
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీయిచ్చిందని టీఎంయూ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన సంఘాలతో సచివాలయంలో మంత్రుల కమిటీ బుధవారం భేటీ అయింది. వేతన సవరణ, ఉద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. జీతాలు పెంపుతో పాటు, 44 శాతం ఫిట్‌మెంట్, మిగతా అంశాలకు సంబంధించి అన్ని విషయాలపై చర్చించినట్టు అశ్వద్దామరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి తీసుకెళతామని మంత్రుల కమిటీ హామీయిచ్చిందన్నారు. తమ సమస్యలు పరిష్కారిస్తే సమ్మె నోటీసు వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాలతో చర్చించి వచ్చే జూన్ 30లోపు జీతాలపై నివేదిక సమర్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్, హరీశ్‌రావుపై తమకు నమ్మకం ఉందన్నారు. తమ అధికారులు తప్పుడు లెక్కలు చూపించారని వాపోయారు. మూడు రోజుల్లో మళ్ళీ మంత్రుల కమిటీతో భేటీ అవుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment