సాక్షి, కర్నూలు : ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసారే తప్ప సీఎం చంద్రబాబు నాయుడులాగా చీకటి ఒప్పందాలు చేసుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు దేశమంతటా తిరిగి ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాలను ప్రత్యేక హోదా కోసం ఒప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీఆర్‌ఎస్ పార్టీతో పొత్తు అంటూ చంద్రబాబు తన మంత్రులతో అబద్ధపు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో నాలుగు సంవత్సరాలు కాపురం ఉండి సాధించిందేమిటో.. ప్రస్తుతం కాంగ్రెస్‌తో జత కట్టి సాధించేదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నీచపు రాజకీయాలు తమకు చేతకావంటూ రామయ్య చంద్రబాబును విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment