్ కాకినాడ వైద్యం : నెలకు రూ.5,000 జీతం పెంచాలని కోరుతూ మంగళవారం ఆశా వర్కర్స్ ఆందోళన నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూల ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆశా వర్కర్స్ యూనియ¯ŒS జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షురాలు సీహెచ్ పద్మ, ఆర్వీలక్ష్మి మాట్లాడుతూ 11 ఏళ్లుగా వైద్య,ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న అంగ¯ŒSవాడీ కార్యకలాపాల్లో చాలీచాలని పారితోషికంతో సేవలు అందిస్తున్నామన్నారు. 2016 అక్టోబర్ నుంచి పారితోషికాల చెల్లింపు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. 2013 నుంచి యూనిఫార్మ్ అలవె¯Œ్స, 2008 నుంచి టీబీ డ్రగ్స్‌కు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదని, ఈ విషయమై మూడు పర్యాయాలు ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాము పనిచేసిన కాలానికి డబ్బులు చెల్లించడం లేదని, కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత విధించడం దారుణమన్నారు. హౌస్ హోల్డ్ సర్వే, స్కూల్ హెల్త్, ఇంద్రధనస్సు, ఫ్రైడే, ఆల్బెండజోల్, కండోమ్స్ పంపిణీ వంటి అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని వాపోయారు. 2017–18 బడ్జెట్లో ఎ¯ŒSహెచ్ఎంకు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్‌పై అధికారుల వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పనికి భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. త్రీటౌ¯ŒS సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
జీఓ 151 వర్తింపజేయాలంటూ ధర్నా
కాకినాడ సిటీ : వేతనాల పెంపు జీఓ 151 వర్తింప చేయాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ రెండవ ఏఎన్ఎంల యూనియన్ గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన అర్హతలతో వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు అరకొర వేతనాలు ఇచ్చి వేతన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంçపునకు సంబంధించి జీఓ నంబర్ 151ని తక్షణం సెకండ్ ఏఎన్ఎంలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవీ రమణ, డీఏ రత్నరాజ్‌లు సంఘీభావం తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతలక్ష్మి, జీఎన్ వరలక్ష్మి పాల్గొన్నారు.