
సాక్షి, కర్నూల్: రాజధాని వికేంద్రీకరణను చంద్రబాబు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కర్నూల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. రాయలసీమలలో హైకోర్టు ఏర్పాటు అన్నది సీమ ప్రజల దశాబ్దాల కల అని వారు అన్నారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను చంద్రబాబు అడ్డుకోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథలకాల అమలు చేస్తూ సుపరిపాలన అందించడం ఒక్క ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని వారు కొనియాడారు. కొవ్వొత్తుల ప్రదర్శనలో కర్నూల్, పాణ్యం ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, కర్నూల్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు బి.వై. రామయ్య ఇతర పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
చదవండి: మళ్లీ దొరికిపోయారా జూమ్ బాబు?
Comments
Please login to add a commentAdd a comment