
ర్యాలీ నిర్వహిస్తున్న తపాలా ఉద్యోగులు
బేతంచెర్ల : గ్రామీణ తపాలా ఉద్యోగుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆ సంఘం నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక పోస్టాఫీసు వద్ద తపాలా ఉద్యోగుల సమ్మె కొనసాగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ, మండల, జిల్లాస్థాయిలో తపాల సేవలు స్తంభించిపోయినా కేంద్ర ప్రభుత్వం స్పందిచకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తపాలా ఉద్యోగుల సమస్యలతో పాటు, కమలేశ్‌చంద్ర కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగులు విజయ్‌కుమార్, రమేశ్, మధు శివరామయ్య, ఖలీల్, రంగమ్మ, రామలక్షమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment