- డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ముట్టిడించిన ఆశా వర్కర్స్
జీతం పెంచాలంటూ ఆందోళన
Published Tue, Feb 14 2017 9:45 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
కాకినాడ వైద్యం :
నెలకు రూ.5,000 జీతం పెంచాలని కోరుతూ మంగళవారం ఆశా వర్కర్స్ ఆందోళన నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూల ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆశా వర్కర్స్ యూనియ¯ŒS జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షురాలు సీహెచ్ పద్మ, ఆర్‌వీలక్ష్మి మాట్లాడుతూ 11 ఏళ్లుగా వైద్య,ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న అంగ¯ŒSవాడీ కార్యకలాపాల్లో చాలీచాలని పారితోషికంతో సేవలు అందిస్తున్నామన్నారు. 2016 అక్టోబర్ నుంచి పారితోషికాల చెల్లింపు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. 2013 నుంచి యూనిఫార్మ్ అలవె¯Œ్స, 2008 నుంచి టీబీ డ్రగ్స్‌కు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదని, ఈ విషయమై మూడు పర్యాయాలు ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాము పనిచేసిన కాలానికి డబ్బులు చెల్లించడం లేదని, కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత విధించడం దారుణమన్నారు. హౌస్ హోల్డ్ సర్వే, స్కూల్ హెల్త్, ఇంద్రధనస్సు, ఫ్రైడే, ఆల్బెండజోల్, కండోమ్స్ పంపిణీ వంటి అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని వాపోయారు. 2017–18 బడ్జెట్‌లో ఎ¯ŒSహెచ్‌ఎంకు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్‌పై అధికారుల వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పనికి భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. త్రీటౌ¯ŒS సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Advertisement
Advertisement