Hyderabad Metro Rail Limited
-
ఒకవైపు కూల్చివేతలు.. మరోవైపు పరిహారం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనులు పట్టాలెక్కి పరుగులు తీస్తున్నాయి. మెట్రో రూట్లో కూల్చివేతలు ఊపందుకున్నాయి. మీరాలంమండి నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న మార్గంలో కూల్చివేతలు చకచకా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం (Metro Route) నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీంతో జేబీఎస్ (JBS) నుంచి చాంద్రాయణగుట్ట వరకు అతి పెద్ద గ్రీన్‌కారిడార్ (Green Corridor) అందుబాటులోకి రానుంది. ఈ రూట్లో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణను సకాలంలో పూర్తి చేసేందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట వరకు తొలగించాల్సిన 1,100 ఆస్తులను అధికారులు ఇప్పటికే గుర్తించారు.41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లింపు...భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్ఏఎంఎల్ (HAML) చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. పాతబస్తీలో గుర్తించిన 1100 ఆస్తులకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లించవలసి ఉంటుందని అంచనా. గజానికి రూ.81 వేల చొప్పున చెల్లించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ, మెట్రో నిర్మాణంలో మతపరమైన, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తున్నట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి (NVS Reddy) తెలిపారు. పర్యాటకంగా మరింత ఆకర్షణ... మెట్రో రైల్ రాకతో పాత నగరానికి కొత్త సొబగులు సమకూరనున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి. కాలుష్యరహితంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు చార్మినార్ సందర్శన ఒక ప్రత్యేకత. మెట్రో రాకతో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఆస్తులను కోల్పోవడంపై విచారం మరోవైపు దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న, ఉపాధి పొందుతున్న భవనాలు, షాపులను మెట్రోరైల్ నిర్మాణంలో భాగంగా కోల్పోవడం పట్ల పాతబస్తీ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులను కోల్పోవడం బాధగానే ఉన్నప్పటికీ పాతబస్తీ అభివృద్ధి దృష్ట్యా అంగీకరిస్తున్నట్లు మీరాలంమండికి చెందిన ఇబ్రహీం అనే ఛాయ్ దుకాణదారు తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న వస్త్ర, కిరాణా దుకాణాలు, హోటళ్లు కనుమరుగు కానున్నాయి.చదవండి: మరో రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులు -
జేబీఎస్ వద్ద అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనుంది. జేబీఎస్ (JBS) వద్ద ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ ఏర్పాటు దిశగా పరిశీలిస్తోంది. ఫలితంగా మేడ్చల్, శామీర్ పేట్ (Shamirpet) దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ.), జేబీఎస్ – శామీర్‌పేట్ (22 కి.మీ.) ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్ విషయంలో సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, (NVS Reddy) సీనియర్ ఇంజినీర్లు, సాంకేతిక సలహాదారులు ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బేగంపేట్ విమానాశ్రయం, ప్యారడైజ్, బోయినపల్లి వరకు రహదారి వంపు ఎక్కువగా ఉండటం, విమానాశ్రయ అధికారుల ఆంక్షల కారణంగా, హెచ్ఏండీఎ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంత దూరం పాటు భూగర్భ మార్గంగా మార్చుకుంది. ఈ అలైన్‌మెంట్‌ను బేగంపేట విమానాశ్రయం (తాడ్‌బండ్/బోయినపల్లి వైపు) రన్‌వే కింద దాదాపు 600 మీటర్ల దూరం భూగర్భ సొరంగం ద్వారా తీసుకువెళ్తుంది. దీనికి సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు మెట్రో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పలు ప్రాంతాల పరిశీలన.. మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్ల స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేయడం, ఇక్కడ ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సమీకరించవచ్చని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. జేబీఎస్ – సికింద్రాబాద్ క్లబ్‌రోడ్, స్టాఫ్ రోడ్ (పికెట్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ రోడ్), మడ్ ఫోర్ట్, టివోలీ, డైమండ్ పాయింట్, సెంటర్ పాయింట్, హస్మత్‌పేట్, బోయినపల్లి (సరోజిని పుల్లారెడ్డి బంగ్లా) రోడ్, తాడ్‌బండ్–ఆంజనేయ స్వామి ఆలయం –తాడ్‌బండ్ జంక్షన్, ఎయిర్ పోర్ట్ ఆఫీస్, బోయినపల్లి చెక్ పోస్ట్ తదితర ప్రాంతాల్లో మెట్రో ఎండీ కాలినడకన కలియతిరిగారు.లాభ నష్టాలను బేరీజు వేయండి..క్లిష్టమైన మలుపులను, విమానాశ్రయం కింద భూగర్భంలో అలైన్‌మెంట్‌ను తీసుకువెళ్లే ఆవశ్యకతను నివారించే విధంగా, ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాల లాభనష్టాలను అంచనా వేయాలని అధికారులను ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు. అలైన్మెంట్ వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండాలని, స్టేషన్ స్థానాల నిర్ధారణ, వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ/రక్షణ భూముల లభ్యత, మెరుగైన పార్కింగ్, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను పరిశీలించాలన్నారు.ఇదీ చదవండి: ముందు డిజైన్లు.. ఆపై టెండర్లుజేబీఎస్ వద్ద ప్రారంభంలో రెండు మెట్రో కారిడార్లను కలపడం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మేడ్చల్–జేబీఎస్–ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట– విమానాశ్రయ లింక్ కూడా ఏర్పడుతుందని, దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పర్యటనలో హెచ్ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు బి.ఎన్. రాజేశ్వర్, ఎం. విష్ణు వర్ధన్ రెడ్డి, ఎ.బాలకృష్ణ, డిప్యూటీ సీఈ (రైల్వేస్) జె.ఎన్. గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ నార్త్ సిటీ మెట్రో రైల్.. రెండు రూట్లలో డబుల్ డెక్కర్!
సాక్షి, హైదరాబాద్: నార్త్‌సిటీ మెట్రో కారిడార్లపై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) దృష్టి సారించింది. మార్చి నాటికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించే దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఈమేరకు రెండు కారిడార్లలో క్షేత్రస్థాయిలో అధ్యయనం మొదలైంది. కారిడార్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎదురు కానున్న సమస్యలు తదితర అంశాల ఆధారంగా అధికారులు సర్వే చేపట్టారు. ఈ రెండు రూట్లలో ఇప్పటికే హెచ్ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సన్నాహాలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ మార్గాల్లోనే మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో డబుల్ డెక్కర్ కారిడార్ల కోసం పియర్స్ ఎత్తును ఏమేరకు పెంచాల్సి ఉంటుంది, ఈ క్రమంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే అంశాలను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు కారిడార్లు సైతం డబుల్ డెక్కర్ (Double Deccar) పద్ధతిలో చేపట్టనున్న దృష్ట్యా ఇతర ఎలివేటెడ్ మెట్రోల కంటే నార్త్‌సిటీ మెట్రో (North City Metro) భిన్నంగా ఉండనుంది. ఇందుకనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. 3 నెలల్లో డీపీఆర్ రెడీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోసం కసరత్తు చేపట్టారు.హెచ్ఎండీఏతో సమన్వయం.. రెండు రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ల కోసం నిర్మించే పియర్స్పైనే మెట్రో కారిడార్ రానుంది. దీంతో నార్త్‌సిటీ మెట్రోకు పియర్స్ ఎత్తు, మెట్రో స్టేషన్ల నిర్మాణం కీలకం కానున్నాయి. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్‌కు, శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్లకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. దీంతో మెట్రో నిర్మాణంపై హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సంస్థ హెచ్ఎండీఏతో కలిసి పని చేయనుంది. పియర్స్, కారిడార్ల నిర్మాణం తదితర అంశాల్లో రెండు సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. డబుల్ డెక్కర్ వల్ల నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు నగర వాసులకు ఒకే రూట్లో రోడ్డు, మెట్రో సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కి.మీ. మెట్రో కారిడార్‌లో డెయిరీఫామ్ వరకు అంటే 5.32 కి.మీ డబుల్‌డెక్కర్ ఉంటుంది. మిగతా 17.68 కి.మీ ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించనున్నారు. మరోవైపు జేబీఎస్ (JBS) నుంచి శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. మార్గంలో ఇంచుమించు పూర్తిగా డబుల్‌డెక్కర్ నిర్మాణమే. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదాపు 23 కి.మీ, జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూంకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. పొడవుతో మెట్రో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కారిడార్లను మెట్రో రెండో దశ ‘బి’ విభాగం కింద చేర్చనున్నారు.ఇదీ చదవండి: చర్లపల్లి తరహాలో మరిన్ని రైల్వే స్టేషన్లుడబుల్డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల వల్ల సికింద్రాబాద్ నుంచి ఉత్తరం వైపు వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్ధులు, వివిధ రంగాల్లో పని చేసే అసంఘటిత కారి్మక వర్గాలు సిటీ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వాహనాల రద్దీ, గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు.అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలుమెట్రో రెండో దశపై కేంద్రం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మెట్రో నిర్మాణానికి నిధుల కొరత ఏ మాత్రం సమస్య కాదని, కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ లభిస్తే అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెన్నై, బెంగళూర్లలో మెట్రో విస్తరణకు గత బడ్జెట్లలో నిధులు కేటాయించినట్లుగానే హైదరాబాద్ మెట్రోకు కూడా ఈసారి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణపై కాంగ్రెస్ సర్కార్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఐదు సెక్టార్లలో మెట్రో అభివృద్ధికి ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో మెట్రో రైలు పొడిగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై త్వరగా డీపీఆర్, ట్రాఫిక్ స్టడీస్ పూర్తి చేయాలని ఆదేశించారు. మియాపూర్ నుంచి పటాన్ చెరు(14 కి.మీ), రాయదుర్గం స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (12 కి. మీ), ఎంజీబీఎస్ నుంచి ఎయిర్‌పోర్టు (23 కి.మీ), ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్( 8 కి.మీ) మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని స్పష్టం చేశారు. చదవండి: HYD Traffic Jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న హైదరాబాద్ నగరం పాతబస్తీలోని దారుషిఫా జంక్షన్ నుంచి శాలిబండ వరకు, దారుషిఫా నుంచి ఫలక్‌నుమ వరకు 100 ఫీట్ల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు వైండింగ్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, అభ్యంతరాలు తీసుకోవాలని తెలిపారు. ఈ మార్గంలో 103 మతపరమైన ప్రార్థనా మందిరాలు, హెరిటేజ్ భవనాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-IIIలో భాగంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట వరకు విస్తరించాలని సీఎం తెలిపారు. శ్రీశైలం హైవేపై ఎయిర్పోర్ట్ ప్రాంతం నుంచికందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాలన్నారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తారామతిపేట నుంచి నాగోల్, ఎంజీబీఎస్(40 కి.మీ) మీదుగా నార్సింగి వరకు మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో మెట్రో రైలు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రణాళికలను సమగ్ర పద్ధతిలో త్వరగా సిద్ధం చేసి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాసేందుకు రూపొందించాలని తెలిపారు. -
గణేష్ నిమజ్జనం.. మెట్రో సేవల సమయం పొడిగింపు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరవ్యాప్తంగా(జంట నగరాల్లో) ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. అయితే, రేపు(గురువారం) ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. గణేష్ నిమజ్జనం సందర్బంగా మెట్రో సమయాల్లో మార్పులు చేశారు. ప్రయాణీకులకు గురువారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు మెట్రో ట్రైన్ సేవలు అందుబాటులో ఉండనున్నట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అలాగే, మెట్రో సర్వీలసులను కూడా పెంచినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి ఒంటి గంటకు అన్ని స్టేషన్ల నుంచి చివరి సర్వీస్ బయలుదేరి అర్థరాత్రి 2 గంటలకు చివరి స్టేషన్లకు చేరుకుంటాయని వెల్లడించారు. మరోవైపు.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వాన కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా గణనాథుల నిమజ్జనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Get ready to celebrate Ganesh Nimarjan like never before! 🙏 Hyderabad Metro is here to make your festivities extra special. 🚇 𝗝𝗼𝗶𝗻 𝘂𝘀 𝗮𝘀 𝘄𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝗱 𝗼𝘂𝗿 𝗼𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗵𝗼𝘂𝗿𝘀 𝗳𝗿𝗼𝗺 𝟲 𝗔𝗠 𝗼𝗻 𝟮𝟴𝘁𝗵 𝗦𝗲𝗽𝘁𝗲𝗺𝗯𝗲𝗿 𝘁𝗼 𝟭 𝗔𝗠 𝗼𝗻… pic.twitter.com/Rl8H2oktwB — L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 27, 2023 -
ఎక్స్‌ప్రెస్ వేగంతో ఎయిర్‌పోర్టు మెట్రో.. కేటీఆర్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే మంత్రిమండలి తీర్మానం ప్రకారం నగరం నలువైపులా మెట్రో విస్తరణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ గురువారం బేగంపేట్‌లోని మెట్రో భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, జయేష్ రంజన్ తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందేందుకు బలమైన ప్రజారవాణా వ్యవస్థ ఎంతో అవసరమని, అందుకు మెట్రో రైల్ విస్తరణ దోహదం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణకు అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దిశగా మెట్రో రైల్ విస్తరణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. రద్దీ మేరకు అదనపు కోచ్‌లు.. ప్రస్తుతం నగరంలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రోజురోజుకూ మెట్రోకు ఆదరణ పెరుగుతోంది. పలు మార్గాల్లో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఇందుకనుగుణంగా మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. మెట్రో లాస్ట్‌మైల్ కనెక్టివిటీపైన దృష్టి సారించాలని, ఎక్కువ మంది ప్రయాణికులను మెట్రో వైపు ఆకర్షించడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం గణనీయంగా తగ్గడమే కాకుండా మెట్రో ప్రయాణికుల సంఖ్య కూడా రెట్టింపవుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఫీడర్ సర్వీసులను పెంచాలని చెప్పారు. ఈ సందర్భంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎయిర్పోర్టుమెట్రో ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు, ప్రభుత్వం ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ ప్రణాళికలపై పూర్తి వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మెట్రో డిపోకు 48 ఎకరాలు ఇవ్వాలి.. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్వేపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 48 ఎకరాల భూమిని జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు వెంటనే మెట్రో డిపో కోసం కేటాయించాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు భూమిని అప్పగించాలని కోరారు. మరోవైపు మెట్రో విస్తరణ ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి కేటీఆర్ సూచించారు. ఇప్పటికే సవివరమైన నివేదికలను సిద్ధం చేసిన బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్, ఎల్బీనగర్–నాగోల్ కారిడార్లపై కేంద్రం నుంచి రూ.9100 కోట్ల అంచనా వ్యయంలో కొంత ఆర్థిక సహాయాన్ని అడిగామని, దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. నివేదికలను సిద్ధం చేయండి... నగరం నలువైపులా భారీగా మెట్రో విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాలలో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి ప్రాథమిక నివేదికలను, అనంతరం సవివరమైన ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయాలని మంత్రి మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ విస్తరణలో భాగంగా మెట్రో స్టేషన్లతో పాటు భారీ కార్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాలకు చెందిన కలెక్టర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వేగంగా పాతబస్తీ మెట్రో.. అనంతరం మంత్రి కేటీఆర్‌తో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశమయ్యారు. పాతబస్తీ మెట్రోను వేగంగా చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో కారిడార్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను చేపట్టామని త్వరలోనే కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న మార్గాన్ని ఎయిర్‌పోర్టు మెట్రో వరకు పొడిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ -
ఎయిర్‌పోర్టు మెట్రోకు యమ క్రేజ్.. పోటీలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. బిడ్డింగ్ గడువు సమీపిస్తుండడంతో పలు నిర్మాణసంస్థల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, మరో ఐదు రోజులే మిగిలి ఉన్నందువల్ల మరిన్ని సంస్థలు బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ ముఖచిత్రం మారింది. వ్యాపార, వాణిజ్య రంగాలు, రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టాయి. దీంతో నగరంలో మెట్రో రైలును నిర్మాణ సంస్థలు లాభదాయకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ, రియల్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ కారిడార్‌ను దక్కించుకొనేందుకు గ్లోబల్‌స్థాయిలో పోటీ పెరిగింది. నిర్మాణ సంస్థలు ఈ కారిడార్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించడమే ఇందుకు కారణమని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో ఇప్పటికే ఎల్అండ్టీ, ఆల్స్టామ్, సీమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఐఆర్సీఓఎన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పీఏఎన్డీఆర్ఓఎల్ రహీ టెక్నాలజీస్ తదితర జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన కంపెనీలు పోటీలో ఉండగా, గడువు ముగిసేనాటికి మరిన్ని సంస్థలు పోటీలో నిలిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెండేళ్లలో పూర్తి... మరోవైపు ఈ మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 నాటికి పూర్తి చేసేవిధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. తాము విధించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు తమ బిడ్లను దాఖలు చేయాలని గతంలోనే అధికారులు స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరంలో అందుబాటులోకి రానున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ కోసం ఇప్పటి వరకు సర్వే, పెగ్‌మార్కింగ్, అలైన్మెంట్ తదితర పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో 29.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కాగా, 1.7 కిలోమీటర్ల వరకు భూగర్భమార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఎయిర్‌పోర్టు టర్మినల్ సమీపంలో ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో పాటు మొత్తం 9 మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయంలో హెచ్ఎండీఏ, జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు 10 శాతం చొప్పున భరిస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. మొదట 11 రైళ్లతో ప్రారంభం.. రాయదుర్గం –ఎయిర్‌పోర్టు మార్గంలో మొదట 11 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి మెట్రోకు 3 కోచ్‌లు ఉంటాయి. మొత్తం 33 కోచ్‌లతో సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌మెట్రో 6 కోచ్‌లు, చైన్నె ఎయిర్పోర్ట్ మెట్రో 4 కోచ్‌లతో నడుస్తోంది. మొదట్లో రద్దీ సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున నడుపుతారు. ఆ తరువాత రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిసింది. నగరం పడమటి వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కేవలం ఎయిర్‌పోర్టు ప్రయాణికులే కాకుండా అన్ని వర్గాల ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ మెట్రో సేవలను వినియోగించుకొనే అవకాశం ఉంది. దీంతో రైళ్లు, సర్వీసుల సంఖ్య భారీగా పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా 9 స్టేషన్లను ఖరారు చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో మరిన్ని స్టేషన్లకు కూడా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది.. మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు కొత్తగా స్టూడెంట్ పాస్ సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించింది. 20 ట్రిప్పులకు పాసు తీసుకుని 30 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. జూలై 1 నుంచి మార్చి 31, 2024 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. విద్యాసంస్థల ఐడీ కార్డును చూపించి స్టూడెంట్ పాస్ మెట్రో కార్డును విద్యార్థులు పొందాలని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెట్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ రెడ్డి, L&T మెట్రో రైల్ హైదరాబాద్ సీఈవో కేవీబీ రెడ్డి శనివారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో స్టూడెంట్ పాస్-2023 ఆఫర్‌ను ప్రారంభించారు. దీని ప్రకారం ఒక విద్యార్ధికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయనున్నారు. ఏప్రిల్ 1,1998 తర్వాత జన్మించిన విద్యార్థులు మాత్రమే పాస్ పొందేందుకు అర్హులు. ఈ పాస్ సహాయంతో నెల రోజుల్లో 30 రైడ్లు చేయవచ్చు 9 నెలల వ్యాలిడిటీతో ఈ పాస్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ జూలై 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పాస్‌లను జేఎన్టీయూ కాలేజీ, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, విక్టోరియా మెమోరియల్, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, రాయదుర్గ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటుంది. చదవండి: రేపు వరంగల్‌లో బీజేపీ సన్నాహక సమావేశం.. ఆ నేతలు కలిసి పనిచేసేనా? Introducing the Metro Student Pass. An ultimate and convenient tool for Hyderabadi Students to ride the metro way. Get a brand new student pass metro card by showing your college ID card, recharge for 20 rides, and get 30 rides in 30 days. School/college-going is now made easier… pic.twitter.com/rHjDhQGPqU — L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 1, 2023 -
Hyderabad: మెట్రో ప్రయాణికులకు షాక్..
సాక్షి, హైదరాబాద్: మెట్రో చార్జీలపై రాయితీని ఎత్తేశారు. కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డులు, క్యూఆర్‌కోడ్‌పైన ప్రయాణం చేస్తున్న వారికి ఇప్పటి వరకు చార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రాయితీపైన కోత విధిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎల్అండ్టీ ప్రకటించింది. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకు అన్ని వేళల్లో 10 శాతం రాయితీ లభిస్తుండగా ఇక నుంచి రద్దీ లేని సమయాలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 12 వరకు మాత్రమే ఈ రాయితీ వర్తించనున్నట్లు అధికారులు తెలిపా రు. ఆఫ్ పీక్ అవర్స్‌లో భాగంగా రాయితీని కుదించినట్లు పేర్కొన్నారు. శనివారం నుంచే ఇది అమల్లోకి రానుంది. దీంతో ప్రతిరోజు మెట్రోలో రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులు ఇక సాధారణ చార్జీలపైనే రాకపోకలు సాగించవలసి వస్తుంది. మరోవైపు గుర్తించిన సెలవు రోజుల్లో కేవలం రూ.59కే అపరిమితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన సూపర్ సేవర్ ఆఫర్ ధరలను సైతం రూ.100కు పెంచింది. దీంతో ఇప్పటి వరకు కేవలం రూ.59 చెల్లించి సెలవు రోజుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణం చేసినవారు ఇక నుంచి ఎస్ఎస్ఓ–99 టిక్కెట్లపైన ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది కూడా శనివారం నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు చెప్పారు. అమాంతంగా పెంచింది. ఈ కొత్త పథకం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతుంది. దీంతో ఆఫర్ టిక్కెట్ల ధరలను సైతం ఏకంగా 40 శాతం పెంచినట్లయింది. 10 లక్షల మంది వినియోగించారు.. ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రవేశపెట్టిన ట్రావెల్యాజ్ యు లైక్ టికెట్ల తరహాలోనే హైదరాబాద్ మెట్రో రైల్ సూపర్ సేవర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. వీకెండ్స్, పండుగలు, ఇతర ప్రత్యేక సెలవు రోజుల్లో అతి తక్కువ చార్జీలతో మెట్రో రైళ్లలో రోజంతా ప్రయాణించే విధంగా అందుబాటులోకి తెచి్చన ఈ సూపర్ సేవర్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఎస్ఎస్ఓ–59 పేరుతో అమల్లోకి తెచ్చిన ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మందికి పైగా ప్రయాణం చేసినట్లు అంచనా. నగరవాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ సందర్శన కోసం వచ్చిన పర్యాటకులు, ఇతర పనులపైన నగరానికి వచ్చిన వారు సైతం ఈ ఆఫర్‌ను వినియోగించుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సూపర్ సేవర్ ధరలను హెచ్ఎంఆర్ఎల్ రూ.100కు పెంచి సూపర్ సేవర్ ఆఫర్ (ఎస్ఎస్ఓ)–99ను ప్రవేశపెట్టింది. అంటే ఇప్పటి వరకు రూ.60తో రోజంతా ప్రయాణం చేసిన వారు ఇక నుంచి రూ.100 చెల్లించవలసి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే ఎస్ఎస్ఓ–59 వినియోగిస్తున్న వారు అదనపు డబ్బులు చెల్లించి ఎస్ఎస్ఓ–99 కోసం వినియోగించవచ్చు. గుర్తించిన సెలవుల జాబితా ఆన్‌లైన్‌లోనూ, అన్ని మెట్రో స్టేషన్లలోనూ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రెగ్యులర్‌గా ప్రయాణించేవారు, సాధారణ ప్రయాణికులు ఎప్పటిలాగే మెట్రో సేవలను వినియోగించుంటారని ఆశిస్తున్నట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ అండ్సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. పెరిగిన రద్దీ మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో నగరవాసులు మెట్రో ప్రయాణం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూడు కారిడార్లలో ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పుల వరకు రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మూడు కారిడార్లలోని 57 స్టేషన్ల నుంచి ఇటీవల వరకు సుమారు 4 లక్షల మంది రాకపోకలు సాగించగా ఇప్పుడు ఆ సంఖ్య 4.4 లక్షలకు పెరిగింది. వేసవి తాపం కారణంగానే కూల్ జర్నీని ఎంపిక చేసుకొనే వారిసంఖ్య పెరుగుతోంది. -
Hyderabad Metro: సాంకేతిక లోపంతో నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక సమస్యలు నగర మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తున్నాయి. మంగళవారం ఉదయం అమీర్‌పేట్– రాయదుర్గం రూట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఓ రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో ఒకేవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలను కొనసాగించారు. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. సమయానికి గమ్యం చేరుకోలేకపోయారు. మెట్రో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరగడంతో సుమారు రెండు గంటల పాటు గందరగోళం నెలకొంది. అనంతరం అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్‌పేట్–రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
చర్చలు సఫలం.. మెట్రో ఉద్యోగుల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: మెట్రో సిబ్బంది చేస్తున్న సమ్మె బాట వీడారు. తమ డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో మెట్రో టికెటింగ్ ఉద్యోగులు సమ్మె విరమించారు. అయితే, వేతనాల అంశంలో మెట్రో టికెటింగ్ ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వీరి సమ్మెపై కియోలిన్ అధికారులు స్పందించారు. వేతనం రూ. 20వేలు పెంచేదిలేదని స్పష్టం చేశారు. ఇక, ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు. -
హైదరాబాద్‌లో మెట్రో రైలుకు సమ్మెసెగ!
-
హైదరాబాద్: మెరుపు సమ్మెపై మెట్రో యాజమాన్యం స్పందన
సాక్షి, హైదరాబాద్: జీతాల పెంపు పేరుతో మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెపై హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు ధర్నాలో పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. ఐదేళ్లుగా తమ జీతాల్లో పెరుగుదల లేదని ఆరోపిస్తూ.. అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్యోగుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే.. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు కచ్చితంగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం రూ. 11 వేలుగా ఉన్న జీతాన్ని.. కనీస వేతనం కింద రూ. 18 వేలకు పెంచాలంటూ టికెటింగ్ ఉద్యోగులు విధుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు. రెడ్ లైన్(మియాపూర్-ఎల్బీనగర్) మధ్య టికెట్ కౌంటర్ల వద్ద సిబ్బంది కొరతతో క్యూ లో టికెట్ల కోసం ప్రయాణికులు అవస్తలు పడుతున్నారు. -
హైదరాబాద్‌లో మెట్రో రైలుకు సమ్మెసెగ
-
హైదరాబాద్: సమ్మె బాటలో మెట్రో రైల్వే ఉద్యోగులు?!
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ(మంగళవారం) ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్‌లైన్ టికెటింగ్ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు. అమీర్‌పేట వద్ద సిబ్బంధి ధర్నాకు దిగారు. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ రూట్లో గందరగోళం నెలకొంది. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు వాళ్లు. కరోనా టైం తప్పిస్తే.. మిగతా రోజుల్లో విరామం లేకుండా పని చేస్తున్నప్పటికీ తమకు సరైన న్యాయం జరగట్లేదని అంటున్నారు వాళ్లు. కేవలం పదకొండు వేల జీతంతో నెట్టుకొస్తున్నామని చెబుతున్నారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళ వ్యక్తం చేశారు. ఇక ఈ పరిణామంపై హైదరాబాద్ మెట్రో స్పందించాల్సి ఉంది. ఆ స్పందన తర్వాత సమ్మె గురించి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో సోలార్ పవర్!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ మెట్రో సౌరకాంతుల శోభను సంతరించుకోనుంది. 31 కి.మీ. మేర చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 9 నుంచి 10 స్టేషన్లను నిర్మించనున్నారు. స్టేషన్లలో పూర్తిస్థాయిలో సౌరశక్తి వినియోగం ఆధారంగా విద్యుత్ దీపాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు తదితర విద్యుత్ ఆధార ఉపకరణాలు పనిచేసేలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ సంస్థ చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే తొలిదశ మెట్రో ప్రాజెక్టులో 28 మెట్రోస్టేషన్ల పైకప్పులు, ఉప్పల్, మియాపూర్ డిపోల్లోని ఖాళీప్రదేశాల్లో 8.35 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. మెట్రోస్టేషన్లు, కార్యాలయాల్లో ఉపయోగించే విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం సౌరశక్తి ద్వారానే పొందుతున్నట్లు తొలిదశ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. తొలిదశలో సౌరశక్తి వినియోగం ఇలా.. సంప్రదాయేతర ఇంధన వనరులపై మెట్రో సంస్థ దృష్టి సారించింది. ఇప్పటికే మెట్రో రైళ్లలో బ్రేకులు వేసినప్పుడు ఉత్పన్నమయ్యే బలంతో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రిజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. సౌరశక్తి, రిజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నందుకు 20 మెట్రోస్టేషన్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందాయి. లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ ప్లాటినం సర్టిఫికెట్‌ను కూడా మెట్రో సాధించింది. మెట్రోస్టేషన్లను 100 శాతం సౌరవెలుగును ఉపయోగించుకోవడం, క్రాస్ వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని పరిమిత మోతాదులో వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఉప్పల్, మియాపూర్ డిపోల్లో వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు 150 భారీ ఇంకుడుగుంతలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంగణాల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టింది. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి మెట్రో రైల్.. త్వరలో శంకుస్థాపన..
-
Hyderabad Metro: గుడ్‌న్యూస్.. ఎయిర్‌పోర్టుకు మెట్రో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌కు తలమానికమైన శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు వివరాలను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సుమారు 31 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ మార్గాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.6,250 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. రాయదుర్గం–ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ఏర్పాటైతే ఐటీ కారిడార్ నుంచి విమానాశ్రయానికి చేరుకునేవారికి దూరాభారం, సమయం తగ్గుతాయి. ప్రస్తుతం రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతోంది. మెట్రో రైళ్లలో 25 నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించి ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను కూడా గతంలోనే ఏర్పాటు చేశారు. మెట్రో రెండోదశపై చిగురిస్తున్న ఆశలు మంత్రి కేటీఆర్ ప్రకటనతో హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు రెండో దశ విస్తరణపై ఆశలు చిగురిస్తున్నాయి. రెండో దశ కింద రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ.)తోపాటు బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ (26 కి.మీ), నాగోల్–ఎల్బీనగర్ (5 కి.మీ) మార్గాల్లో మెట్రో ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధంచేసి కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచింది. రెండోదశకు అవసరమైన రూ.8,500 కోట్ల నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్ ఇటీవలే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. సంబంధిత అధికారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ప్రతీ 5 కిలోమీటర్లకు ఓ స్టేషన్ విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రోస్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నట్టు తెలిసింది. స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని గచి్చ»ౌలి, అప్పా జంక్షన్, కిస్మత్పూర్, గండిగూడ చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థలపరిశీలన కూడా పూర్తయింది. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా సాయిల్ టెస్ట్ చేస్తున్నట్టు మెట్రో వర్గాలు తెలిపాయి. -
మెట్రో వడ్డన.. 25 నుంచి 30 శాతం చార్జీల పెంపు?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ మెట్రో చార్జీలు 25 నుంచి 30 శాతం పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెరిగిన టికెట్ ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. చార్జీల పెంపునకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీకి ఈ– మెయిల్ ద్వారా సలహాలు పంపించేందుకు విధించిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ప్రజల నుంచి పలు అంశాలపై సూచనలు అందినట్లు సమాచారం. ప్రధానంగా మెట్రోలో చార్జీల పెంపునకు బదులు ఆదాయం పెంచుకునేందుకు నగరంలో మెట్రోకు కేటాయించిన విలువైన ప్రభుత్వ స్థలాల లీజు, మాల్స్ నిర్మాణం, స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ బస్సులను నడపడం, ప్రతి స్టేషన్లో ఉచితంగా పార్కింగ్ సదుపాయం కల్పించడం, స్టేషన్ మధ్య భాగంలో తక్కువ అద్దెతో నిత్యావసరాలు విక్రయించుకునేందుకు చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న సూచలు అందడం విశేషం. ఆదాయ ఆర్జనలో విఫలం.. మెట్రో నిర్మాణం సమయంలో ప్రయాణికుల చార్జీల ద్వారా 45 శాతం.. మరో 50 శాతం వాణిజ్య స్థలాలు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా సమకూర్చుకోవడం, మరో అయిదు శాతం వాణిజ్య ప్రకటనల రూపంలో ఆదాయ ఆర్జన చేయాలని నిర్మాణ సంస్థ నిర్దేశించుకుంది. నిర్మాణ పనులు ఆలస్యం కావడం, కోర్టు కేసులు, రాష్ట్ర విభజన, కోవిడ్ విజృంభణ, ఆర్థిక మాంద్యం తదితర కారణాల రీత్యా నిర్మాణ సంస్థ అంచనాలు తలకిందులయ్యాయి. నగరం నడిబొడ్డున పలు చోట్ల సుమారు 269 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాలను 60 ఏళ్లపాటు సంస్థకు సర్కారు కేటాయించింది. ఈ స్థలాలను అభివృద్ధి చేసి ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టే విషయంలోనూ సంస్థ చతికిలపడింది. తాజాగా పెరిగే విద్యుత్ చార్జీల భారం, నిర్వహణ కష్టాలు, రుణాలు, వాటిపై వడ్డీతో తడిసి మోపెడు కావడం తదితర కారణాలను సాకుగా చూపి చార్జీల పెంపునకు సిద్ధపడటం గమనార్హం. ప్రభుత్వం నుంచి రూ.3 వేల కోట్ల మేర సాఫ్ట్‌లోన్ మంజూరు అంశం కూడా కొలిక్కి రాకపోవడంతో చార్జీలు పెంచడం మినహా ఇతర ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగర మెట్రోలో కనీస చార్జీ రూ.10.. గరిష్టంగా రూ.60గా ఉంది. పెంపు ప్రతిపాదనలను 25 నుంచి 30 శాతానికి పరిమితం చేస్తారా? అంతకంటే అదనంగా పెంచుతారా? అన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది. -
మెట్రోలో వెళ్తున్నారా.. బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నారు జాగ్రత్త..!
హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు బిగ్‌బాస్‌ను బరిలోకి దించింది. సురక్షిత ప్రయాణంపై సామాజిక సందేశాన్ని స్టార్ మా, ఎల్ అండ్ టీ మెట్రో సంయుక్తంగా ప్రచారం కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా స్టార్ మా బిగ్‌బాస్ సీజన్ -6 హోస్ట్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా బిగ్‌బాస్ ఈజ్ వాచింగ్ యు (బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు) అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘బిగ్ బాస్ ఈజ్ వాచింగ్ యు’ ప్రచారం ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని నగరంలోని 57 మెట్రో స్టేషన్లలోని కాన్కోర్స్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్, చెక్ ఇన్ ప్రాంగణాలలో చేస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్‌తో పాటుగా అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌ను మొత్తం బిగ్‌బాస్ సీజన్లో 100 రోజులూ ప్రచారం చేయనున్నారు. ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా మెట్రో స్టేషన్ ప్రాంగణాలలో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగా భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేయనున్నారు. (చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప-2 ఫస్ట్ గ్లింప్స్ ఆరోజే..!) బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. 'వినోదంతో పాటుగా ఓ సహేతుకమైన సందేశమూ ఉండాలి. ఈ ప్రచారం ఆ విధానానికి చక్కటి ప్రాతినిధ్యం వహిస్తుంది. బిగ్‌బాస్ అనేది పూర్తి వినోదాత్మక కార్యక్రమం. భావోద్వేగాలను తట్టి లేపుతుంది. ఈ ప్రచారం ద్వారా భద్రత పట్ల మరింత అవగాహన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రయాణికులకు చక్కటి విలువను జోడించనుంది. స్టార్ మా, ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఈ తరహా బాధ్యతాయుతమైన ప్రచారం కోసం ముందుకు రావడం సంతోషంగా ఉంది' అని అన్నారు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. 'స్టార్ మా బిగ్‌బాస్‌తో విజయవంతంగా మూడో ఏడాది భాగస్వామ్యం చేసుకున్నాం. ఈ భాగస్వామ్యంలో భాగంగా మేము ‘బిగ్‌బాస్ ఈజ్ వాచింగ్ యు’ ప్రచారం ప్రారంభించాము. దీని ద్వారా భద్రతా అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం. ఈ ప్రచారం ద్వారా స్మార్ట్ ట్రావెల్ అలవాట్లను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిద్వారా మెట్రో ప్రయాణీకులు మొబైల్ క్యూఆర్ టిక్కెట్లు, స్మార్ట్ కార్డులు వినియోగించాల్సిందిగా చెబుతున్నాం. సూపర్ స్టార్ నాగార్జున, స్టార్ మా నెట్‌వర్క్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నా' అని అన్నారు. (చదవండి: ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావు, మరి నిన్నేమనాలి?: నాగ్) -
ఫలించని వ్యూహాలు.. గ్రేటర్ మెట్రోకు కొత్త కష్టాలు!
సాక్షి, సిటీబ్యూరో: పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న గ్రేటర్ మెట్రోను గట్టెక్కించేందుకు నిర్మాణ సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఇందుకోసం ఐదేళ్లుగా అమలు చేస్తోన్న సరికొత్త వ్యూహాలు ఆశించినస్థాయిలో సత్ఫలితాన్నివ్వడం లేదు. తాజాగా ప్రాజెక్టులో తమ వాటాను 50 శాతం విక్రయించేందుకు ముందుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మెట్రో నిర్మాణం చేపట్టేందుకు వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి సుమారు 13 వేల కోట్ల రుణాలను సేకరించింది. ఇందులో తమ వాటాను సగానికి తగ్గించుకోవడం ద్వారా రూ.7,500 కోట్లు సమీకరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రుణాలపై వడ్డీ భారాన్ని సైతం ఇటీవల సుమారు 2.5 శాతం తగ్గించుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు టిక్కెట్ ఛార్జీల పెంపు ద్వారా రోజువారీగా భారంగా మారిన నిర్వహణ నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నినస్తుండడం గమనార్హం. ఇందుకోసం ప్రభుత్వం ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇక మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రధాన నగరంలో ప్రభుత్వం నిర్మా ణ సంస్థకు కేటాయించిన సుమారు 69 ఎకరాల విలువైన స్థలాలను క్రమంగా లీజుకివ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన స్థాయిలో సత్ఫలితాన్నివ్వలేదు. తాజాగా రాయదుర్గంలోని 15 ఎకరాల స్థలాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా మరో వెయ్యికోట్లు ఆదాయం సమకూర్చుకునేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. వాటా దక్కించుకునేదెవ్వరో.. ఐదేళ్లుగా నష్టాలతో నెట్టుకొస్తున్న గ్రేటర్ మెట్రోలో నిర్మాణ సంస్థ విక్రయించాలనుకుంటున్న 50 శాతం వాటాను దక్కించుకునేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశం సస్పెన్స్‌గా మారింది. ఒకవైపు భయపెడుతోన్న నష్టాలు..మరోవైపు కొండలా పేరుకుపోయిన రుణాలు,వాటిపై వడ్డీ చెల్లింపులు భారంగా మారిన తరుణంలో నిర్మాణ సంస్థ వాటాల విక్రయం అంత సులభం కాదని ఆర్ధిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్, లాక్డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన తమకు రూ.3 వేల కోట్ల మేర వడ్డీలేని సాఫ్ట్‌లోన్‌ను మంజూరు చేయాలని నిర్మాణ సంస్థ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఙప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం. అనుకున్నదొక్కటి... - నగరంలో ఎల్బీ నగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు మార్గాల్లో 69.2 కి.మీ మేర మెట్రో అందుబాటులోకి వచ్చింది. - ప్రస్తుతం ఈ రూట్లలో నిత్యం 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ అంచనాల మేరకు ఈ మూడు రూట్లలోనిత్యం 16 లక్షలమంది జర్నీ చేస్తారని ఐదేళ్ల క్రితం అంచనా వేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. - పార్కింగ్ కష్టాలు, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేకపోవడం తదితర అంశాలు మెట్రోకు శాపంగా మారాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు కనీస ఛార్జీని ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి..గరిష్ట ఛార్జీని ప్రస్తుతం ఉన్న రూ.60 నుంచి రూ.100కు పెంచేందుకు ప్రయత్నినస్తునట్లు సమాచారం. -
Hyderabad: మెట్రో స్టేషన్లతో సిటీ బస్సుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: మెట్రో స్టేషన్లతో సిటీ బస్సులను అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. మెట్రో రైళ్లు, సిటీ బస్సుల మధ్య సమన్వయం కోసం శనివారం బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్అండ్టీ మెట్రోకు, ఆరీ్టసీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఎల్అండ్టీ చీఫ్ స్ట్రాటజీ అధికారి మురళీ వరద రాజన్, చీఫ్ మార్కెటింగ్ అధికారి రిషికుమార్ వర్మ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్లను అనుసంధానం చేస్తూ బస్సులను నడపడంతో పాటు సర్వీసుల సమయపట్టిక, సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్ల వద్ద ఆర్టీసీ సమాచార కేంద్రాలను, అనౌన్స్మెంట్ ఏర్పాట్లను చేయనున్నట్లు పేర్కొన్నారు. మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా ఈ అనుసంధానం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మెట్రోరైల్ ప్రతినిధుల బృందం చొరవను ప్రత్యేకంగా అభినందించారు. మెట్రో రైలుతో ఆర్టీసీ బస్సుల అనుసంధానం ఆహ్వానించదగిన పరిణామమని ఎల్అండ్టీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: సకల జనుల సమ్మె కాలపు వేతనం వచ్చిందోచ్.. 11 ఏళ్ల తర్వాత! -
Hyderabad: మెట్రో జర్నీ మరింత ప్రియం.. సామాన్యుడిపై చార్జీల పిడుగు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీజన్లపై త్వరలో మెట్రో చార్జీల పిడుగు పడనుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి విముక్తి కల్పించేందుకు ఏర్పాటు చేసిన కలల మెట్రోలో జర్నీ సామాన్యుడికి మరింత ప్రియం కానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మహానగర పరిధిలో నాలుగేళ్ల క్రితం నుంచి మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. తాజాగా చార్జీల సవరణ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆర్డర్ నెం. కె–14011/29/2018–ఎంఆర్టీఎస్–2 ప్రకారం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేంద్రకుమార్ బగ్డె, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యామ్ప్రసాద్ల ఆధ్వర్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నగర వాసులు, మెట్రో ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను ఈ– మెయిల్ ద్వారా పంపించాలని హెచ్ఎంఆర్ బహిరంగంగా ప్రకటించింది. నవంబరు 15 వరకు గడువు ఇచ్చింది. నగరవాసులు ‘ఎఫ్ఎఫ్సీహెచ్ఎంఆర్ఎల్ ఎట్రేట్జీమెయిల్.కామ్’కు సలహాలను ఈ– మెయిల్ ద్వారా పంపించాలని కోరింది. చార్జీల వడ్డింపుతో నిరాదరణే.. నగరంలో తొలిదశ మెట్రో ప్రాజెక్టు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మార్గాల్లో 69.2 కి.మీ మేర అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు రూట్లలో 57 రైళ్లను నడుపుతున్నారు. నిత్యం సుమారు 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రోలో కనీస చార్జీ రూ.10 గరిష్టంగా రూ.60 వసూలు చేస్తున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం, తమ ఇళ్ల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు ప్రత్యేకంగా షటిల్ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మెట్రో అధికారుల ముందస్తు అంచనాల మేరకు ఈ మూడు రూట్లలో 16 లక్షల మంది జర్నీ చేస్తారని అంచనా వేసినప్పటికీ.. పలు కారణాల రీత్యా మెట్రోకు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా చార్జీలు మరింత పెంచితే ప్రయాణికుల నిరాదరణ తప్పదని ప్రజారవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టోకు ధరల సూచీ, ద్రవ్యోల్బణం అంచనాలు, వినియోగ వ్యయాలు, మెట్రో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మెట్రో చార్జీలను సవరించనున్నట్లు తెలిసింది. నగర మెట్రోలో కనీస చార్జీ ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి.. గరిష్ట చార్జీ రూ.60 నుంచి రూ.100కి పెంచే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్‌ఛానెల్‌తో గుండెను తరలించిన మెట్రో
సాక్షి,హైదరాబాద్: నగరవాసులకు అవసరమైన సహాయం చేయడానికి తామెప్పుడూ ముందే ఉంటామని మరోసారి ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ నిరూపించింది. గతంలో ఫిబ్రవరి 2021లో ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించాలని ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎస్ఓఎస్కు కాల్ వచ్చిందో అదే తరహాలో మరోసారి కాల్ వచ్చింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో.. సెప్టెంబర్ 26న తెల్లవారుజూమున గ్రీన్ ఛానెల్ ఏర్పాటుచేయడంతో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు గుండెను రవాణా చేసింది. కాగా, గుండె తరలింపులో భాగంగా ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ డాక్టర్లు , ఇతర మెడికోలు.. రాత్రి ఒంటి గంట సమయంలో నాగోల్ మెట్రోస్టేషన్ వద్దకు గుండెను తీసుకువచ్చారు. అనంతరం, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి కేవలం 25 నిమిషాల్లోనే గుండెను ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్‌కు చేర్చారు. తర్వాత, అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి చేర్చారు. ఈ స్పెషల్ ఆపరేషన్ కోసం లైన్-3 సెక్యూరిటీ అధికారులతో పాటుగా మెట్రో అధికారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చేశారు. ఈ సందర్భంగా ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రయాణీకుల సేవకు హైదరాబాద్ మెట్రో రైల్ కట్టుబడి ఉంటుంది. అవసరమైన సమయంలో వారికి సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. మా అవసరం ఎక్కువగా ఉన్నవారికి, అవసరమైన సమయంలో తోడుండాలనేది మా సిద్ధాంతం. ఈసారి కూడా మేము గ్రీన్‌ఛానెల్ ఏర్పాటుచేయడంతో పాటుగా వీలైనంత త్వరగా గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడాము. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్ఎంఆర్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము’ అని అన్నారు. కాగా, ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులోనే ఉన్నాయి. ఓవైపు.. క్రికెట్ అభిమానులకు తరలిస్తూనే.. అటు మెట్రో అధికారులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడం విశేషం. మ్యాచ్ సందర్భంగా దాదాపు 20వేల మంది క్రికెట్ ఫ్యాన్స్ మెట్రో ప్రయాణించినట్టు సమాచారం. -
Hyderabad Metro: అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్‌ఛానెల్‌తో గుండెను తరలించిన మెట్రో
-
హైదరాబాద్ మెట్రోలో డ్యాన్స్.. యువతికి షాకిచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అందరికి ఫేమస్ అయిపోవాలన్న పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలు రికార్డ్ చేసి నెట్టింట్లో అప్లోడ్ చేయడం తెగ కామన్ అయిపోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లోనూ వీడియోలు చీత్రికరిస్తున్నారు. నలుగురిలో పాపులారిటీ తెచ్చుకోవాలన్న భ్రమలో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే సదరు యువతి స్టేషన్లోనే కాకుండా మెట్రో రైల్లో కూడా వీడియో చేసినట్లు బయటపడింది. ట్రైన్లో ప్రయాణికులు ఉండగానే అందరిముందు టాలీవుడ్‌లోని ఓ పాటకు స్టెప్పులేస్తూ రీల్ చేసింది. దీనిని ఇన్‌స్టాలో షేర్ చేయింది. అయితే యువతి మెట్రలో డ్యాన్స్ చేయడంపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను ఏ స్టేషన్లో చిత్రీకరించారో గుర్తించి యువతిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇన్‌స్టా రీల్ చేసిన యువతిపై కేసు నమోదైంది. సదరు యువతిని గుర్తించి, ఆమెపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు వెల్లడించారు. మరోవైపు సోషల్ మీడియాలో యువతి చర్యపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇలాంటి పిచ్చి ప్రవర్తనను ప్రొత్సహించొద్దు. మెట్రో మీ ప్రైవేటు ఆస్తి కాదు. ప్రజా రవాణాలో ఇలాంటి ప్రవర్తనను అస్సలు సహించకూడదు.’ అంటూ మండిపడుతున్నారు 💃 Dance On Hyderabad Metro 🚄 When did this happen??? pic.twitter.com/ZilPdia9fx — Hi Hyderabad (@HiHyderabad) July 20, 2022 కాగా గతంలో రైలు బోగీల్లోనూ పలువురు డ్యాన్స్ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. నగర మెట్రో రైళ్లలో అధికారుల అనుమతితో కొన్ని టాలీవుడ్, బాలీవుడ్ సినిమా సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఓ సినిమాను మాదాపూర్ మెట్రో స్టేషన్ ఆవరణలో చిత్రీకరించడం విశేషం. After many people criticised her on social media, Hyderabad Metro Rail🚇 Limited Authorities said that stringent action will be taken against the woman.👮@MostlyTelugu #Hyderabad #HyderabadMetro #VikrantRоna #RaRaRakkamma pic.twitter.com/CUUJ6S8e6w — Mostly Telugu (@MostlyTelugu) July 21, 2022 -
హైదరాబాద్‌లో మెట్రోరైళ్లు నిలిపివేత
-
అగ్నిపథ్ ఆందోళన ఎఫెక్ట్.. హైదరాబాద్ మెట్రో రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హైదరాబాద్ మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని అధికారులు సూచించారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధావిధిగా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో సబ్ అర్బన్ సర్వీస్‌లను రద్దుచేశారు. మరోవైపు ఢిల్లీలోనూ మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. చదవండి: Live Updates: అగ్నిగుండంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్పీఎఫ్ కాల్పుల్లో గాయపడిన యువకుడు మృతి చెందాడు. గత నాలుగు గంటలుగా పోలీసులు కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రైల్వేట్రాక్‌పైనే వేలాదిమంది నిరసనకారులు బైఠాయించారు. రైల్వే పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. రైల్వే స్టేషన్ వదిలి వెళ్లిపోవాలని, ఆందోళనలు విరమించకపోతే మళ్లీ కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరించారు. సంబంధిత వార్త: న్యాయం కావాలని అడిగితే చంపేస్తారా: ఆందోళనకారులు -
హైదరాబాద్: మెట్రో రైల్లో సాంకేతిక లోపం
-
హైదరాబాద్ మెట్రో రికార్డ్! ఒక్క రోజులో రూ.13,119 కోట్లు సమీకరణ..
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రో భారీగా నిధులు సమీకరించింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ , కమర్షియల్ పేపర్ల ద్వారా రూ.13,119 కోట్లు సమీకరించింది. ఒక్కరోజుల్లో ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించడంలో ఇదో రికార్డుగా నిలిచింది. ఒక్కరోజులో నిధుల సమీకరణలో భాగంగా 2021 డిసెంబరు 29 బుధవారం మూడు రకాలైన బాండ్ పేపర్లను ఎల్ అండ్ టీ జారీ చేసింది. వీటిలో ఒక్కో బాండ్ ద్వారా రూ. 2,872 కోట్లు సమీకరించింది.. ఇలా బాండ్ పేపర్ల ద్వారా 8,616 కోట్లు సమీకరించింది. ఈ బాండ్ పేపర్లకు సంబంధించి వడ్డీ రేంజ్ 6.38 శాతం నుంచి 6.68 వరకు ఉంది. ఇక బాండ్ పేపర్ల మెచ్యూరిటీ విషయానికి వస్తే మూడేళ్ల నాలుగు నెలలు, నాలుగేళ్ల నాలుగు నెలలు, ఐదేళ్ల నాలుగు నెలలుగా ఉంది. మిగిలిన సొమ్మును కమర్షియల్ పేపర్ల ద్వారా సమీకరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ నిధుల సమీకరణలో భాగస్వామిగా వ్యవహరించింది. మిగిలిన నిధులు కమర్షియల్ పేపర్ల ద్వారా సమీకరించింది. ప్రత్యామ్నాయం కరోనా సంక్షోభం కారణంగా నష్టాలు పెరిగిపోవడంతో సాఫ్ట్‌లోన్ రూపంలో సాయం అందించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో నిర్వహిస్తోన్న ఎల్ అండ్ టీ ప్రభుత్వాలను కోరింది. ప్రభుత్వం దగ్గర సాఫ్ట్‌లోన్ అంశంలో పెండింగ్‌లో ఉండగానే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయాలను ఎల్ అండ్ టీ ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో మార్కెట్ ద్వారా నిధులు సమీకరణ ఎల్ అండ్ టీకి సులువైంది. చదవండి: కరోనా కష్టాలు.. వరుస నష్టాలు.. బయటపడేందుకు ఎల్ అండ్ టీ కొత్త ప్లాన్ -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్..!
Paytm Payments Bank Launches Paytm Transit Card: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్ధ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ అందించింది. ‘వన్‌నేషన్-వన్ కార్డ్’ అనే నినాదంతో పేటీఎం ట్రాన్సిట్కార్డును పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించింది. ఈ ట్రాన్సిట్ కార్డుతో మెట్రో, రైల్వేలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసుల్లో, మర్చంట్ స్టోర్లలో, టోల్ పార్కింగ్ ఛార్జీలు, ఆన్లైన్ షాపింగ్ కోసం ఉపయోగించవచ్చునని పేర్కొంది. దాంతో పాటుగా ట్రాన్సిట్ కార్డు సహాయంతో ఏటీఎం నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించనుంది. ట్రాన్సిట్ కార్డు పేటీఎం వ్యాలెట్‌తో నేరుగా లింక్ చేయబడి ఉండనుంది. బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకుగాను పేటీఎం ట్రాన్సిట్ కార్డును లాంచ్ చేసినట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్డును పేటీఎం యాప్‌లో అప్లై చేసుకున్న యూజర్లకు ఇంటికే డెలివరీ చేయనుంది. పేటీఎం ప్రకటన ప్రకారం..పేటీఎం ట్రాన్సిట్ కార్డ్‌ను దేశవ్యాప్తంగా మెట్రోలతో పాటు ఇతర మెట్రో స్టేషన్లలో ఉపయోగించవచ్చునని పేర్కొంది. ఈ కార్డ్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ , అహ్మదాబాద్ మెట్రో లైన్లలో పనిచేస్తోంది. హైదరాబాద్ మెట్రోరైల్లో కూడా పేటీఎం ట్రాన్సిట్ కార్డును ఉపయోగించే అవకాశం కల్పించనుంది.పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ సహయంతో ఒకే కార్డుతో అన్ని పనులు చేసుకోగలుగుతారని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో సతీష్ గుప్తా తెలిపారు. చదవండి: రూపేకార్డులపై అమెరికన్ కంపెనీ కుతంత్రం..! -
కష్టాల్లో హైదరాబాద్ కలల మెట్రో.. అటకెక్కిన సాఫ్ట్‌లోన్ అంశం!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక కష్టాల్లో ఉన్న గ్రేటర్ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించే అంశం ప్రకటనలకే పరిమితమైంది. కోవిడ్, లాక్డౌన్, ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోవడంతో కలల మెట్రో వరుస నష్టాలను చవిచూస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మెట్రో నష్టాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సాఫ్ట్‌లోన్ అంశం తెరపైకి వచ్చింది. సులభ వాయిదాల్లో చెల్లించే సౌలభ్యం, తక్కువ వడ్డీరేటు సాఫ్ట్లోన్కున్న ప్రత్యేకత. మెట్రో నిర్మాణ వ్యయం పెరగడం, రుణాలపై వడ్డీ పెరగడంతో దీని మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సానుకూలంగా స్పందించింది. కానీ రుణ మంజూరు అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంలేదు గమనార్హం. నష్టాల బాట.. గ్రేటర్ పరిధిలో ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు మార్గాల్లో 69.1 కి.మీ రూట్లో మెట్రో అందుబాటులో ఉంది. నాలుగేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన మెట్రోకు నాటి నుంచి నేటి వరకు వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. కోవిడ్‌కు ముందు మూడు రూట్లలో 4.5 లక్షల మంది జర్నీ చేయగా.. ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల వర్క్‌ఫ్రం హోం కారణంగా నిత్యం కనాకష్టంగా 2 నుంచి 2.5 లక్షలమంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు మెట్రో నిర్మాణానికి నిర్మాణ సంస్థ సుమారు రూ.14,132 కోట్లు వ్యయం చేసింది. ఈమొత్తాన్ని వివిధ బ్యాంకులు,ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించింది. రుణాలపై వడ్డీ సైతం సుమారు రూ.2 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు మెట్రో నిర్మాణం రెండేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం కూడా రూ.3 వేల కోట్ల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సర్కారు సాయం కోసం అర్థించింది. కానీ ఈవిషయంలో ఎలాంటి ముందడుగు పడడం లేదు. ఈ పరిస్థితుల కారణంగా మెట్రో మొదటి దశలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 5.1 కి.మీ రూట్లో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం కానుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎయిర్పోర్ట్ మెట్రో సైతం ఆలస్యం? రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ)రూట్లో మెట్రో ఏర్పాటు ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సైతం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ రూపొందించింది. తొలిదశ మెట్రో అనుభవాల నేపథ్యంలో.. రూ.5 వేల కోట్లు అంచనా వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిధుల సమీకరణ ఎలా అన్న అంశం కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
Metro trains: ఆరుకొట్టంగనే మెట్రో
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో వేళలు బుధవారం నుంచి ఉదయం 6 గంటలకే ప్రారంభం అయ్యాయి. ఉదయం వేళల్లో క్యాబ్‌లు, ఆటోల దోపిడీ నుంచి ఉపశమనానికి మెట్రో వేళలను మార్చాలని కోరుతూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు సోమవారం ట్విట్టర్లో విన్నవించిన సంగతి విదితమే. దీంతో ఆయన ఏకీభవిస్తూ.. మెట్రో అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఆయన సూచనల మేరకు వేళల్లో మార్పులు చేస్తున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చివరి రైలు వేళలను మాత్రం మార్పు చేయకపోవడం గమనార్హం. ఈ రైలు ఒక చివరి నుంచి రాత్రి 10.15 గంటలకు బయలుదేరి... రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానం చేరుతుందని ప్రకటించారు. బాలారిష్టాలు దాటనేలే.. నగరంలో మెట్రో ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా బాలారిష్టాలను అధిగమించనేలేదు. ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లను నిలిపేందుకు ఉచిత పార్కింగ్ సదుపాయం లేకపోవడం, పలు చోట్ల పార్కింగ్ దోపిడీ నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆయా స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ప్రయాణికులు ఆటోలు,క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది. వెంటాడుతున్న ఆర్థిక నష్టాలు.. ► కోవిడ్, లాక్డౌన్, ఐటీ కంపెనీల వర్క్ ఫ్రం హోం తదితర కారణాలు మెట్రోను ఆర్థికంగా భారీగా దెబ్బతీశాయి. లాక్‌డౌన్‌కు ముందు మూడు మార్గాల్లో నిత్యం 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య రోజుకు కనాకష్టంగా 2.5 లక్షలు దాటడంలేదు. ► మరోవైపు నిర్మాణ సమయం పెరగడంతో వ్యయం దాదాపు రూ.3 వేల కోట్ల మేర పెరిగినట్లు సమాచారం. నిర్మాణం సమయంలో రూపొందించిన అంచనాల ప్రకారం మెట్రో ప్రాజెక్టుకు చేసిన వ్యయంలో 45 శాతం ప్రయాణికుల చార్జీలు, మరో అయిదు శాతం వాణిజ్య ప్రకటనలు, మరో 50 శాతం రియల్టీ, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ► ఈ మూడు అంశాల్లోనూ నిర్మాణ సంస్థ అంచనాలు తల్లకిందులు కావడంతో ఆర్థిక నష్టాలు తప్పడంలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను ఆదుకునేందుకు సాఫ్ట్‌లోన్ మంజూరు చేస్తామని సూచనప్రాయంగా ప్రకటించడంతోపాటు సీఎం కేసీఆర్ సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. కానీ.. రుణ మంజూలు, ఇతరత్రా ఆర్థిక సాయం అందించే విషయంలో స్పష్టత రాకపోవడం గమనార్హం. -
Hyderabad Metro: 18 నుంచి మెట్రో సువర్ణ ఆఫర్
సాక్షి,హైదరాబాద్: దసరా, దీపావళి, సంక్రాంతి వరుస పండగల సందర్భంగా మెట్రోరైలు సంస్థ మళ్లీ 3 సువర్ణ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 18 నుంచి అమలుకానున్న ఈ పథకంలో ప్రయాణికులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు జర్నీ చేసే అవకాశం కల్పించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్–జేబీఎస్ (గ్రీన్‌లైన్) మార్గంలో కేవలం రూ.15 చెల్లించి ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించే అవకాశం కల్పించడం విశేషం. ఆఫర్లివే.. ట్రిప్‌పాస్ ఆఫర్: ఈ ఆఫర్లో ప్రయాణికులు ఎవరైనా 20 ట్రిప్పులకు చెల్లించి.. 30 ట్రిప్పులు జర్నీ చేసే అవకాశం ఉంది. 45 రోజుల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మెట్రో స్మార్ట్‌కార్డు (పాత, కొత్త కార్డులున్నవారు)ప్రయాణికులకు ఈ ఆఫర్‌కు అర్హులు. అక్టోబరు 18 నుంచి జనవరి 15, 2022 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. గ్రీన్‌లైన్ ఆఫర్: ఎంజీబీఎస్– జేబీఎస్–మెట్రో స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే వారు కేవలం రూ.15 చెల్లించి ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌కార్డులు, టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే వారికి సైతం ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కూడా జనవరి 15, 2022 వరకు అమల్లో ఉంటుంది. నెలవారీగా లక్కీ డ్రా: మెట్రో ప్రయాణికులకు నెలవారీగా లక్కీడ్రా తీయనున్నారు. అక్టోబరు 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ప్రతి నెలా డ్రా తీస్తారు. నెలలో 20 ట్రిప్పులు స్మార్ట్‌కార్డుల ద్వారా జర్నీ చేసినవారిని కార్డు నంబరు ఆధారంగా ఈ డ్రా తీస్తారు. అయిదుగురు విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. ఇందుకోసం ప్రతి ప్రయాణికుడూ తమ కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డును టి–సవారీ యాప్ లేదా మెట్రో స్టేషన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు మెట్రో స్టేషన్లలో సిబ్బందిని సంప్రదించాలని ఎండీ సూచించారు. -
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్!
హైదరాబాద్: దసరా, దీపావళి పండుగ సీజన్ పురస్కరించుకుని ఎల్అండ్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్(ఎల్టీఎంఆర్హెచ్ఎల్) మరో మారు పండగ ఆఫర్లను తీసుకువస్తూ ‘మెట్రో సువర్ణ ఆఫర్ 2021’ను ప్రకటించింది. అక్టోబర్ 18 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లో ట్రిప్ పాస్, గ్రీన్ లైన్‌పై ప్రత్యేక ధర, మెట్రో ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను హైదరాబాద్ మెట్రో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.(చదవండి: కేసీఆర్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు) మెట్రో సువర్ణ ఆఫర్ 2021: ట్రిప్ పాస్ ఆఫర్: ఈ ఆఫర్ కింద మెట్రో ప్రయాణీకులు తమ ప్రయాణ అవసరాలకు తగినట్లుగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ ట్రిప్పులను 45రోజుల లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం మెట్రో స్మార్ట్ కార్డ్(పాత, నూతన)పై మాత్రమే వర్తిస్తుంది. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను 18 అక్టోబర్ 2021 నుంచి 15 జనవరి 2022 మధ్య వినియోగించుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ లైన్‌పై ప్రత్యేక ఫేర్ ఆఫర్: ఎంజీబీఎస్, జెబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల నడుమ గ్రీన్ లైన్‌పై ప్రయాణించే ప్రయాణీకులు ప్రతి ట్రిప్‌కూ గరిష్టంగా 15 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను అన్ని టిక్కెటింగ్ మార్గాలపై 18 అక్టోబర్ 2021 నుంచి15 జనవరి 2022 వరకూ పొందవచ్చు. నెలవారీ లక్కీ డ్రా: అక్టోబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకూ ఆకర్షణీయమైన బహుమతులను ప్రతినెలా గెలుచుకునే అవకాశం మెట్రో ప్రయాణీకులకు ఉంది. ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా సీఎస్సీ కార్డు వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తారు. వీరు ఓ క్యాలెండర్ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సీఎస్సీ (కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డు)లను టీసవారీ లేదా మెట్రో స్టేషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత సంవత్సరం అక్టోబర్‌లో తొలిసారిగా ప్రకటించిన మెట్రో సువర్ణ ఆఫర్‌కు అపూర్వమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ సంవత్సరం మరో మారు ఈ ఆఫర్‌ను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా ప్రయాణీకులు మా సేవల పట్ల అపారమైన నమ్మకాన్ని చూపడంతో పాటుగా మెట్రోను తమ సురక్షితమైన ప్రయాణ భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. నగరంలో అత్యంత విశ్వసనీయమైన, పర్యావరణ అనుకూల, సమయపాలన కలిగిన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా మాధ్యమం ఇది. మా ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు మమ్మల్ని మేము మెరుగుపరుచుకుంటూనే ఈ మహమ్మారి కాలంలో అత్యంత సురక్షితమైన భద్రతా ఏర్పాట్లను చేశాము’’ అని అన్నారు. -
అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం?
ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి కోవిడ్ సంక్షోభం శాపంగా మారింది. వరుస లాక్డౌన్లు, కఠిన నిబంధనలు, వర్క్‌ఫ్రం హోం వంటి కారణాల వల్ల నష్టాల ఊబి నుంచి బయటపడలేకపోతుంది. దీంతో హైదరాబాద్ మెట్రోలో తన వాటా అమ్మేందుకు ఎల్ అండ్ టీ సన్నాహలు చేస్తోంది. మెట్రో స్పీడుకి కోవిడ్ బ్రేకులు పబ్లిక్ , ప్రైవేటు పార్టనర్‌షిప్‌లో ప్రపంచలోనే అతి పెద్ద మెట్రోగా 71 కిలోమీటర్ల నిడివితో మూడు మార్గాల్లో హైదరాబాద్ మెట్రో ఘనంగా ప్రారంభమైంది. ఆరంభానికి తగ్గట్టే ప్రారంభించిన ఏడాదిలోపే నిత్యం 4.50 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణ సాధనంగా మారింది. ఇక లాభాల రూట్లోకి వెళ్లడమే తరువాయి అనే సమయంలో కోవిడ్ సంక్షోభం వచ్చి పడి మెట్రో స్పీడుకి బ్రేకులు వేసింది. నష్టాల ట్రాక్‌లో కోవిడ్ ఫస్ట్ వేవ్ కారణంగా ఆరు నెలల పాటు మెట్రో రైలు నడవలేదు. ఆ తర్వాత కఠిన నిబంధనల మధ్య 2020 సెప్టెంబరులో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి, క్రమంగా ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటున్న తరుణంలో 2021 మేలో మరోసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఫలితంగా మరోసారి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో వరుసగా మెట్రో నష్టాలు పెరిగాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మెట్రో నష్టాలు రూ. 1,766 కోట్లకు చేరగా అంతకు ముందు ఏడాది ఈ నష్టం రూ. 382 కోట్లుగా నమోదైంది. మొత్తంగా రెండు వేలకు కోట్లకు పైగా నష్టాల్లో మెట్రో నడుస్తోంది. వర్క్‌ఫ్రం హోం ఎఫెక్ట్ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వర్క్‌ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కోవిడ్ కారణంగా పడిన జీతాల కోతకు తోడు మెట్రో సర్వీసులు రెగ్యులర్‌గా నడకవపోవడంతో చాలా మంది ప్రత్యామ్నాయ రవాణాకు మారిపోయారు. దీంతో సెకండ్ వేవ్ ముగిసినా మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరగడం లేదు. ఫలితంగా రోజువారి ప్రయాణికుల సంఖ్య 4.50 లక్షల నుంచి కేవలం ఒక లక్షకు పడిపోయింది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో మెట్రో నష్టాలు తడిసి మోపెడు అవుడం ఖాయంగా మారింది. వాటా అమ్మకానికి సిద్ధం లాభాలు తెచ్చివ్వని సంస్థల్లో వాటాలు అమ్మేయాలని ఎల్ అండ్ టీ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా పంజాబ్‌లోని పవర్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్ మెట్రోలో వాటాను అమ్మాలని సంస్థాపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ మెట్రోలో 15 శాతం వాటా అమ్మకానికి ఎల్ అండ్ టీ రెడీ అవుతోంది. హైదరాబాద్ మెట్రోలో వాటాను వాటాను కొనుగోలు చేసేందుకు గ్రీన్కో సంస్థ సిద్ధంగా ఉందంటూ ఎల్ అండ్ టీ వైస్‌ప్రెసిడెంట్ డీకే సేన్ అన్నారు. అయితే దీనిపై గ్రీన్ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం అనుమతిస్తుందా ? హైదరాబాద్ మెట్రో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో నిర్మించిన ప్రాజెక్టు కావడంతో ఎల్ అండ్ టీ తన వాటాలను ఏకపక్షంగా అమ్మేయడానికి వీలులేదు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటాల విక్రయానికి సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని మెట్రో అధికారులు అంటున్నారు. సాయం అందేనా ? నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలులో పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ ముందుకు వచ్చినట్టు వార్తలు రావడం కొంత శుభ పరిణామంగా చెప్పుకోవాలిజ హైదరాబాద్ మెట్రోలో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ సుముఖతగా ఉన్నట్టు సమాచారం. నష్టాల ఊబి నంచి బయట పడేందుకు గత కొంత కాలంగా సాఫ్ట్ రుణాల కోసం వివిధ బ్యాంకులను హైదరాబాద్ మెట్రో ఆశ్రయిస్తోంది. చదవండి : మెట్రో తడబాటు! ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల నష్టం -
హైదరాబాద్ మెట్రోకు గుడ్‌న్యూస్!
Good News For Hyderabad Metro: సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలుకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్ఎల్) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలుకు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.4వేల కోట్ల పెట్టుబడికి ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పటికే రోజుకు రూ.5 కోట్ల చొప్పున నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సాఫ్ట్ రుణాల కోసం హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ వివిధ బ్యాంకులను ఆశ్రయిస్తోంది. -
మెట్రో తడబాటు! ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల నష్టం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలు ప్రాజెక్టుకు ఏడాదిగా నష్టాల బాట తప్పడంలేదు. కోవిడ్, లాక్డౌన్, ప్రయాణికుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉండడంతో సుమారు రూ.2 వేల కోట్ల మేర నష్టాలను మూట గట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మెట్రోను ఆదుకునేందుకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణ సంస్థ వర్గాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. ఆపన్న హస్తం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆర్థిక పరంగా తమకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి షరతులు లేని దీర్ఘకాలిక రుణం మంజూరు చేయాలని, లేని పక్షంలో మెట్రో నిర్మాణం ఆలస్యమైన కారణంగా పెరిగిన రూ. 3వేల కోట్ల అంచనా వ్యయాన్ని సాయంగా అందజేయాలని ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ వర్గాలు విన్నవించినట్లు సమాచారం. అత్యధికంగా ఆ రూట్లో.. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మార్గాల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం కారణంగా ప్రస్తుతం సుమారు లక్షమంది జర్నీ చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో సుమారు 60 వేల మంది.. నాగోల్–రాయదుర్గం మార్గంలో సుమారు 30 వేలు..జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో సుమారు పదివేల మంది రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపాయి. ►మెట్రోకు షరతులు లేని దీర్ఘకాలిక రుణం మంజూరు, లేదా సర్దుబాటు నిధి కింద పెరిగిన నిర్మాణ వ్యయంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వ గ్రాంటుగా అందజేసే అంశం ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో సర్కారు ఎంత మొత్తంలో మెట్రోకు సాయం అందిస్తుందన్నది సస్పెన్స్‌గా మారింది. -
హైదరాబాద్ మెట్రో రియల్ వెంచర్.. సదుపాయాలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: సర్వ హంగులతో త్వరలో మెట్రో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు కానుంది. మెట్రో ప్రాజెక్టు ప్రజా రవాణా సాధనమే కాదు.. నగర పునర్నిర్మాణ ప్రాజెక్టు అని గతంలో ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రియల్ రంగంలోకి అడుగు పెడుతుండడం విశేషం. మెట్రో నిర్మాణ సమయంలో ఆసియాలో అతిపెద్దదైన ప్రీకాస్ట్ యార్డు (మెట్రో వయాడక్ట్‌లు తయారు చేసిన ప్రాంతం)ను నెలకొల్పిన విషయం విదితమే. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడంతో సుమారు 42 ఎకరాల స్థలంలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రియల్ వెంచర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో ప్రస్తుతం మెట్రో డిపోను సుమారు 104 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో భూములు కోల్పోయిన రైతులకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నెలకొల్పిన మెట్రో సిటీలో ప్లాట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రీకాస్ట్ యార్డును రియల్ వెంచర్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ నిధులను ఆర్థిక కష్టాల్లో ఉన్న మెట్రో సంస్థ వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనుంది. నూతన రియల్ వెంచర్లో 200, 300, 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అదే తరహాలో.. రియల్ బూమ్.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోకాపేట్లో భూముల వేలం ద్వారా సుమారు రెండు వేల కోట్లకు పైగా రెవెన్యూ ఆదాయాన్ని రాబట్టిన విషయం విదితమే. భూముల వేలంతో గ్రేటర్ పరిధిలో మళ్లీ రియల్ బూమ్‌కు రెక్కలొచ్చాయి. ఇదే తరుణంలో ఉప్పల్ ప్రీకాస్ట్ యార్డ్ ప్రాంగణంలో హెచ్ఎంఆర్ సంస్థ ఏ ర్పాటు చేసే రియల్ వెంచర్‌కు కూడా భారీగా డిమాండ్ ఉంటుందని రియల్టీ వర్గాలు అంచనా వే స్తున్నాయి. ఈ వెంచర్ ఏర్పాటు ద్వారా రూ.600 కో ట్లు రాబట్టాలని మెట్రో వర్గాలు ఆదాయ అంచనాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదుపాయాలు ఇలా.. ► ప్రీకాస్ట్ యార్డు స్థలంలో ఏర్పాటు చేయనున్న వెంచర్లో హెచ్ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం 40, 60, 100 ఫీట్ల వైశాల్యంతో సువిశాలమైన రహదారులు, గ్రీన్ స్పేస్, పబ్లిక్ పార్కులు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండీఏ నిబంధనల మేరకు 30 శాతం విస్తీర్ణంలో రహదారులు మరో 10 శాతం విస్తీర్ణంలో ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ► మిగతా 55–60 శాతం విస్తీర్ణంలో రియల్ వెంచర్ ఏర్పాటు కానుంది. ఇందులో మార్కెట్ డిమాండ్‌ను బట్టి నివాస, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్లాట్ల విస్తీర్ణాన్ని నిర్ణయించనున్నారు. మెట్రో ప్రాజెక్టుకు ప్రయాణికుల ఆదాయం ద్వారా 50 శాతం, రియల్టీ, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా మరో 45 శాతం, వాణిజ్య ప్రకటనల ద్వారా మరో 5 శాతం ఆదాయాన్ని రాబట్టాలని 2011లో కుదిరిన నిర్మాణ ఒప్పందంలో నిర్ణయించిన విషయం విదితమే. -
Hyderabad: అయ్యో! ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా?
సాక్షి, సిటీబ్యూరో: పాత నగరానికి మెట్రో జర్నీ కలగా మారనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో పనులు చేపట్టేందుకు గతంలో పలు మార్లు హడావుడి మొదలైనప్పటికీ అడుగు ముందుకు పడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మెట్రో నిర్మాణ సంస్థ వర్గాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. నష్టాల మెట్రో గాడిన పడేందుకు సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారన్న అంశంపై స్పష్టత కరువైంది. దీంతో పాతనగరంతోపాటు రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలోనూ మెట్రో ఎప్పటికి పూర్తవుతుందన్న అంశం సస్పెన్స్‌గా మారడం గమనార్హం. సమస్యలు ఎన్నో.. ► ప్రధానంగా ఎంజీబీఎస్–ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, మరో 69 వరకు ప్రార్థనా స్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించడం, మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ఆఫ్‌వే స్థలాన్ని సేకరించడం వంటి పనులు కత్తిమీద సాములా మారాయి. ► పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు వంద కోట్లకుపైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ► సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు రూ.1250 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► ఇక పనులు చేపట్టేందుకు వీలుగా ఆస్తుల సేకరణ ఆలస్యమైతే ప్రాజెక్టు నిర్మాణ గడువు పెరిగే అవకాశం ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ► ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనా స్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ► ఈ సమస్యల కారణంగానే నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. ► గతంలో మెట్రో అధికారులు, నిర్మాణ సంస్థ వర్గాలు ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్‌చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరిబౌలి, శాలిబండ, సయ్యద్ అలీఛబుత్రా, అలియాబాద్, షంషీర్గంజ్ ద్వారా ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు పనులు ప్రారంభిస్తామని హడావుడి చేసినా..అడుగు ముందుకుపడకపోవడం గమనార్హం. ► మరోవైపు తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగిందని..ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ఇటీవల ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడం గమనార్హం. మెట్రో కోసం మహా పోరాటం.. పాతబస్తీ మెట్రో కోసం పలు రాజకీయ పార్టీలు మహా పోరాటమే చేశాయి. పలు రాజకీయ పారీ్టలతోపాటు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేల పాదయాత్రలతో మెట్రో ప్రాజెక్టు కోసం మహా ఉద్యమమే సాగింది. 2017 నుంచి 2021 వరకు పలు రాజకీయ పార్టీలు మెట్రో కావాలని నినదిస్తున్న విషయం విదితమే. -
HYD Metro: సీన్ కట్ చేస్తే.. నష్టం రోజుకు రూ.కోటి!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్.. హైదరాబాదు నగర వాసులకు అందుబాటులోకి వచ్చిన ప్రయాణ సాధనం.. గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నగరవాసి కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రయాణించవచ్చు..అందుకే చాలామంది ఉపయోగించుకున్నారు.. ఎంతగా అంటే.. రోజుకు దాదాపు 4.5 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు.. సీన్ కట్‌చేస్తే.. ఇపుడు రోజుకు కనీసం లక్ష మంది కూడా మెట్రోను ఉపయోగించడం లేదు. లాక్డౌన్ ఎఫెక్ట్.. కరోనా థర్డ్ వేవ్ భయంతో అధికశాతం మంది వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. దీంతో హెచ్ఎంఆర్కు రోజుకు దాదాపు రూ.కోటి నష్టం వస్తోందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. మెట్రో వేళలు పెంచినా రద్దీ పెరగడం లేదు. లాక్డౌన్ అనంతరం గ్రేటర్ పరిధిలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మెట్రో వేళలను ఉదయం 7 నుంచి రాత్రి 10.45 గంటల వరకు పెంచారు. కానీ నగరవాసులు మాత్రం మెట్రోను అంతగా ఆదరించడంలేదు. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో లక్ష మార్కును కూడా దాటకపోవడం గమనార్హం. ప్రస్తుతం రోజుకు కోటిరూపాయల నష్టంతో మెట్రో నెట్టుకొస్తున్నట్లు సమాచారం. అయినా సీన్మారలేదు.. లాక్డౌన్ సమయంలో పరిమితవేళలు మెట్రో పాలిట శాపంగా పరిణమించాయి. మరోవైపు గ్రేటర్ పరిధిలోని సుమారు వెయ్యికి పైగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ఫ్రం హోంకు అనుమతిచ్చాయి. దీంతో మెట్రో రద్దీ ఒక్కసారిగా పడిపోయింది. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు మూడు మార్గాల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది జర్నీ చేయడం గమనార్హం. ఇప్పుడు కోవిడ్ థర్డ్‌వేవ్ భయంతో మెజార్టీ సిటీజనులు ఇంకా వ్యక్తిగత వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలు మినహా మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో సరాసరిన నిత్యం 50 వేలు, నాగోల్–రాయదుర్గం రూట్లో నిత్యం సుమారు 30 వేలు, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో సుమారు పదివేల మంది మాత్రమే జర్నీ చేస్తున్నట్లు సమాచారం. నష్టాల జర్నీ.. గ్రేటర్‌వాసుల కలల మెట్రోకు గత నాలుగేళ్లుగా నష్టాల జర్నీ తప్పడంలేదు. సుమారు రూ.16 వేల కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన ఈప్రాజెక్టుకు ప్రయాణీకుల చార్జీలు, వాణిజ్య ప్రకటనలు, రియల్టీ ప్రాజెక్టులు, మాల్స్ అభివృద్ధి ద్వారా ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం లేదు. దీంతో నిత్యం మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, భద్రతకు అత్యధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. రోజుకు సుమారు కోటి రూపాయల నష్టంతో మెట్రో కనాకష్టంగా నెట్టుకొస్తోంది. ఇదే తరుణంలో తమను ఆదుకోవాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు ఇటీవల సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీలో కోరాయి. సీఎం సానుకూలంగా స్పందించినా.. మెట్రోకు రాష్ట్ర సర్కారు నుంచి ఏవిధంగా ఆర్థిక సాయం అందుతుందన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం ఇదీ లెక్క(రోజుకు) రూట్ ప్రయాణికుల సంఖ్య ఎల్బీనగర్- మియాపూర్ 50 వేలు నాగోల్-రాయదుర్గం 30వేలు జేబీఎస్-ఎంజీబీఎస్ 10వేలు (గతంలో ఈ మూడు రూట్లలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణించేవారు) -
హైదరాబాద్ : ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..?
-
హైదరాబాద్: ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..?
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలిదశ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలో 69 కి.మీ మార్గంలో పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థ రూ.16 వేల కోట్లు వ్యయం చేసింది. మెట్రో ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా నష్టాల బాట తప్పడంలేదు. గతేడాదిగా కోవిడ్ విజృంభణ, వరుస లాక్డౌన్ల కారణంగా మెట్రోకు కష్టాలు..నష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సంఖ్య గతేడాది లాక్‌డౌన్‌కు ముందు నాలుగున్నర లక్షలు కాగా.. తాజాగా లాక్డౌన్ ఎత్తివేయడంతో సంఖ్య సుమారు 80 వేలుగా ఉన్నట్లు మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. అంచనాలు తలకిందులు... మెట్రో మాల్స్ నిర్మాణం, వాణిజ్య ప్రకటనలు, రవాణా ఆధారిత, రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా భారీగా రెవెన్యూ ఆర్జించవచ్చన్న నిర్మాణ సంస్థ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో రెండోదశ ప్రాజెక్టును ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టడం దాదాపు అసాధ్యమే. తాజా అనుభవాలతో మెట్రో ప్రాజెక్టులు వాణిజ్య పరంగా అంతగా గిట్టుకాటు కావని రుజువుకావడంతో..ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థలు సైతం ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడంలేదు. విశ్వవ్యాప్తంగా సుమారు వందకు పైగా మెట్రో రైలు ప్రాజెక్టులుండగా.. సింగపూర్, హాంకాంగ్, టోక్యో, తైపి మినహా మిగతా అన్ని ప్రాజెక్టులదీ నష్టాల బాటేనన్నది నిర్మాణరంగ సంస్థ వర్గాల మాట కావడం గమనార్హం. రెండోదశ కింద ప్రతిపాదించిన మార్గాలివే.. మెట్రో రెండోదశ కింద బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ (29 కి.మీ), గచ్చిబౌలి–శంషాబాద్ (22 కి.మీ) మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమైనా ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ జఠిలంగా మారడంతో రెండోదశ మెట్రో ప్రాజెక్టు ఎప్పటికి సాధ్యపడుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ మెట్రో మార్గం ఇదీ.. ► బీహెచ్ఈఎల్ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్ వరకు తీసుకొచ్చి ప్రస్తుత మెట్రో లైనులో కలిపేలా డీపీఆర్ సిద్ధమైంది. ► ఈ మార్గం మొత్తంగా 29 కి.మీ ఉంటుంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్ఎల్)లతోపాటు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. ► బీహెచ్ఈఎల్ దగ్గర మెట్రోరైలు ఎక్కితే చందానగర్ మీదుగా ఆల్విన్ క్రాస్ రోడ్డు వరకు జాతీయ రహదారిలో ప్రయాణం సాగుతుంది. తర్వాత హఫీజ్‌పేట వైపు తిరుగుతుంది. కొత్తగూడ, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, కాజగూడ, విస్పర్‌వ్యాలీ, టోలీచౌక్, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్ మీదుగా లక్డీకాపూల్ చేరుకుంటుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న మెట్రోలైనులో కలుస్తుంది. గచ్చిబౌలి–శంషాబాద్ మెట్రో రూటు ఇదీ.. ►గచ్చిబౌలి–రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 22 కిలో మీటర్ల పొడవున మెట్రో లైనును నిరి్మంచడానికి డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. ► బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడా తెలంగాణా పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు ఏర్పాటుచేయాల్సి ఉంది. ► ఈ మార్గంలో హైస్పీడ్ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈమేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు రెండోదశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. ► కాగా సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని నిర్ణయించినా నిధుల లేమితో ఈ మెట్రో రూటు సైతం కాగితాలకే పరిమితమవడం గమనార్హం. ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..? గతంలో మరో ఐదు మార్గాల్లో రెండోదశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ ఆదిశగా అడుగులు పడకపోవడంతో ఈ కింది మార్గాల్లో మెట్రో అనుమానమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1.ఎల్బీనగర్–హయత్‌నగర్ 2.ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 3.మియాపూర్–పటాన్చెరు 4.తార్నాక–ఈసీఐఎల్ 5.జేబీఎస్ –మౌలాలి -
లాక్డౌన్ దారుల్లో.. హైదరాబాద్ కలల మెట్రో పయనమెటు?
సాక్షి, హైదరాబాద్: అది 2010 సంవత్సరం.. మెట్రో నిర్మాణ ఒప్పందం సందర్భంగా కలల మెట్రో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్యపై భారీగా ఊహాగానాలు చేశారు. 2021 నాటికి మూడు రూట్లలో నిత్యం సుమారు 16 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని భారీ అంచనాలు వేశారు. కానీ దశాబ్ద కాలంలో నిర్మాణ సంస్థ లెక్కలు.. అంచనాలు తప్పాయి. కోవిడ్ విజృంభణ.. లాక్డౌన్ కారణంగా పట్టుమని పది వేల మంది కూడా జర్నీ చేయని పరిస్థితి నెలకొంది. ఏకంగా మెట్రో రైలు వేళలను ప్రస్తుతం ఉదయం 7 నుంచి 8.45 గంటల వరకే కుదించడంతో ఈ దుస్థితి తలెత్తింది. 2020 లాక్‌డౌన్‌కు ముందు 4.5 లక్షల మంది.. గతేడాది మార్చికంటే (లాక్డౌన్)కు ముందు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మార్గాల్లో సుమారు 4.5 లక్ష ల మంది జర్నీ చేసేవారు. ఇదే స్పీడ్‌తో దూసుకెళ్లి హీనపక్షం సుమారు 8 లక్షల ప్రయాణికుల మా ర్క్.. అంటే నిర్మాణ సంస్థ అంచనాల్లో కనీసం సగమైనా లక్ష్యం సాధిస్తుందని అనుకున్నారు. పరిస్థితి మాత్రం తల్లకిందులైంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిరి్మంచిన మెట్రో స్టేషన్లు, రైళ్లు, డిపోలు ఇప్పుడు తెల్ల ఏనుగులను తలపిస్తున్నాయి. ఆద్యంతం నష్టాలు.. కష్టాల పయనమే.. ► ప్రధాన నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన మార్గాల్లో సుమారు 72 కి.మీ మార్గంలో మెట్రో ప్రాజెక్టును డిజైన్ చేశారు. నిర్మాణం ప్రారంభమైన 2011 నుంచి పూర్తయిన 2017 వరకు పలు ప్రాంతాల్లో భూమి, ఆస్తుల సేకరణ, పనులు చేపట్టేందుకు వీలుగా రైట్ ఆఫ్ వే ఏర్పాటు వంటివన్నీ సమస్యలుగానే మారాయి. ► నిర్మాణ సమయంలో కష్టాలు..పట్టాలెక్కిన తర్వాత నష్టాలు శాపంగా పరిణమించాయి. సుమారు రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు నిత్యం సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. ప్రాజెక్టు నిర్మాణం కోసం వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణానికి సంబంధించి వడ్డీలు, వాయిదాల చెల్లింపులు ఇప్పుడు తడిసిమోపెడవుతున్నాయి. ఇప్పట్లో గట్టెక్కేది కష్టమే.. కోవిడ్ ప్రజా రవాణా వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది. మెట్రోను సైతం కుదిపేసింది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివరినాటికైనా నష్టాల నుంచి మెట్రో గట్టెక్కుతుందా లేదా? వేచి చూడాల్సిందే. -
మెట్రో రైల్: ఎంఆర్‌పీఎఫ్ ఏమైనట్లు?
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభమై మూడేళ్లు.. అన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. దాని భద్రత పర్యవేక్షణకు అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆదిలోనే అటకెక్కాయి. సాధారణ రైళ్లల్లో జరిగే నేరాలు, రైల్వేస్టేషన్ల పర్యవేక్షణకు గవర్నమెంట్ రైల్వేపోలీసు (జీఆర్పీ) విభాగం ఉన్నట్లే.. మెట్రో రైల్ కోసం మెట్రో రైల్ పోలీస్ ఫోర్స్ (ఎంఆర్‌పీఎఫ్) విభాగాన్ని ఏర్పాటు చేయాలని 2017లో ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ఇప్పటికీ అమలులోకి రాలేదు సరికదా.. ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎంఆర్పీఎఫ్కు సంబంధించిన విధి విధానాలు, సిబ్బంది సంఖ్య తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. మెట్రో రైల్, రైల్వేస్టేషన్ల భద్రతకు సంబంధించిన అనేక కీలకాంశాలను ఇందులో ఖరారు చేశారు. వీటిని సంబంధించి సమగ్ర నివేదికలతో కూడిన ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించారు. ఆపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. మెట్రో రైల్ తొలి దశ ప్రారంభం నాటికే భద్రతాంశాలతో పాటు ప్రత్యేక భద్రతా విభాగాన్ని అమలులోకి తీసుకురావడానికి రాష్ట్ర పోలీసు విభాగం, హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థలు కసరత్తు చేశాయి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అదే స్థాయిలో భద్రతను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మెట్రో రైల్‌కు సంబంధించి మొత్తం 65 స్టేషన్లు, మూడు డిపోలు ఏర్పాటయ్యాయి. ప్రతి 22 మెట్రో రైల్‌స్టేషన్లకు ఒక ఎంఆర్‌పీఎఫ్ స్టేషన్ చొప్పున నగరంలో మూడింటిని ఏర్పాటు చేయాలని భావించారు. ప్రాథమికంగా నిర్ణయించిన దాని ప్రకారం ఇవి ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్లతో పాటు అమీర్‌పేటల్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండు కారిడార్లు కలిసే ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లు కావడంతో పాటు ఇవే అతి పెద్దగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో మెట్రో రైల్ స్టేషన్‌కు ఎస్సై స్థాయి అధికారి నేతృత్వంలో టీమ్ ఏర్పాటు చేయాలని భావించారు. మొత్తం 24 గంటల్లో మూడు షిఫ్టుల్లో ఎంఆర్‌పీఎఫ్ పోలీసుల విధి నిర్వహణ ఉండేలా ప్రణాళికలు రచించారు. ప్రతి షిఫ్ట్‌లోనూ ఎస్సైతో పాటు హెడ్–కానిస్టేబుళ్ళు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వర్తించేలా చూడాలని యోచించారు. ప్రతి రెండు మెట్రో రైల్‌స్టేషన్లకు కలిపి ఓ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇన్చార్జి, ఇద్దరు డీసీపీ, మరో ఇద్దరు ఏసీపీలతో పాటు ఎంఆర్పీఎఫ్కు మొత్తం 1525 మంది సిబ్బంది కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేశారు. వీరి నిర్వహణకు ఏటా రూ.60 కోట్లు అవసరమవుతాయని లెక్కలు కూడా తేల్చారు. ఆకతాయిలకు చెక్ చెప్పడానికి ‘షీ టీమ్స్’ బృందాలనూ స్టేషన్లలో మోహరించాలని... ప్రత్యేక సందర్భాల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని యోచించారు. ఇవన్నీ ప్రతిపాదనల స్థితిలోనే ఆగిపోగా... ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లను స్థానిక ఠాణా అధికారులే కేటాయిస్తున్నారు. ఎంఆర్పీఎఫ్కు తోడుగా సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసులూ ‘మెట్రో’ భద్రతలో భాగస్వాముల్ని చేయాలనే యోచన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రత్యేక యాక్ట్ ఉండాలని భావించారు. ఎంఆర్పీఎఫ్కు సిబ్బందికి పోలీసు విభాగంలోని సివిల్, ఏఆర్ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ స్టేషన్లను సంబంధించిన, ఆ పరిధిలో జరిగే నేరాలపై నమోదైన కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మెట్రోపాలిటన్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని భావించారు. ఎంఆర్‌పీఎఫ్ కోసం ప్రత్యేకంగా పోలీసు జాగిల విభాగాన్ని ఏర్పాటు చేయాలంటూ హడావుడి చేశారు. వీటిలో దాదాపు 90 శాతం అంశాలకు ఆదిలోనే బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అవన్నీ ప్రతిపాదనల స్థాయిలోనే ఆగిపోయాయి. మెట్రో రైల్ ప్రారంభంకావడంతో పాటు నిరంతరాయంగా నడుస్తుండటంతో ఆ ప్రతిపాదనల్ని దాదాపు అన్ని విభాగాలూ మర్చిపోయాయి. ఇప్పుడిక కష్టమే అనిపిస్తోంది మెట్రో రైల్ ప్రారంభానికి ముందు, ప్రారంభమైన తొలినాళ్లల్లో ఉన్న ఆ జోష్ ఇప్పుడు లేదు. దీనికి తోడు లాక్డౌన్ ప్రభావం, సర్వీసులు పునఃప్రారంభమైనా తగ్గిన ఆక్యుపెన్సీ వంటి అనేక సమస్యలు ఇప్పుడు హెచ్‌ఎంఆర్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాటి ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తాయని భావించలేం. – సిటీ పోలీసు ఉన్నతాధికారి -
మెట్రో ప్రయాణీకులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: పండగల సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. చార్జీల్లో రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 17నుంచి 31 వరకు పలు ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్లు బతుకమ్మ నుంచి సంక్రాంతి వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయన్నారు. ఇక నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో.. వర్షాలకు సిటీలో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయన్న ఆయన, ముసాపేట్ మెట్రో పిల్లర్‌కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది రాయితీ వర్తింపు మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో ఈ నెల 31 వరకు 40 శాతం రాయితీ స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం 20 ట్రిప్పుల చార్జీతో... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం 40 ట్రిప్పుల చార్జీతో... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు 7 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం 14 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం 20ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం 30 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో45 ట్రిప్పులు తిరిగే అవకాశం 40 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం -
మెట్రో స్టేషన్ గోడలకు పగుళ్లు
-
మూసాపేట మెట్రో స్టేషన్ గోడలకు పగుళ్లు
సాక్షి, హైదరాబాద్ : మెట్రో స్టేషన్లో గోడల మీద ఏర్పడిన పగుళ్లు ప్రయాణికుల్నిమరోసారి భయపెడుతున్నాయి. తాజాగా మూసాపేటలోని మెట్రో స్టేషన్ గోడలతో పాటు స్టేషన్‌పైకి వెళ్లే మెట్లపై ఏర్పడిన పగుళ్లు నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు రేపుతున్నాయి. పగుళ్లకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అయిదు నెలలుగా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్ల సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే నిర్వహణ లేమి కారణంగా ఈ పగుళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా గతంలో అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద నిలబడిన ఓ యువతిపై పైనుంచి పెచ్చులు పడి మృతి చెందిన విషయం తెలిసిందే. (హైదరాబాద్ మెట్రో.. ఇవి తెలుసుకోండి) -
నష్టాల నుంచి గట్టెక్కించండి ప్లీజ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో నష్టాల బాట పట్టింది. వీటినుంచి గట్టెక్కేందుకు ఎల్అండ్టీ మెట్రోకు తక్షణం రూ.3,756 కోట్లు అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి రాసిన తాజా లేఖలో కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గడువు పెరగడం, అవసరమైన భూములు, స్థలాల సేకరణ ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రభుత్వపరంగా ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని అందులో పేర్కొంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తిచేసేందుకు వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిర్మాణ సంస్థ సేకరించిన సుమారు రూ.15 వేల కోట్లకుపైగా రుణాలు, వాటి వాయిదాలు, వడ్డీల చెల్లింపులు పెరిగిపోవడంతో సంస్థ భారీగా నష్టాలుచవిచూడాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. లాక్డౌన్ ప్రకటించిన మార్చి 22 నుంచి వరుసగా ఐదు నెలలపాటు సర్వీసులు నిలిచిపోవడంతో నెలకు దాదాపు రూ.50 కోట్ల చొప్పున మార్చి నుంచి ఆగస్టు మధ్యకాలంలో సుమారు రూ.250 కోట్ల మేర నష్టాలు వచ్చాయని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్థను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో రైలు సర్వీసులు నడిపేందుకు అనుమతివ్వాలని కోరింది. కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం రైళ్లను నడుపుతామని స్పష్టం చేసింది. నష్టాల బాట ఇలా.. నగరంలోని ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మార్గాల్లో 69.2 కి.మీ మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు ఆయా రూట్లలో నిత్యం 4 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రయాణికుల చార్జీల ద్వారా కేవలం 45 శాతమే ఆదాయం సమకూరేది. మరో 5 శాతం వాణిజ్య ప్రకటనల రూపంలో.. 50 శాతం రియల్ ఎస్టేట్, మాల్స్, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా సంస్థ సమకూర్చుకోవాల్సి ఉంది. కోవిడ్ మహమ్మారి పంజా విసరడంతో సర్వీసులు నిలిపివేయడం, స్టేషన్లు, డిపోల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు నెలకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు వాణిజ్య ప్రకటనల ఆదాయం కూడా నిలిచిపోయింది. నగరంలో 18 మాల్స్ నిర్మించాలనుకున్న సంస్థ డిమాండ్ లేకపోవడంతో 4 మాల్స్ మాత్రమే నిర్మించింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల ద్వారా ఆదాయం ఆర్జించాలనుకున్న సంస్థ ఆశలు తలకిందులయ్యాయి. దీంతో నష్టాల జర్నీతో ఎల్అండ్టీ మెట్రో సంస్థ అష్టకష్టాలు పడుతోంది. సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో 2019– 20 ఆర్థిక సంవత్సరంలో రూ.382.21 కోట్లు నష్టపోయామని వెల్లడించింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.598.20 కోట్ల రెవెన్యూ ఆర్జించలేకపోయినట్లు ప్రకటించడం గమనార్హం. రైళ్లు నడుపుతాం.. అనుమతించండి.. కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం రైళ్లను నడిపేందుకు అనుమతివ్వాలని కోరుతూ నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని తాజా లేఖలో కోరింది. స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేలా చూడడం, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చర్యలు చేపడతామని పేర్కొంది. మెట్రో రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతులు జారీ చేయాల్సి ఉందని నిర్మాణ సంస్థ వర్గాలు తెలిపాయి. -
నష్టాలు మూటగట్టుకుంటున్న హైదరాబాద్ మెట్రోరైల్
-
మెట్రో పరుగులు అనుమానమే!!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు జూలై నెలలోనూ పట్టాలెక్కుతాయా..? లేదా..? అనే అంశం సంశయంగా మారింది. కోవిడ్ విసిరిన పంజాకు ఈ ఏడాది మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మెట్రోకు నష్టాలు తప్పడంలేదు. రైళ్లు, స్టేషన్ల నిర్వహణ వ్యయం తడిసిమోపెడవుతుండడంతో ప్రతి నెలా రూ.50 కోట్ల మేర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మొత్తంగా ఈ నెలాఖరుకు నష్టాలు రూ.200 కోట్లకు చేరుకుంటాయని అంచనా. మహానగరంలో నాగోల్– రాయదుర్గం, జేబీఎస్– ఎంజీబీఎస్, జేబీఎస్– ఎంజీబీఎస్ మూడు మార్గాల్లో 69 కి.మీ మార్గంలో మెట్రో అందుబాటులో ఉన్న విషయం విదితమే. రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలను తిరిగి ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అదుపు లేకుండా పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో ఈ నెలలో ప్రభుత్వం అనుమతులిచ్చే ప్రసక్తి ఉండదని మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు ఆర్టీసీ బస్సులు, మరోవైపు మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో గ్రేటర్లో ప్రజారవాణా వ్యవస్థ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.(మెట్రో ఇప్పట్లో లేనట్టే!) నష్టాల బాటలో.. లాక్‌డౌన్‌కు ముందు మూడు మెట్రో మార్గాల్లో నిత్యం 4 లక్షల నుంచి 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. అప్పట్లో లాభం, నష్టంలేని స్థితికి చేరుకుంటున్న తరుణంలోనే కోవిడ్ పంజా విసరడంతో మెట్రోకు బ్రేకులు పడ్డాయి. మార్చి 22 నుంచి మెట్రో రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు నిర్మాణ సంస్థకు భారంగా పరిణమించాయి. జరిగిన నష్టాన్ని చెల్లించాల్సిందిగా ఈ సంస్థ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. సాధారణంగా మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం 45 శాతం మాత్రమే. మరో 50 శాతం వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా నిర్మాణ సంస్థ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరో 5 శాతాన్ని వ్యాపార, వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలని నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నారు. గత మూడున్నర నెలలుగా వాణిజ్య స్థలాల అద్దెలు, వాణిజ్య ప్రకటనల ఆదాయం సైతం అరకొరగా లభిస్తుండడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూపులు.. మెట్రో స్టేషన్లు, ప్రయాణికులు వినియోగించే కామన్ ప్రాంతాలు, రైలు బోగీలను కోవిడ్– 19 నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసి వినియోగంలోకి తీసుకొస్తామని, ప్రయాణికుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని మెట్రో వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. స్టేషన్‌లోనికి ప్రవేశించే సమయంలో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ సైతం నిర్వహిస్తామన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తాయా అని మెట్రో వర్గాలు ఎదురుచూస్తున్నాయి. -
మెట్రో జర్నీకి బ్రేకులు వేస్తున్నాయి..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో నష్టాల బాటన సాగుతోంది. గత మూడు నెలలుగా సుమారు రూ.150 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు మెట్రో జర్నీకి బ్రేకులు వేస్తున్నాయి. కరోనా కలకలం నేపథ్యంలో మార్చి 22 నుంచి నిలిచిన రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. అడపాదడపా రైళ్లకు సామర్థ్య పరీక్షలు నిర్వహించి వాణిజ్య రాకపోకలకు సిద్ధం చేసినప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోసం మెట్రో అధికారులు ఎదురుచూస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నెలలో దాదాపు మెట్రో పరుగులు లేనట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకున్నా కదలని రైళ్లు.. ప్రారంభించిన అనతికాలంలోనే గ్రేటర్ సిటీజన్ల మనసు దోచుకున్న మెట్రో రైళ్లలో లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజూ సరాసరి 4 లక్షల మంది ప్రయాణం చేసేవారు. కోవిడ్ నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల మధ్య భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారు తరచూ తాకే, నిల్చునే ప్రాంతాలను శానిటైజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే రద్దీ అంతగా ఉండని స్టేషన్లలో రైళ్లను నిలపకూడదని అనుకున్నారు. కానీ కోవిడ్ మహమ్మారి విజృంభించడంతో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినీయకపోవడంతో మెట్రో రైళ్లు పట్టాలెక్కడంలేదు. నిర్వహణ ఖర్చు తడిసి మోపెడు.. గ్రేటర్లో ప్రస్తుతం ఎల్భీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం.. వెరసీ.. 69 కి.మీ మార్గంలో మెట్రో అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం సేకరించడంతోపాటు సొంత నిధులు కలిపి మొత్తంగా సుమారు రూ.13 వేల కోట్లు ఖర్చు చేసింది. లాక్‌డౌన్‌కు ముందు నెలకు రూ.50 కోట్ల ఆదాయంతో లాభాలు, నష్టాలు రాని దశకు చేరుకుంటున్న తరుణంలోనే కోవిడ్ పంజా విసిరింది. దీంతో కలల రైలుకు నష్టాల పయనం ఎదురవుతోంది. గత మూడు నెలలుగా ప్రయాణికుల చార్జీలు, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోవడంతో పాటు మెట్రో రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు తడిసి మోపడవుతోంది. వచ్చే నెలలోనైనా? తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలలో మెట్రో రైళ్ల రాకపోకలకు దాదాపు అనుమతులు నిరాకరించే అవకాశాలున్నాయి. దీంతో సిటీజన్లకు మెట్రో జర్నీ ఉండదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే నెల లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రైళ్లను నడిపే అవకాశాలుంటాయని మెట్రో అధికారులు తెలిపారు. రెండో దశ లేనట్టే.. నగరంలో మెట్రో తొలి దశకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో పలు మార్గాల్లో మెట్రో రెండోదశ చేపట్టాలన్న విజ్ఙప్తులు ఇటు ప్రజాప్రతినిధులు.. అటు ప్రజల నుంచి వినిపించాయి. కానీ ఒకవైపు ప్రభుత్వానికి నిధుల లేమి.. తాజాగా కోవిడ్ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో రెండోదశకు ఇప్పట్లో బాటలు పడే అవకాశాలుండవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
మెట్రో పయనం.. సులభతరం
బొల్లారం: నగరానికే తలమానికంగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం మరింత సులభతరం కానుంది. మెట్రో ఎక్కాలంటే ఇప్పటి వరకు టికెట్ కొనేందుకు కౌంటర్ల వద్ద క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. కానీ మెట్రో ప్రారంభ దశలో ఈ కౌంటర్లలో టికెట్ కొనడం సులువుగానే ఉండేది. కొద్ది రోజులుగా ప్రయాణికులు పెరగడంతో.. టికెట్ కౌంటర్ల వద్ద ఒక్కొసారి క్యూలైన్లలో బారులుతీరే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు ప్రయాణికులు టికెట్ కొనేందుకు సులువైన పద్ధతిని ఆవిష్కరించారు. దీంతో పేటీఎంతో ఇక క్యూఆర్– కోడ్ టికెట్ పద్ధతిని అమలు చేయనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం రసూల్‌పురాలోని మెట్రో భవన్లో పేటీఎం సంస్థ ప్రతినిధులతో కలిసి డిజిటల్ మెట్రో పేటీఎం క్యూఆర్– కోడ్ టికెట్ పద్ధతిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. సమయం వృథా కాకుండా పేటీఎంతో క్యూఆర్ కోడ్ పద్ధతి ద్వారా ప్రయాణించవచ్చని చెప్పారు. నగదు రహిత ప్రయాణానికి సులువైన మార్గంగా ఉండే పేటీఎం క్యూఆర్ కోడ్ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో అందరి చేతిలో మొబైల్స్ ఉండడం వల్ల ప్రయాణాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగించవచ్చన్నారు. పేటీఎంకు సంబంధించిన యాప్‌లోకి వెళ్లి ఎక్కాల్సిన స్టేషన్, ప్రయాణంలో దిగాల్సిన స్టేషన్ పేర్లను నమోదు చేస్తే టికెట్ చార్జి కనిపిస్తుంది. పేమెంట్ పూర్తి కాగానే టికెట్ యాప్‌లో కనబడటంతోపాటు మొబైల్‌కు మెసేజ్ ద్వారా కన్ఫర్మేషన్ సమాచారం వస్తుంది. దీంతోపాటు స్టేషన్ ఎంట్రీలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మెట్రో ఎక్కిన తర్వాత గమ్యస్థానానికి సంబంధించిన ఎగ్జిట్ గేట్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) దగ్గర క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేటీఎం వ్యాలెట్ నుంచి టికెట్ చార్జి కట్ అవుతుంది. వీటిని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద ఉన్న స్కాన్ చేసి సులభంగా మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు. పేటీఎం క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో మెట్రోలో ప్రయాణించే వీలుగా దీనిని నూతన విధానంతంఓ రూపొందించినట్లు పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అభయ్ శర్మ అన్నారు. మెట్రో ప్రయాణికులు సౌకర్యవంతమైన పద్ధతిలో గమ్యస్థానాలకు చేరుకునే విధంగా పేటీఎం ముందు అడుగులు వేసిందన్నారు. అనంతరం మెట్రో ప్రయాణంలో పేటీఎం క్యూఆర్ కోడ్ పద్ధతి ఎలా పనిచేస్తుందో అనే దానిపై రసూల్‌పురా మెట్రో రైల్ స్టేషన్లో ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద స్కానింగ్ చేసి పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో అధికారులతో పాటు పేటీఎం సంస్థ ప్రతినిధులు అంకిత్ చౌదరి, అనిల్‌తో సహా పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉపయోగించుకోవడం ఎలా..? ♦ పేటీఎం యాప్‌లో ‘మెట్రో’ ఐకాన్‌పై క్లిక్ చేయాలి ♦ మీ నగరాన్ని ఎంచుకోవాలి. రూట్ సెర్చ్‌పై క్లిక్ చేయాలి ♦ గమ్య స్థానాన్ని ఎంచుకోవాలి. రూట్స్ చూడడానికి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ♦ రూట్‌ను సూచిస్తుంది. ఎంపిక చేసుకున్న స్టేషన్స్ మధ్య ప్రయాణ సమయాన్ని కూడా చూపిస్తుంది. -
కరోనా ఎఫెక్ట్: మెట్రోరైల్లో క్లీనింగ్ ప్రక్రియ
-
5 సంవత్సరాలు అవుతే కానీ మెట్రో లాభాల్లోకి రాదు
-
రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెస్తే కిషన్‌రెడ్డికి పేరొస్తుంది
-
జేబీఎస్ టు ఎంజీబీఎస్ మెట్రో పరుగులు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ వాసుల కలల మెట్రో రైల్‌ను జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జేబీఎస్ వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. సీఎం ప్రయాణించడంతో ఈ మార్గంలోని చిక్కడపల్లి మినహా ఇతర మెట్రో స్టేషన్లలో ఎక్కడా రైలును నిలపకుండా నేరుగా ఎంజీబీఎస్ వరకు నడిపారు. దీంతో 13 నిమిషాల్లోనే జర్నీ పూర్తయ్యింది. సాధారణంగా ఈ మార్గంలో మిగతా ప్రతీ స్టేషన్లో మెట్రో రైల్ నిలిపితే ప్రయాణానికి 16 నిమిషాల సమ యం పడుతుంది. ఎంజీబీఎస్ వద్ద మెట్రో దిగిన సీఎం స్టేషన్ లో ప్రయాణికులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఎల్అండ్టీ, హెచ్ ఎంఆర్ అధికారులు నగర మెట్రో ప్రాజెక్టు విశేషాలను కేసీఆర్‌కు వివరించారు. మెట్రో ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంపీ రేవంత్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ సీఈఓ ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి, నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నారు. నేడు ఉదయం 6–30 నుంచి అందుబాటులోకి... జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో శనివారం ఉదయం 6–30 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం ఈ మార్గంలో సుమారు 60 వేల నుంచి లక్ష మంది వరకు జర్నీ చేసే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. కాగా, మెట్రో ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ కనిపించింది. జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలు, నృత్యాలతో సందడి చేశారు. చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వద్ద కొన్ని నిమిషాల పాటు రైల్ నిలపడంతో కేసీఆర్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరికి సీఎం అభివాదం చేశారు. మెట్రో విస్తరణకు ప్లాన్ సిద్ధం చేయండి... నగరం నలుమూలలా మెట్రో విస్తరణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రోలో ప్రయాణిస్తూ ఆయన.. ఎన్వీఎస్ రెడ్డి, ఇతర అధికారులతో మాట్లాడారు. నగరవాసులకు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణం సాగించేందుకు, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మెట్రో ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. మూడు మార్గాల్లో మెట్రో పూర్తితో ఆ ఫలాలను నగరవాసులు అందిపుచ్చుకున్నారని సీఎం అన్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు అత్యాధునిక ఎయిర్ పోర్టుల తరహాలో కనిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ, విజన్‌పరంగా ఢిల్లీ మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో మరింత అత్యాధునికంగా ఉందన్నారు. మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఆ మార్గంలోని ప్రతి ప్రాంతాల విశిష్టతలను ముఖ్యమంత్రి గుర్తు చేసినట్లు హెచ్ఎమ్ఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
కల నిజమాయె..
-
హైదరాబాద్ మెట్రో: కల నిజమాయె..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్వప్నం సాకారమైంది.భాగ్యనగర జీవనరేఖ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలిదశ సంపూర్ణమైంది. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో పూర్తయ్యింది. ఎల్బీనగర్– మియాపూర్ (29 కి.మీ), నాగోల్– రాయదుర్గం(29 కి.మీ), ఇప్పటికే అందుబాటులో ఉండగా.. నేడు జేబీఎస్– ఎంజీబీఎస్ (11 కి.మీ) రూట్ ప్రారంభం కానుండటంతో లక్ష్యం పరిపూర్ణమైంది. నగర మెట్రో ప్రాజెక్టుకు 2008లోనే ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఎన్నో బాలారిష్టాలను అధిగమించి 2012లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టినప్పటికీ.. అవి పూర్తయ్యేనాటికి నిర్మాణ వ్యయం రూ.17,132 కోట్లకు చేరుకుంది. తొలుత 2017 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నప్పటికీ.. ఆస్తుల సేకరణ, న్యాయపరమైన చిక్కులు, పనులు చేపట్టేందుకు రైట్ ఆఫ్ వే సమస్యల నేపథ్యంలో ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమైంది. మెట్రోఅధికారుల అంచనా ప్రకారం మూడు మార్గాల్లో సుమారు 16 లక్షల మంది జర్నీ చేస్తారని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ప్రయాణికుల మార్క్ 4 లక్షలకు మించలేదు. 2016 నుంచి ఇప్పటివరకు సుమారు 10 కోట్ల మంది మెట్రో రైళ్లలో జర్నీ చేసినట్లు అధికారులుప్రకటించారు. నేర్చుకోవాల్సిన పాఠాలివీ.. టప్రతి స్టేషన్ వద్ద ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేసైనామల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం కల్పించాలి. పార్కింగ్ ఫీజు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి. టమెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు సులువుగా చేరుకునేందుకు(లాస్ట్‌మైల్ కనెక్టివిటీ) బ్యాటరీ బస్సులు, మినీ బస్సులను నిరంతరం అందుబాటులో ఉంచాలి. వీటిని స్టేషన్ల వద్ద నిలిపేందుకు వీలుగా బస్‌బేలు ఏర్పాటు చేయాలి. టమెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణీకులకు నామమాత్రపు అద్దె ప్రాతిపదికన బైక్‌లు, సైకిల్లు ఇచ్చే ఏర్పాటు చేయాలి. టప్రతి స్టేషన్ వద్ద ఓలా, ఉబర్ క్యాబ్‌లు, ఆటోలను నిలిపేలా చర్యలు తీసుకోవాలి. వారి దోపిడీని నివారించాలి. టప్రతి స్టేషన్‌ను సమీప బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్యమైన కార్యాలయాలు, మాల్స్‌లోకి సులువుగా చేరుకునేందుకు వీలుగా ఆకాశమార్గాలు(స్కైవాక్‌లు)ఏర్పాటు చేయాలి. లాభమా..? నష్టమా..? మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 45 శాతం మాత్రమే. మిగతా 50 శాతం రెవెన్యూ రియాల్టీ ప్రాజెక్టులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. మొత్తంగా ప్రభుత్వం నిర్మాణ సంస్థకు వివిధ ప్రాంతాల్లో కేటాయించిన 269 ఎకరాల విలువైన స్థలాల్లో రాబోయే 10–15 ఏళ్లలో రూ.2243 కోట్లతో వివిధ ప్రాంతాల్లో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్, ఇతర వాణిజ్యస్థలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. రియాల్టీ, టూరిజం, నిర్మాణరంగం తదితర మఖ్యమైన రంగాల్లో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఆశిస్తున్న మేర 50 శాతం ఆదాయం సమకూరుతుందా..? లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. మెట్రో నిర్మాణ ఒప్పందం కుదిరిన 2011లో 18 చోట్ల మాల్స్ నిర్మించాలని భావించినా ఇప్పటివరకు కేవలం ఐదు ప్రాంతాల్లో మాత్రమే మాల్స్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. మెట్రో విశేషాలు ఇవీ.. ♦ కారిడార్ 1 : మియాపూర్ – ఎల్బీనగర్ : 29 కి.మీ, 27 స్టేషన్లు – రెడ్ లైన్ ( ఏ కారిడార్) ♦ కారిడార్ 2 : జేబీఎస్ – ఎంజీబీఎస్ : 11 కి.మీ, 9 స్టేషన్లు – గ్రీన్ లైన్ ( బీ కారిడార్ ) ♦ కారిడార్ 3 : నాగోల్ – రాయదుర్గ్ : 29 కి.మీ, 23 స్టేషన్లు – బ్లూ లైన్ ( సీ కారిడార్ ) ♦ మెట్రో తొలి పిల్లర్ ఏర్పాటు : 2012 ఏప్రిల్ 19 ఉప్పల్ జెన్‌ప్యాక్ట్ ♦ మొత్తం మెట్రో పిల్లర్లు : 2599 ( ఎంజీబీఎస్ చివరి పిల్లర్ ) ♦ రోజూవారి మెట్రో ప్రయాణికులు : సుమారు 4 లక్షలు ♦ మెట్రో మాల్స్ : పంజాగుట్ట , ఎర్రమంజిల్, హైటెక్ సిటీ, రాయదుర్గం, మూసారంబాగ్, ♦ స్కై వాక్ : పంజగుట్ట మెట్రో స్టేషన్ నుంచి సమీపంలోని మెట్రో మాల్ కి నేరుగా చేరుకొనేలా నిర్మాణం ♦ మెట్రో రైళ్లు , స్టేషన్లలో వస్తువులు పోగొట్టుకుంటే కస్టమర్ కేర్ నం: 040–23332555 ♦ అమీర్‌పేట్ , నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం ♦ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలు: బేగంపేట్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ మెట్రో స్టేషన్లు నగర మెట్రో ప్రస్థానం సాగిందిలా.. అంచలంచెల అభివృద్ధి తేదీ ♦ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ప్రారంభం మే 14–2007 ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది సెప్టెంబరు 19–2008 ♦ మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం రద్దు జూలై 7–2009 ♦ రెండోమారు ఆర్థిక బిడ్లు తెరిచింది జూలై 14–2010 ♦ ఎల్అండ్టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది సెప్టెంబరు 4–2010 ♦ మెట్రో డిపో నిర్మాణానికి ఉప్పల్‌లో 104 ఎకరాల కేటాయింపు జనవరి–2011 ♦ ఫైనాన్షియల్ క్లోజర్, కామన్ లోన్ అగ్రిమెంట్ కుదిరింది మార్చి–2011 ♦ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకు సెంట్రల్మెట్రో యాక్ట్ వర్తింపు జనవరి– 2012 ♦ 104 ఎకరాల మియాపూర్ డిపోల్యాండ్నుఎల్టీఎంఆర్హెచ్ఎల్కు కేటాయింపు మార్చి–2012 ♦ మెట్రో గ్రౌండ్ వర్క్స్ ప్రారంభం ఏప్రిల్ 26– 2012 ♦ కియోలిస్ సంస్థకు మెట్రో రైళ్ల నిర్వహణకు కాంట్రాక్టు కేటాయింపు మే 2012 ♦ రాయదుర్గంలో 15 ఎకరాల స్థలం కేటాయింపు ఆగస్టు 2012 ♦ కుత్భుల్లాపూర్ కాస్టింగ్‌యార్డులో 62 ఎకరాల హెచ్ఎంటీ స్థల లీజు సెప్టెంబరు 2012 ♦ బోగీల తయారీకి హ్యూండాయ్ రోటెమ్ కంపెనీతో ఒప్పందం సెప్టెంబరు 2012 ♦ మెట్రో రైలు పనుల ప్రారంభం నవంబరు 25– 2012 ♦ కేంద్ర ప్రభుత్వం నుంచి సర్దుబాటు నిధిరూ.1458 కోట్ల విడుదలకు ఆమోదం మే 2013 ♦ హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల సెప్టెంబర్ 2014 ♦ రైల్వే బోర్డు నుంచి హెచ్ఎంఆర్కుసిగ్నలింగ్ టెలికాం సిస్టంకు అనుమతి జనవరి 20–2015 ♦ వేలీవ్ ఛార్జీలు లేకుండా మెట్రో రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతి జనవరి 23–2015 ♦ మెట్రో కారిడార్3 స్టేజ్1కు ఆర్డీఎస్ఓ సంస్థ నుంచి స్పీడ్ సర్టిఫికెట్ మే 8– 2015 ♦ నాగోల్ మెట్టుగూడ(8కి.మీ)కు సీఎం ఆర్ఎస్ ధ్రువీకరణ జారీ ఏప్రిల్ 20– 2016 ♦ మెట్రోకు ప్రత్యేక విద్యుత్ టారిఫ్‌ను వర్తింపజేస్తూ ప్రభుత్వ నిర్ణయం ఏప్రిల్ 27– 2016 ♦ ఆర్డీఎస్ఓ నుంచి 80 కి.మీ వేగంతోమెట్రో రైళ్లు దూసుకెళ్లేందుకు అనుమతి జూన్ 17–2016 ♦ మియాపూర్ ఎస్.ఆర్.నగర్మార్గంలోప్రయాణికుల రాకపోకలకుసీఎంఆర్ఎస్ అనుమతి ఆగస్టు 16–2016 ♦ మెట్రో ప్రాజెక్టును 2018 నవంబరు 30 నాటికి పూర్తికి ప్రభుత్వ ఆదేశాల జారీ ఆగస్టు 16–2016 ♦ హెచ్ఎంఆర్ ప్రాజెక్టుకు భద్రతను మంజూరు చేస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలు ఆగస్టు 22– 2017 ♦ కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి మెట్టుగూడ–అమీర్‌పేట్ మార్గానికి అనుమతి నవంబర్ 20– 2017 పాతబస్తీపై ఎందుకీ నిర్లక్ష్యం.. మెట్రో పై అసదుద్దీన్ ట్వీట్.. హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో మెట్రో పనులంటే అంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ట్విటర్ వేదికగా నిలదీశారు. దీనిపై నెటిజన్లు కూడా విమర్శలు కురిపించారు. ముస్లింలు పన్నులు చెల్లించడం లేదా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. పాతబస్తీ విషయానికి వచ్చే సరికే ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తాయంటూ మరో నెటిజన్ నిలదీశారు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు మెట్రో పనులు పూర్తి చేయడానికి మీకు నిధులు ఉంటాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారు. ఎప్పుడు పూర్తి చేస్తారు?’ అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. నేడు జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందంటూ మెట్రో యాజమాన్యం చేసిన ట్వీట్‌కు బదులిస్తూ అసదుద్దీన్ ఈ ట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థను ట్యాగ్ చేశారు. -
జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో: ఒవైసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు మెట్రో పనులు పూర్తి చేశారు గానీ.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారని ప్రశ్నించారు. ఈ మేరకు... ‘దార్ ఉల్ షిఫా నుంచి ఫలక్నామా మెట్రో లైన్ సంగతి ఏంటి? జేబీఎస్ మార్గాన్ని పూర్తి చేశారు గానీ.. దక్షిణ హైదరాబాద్ విషయానికి వచ్చే సరికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఇదైతే ఇంకా అద్భుతం.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయి. మరి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా పనులు ఎప్పుడు మొదలు పెడతారు. ఎప్పుడు పూర్తి చేస్తార’ని అసదుద్దీన్ ట్విటర్ వేదికగా హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణానికి దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం 15 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య తీరనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు చేసిన ట్వీట్‌కు అసదుద్దీన్ పైవిధంగా స్పందించారు. నగరంలో 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా మార్గం మాత్రం నిర్మాణ దశలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ 5 కిలోమీటర్లు మినహాయిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు. Amazing that you have funds for JBS & MGBS,when will @hmrgov start and complete MGBS to FALAKNUMA ? https://t.co/FnCyy8Y829 — Asaduddin Owaisi (@asadowaisi) February 6, 2020 -
శంషాబాద్ వరకు మెట్రో
శంషాబాద్: విమానాశ్రయంతో అంతర్జాతీయంగా పేరుగాంచిన శంషాబాద్‌ను అభివృద్ధిలోనూ అదే స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన శంషాబాద్ మాజీ సర్పంచ్ ఆర్.గణేష్ గుప్తా తన అనుచరగణంతో పాటు శంషాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 8 మంది కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రో రైలును శంషాబాద్ వరకు పొడిగిస్తామన్నారు. శంషాబాద్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి అధ్వానంగా తయారైందని, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా వారి తీరు మారడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే తెలంగాణ అభివృద్ధి కోసం గణేష్‌గుప్తా లాంటి నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి బాటలు పడ్డాయని టీఆర్ఎస్లో చేరిన గణేష్‌గుప్తా అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వానికి ఎదురులేదన్నారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు జహంగీర్‌ఖాన్, అజయ్, కుమార్, భద్రు, రేఖ, విజయలక్ష్మి, నజియా, సునీత, వ్యాపారవేత్త వేణుమాధవ్‌రెడ్డి తదితరులున్నారు. -
ఎయిర్‌పోర్టు మెట్రో ఎప్పుడో?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్ట్‌ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు ఏడాది క్రితం సిద్ధం చేసిన సమగ్రప్రాజెక్ట్ నివేదిక కార్యరూపం దాల్చడం లేదు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు సుమారు 30.7 కిలోమీటర్ల మార్గంలో దాదాపు రూ.4500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని సంకల్పించారు. కానీ నిధుల లేమి శాపంగా పరిణమిస్తోంది. మెట్రో తొలిదశ తరహాలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం లేదా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణ సేకరణ జరిపి ఈ ప్రాజెక్ట్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినా అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. ఎయిర్పోర్ట్ మెట్రో ఉద్దేశం ఇదే.. ♦ రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. కానీ మెట్రో రైళ్లలో కేవలం25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ♦ ఏడాది క్రితం ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలోకి రంగంలోకి దిగి శంషాబాద్ రాయదుర్గం మార్గంలో పర్యటించి ఈ డీపీఆర్నుసిద్ధంచేశారు. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్లు విమానాశ్రయానికి కనెక్టివిటీలేకపోవడంతో..తక్షణం విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైన విషయం విదితమే. విమానాశ్రయమార్గంలో ప్రతీఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని నివేదికలో పేర్కొన్నారు. స్టేషన్లను ఔటర్‌రింగ్ రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పా జంక్షన్, కిస్మత్పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీపీపీ విధానంలో ముందుకొచ్చేదెవరో...? ♦ ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మొదటిదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టారు. మూడు మార్గాల్లో 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని తొలుత అంచనావేశారు. కానీ ఆస్తుల సేకరణ ఆలస్యం కావడం, అలైన్మెంట్ చిక్కులు, రైట్‌ఆఫ్‌వే సమస్యల కారణంగా మెట్రో అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా పెరిగినట్లు సమాచారం. ♦ ఈ నేపథ్యంలో రెండోదశ మెట్రో ప్రాజెక్టునుపీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగారాయదుర్గం శంషాబాద్ ఎక్స్‌ప్రెస్‌మెట్రో కారిడార్ ఏర్పాటుకు స్పెషల్ పర్పస్ వెహికిల్(ప్రత్యేకయంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం విదితమే. ♦ జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లోఈ వారంలో మెట్రో పరుగులు ♦ సికింద్రాబాద్–హైదరాబాద్ నగరాలను అనుసంధానం చేసే జేబీఎస్–ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని ఈ వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రారంభ కార్యక్రమాన్ని జేబీఎస్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పది కిలోమీటర్ల నిడివి గల ఈ మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్లున్నాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే తొలిదశ మెట్రో ప్రాజెక్టు సంపూర్ణం కానుండటం విశేషం. -
హైదరాబాద్ : నిలిచిపోయిన 9 మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గంలో తొమ్మిది మెట్రో ట్రైన్లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతోనే మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే, లోపాన్ని సరిచేయడంతో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. -
ఇంటర్నెట్ అవసరం లేకుండానే సినిమాలు, వినోదం
సాక్షి, సిటీబ్యూరో: హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు మొదలుకొని నచ్చిన పాటలను, వినోద కార్యక్రమాలను ఆస్వాదించాలనుకుంటున్నారా...అయితే మెట్రో రైలు ఎక్కేసేయండి. నిజమే. మెట్రోలో ప్రయాణం చేసినంత సమయం నచ్చిన సినిమాలు వీక్షించడమే కాదు. వాటిని మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. ఆహ్లాదభరితమైన మెట్రో ప్రయాణాన్ని మరింత ఆనందభరితం, వినోదభరితం చేసే సదుపాయాన్ని మొట్టమొదటిసారి అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్. షుగర్ బాక్సు నెట్వర్క్ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇంటర్నెట్తో నిమిత్తం లేకుండా లోకల్ వైఫై సదుపాయం ద్వారా ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో నచ్చిన సినిమాలు, వినోద కార్యక్రమాలను వీక్షించే అద్భుతమైన సదుపాయాన్ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. షుగర్ బాక్సు సీఈవో రోహిత్ పరంజిపే,ఎల్అండ్టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. మొదట నగరంలోని 9 మెట్రో స్టేషన్లు నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, జేఎస్టీయూ, మియాపూర్‌లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ‘జీ 5’ లేదా ‘ఫ్రీ ప్లే’ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని ఈ వినోదభరితమైన ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు..నచ్చిన సినిమాలను కేవలం 3 నిమిషాల్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం 9 స్టేషన్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించినప్పటికీ త్వరలో నగరంలోని అన్ని స్టేషన్లకు విస్తరించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కేవలం సినిమాలు, వినోదం వంటి కార్యక్రమాలే కాకుండా ప్రయాణికులు తమ అభిరుచికి తగిన పుస్తకాలను చదువుకొనేందుకు, మేధో సంపత్తిని పెంచుకొనేందుకు ఈ యాప్ ద్వారా ఒక లైబ్రరీని అందుబాటులోకి తేవాలని ఆయన షుగర్ బాక్సు నెట్ వర్క్ ప్రతినిధులకు సూచించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, తదితర అన్ని వర్గాల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెట్రో సేవలను మరింత అభివృద్ధిచేయనున్నట్లు తెలిపారు. 5 వేల సినిమాలతో షుగర్ బాక్సు షుగర్ బాక్సు నెట్ వర్క్ ద్వారా 5 వేలకు పైగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూవీలు, హాస్యంతో కూడిన వినోద కార్యక్రమాలు, ప్రీమియర్ షోలు, పాటలు, గేమ్స్, తదితర అన్ని కార్యక్రమాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్లలో జీ 5, లేదా ఫ్రీ ప్లే యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఫోన్ నెంబర్, ఇతర వివరాలను నమోదు చేసుకొంటే చాలు. రైలు ఎక్కిన వెంటనే లోకల్ వైఫై ద్వారా నచ్చిన సినిమాలను చూడవచ్చు. కొత్త మొబైల్ ఫోన్లలో కేవలం 3 నిమిషాల్లో ఒక సినిమాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాతవాటిలో అయితే 15 నిమిషాల వరకు సమయం పట్టవచ్చునని షుగర్ బాక్సు సీఈవో రోహిత్ తెలిపారు. గత 3 నెలలుగా చేపట్టిన ప్రచార కార్యక్రమాల వల్ల 75 వేల మందికి పైగా ఈ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ ప్రయాణికులంతా ప్రస్తుతం నచ్చిన మూవీలు చూడొచ్చు. మొదటి 60 రోజులు పూర్తిగా ఉచితంగా ఈ సదుపాయాన్ని అందజేస్తున్నారు. ఆ తరువాత రూ.80 నుంచి రూ.100 వరకు నెలవారీ రుసుముతో సినిమాలు, వినోద కార్యక్రమాలను పొందవచ్చునని తెలిపారు. జనవరి నెలాఖరులో జేబీఎస్– ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభం షుగర్ బాక్సు నెట్ వర్క్ ప్రారంభం అనంతరం ఎన్వీఎస్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, జనవరి నెలాఖరుకు జూబ్లీబస్‌స్టేషన్– మహాత్మాగాంధీ బస్స్టేషన్ల మధ్య మెట్రో రైల్ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4 లక్షల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సమ్మె రోజుల్లో 70 వేల మంది ప్రతి రోజు అదనంగా ప్రయాణం చేశారని పేర్కొన్నారు. రాయదుర్గం స్టేషన్ ప్రారంభించడంతో మరో 20 వేల మంది అదనంగా మెట్రో రైళ్లలో పయనిస్తున్నట్లు ఎండీ తెలిపారు. -
మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : నగర మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణ సమయంలో ఎలాంటి వినోదం లేక బోర్‌గా ఫీలవుతున్న వారికి హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. విమానాల్లో మాదిరిగా మెట్రో సర్వీసుల్లో నచ్చిన గేమ్‌లు, సినిమాలను వీక్షించే వెసులుబాటు కల్పిస్తోంది. మంగళవారం నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జీ5 యాప్ ద్వారా ఈ సేవలను అందించనున్నారు. ఇందుకు ప్రయాణికులు తమ ఫోన్లోని డేటాను వినియోగించాల్సిన అవసరం లేదు. మెట్రో సంస్థనే ప్రత్యేక వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి, నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రయాణించే ప్రయాణికులంతా ఈ సేవలను పొందవచ్చు. -
దిశ కేసు: హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్‌లో జరిగిన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో మహిళల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో ప్రయాణం సందర్భంగా మహిళలు తమ వెంట పెప్పర్ స్పే తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఇప్పటికే బెంగళూరు మెట్రో మహిళలు ప్రెప్పెర్ స్ప్రేలతో ప్రయాణించేందుకు అనుమతించగా.. హైదరాబాద్ మెట్రో కూడా అదే దారిలో సాగుతూ నిర్ణయం తీసుకుంది. షాద్‌నగర్ సమీపంలో అత్యంత అమానుషంగా జరిగిన దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఇకనుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్లోకి అనుమతిస్తామని బెంగళూరు మెట్రో ప్రకటించగా. తాజాగా హైదరాబాద్ మెట్రో కూడా అదే నిర్ణయం తీసుకుంది. మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. మెట్రోరైలులో సాంకేతిక కారణాలతో సాధారణంగా పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఎవరైనా వీటిని తీసుకొస్తే చెకింగ్ పాయింట్ల వద్దే వాటిని పడేయాల్సి వచ్చేది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటివి మహిళల వద్ద అవి దొరికితే సీజ్ చేసేవారు. కానీ ఇకనుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేశారు. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
అందుబాటులోకి రానున్న మెట్రో కారిడార్–2
సాక్షి, సిటీబ్యూరో : సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్య మెట్రో బంధం వేయనుంది. పాత నగరాన్ని కొత్త నగరంతో అనుసంధానం చేసే మణిహారంగా జేబీఎస్–ఫలక్‌నుమా కారిడార్ నిలిచిపోనుంది. ఈ మెట్రో–2 కారిడార్‌లో భాగంగా జేబీఎస్–ఎంజీబీఎస్ వరకు సోమవారం ట్రయల్ రన్ ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నేతృత్వంలో సాంకేతిక బృందం, హెచ్ఎంఆర్ఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.నాయుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏకే సాయిని ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా కారిడార్‌లో సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ రెండింటి మధ్య 11 కిలోమీటర్ల మార్గంలో 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్–పరేడ్‌గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్ వరకు 16 నిమిషాల సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణంగా అయితే ఈ రూట్లో రోడ్డు మార్గంలో 45 నిమిషాల వరకు సమయం పడుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరికొన్ని వారాల పాటు ట్రయల్ రన్ నిర్వహించి.. ఆ తర్వాత ప్రయాణికుల రాకపోకలకు అనుమతినిస్తారు. ట్రయల్ రన్లో భాగంగా సాంకేతిక సమర్థత, రైళ్ల నిర్వహణ, సమయపాలన, సిగ్నలింగ్ వ్యవస్థ పనితీరు, బ్రేక్ టెస్ట్, ట్రైన్ కంట్రోల్ సిస్టమ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్ తదితర అంశాలను పరిశీలిస్తారు. ప్రయాణికులకు ఊరట... కరీంనగర్, సిద్దిపేట, మెదక్, గజ్వేల్ తదితర ప్రాంతాల నుంచి జేబీఎస్‌కు వచ్చే ప్రయాణికులు మెట్రో మార్గంలో నేరుగా ఎంజీబీఎస్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే రైల్వేస్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా మెట్రో ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ నుంచి సుల్తాన్‌బజార్ వరకు వాహనాల రాకపోకలతో ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. మెట్రో రాక వల్ల ప్రయాణికులకు ఈ మార్గంలో ఊరట లభించనుంది. కోఠీకి కొత్త కళ... నిజాం కాలం నుంచి అతిపెద్ద వ్యాపార, వాణిజ్య కేంద్రంగా కొనసాగుతున్న అబిడ్స్, కోఠీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాలు మెట్రోరైలు రాకతో సరికొత్త కళను సంతరించుకోనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మెట్రో రైలులో సుల్తాన్‌బజార్‌కు చేరుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ రూట్లో సిటీ బస్సులు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కోఠీ వరకు ప్రతి 30 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే ఈ రూట్లో నడిచే సిటీ బస్సులపై పెద్ద ఎత్తున ప్రభావం పడనుంది. ఇప్పటికే ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో సిటీ బస్సులు ఆదరణ కోల్పోయాయి. నాగోల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా అమీర్‌పేట్ వరకు రాకపోకలు సాగించే బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గింది. ఈ రెండు ప్రధాన మార్గాల్లో ఆర్టీసీ ఏసీ బస్సులను చాలా వరకు తగ్గించింది. తాజాగా జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఎంజీబీఎస్ వరకు కొత్త లైన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ మార్గంలో నడిచే బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం ఉంది. మరోవైపు హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.05 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను ఈ నెల 29న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్, ఎల్బీనగర్–మియాపూర్ మార్గాల్లో 3.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండు రూట్లలో ప్రయాణికులకు మెట్రో సదుపాయం అందుబాటులోకి వస్తే మరో 2లక్షల మందికి పైగా అదనంగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది. -
మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చార్జీల మోత..
నగరవాసులకు మెట్రో ప్రయాణం మరింత భారమైంది. స్టేషన్లలో పార్కింగ్ ఫీజులను అమాంతం పెంచడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సదుపాయం ఉండగా... అదీ ఎత్తేశారు. ఇక నగరమంతటా పెయిడ్ పార్కింగ్‌లే. దీంతో ప్రయాణికులు మెట్రో ప్రయాణంపై పెదవి విరుస్తున్నారు. ఉచితంగా పార్కింగ్ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత మెట్రోదేనని పేర్కొంటున్నారు. నగర మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చార్జీలు మోత మోగుతున్నాయి.ఈ ఫీజును అమాంతం పెంచడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో సేవల్లో భాగంగా ఉచిత పార్కింగ్సదుపాయం కల్పించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపడంతో పాటు.. అధికంగా పెంచడంపై సర్వత్రా వ్యతిరేకతవ్యక్తమవుతోంది. మరోవైపుఇప్పటి వరకు ‘ఉచిత పార్కింగ్’సదుపాయం ఉన్న కొన్నిస్టేషన్లలో కూడాఆ సదుపాయాన్ని తొలగించిన మెట్రో అధికారులు అన్నిచోట్లా పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలు స్టేషన్లలోపార్కింగ్ సదుపాయాలు, చార్జీల వసూళ్లపై ‘సాక్షి’ విజిట్నిర్వహించింది. పార్కింగ్ చార్జీల బాదుడుపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షి,సిటీబ్యూరో/నెట్వర్క్: మెట్రో ద్వారా ప్రయాణికులకు మెరుగైన, సుఖవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తున్నప్పటికీ పార్కింగ్ రేట్లు మాత్రం వాహనదారులకు షాకిస్తున్నాయి. ఉదాహరణకు మెట్రో ప్రారంభమైన తొలినాళ్లలో బేగంపేట్ స్టేషన్లో వాహనాలకు పార్కింగ్ ఫీజును వసూలు చేయలేదు. ఏడాది తర్వాత నామమాత్రంగా రోజంతా బండి నిలిపితే రూ.10 తీసుకొనేవారు. ఇప్పుడు ద్విచక్ర వాహనానికి 2 గంటలకు రూ.5, 3 గంటలకు రూ.10 చొప్పున గుంజుతున్నారు. 5 గంటల పాటు పార్కింగ్ చేస్తే బైక్‌కు రూ.15 చొప్పున చెల్లించాలి. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు ద్విచక్ర వాహనం పార్కింగ్‌లో ఉంచితే రూ.20 చెల్సించాల్సిందే. ఇక కార్లకైతే పార్కింగ్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. కనిష్టంగా 2 గంటలకు రూ.15 చొప్పున వసూలు చేస్తుండగా, గరిష్టంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిపే వాహనాలకు రూ.50 వరకు చదివించుకోవాల్సి వస్తోంది. ఒక్క బేగంపేట్ స్టేషన్లోనే కాకుండా నగరంలోని దాదాపు అన్ని మెట్రో స్టేషన్లలో ఇదే పరిస్థితి ఉంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు 29 కి.మీ మార్గంలో, నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు 28 కి.మీ మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు మార్గాల్లో 50 స్టేషన్లు ఉండగా వీటిలో సుమారు 30 స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం ఉంది. అమీర్‌పేట్ వంటి ప్రధాన స్టేషన్లో గతంలో పూర్తిగా ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించారు. అలాగే ఉప్పల్‌లోనూ ఈ సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు అన్నిచోట్ల పెయిడ్ పార్కింగ్‌గా మార్చడం గమనార్హం. మెట్రో రైళ్లలో ప్రతిరోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో చాలామంది సొంత వాహనాల్లో మెట్రో స్టేషన్ వరకు వచ్చి అక్కడ పార్కింగ్ చేసి కార్యాలయాలకు వెళుతున్నారు. ఇలా వస్తున్న వారంతా మెట్రో ప్రయాణ చార్జీ కంటే వాహనాల పార్కింగ్ చార్జీలే ఎక్కువవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేం దోపిడీ బాబోయ్.. మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఎల్ అండ్ టీ, పార్క్ హైదరాబాద్ సంస్థలు పార్కింగ్ సదుపాయాలు కల్పించాయి. టూ వీలర్‌కు నెల పాస్‌కు రూ.250, ఓవర్ నైట్ చార్జ్ రూ.30, ఫోర్ వీలర్‌కు ఒకరోజు పాస్‌కు రూ.40, నెల పాస్‌కు రూ.750, ఓవర్ నైట్ చార్జ్ రూ.40 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. హెచ్ఎంఆర్ సంస్థ తరపున ‘పార్క్ హైదరాబాద్’ పార్కింగ్ సదుపాయం కల్పిస్తోంది. ♦ ఎల్బీనగర్లో ఇప్పటి వరకు లేని పార్కింగ్ ఫీజును కొత్తగా ప్రారంభించారు. ఇక్కడ కనీసం పార్కు చేసుకోవటానికి అనువైన స్థలం లేదు. గుంతలమయంగా ఉన్న స్థలంలో వాహనాలు నిలిపితేనే పార్కింగ్ రుసుం వసూలు చేయడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఎల్బీనగర్ స్టేషన్లో ప్రయాణికులకు సరిపోయేత పార్కింగ్ స్థలం లేదు. ♦ మిరాజ్ థియేటర్ సమీపంలోని చైతన్యపురి మెట్రో స్టేషన్ వద్ద పార్కంగ్ స్థలం మట్టికుప్పలతో నిండిపోయింది. ఎగుడుదిగుడుగా ఉండటంతో వాహనం ఎప్పుడు కిందపడుతుందో తెలియదు. ♦ దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఒక వైపు బస్‌స్టాండ్, మరోవైపు తోపుడు బండ్లు ఉండడంతో అధికారులు ఇంకా ఎటువంటి పెయిడ్ పారింగ్Š బోర్డులు ఏర్పాటు చేయలేదు. పార్కింగ్ సక్రమంగా లేదు ఎల్బీనగర్ పరిధిలోని మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ స్థలాల్లో కనీసం సిమెంట్ ప్లోరింగ్ కూడా చేయలేదు. ప్రస్తుతం గుంతలు, మట్టి కుప్పలు ఉన్న స్థలాల్లోనే ద్విచక్రవాహనాలు పార్కు చేస్తున్నారు. వాటిని సక్రమంగా ఏర్పాటు చేయకుండానే పార్కింగ్ రుసుం ఎలా తీసుకుంటారు? కార్లు పెట్టుకునేందుకు స్టేషన్ల వద్ద స్థలం లేదు.. కానీ ‘కారు పెయిడ్ పార్కింగ్’ అని బోర్డులు పెట్టారు. కొన్ని స్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌లు కూడా సక్రమంగా లేవు. మెట్రో ప్రయాణికులకు స్టేషన్ సమీపంలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసిన తర్వాతే పార్కింగ్ రుసుం తీసుకోవాలి.– బి.చందర్రావు, ఎల్బీనగర్ పార్కింగ్ రుసుం తగ్గించాలి మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ రుసుం అధికంగా ఉంది. రోజువారి పాస్ తీసుకున్న వారికి అదనంగా నైట్ అవర్స్ రుసుం లేకుండా చూడాలి. అప్పుడే వాహనదారులకు భారం తగ్గుతుంది. నెలవారీ పాస్ తీసుకున్న వారికి సౌకర్యంగా ఉంది. వాహనాలు పార్కింగ్ చేసే స్థలంలో ఎలాంటి షెడ్లు లేకపోవడంతో వర్షానికి తడిసి, ఎండకు ఎండిపోతున్నాయి. ఈ విషయంలో మొట్రో అధికారులు చర్యలు తీసుకోవాలి. – రాకేష్, చందానగర్ నెలకు రూ.600 ఫీజు బేగంపేట్ మెట్రో స్టేషన్ వద్ద వాహనం పార్కు చేసి పనులు పూర్తయిన తర్వాత వస్తా. గతంలో రోజంతటికీ రూ.10 మాత్రమే వసూలు చేసేవారు. ఇటీవల దానిని రూ.20 పెంచారు. ప్రతిరోజూ రూ.20 చొప్పున అంటే నెలకు పార్కింగ్‌కు రూ.600 పార్కింగ్ ఫీజుగానే కట్టాల్సి వస్తోంది. ఇది తగ్గిస్తే మంచిది.– రాఘవేంద్ర రెడ్డి, రైల్వే సివిల్ వర్క్స్ -
మరో రికార్డు బద్దలు కొట్టిన మెట్రో
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌వాసుల కలల మెట్రో మరో రికార్డు సృష్టించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు పోటెత్తడంతో సోమవారం నాలుగు లక్షలకు పైగా ప్రయాణికుల జర్నీతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు మెట్రోరైళ్లలో 3.75 లక్షలమంది జర్నీ చేయడమే ఇప్పటివరకు నమోదైన రికార్డు కాగా..సోమవారం రికార్డుతో పాత రికార్డు బద్దలైంది. పలు ప్రధాన రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో లక్షలాదిమంది మెట్రోరైళ్లను ఆశ్రయించారు. దీంతో 4 అదనపు రైళ్లు..120 అదనపు ట్రిప్పులను నడిపారు. మొత్తంగా సోమవారం 830 ట్రిప్పుల మేర మెట్రో సర్వీసులను నడపడం విశేషం. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పీక్ అవర్స్‌లో ప్రతి 3.5 నిమిషాలకు..ఇతర సమయాల్లో ప్రతి ఏడు నిమిషాలకో రైలును నడిపినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. స్టేషన్లలో అధిక రద్దీ నేపథ్యంలో....ట్రిప్పులను అదనంగా నడిపామన్నారు. ప్రధానంగా ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ఎల్భీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, లక్డికాపూల్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్లు కిక్కిరిశాయి. స్టేషన్లలోకి చేరుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులు బారులు తీరారు. అన్ని మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్‌సిటీ స్టేషన్లలో వేలాది మంది మెట్రో రైళ్లకోసం నిరీక్షించడం కనిపించింది. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్లో ప్రయాణికుల రద్దీ బేగంపేట్ మెట్రోస్టేషన్‌కు తాళం.. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు బేగంపేట మెట్రో స్టేషన్‌కు అధికారులు తాళం వేశారు. నిరసన కారులు స్టేషన్లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్లో నోటీసు అంటించడం విశేషం. అయితే స్టేషన్ మూసివేత కారణంగా ఈ స్టేషన్లో దిగాల్సిన ప్రయాణికులు ముందు స్టేషన్లో దిగాల్సి రావడంతో ఇబ్బందులు పడ్డారు. -
ఆర్టీసీ సమ్మె: సోషల్ మీడియా పోస్టులతో ఆందోళన వద్దు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గాల్లో ఆదివారం 3.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాధారణ రోజుల్లో రద్దీ 3 లక్షలుండగా, నిత్యం 50 వేల మంది అధికంగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి 3–5 నిమిషాలకో రైలు నడిపినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీతో ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్లు కిటకిటలాడాయి. ఆయా స్టేషన్ల ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనూ స్థలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమీర్‌పేట్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్లో నాగోలు, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్‌సిటీ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. రద్దీ పెరగడంతో హెచ్ఎంఆర్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరింత పెంచినట్లు తెలిపారు. సోమవారం సుమారు 4లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్ల భద్రతపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులతో ప్రయాణికులు ఆందోళన చెందవద్దన్నారు. నగరంలోని మెట్రో రైళ్లు, స్టేషన్లు అత్యంత సురక్షితమైనవని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ నగరం.. విశ్వనగరం’ దిశగా మెట్రో అడుగులు వేస్తున్నామన్నారు. -
తెలంగాణ బంద్: ప్రతి 3నిమిషాలకు మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకుమద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు శనివారం నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ బంద్’ కారణంగా నగరంలో ప్రజారవాణా స్తంభించే పరిస్థితులు నెలకొన్నాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ సిబ్బంది సహాయంతోఅరకొరగా నడుస్తున్న సిటీ బస్సులూ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బంద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ స్టేట్ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ ‘తెలంగాణ బంద్’కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ఆటోలు, క్యాబ్‌లు కూడా నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర సంఘాలన్నీ ఆర్టీసీ మద్దతు తెలిపాయి. 14 రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె, తెలంగాణ బంద్, సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందన్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన, ఈ నెల 21 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవడం తదితర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రవాణా అధికారులు బస్సుల నిర్వహణపై సీరియస్‌గా దృష్టిసారించారు. ‘ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల తాత్కాలిక నియామకాలను ముమ్మరం చేశాం. చర్చలు సఫలమై కార్మికులు విధుల్లో చేరితే మంచిదే.. లేని పక్షంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణం కష్టమే... గ్రేటర్లో సాధారణ రోజుల్లో నిత్యం సుమారు 3,750 బస్సులు 32 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. సమ్మె కారణంగా 14 రోజులుగా 1200–1400 బస్సులు మాత్రమే రోడ్డెక్కుతున్నాయి. ఈ బస్సులను సైతం కేవలం పగటిపూట మాత్రమే నడుపుతున్నారు. శనివారం నిర్వహించనున్న బంద్ దృష్ట్యా ఇవి కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. మరోవైపు నగరం నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. దూరప్రాంతాల బస్సులు నిలిచిపోతే మరో లక్ష మంది వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. నగరంలో నివాసం ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో, మండల, జిల్లా కేంద్రాల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు విధులకు హాజరుకావడం కష్టమే. బీజేపీ, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం కూకట్‌పల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్మికులు ఆటోలకు బ్రేక్... గ్రేటర్లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉన్నాయి. 5 లక్షల మందికి పైగా ఆటోరిక్షాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. బంద్ వల్ల వీటికీ బ్రేక్ పడనుంది.ఆటో డ్రైవర్లు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్తిరెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ప్రత్యేకించి అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సినవారు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి బంధువులు తదితరులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే సమ్మె కారణంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రధాన ఆసుపత్రులకు వచ్చే బయటి రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. బంద్ కారణంగా తప్పనిసరిగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులకు అసౌకర్యం కలగనుంది. అలాగే పాలు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల రవాణాకు కూడా తీవ్ర అంతరాయం కలగనుంది. క్యాబ్‌లు బంద్... నగరంలో 50వేలకు పైగా ఉబర్, ఓలా తదితర క్యాబ్‌లు బంద్‌లో పాల్గొనున్న నేపథ్యంలో మరో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులకు రవాణా సదుపాయం స్తంభించనుంది. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 5వేలకు పైగా క్యాబ్‌లు కూడా నిలిచిపోనుండడంతో డోమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. వైద్య సేవలు యథాతథం బంద్ నేపథ్యంలో శనివారం వైద్యసేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 108 అత్యవసర సర్వీసులతో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్ సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. రైళ్లు.. రయ్ రయ్ బంద్ నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3నిమిషాలకు ఒకటి చొప్పున నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో సుమారు 4లక్షల మంది మెట్రో సేవలు వినియోగించుకునే అవకాశముంది. అలాగే ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మార్గాల్లో 121ఎంఎటీఎస్ సర్వీసులు యథావిధిగానడుస్తాయి. 1.5 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకోనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–బొల్లారం మధ్య నడిచే డెమూ రైలునుశనివారం మేడ్చల్ వరకు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఓప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కాచిగూడ–నిజామాబాద్, కాచిగూడ–కర్నూల్ సిటీ మధ్య మరో రెండు జన సాధారణ రైళ్లుఅదనంగా నడవనున్నాయి. -
ఎల్బీనగర్-మియాపూర్ మెట్రోలో ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : మెట్రో ప్రయాణం అత్యంత సురక్షితం అన్న అధికారుల మాటలు నమ్మేలా కనిపించడం లేదు. ఇటీవల అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద పెచ్చులూడి తలపై పడటంతో ఓ యువతి మరణించిన ఘటన మరువకముందే.. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రోలో శుక్రవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. డోర్‌పైనున్న క్యాబిన్ ఊడి ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నసమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలాఉండగా.. గత 14 రోజులుగా టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో హైదరాబాద్ మెట్రో సర్వీసులకు జనం తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు పట్టుకుని నిల్చునే డోర్‌పైనున్న క్యాబిన్ ఊడిపోయినట్టు పలువురు చెప్తున్నారు. (చదవండి : మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్) -
ఆర్టీసీ సమ్మె : మెట్రో సరికొత్త రికార్డు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌వాసుల కలల మెట్రో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సోమవారం అత్యధికంగా 3.80 లక్షల మంది ప్రయాణికులతో తాజా రికార్డును బద్దలుకొట్టింది. ఇటీవల 3.75 లక్షల మందితో రికార్డు నెలకొల్పగా..సోమవారం రద్దీ 3.80 లక్షలకు చేరుకోవడం విశేషం. ఆర్టీసీ సమ్మె నేపథ్యలో మెజార్టీ సిటీజనులతో పాటు..దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణీకులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండడంతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11.30 గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్ రూట్లోని ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్లలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, మెట్టూగూడా, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్‌సిటీ స్టేషన్లు రికార్డు సంఖ్యలో ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నట్లు తెలిపారు. ఆయా స్టేషన్లలో సాధారణ రోజులతో పోలిస్తే ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యే ప్రయాణీకుల సంఖ్య సోమవారం రెట్టింపుగా ఉందని తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆయా స్టేషన్లలో ప్రత్యేక టిక్కెట్‌కౌంటర్లు,అదనపు సిబ్బందిని ఏర్పాటుచేశామన్నారు. రద్దీ రూట్లలో ప్రతీ మూడు నుంచి ఐదు నిమిషాలకోరైలును నడుపుతున్నామన్నారు. రద్దీ పెరగడంతో రైళ్లలో ఏసీ సదుపాయం అంతగా లేదని..స్టేషన్లలో టాయిలెట్స్‌వద్ద ,టిక్కెట్ కౌంటర్ల రద్దీతో ఇబ్బందులపాలయినట్లు ప్రయాణీకులు వాపోయారు. సాధారణ రోజుల్లో రద్దీ 2.780 లక్షలకు మించదు..సెలవు రోజుల్లో రద్దీ సుమారు 3 లక్షల మేర ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. -
ఉందిగా అద్దె బైక్..
కంటోన్మెంట్: మెట్రో రాకతో నగరంలో రవాణా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయి. అయితే మెట్రో స్టేషన్లు తమ నివాసం, పనిచేసే కార్యాలయం, వ్యాపార సంస్థలకు అందుబాటులో ఉండే వారికి మాత్రమే మెట్రో బాగా కలిసొస్తుంది. మెజారిటీ ప్రయాణికులు తమ ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు, లేదా నిర్దేశిత మెట్రో స్టేషన్ నుంచి తమ గమ్యం చేరుకునేందు మళ్లీ సిటీ బస్సు లేదా ఆటో, క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. మెట్రో స్టేషన్ల వద్ద సైకిళ్లు, బైక్ రైడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అంత సౌకర్యంగా లేవు. ఈ గ్యాప్‌ను పూరించేందుకు కొందరు యువకుల మదిలో మెదిలిన సరికొత్త ఆలోచనే ‘బౌన్స్’. మొబైల్ ఫోన్ ఉంటే చాలు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా చేరుకోలేని గమ్యానికి తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏర్పడింది బౌన్స్. గోవాలోని పనాజీ వంటి నగరాల్లో ఇప్పటికే అద్దె బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి ఉన్న చోటుకు వెళ్లి అక్కడి నుంచి అద్దెకు తీసుకుని మళ్లీ వాటిని, తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ బైక్‌లు అందుబాటులో ఉండవు. ‘బౌన్స్’ ఈ లోటును పూరించింది. నగరంలో ఎక్కడైనా బైక్ అద్దెకు తీసుకుని మన గమ్యానికి చేరుకున్నాక, ఏదేని పార్కింగ్ ప్రదేశంలో వదిలేస్తే చాలు. మళ్లీ ఆ బైక్‌ను మనం తిరిగి అప్పగించాల్సిన పనిలేదు. తాళం వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మొబైల్లో ఉన్న యాప్ ద్వారా మన ట్రిప్ ముగిస్తున్నట్లు తెలియజేస్తే చాలు, సరదు కంపెనీ ప్రతినిధులే ఆన్లైన్లో బైక్‌ను లాక్ చేస్తారు. ఇక ఆ ప్రదేశంలో మరొకరు అదే బైక్‌ను తీసుకుని తమ రైడ్ ప్రారంభించవచ్చు. ఇలా నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా సరే మన మొబైల్ ఫోన్లో ‘బౌన్స్’ యాప్ ఉంటే చాలు. మనకు సమీపంలో పార్కు చేసి ఉన్న వాహనాల వివరాలు అందులో ప్రత్యక్షం అవుతాయి. ఫోన్ యాప్ ద్వారానే సదరు బైక్‌ను స్టార్ట్ చేసుకుని మనకు కావాల్సిన చోటుకు వెళ్లి వదిలేయవచ్చు. మెట్రో ప్రయాణికులకు అత్యంత అనువుగా ఉండే ఈ తరహా రవాణా వ్యవస్థ మన నగరంలో శుక్రవారం ప్రారంభమైంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద నగర అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఇవీ ప్రత్యేకతలు ♦ బౌన్స్ ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా కిలోమీటరుకు రూ.2 చొప్పున మాత్రమే చార్జ్ చేయనున్నారు. అయితే బైకును వినియోగించిన సమయానికి గానూ నిమిషానికి రూ.1.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ♦ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్సు కలిగిన ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో ‘బౌన్స్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ‘బౌన్స్’ వాహనాల్ని అద్దెకు తీసుకోవచ్చు. హెల్మెట్‌ను కూడా కంపెనీ వాళ్లే అందిస్తారు. ♦ ప్రస్తుతానికి టీవీఎస్ జెస్ట్, టీవీఎస్ పెప్ మోటార్ బైకులు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఎలక్ట్రికల్ వాహనాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ♦ తమ మొబైల్లో ఉన్న యాప్ ఆధారంగా ప్రయాణికులు తమకు సమీపంలో ఏవైనా బైకులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, వెంటనే బుక్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి గమ్యస్థానికి చేరుకున్నాక సమీపంలోని పబ్లిక్ పార్కింగ్ ప్రదేశంలో బైక్‌ను పార్కు చేసి వెళ్లిపోవచ్చు. బుకింగ్ ఎలా అంటే.. ♦ ప్లే స్టోర్ లేదా ఏదేని ఆన్లైన్ యాప్ స్టోర్ నుంచి ‘బౌన్స్’ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ♦ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ముందు, వెనక బాగాల ఫొటోలతో పాటు, ఫేస్ వెరిఫికేషన్ కోసం సెల్ఫీ పోటోను కూడా అప్లోడ్ చేయాలి. ♦ వినియోగదారుడి లైసెన్సు, ఫొటోను బౌన్స్ అప్రూవ్ చేశాక, వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు ♦ ‘బుక్ నౌ’ అనే బటన్ నొక్కితే సమీపంలో అందుబాటులో ఉన్న స్కూటర్, బైక్‌ల సమాచారం లొకేషన్‌తో సహా పోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఏదేని వాహనాన్ని బుక్ చేసుకున్నాక ఆ వాహనానికి సంబంధించిన ఆటోమెటిక్ లాక్ ఆన్ చేసి, బైక్‌కు ఉన్న బటన్ మీద నొక్కితే చాలు వాహనం స్టార్ట్ అవుతుంది. ♦ రైడ్ ముగించాక, మళ్లీ వెంటనే వినియోగించుకోవాలంటే పాస్ మోడ్‌లో పెడితే ఆటోమెటిక్‌గా లాక్ అవుతుంది. పాస్ మోడ్‌లో ఉన్న వాహనానికి అద్దె రేటు తక్కువగా ఉంటుంది. ♦ ఒక వేళ బైక్ మళ్లీ వెంటనే అవసరం లేదనుకుంటే, ఏదేని నిర్ధేశిత పార్కింగ్ ప్రదేశంలో వదిలిపెట్టి ఎండ్ రైడ్ నొక్కాలి. రైడ్‌కు సంబంధించిన పేమెంట్‌ను ఆన్లైన్లో చెల్లిస్తే సరిపోతుంది. ♦ ప్రయాణంలో వాహనం యాక్సిడెంట్‌కు గురైతే, వెంటనే బౌన్స్ కస్టమర్ కేర్‌కు సమచారం వెళుతుంది. వినియోగదారుడు వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోవచ్చు. -
హైదరాబాద్ మెట్రోరైల్: డేంజర్ బెల్స్
-
ఆర్టీసీ సమ్మె: రాత్రి 11.30 వరకు మెట్రోరైళ్లు..!
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండోరోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో నగరంలోని మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఆదివారం ప్రయాణికులతో మెట్రో స్టేషన్లన్నీ కిటకిటలాడాయి. ఆర్టీసీ సమ్మెతో బస్సులు తిరగకపోవడం, ప్రైవేటు వాహనాల్లో భారీగా చార్జీలు వసూలు చేస్తుండటంతో నగరవాసులు మెట్రోరైలుపై పెద్ద ఎత్తున ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా రాత్రి 11.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి మూడు నిమిషాలకు ఒకటి చొప్పున ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ మెట్రో నడుపుతోంది. -
మెట్రో స్టేషన్లలో మరమ్మతులు
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ దుర్ఘటన నేపథ్యంలో అన్ని స్టేషన్లలో మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్‌అండ్‌టీలు అప్రమత్తమై ఆయా స్టేషన్లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పనులు చేపడుతున్నాయి. విడిభాగాలు, ప్లాస్టరింగ్ మెటీరియల్ ఊడి పడకుండా మరమ్మతు పనులు చేపట్టినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పనులను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానన్నారు. పనుల నాణ్యత, మన్నిక, లోపాలను గుర్తించేందుకు ఎల్అండ్టీ ఆరు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. పనులు చేపట్టేందుకు అత్యంత ఎత్తునకు వెళ్లే బూమ్ లిఫ్టులు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశామన్నారు. నాగోల్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలోని అన్ని స్టేషన్ల విడిభాగాలు, ఇతర నిర్మాణాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామన్నారు. సుదీర్ఘం అనుభవం కలిగిన ఇంజినీర్ల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయన్నారు. నిర్మాణాల్లోని పగుళ్లు, ఉపరితల ప్లాస్టర్ మెటీరియల్, కాంక్రీట్ చిప్‌లు, విడిభాగాలు ఊడిపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడే మరమ్మతులు.. ప్రధానంగా బాలానగర్, పరేడ్‌గ్రౌండ్స్, రసూల్‌పురా, హైటెక్‌సిటీ, గాంధీభవన్, ఎల్బీనగర్, న్యూమార్కెట్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ తదితర స్టేషన్లకున్న పగుళ్లను సరిదిద్దుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రాకతో ట్రాఫిక్ బాధలు తప్పాయని ఊపిరి పీల్చుకున్న నగరవాసులు... ఇప్పుడు మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో పెచ్చులూడి ఆదివారం ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పరిధిలో ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. ఈ రెండు రూట్లలో నిత్యం 3లక్షల మంది జర్నీ చేస్తుండగా... డిసెంబరులో ఎంజీబీఎస్–జేబీఎస్ రూట్లోనూ రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్ అయితే ఈ మార్గాల్లో స్టేషన్లలోని సీలింగ్, పిల్లర్లు పెచ్చులూడుతుండడంపై సిటీజనులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు ప్రారంభమైన రెండేళ్లకే ఇలా పెచ్చులూడడం.. నిర్మాణ పనుల్లోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని మెట్రో అధికారులు, ప్రభుత్వ వర్గాలు ఒకవైపు ఎలుగెత్తి చాటుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో పిల్లర్ల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ చేపట్టినప్పటికీ, వాటిపై ఏర్పాటు చేసిన సెగ్మెంట్లు, స్టేషన్లకు ఇరువైపులా పక్షి రెక్కల ఆకృతిలో ఉన్న నిర్మాణాలను ఉప్పల్, మియాపూర్ మెట్రో కాస్టింగ్ యార్డుల్లో సిద్ధం చేసి తీసుకొచ్చి అమర్చారు. అంటే ప్రీకాస్ట్ విధానంలో సిద్ధం చేసిన విడిభాగాలతో మెట్రో స్టేషన్లు రూపుదిద్దుకున్నాయి. ఇక మూడు అంతస్తులుగా పిలిచే ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ప్లాట్‌ఫామ్ లెవల్, మధ్యభాగం(కాన్కోర్స్), రహదారి మార్గంలో ఉండే మెట్రో మార్గానికి పైకప్పులను కాంక్రీటు మిశ్రమం, టైల్స్, ఫాల్‌సీలింగ్ ఇతర ఫినిషింగ్ మెటీరియల్‌తోతీర్చిదిద్దారు. మెట్రో పిల్లర్లు, పునాదులు, స్టేషన్ల కాంక్రీటు నిర్మాణాల నాణ్యతకు ఎలాంటి ఢోకా లేకపోయినా, పైకప్పులకు అతికించిన టైల్స్, పిల్లర్లు, సెగ్మెంట్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశాలను పూడ్చిన కాంక్రీటు మిశ్రమం రైళ్లు రాకపోకలు సాగించినపుడు, భారీ వర్షాలు కురిసినపుడు ఊడిపడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో భారీ ఈదురు గాలులకు ఫాల్‌సీలింగ్ మెటీరియల్ ఎగిరిపడడం సంచలనం సృష్టించింది. కాగా ఆదివారం జరిగిన సంఘటన నేపథ్యంలోని నగరంలో మూడు మార్గాల్లో ఉన్న 64 స్టేషన్లలో ఇలాంటివి పునరావృతం కాకుండా నిపుణుల బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపడతామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. -
బిగ్‌బాస్ చూస్తున్నాడు.. జాగ్రత్త
‘మెట్రో రైలు ఎక్కేప్పుడు జాగ్రత్త. డోర్స్ క్లోజ్ అయ్యేప్పుడు సడన్‌గా ఎక్కొద్దు. అలా చేస్దే మీ వీపునకు తగిలించుకున్న బ్యాగులు డోర్స్‌లో చిక్కుకుంటున్నాయి. దీంతో సాంకేతిక లోపాలతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం’ ఉంటాయన్నారు సినీ నటుడు అక్కినేని నాగార్జున. ప్రమాదాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ‘బిగ్‌బాస్– 3’ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. ‘బిగ్‌బాస్’ మిమ్మల్ని చూస్తున్నాడనే పోస్టర్ని శనివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లోని బాల్రూమ్లో ‘స్టార్– మా’ నెట్వర్క్ బిజినెస్ హెడ్ అలోక్‌జైన్, ఎల్ఎన్టీహెచ్ఎల్ ఎండీ, సీఈఓ కె.వి.బి.రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం కొద్దిసేపు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు నాగ్.ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే. సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు వెళ్లిపోతోందనే కంగారు వద్దు. మన సిటీలో ప్రతి పది నిమిషాలకో మెట్రో రైలు సదుపాయం ఉంది. మీరు త్వరగా మీ గమ్యస్థానాలకు వెళ్లాలంటే ఓ పదిహేను నిమిషాలు ముందుగానే బయలుదేరండి. హడావుడిలో మెట్రో రైలు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలను కోల్పొవద్దు. మన మెట్రో ఎంతో మర్యాదకరమైనది. ఆ మర్యాదను కాపాడి ఇతర సిటీలకు మనం మార్గదర్శకంగా ఉందాం. – నాగార్జున మెట్రో టీవీ స్క్రీన్లపై ప్రచారం.. ‘బిగ్‌బాస్’ మిమ్మల్ని చూస్తున్నాడు అనే ప్రచారాన్ని నగరంలోని మెట్రో స్టేషన్లలో చేయనున్నాం. మెట్రోలో ఉన్న టీవీ స్క్రిన్లపై, మెట్రో స్టేషన్లో టీవీ స్క్రీన్లపై ప్రచారాలు ప్రదర్శిస్తాం. ఇటీవల కాలంలో చాలా మంది యువత త్వరగా వెళ్లాలన్నా హడావుడిలో డోర్స్ క్లోజయ్యే టైంలో మెట్రో రైలు ఎక్కుతున్నారు. దీంతో వారు వెనక తగిలించుకున్న బ్యాగ్ కాస్త డోర్స్ మధ్య చిక్కుకుంటుంది. దీంతో ప్రతి స్టేషన్లో మెట్రో రైలు ఆరు నుంచి పది సెకన్లు పాటు స్లో అవుతోంది. వీటిని సీసీ కెమెరాల ద్వారా ‘బిగ్‌బాస్’ గమనిస్తుంటాడు. అలా చేయొద్దంటూ టీవీల్లో ప్రకటనలు టెలికాస్ట్ కానున్నాయి. ప్రాణాలను కాపాడేందుకే.. మన ప్రాణాలు ఎంతో విలువైనవి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఒక్కోసారి తొందరలో మెట్రోరైలు ఎక్కుతున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా కాలు స్కిడ్ అయ్యి కిందపడే ప్రమాదం ఉంది. ఆ సమయంలో కిందపడిన వ్యక్తికి ఏదైనా జరిగితే? అందుకే.. విలువైన ప్రాణాలను కాపాడే కాన్సెప్ట్‌కి..‘బిగ్‌బాస్’ మిమ్మల్ని చూస్తున్నాడంటూ ప్రకటనలు వస్తుంటాయి. మెట్రో రైలు ఎక్కేటప్పుడు, దిగేప్పుడు జాగ్రత్తలు పాటిస్తారని ‘మా’ నమ్మకం. గొప్ప అనుభూతి.. మెట్రో ప్రయాణం అనేది చాలా మర్యాదతో కూడుకున్నది. ఆ మర్యాదను, ప్రతిష్టను ప్రయాణికులుగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ‘బిగ్‌బాస్– 3’ సీజన్ పూర్తయ్యే వరకు మెట్రో ప్రయాణాలపై, మర్యాదలపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించడమనేది ఓ గొప్ప అనుభూతి. ‘బాగ్‌బాస్– 3’ అతిపెద్ద ప్రాపర్టీ షో. ‘స్టార్– మా, మెట్రో’కు ప్రత్యేక ధన్యవాదాలు. -
ఏసీ బస్సుకన్నా మెట్రో ధర తక్కువే
సాక్షి, హైదరాబాద్ :నగరంలో మెట్రో రైలు టికెట్ ధరలు ఆర్టీసీ నడుపుతున్న ఏసీ బస్సుల టికెట్ ధరల కన్నా తక్కువేనని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఏసీ బస్సుల్లో కనిష్ట ధర రూ.15, గరిష్ట ధర రూ.80 ఉంటే మెట్రోలో కనిష్ట ధర రూ.10, గరిష్ట ధర రూ.60గా ఉందని వెల్లడించారు. ఐదేళ్ల కింద ఆరంభించిన చెన్నై మెట్రోలో రోజుకు 70వేల మంది ప్రయాణిస్తుంటే, హైదరాబాద్ మెట్రోలో 3లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు.గురువారం శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, డి.శ్రీధర్‌బాబులు దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో అసెంబ్లీ భవనం, సుల్తాన్ బజార్ల మీదుగా మెట్రో ప్రతిపాదనలు వద్దన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్లీ అదే ప్రాంతాల నుంచి ఎందుకు నిర్మాణం చేసిందని అడిగారు. దీనికి తోడు టికెట్ ధరలు ఎందుకు పెంచారని, ప్రాజెక్టు ఆలస్యం కావడంతో వ్యయభారం పెరిగింది వాస్తవమేనా అని ప్రశ్నించారు.దీనికి మంత్రి కేటీఆర్ బదులిస్తూ, ‘గతంలో గన్‌పార్క్‌ను పడగొడుతూ అలైన్మెంట్ ప్రతిపాదించడంతో టీఆర్ఎస్ సైతం వ్యతిరేకించింది.ఇప్పుడు అమరవీరుల స్తూపానికి నష్టం వాటిల్లకుండా 20మీటర్ల దూరం నుంచి మెట్రో వెళుతోంది. ఇక సుల్తాన్‌బజార్‌లోనూ వ్యాపారులతో మాట్లాడి, వారి ఆమోదంతో దుకాణ సముదాయాలకు నష్టం రాకుండా నిర్మాణం చేశాం. పాతబస్తీకి పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో నిర్మిస్తాం’ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టుపై 370 కేసులుంటే, సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుని రెండేళ్లలో∙360 కేసులు పరిష్కరించారన్నారు. -
తాగి మెట్రోలో హంగామా..
-
మెట్రోలో హంగామా.. రైలు నుంచి దించివేత
తేదీ ఈ నెల 8.. తార్నాక మెట్రో స్టేషన్.. రైలెక్కిన ఓ వ్యక్తి అతిగా మద్యం తాగి హంగామా చేశాడు. సిబ్బంది వెంటనే అతణ్ని రైలులో నుంచి దింపేశారు. ఇక నుంచి ఇలా ఎవరైనా చేస్తే సహించబోమని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. మందుబాబుల న్యూసెన్స్‌పై ఫిర్యాదులు స్వీకరించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. నిందితులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. పరిమిత మోతాదులో మద్యం తాగి, బుద్ధిగా ఉంటేనే మెట్రో జర్నీకి అనుమతి ఇస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: అతిగా మద్యం సేవించి మెట్రో రైళ్లలో న్యూసెన్స్ చేసే మందుబాబులకు చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 8న తార్నాక మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి రైలులో తన మొబైల్లో పాట పెట్టి విపరీతంగా డ్యాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు. వారు దాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసి మెట్రో అధికారులకు చేరవేయడంతో సిబ్బంది అతణ్ని కిందికి దించేశారని తెలిపారు. పోలీసులు డ్రంకన్డ్రైవ్కు రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తుండడంతో... చాలామంది తనను వ్యక్తిగతంగా కలిసి పరిమిత మోతాదులో మద్యం తాగిన వారిని మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని కోరారని చెప్పారు. పలువురు ఎన్ఆర్ఐలు సైతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మెట్రో రైళ్లలో మద్యం తాగిన వారిని అనుమతిస్తున్నారని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే తాము ఉదారంగా వ్యవహరిస్తూ పరిమిత మోతాదులో మద్యం తాగిన వారిని మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని భద్రతా సిబ్బందికి సూచించామన్నారు. అయితే మందుబాబుల ఆగడాలు ఎక్కువవుతుండడంతో వారిని కట్టడి చేసేందుకు త్వరలో ప్రత్యేకంగా వాట్సప్ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. దీని ఆధారంగా అతిగా మద్యం తాగి మెట్రోరైళ్లు, స్టేషన్లలో అల్లరి చేసే వారిపై తోటి ప్రయాణికులు, మెట్రో సిబ్బంది నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. మందుబాబులను ఎక్కడికక్కడే అరెస్టు చేసి వారిని చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. -
మెట్రో టు ఆర్టీసీ
సాక్షి, సిటీబ్యూరో: లాస్ట్‌మైల్ కనెక్టివిటీ మరోసారి తెరపైకి వచ్చింది. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ తాజాగా ప్యాసింజర్ ట్రాకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మెట్రో స్టేషన్లలో ట్రైన్ దిగిన ప్రయాణికుల లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి అనుగుణంగా బస్సులను నడుపుతారు. ఇప్పటికే హైటెక్‌సిటీ స్టేషన్ నుంచి ప్రారంభించిన ఈ తరహా సేవలను మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ నుంచి రద్దీ వేళల్లో సుమారు 400–500 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. వారిలో ఎక్కువ శాతం ఐటీ కారిడార్‌లోని వేవ్‌రాక్, లెమన్‌ట్రీ, అమెజాన్, మైండ్‌స్పేస్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఇందుకు అనుగుణంగా బస్సుల నిర్వహణలో మార్పులు చేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు ప్రతిరోజు 393 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొద్ది రోజుల క్రితం మరో 30 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. హైటెక్‌సిటీ కేంద్రంగా అన్ని మార్గాల్లో రోజుకు 3,796 ట్రిప్పులు తిరుగుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అదే తరహాలో వివిధ మెట్రో స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాలను, లాస్ట్‌మైల్ కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని బస్సుల నిర్వహణ కోసం ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం మెట్రో రైలు అధికారులతో కలిసి ప్యాసింజర్ ట్రాకింగ్నిర్వహిస్తారు. మెట్రో కారిడార్లలో నష్టాలు... రెండు ప్రధాన మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది. ఉప్పల్ నుంచి అమీర్‌పేట్ వరకు మొదట్లో పెద్దగా ప్రభావం లేకపోయినా హైటెక్‌సిటీకి సేవలు మొదలైన తరువాత ఆర్టీసీకి ఆదరణ తగ్గింది. అలాగే ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ సేవలు అందుబాటులోకి రావడంతో ఏసీ బస్సులపై ప్రభావం పడింది. దీంతో ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో 18 ఏసీ బస్సులను ఆర్టీసీ ఉపసంహరించుకుంది. మొత్తంగా మెట్రో కారిడార్లలో ఒక కిలోమీటర్‌కు రూ.7 చొప్పున నష్టం వస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ తెలిపారు. రెండు ప్రధాన మెట్రో కారిడార్లలో ఒక కిలోమీటర్‌పై రూ.28 ఆదాయం లభిస్తే రూ.35 ఖర్చవుతోంది. వందలకొద్దీ బస్సులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్యాసింజర్ ట్రాకింగ్ చేపట్టేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. గతంలో మెట్రో స్టేషన్లకు ఫీడర్ బస్సులను నడిపారు. కానీ పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో మరోసారి ప్రయాణికుల అవసరాలపై సమగ్రమైన అధ్యయనం జరిపి బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. పొగ లేని బస్సులు... అలాగే బ్లాక్స్మోక్ బస్సులను అరికట్టేందుకు కూడా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నల్లటి కారుమబ్బుల్లా కాలుష్యాన్ని వదిలే బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డెక్కించకుండా జాగ్రత్త పడాలని, అలాంటి బస్సులలో అవసరమైన విడి భాగాలను మార్చాలని అధికారులు భావిస్తున్నారు. ‘ఇంజెక్టర్లు, ఎఫ్ఐబీలు చెడిపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. కొన్ని బస్సుల్లో ఇంజిన్ మార్చాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఈడీ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్న దృష్ట్యా 12 డిపోల్లో విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈడీ తెలిపారు. ఫిర్యాదు చేయండి... ప్రస్తుతం గ్రేటర్లో రోజుకు 3,550 బస్సులు నడుస్తున్నాయి. సుమారు 9.15 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. అయినా ఈ బస్సులపై ప్రతిరోజు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. కిలోమీటర్‌కు రూ.42 లభిస్తే ఖర్చు మాత్రం రూ.58 వరకు ఉంటోంది. అంటే ఒక కిలోమీటర్‌పై రూ.16 చొప్పున నష్టం వస్తోంది. ఈ నష్టాలను ఎదుర్కొనేందుకు ప్రయాణికుల ఆదరణను పెంచుకోవడం మినహా మరో మార్గం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయాణికుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించి చర్యలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ‘ఇందుకోసం ప్రతి బస్సుపైన బయటి వైపు డిపో మేనేజర్ల ఫోన్ నంబర్లు డిస్ప్లే చేస్తాం. లోపలి వైపు కూడా నంబర్లు ఉంటాయి. బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా డిపో మేనేజర్లను, అవసరమైతే డివిజనల్ మేనేజర్లను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. వెంటనే పరిష్కారం పొందవచ్చు. బస్టాపుల్లో బస్సులు నిలపకపోయినా, అర్ధాంతరంగా ట్రిప్పులు రద్దయినా, బస్సులు పరిశుభ్రంగా లేకపోయినా డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేయండి’ అని ఈడీ ప్రయాణికులను కోరారు. -
వారానికి 5వేల మంది చొప్పున ప్రయాణికులు
సాక్షి, సిటీబ్యూరో: మెట్రోకు సిటీజనుల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ప్రతివారం సరాసరిన మెట్రో ప్రయాణీకుల సంఖ్యలో 5వేల మేర పెరుగుదల నమోదవుతోందని మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్న విషయం విదితమే. ఈ మార్గంలో నిత్యం సుమారు 3లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నాయి. ఖైరతాబాద్ మహాగణపతిని వీక్షించేందుకు వేలాది మంది మెట్రో రైళ్లలోనే తరలివస్తున్నారని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఆదివారం అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో సుమారు 70వేల మంది ప్రయాణికులు ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యారని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య, నిర్వహణ సిబ్బంది సంఖ్యను పెంచామన్నారు. ప్రతి నాలుగున్నర నిమిషాలకో మెట్రో రైలు ఈ రెండు రూట్లలో అందుబాటులో ఉందన్నారు. చివరి మెట్రో రైలు అమీర్‌పేట్ నుంచి రాత్రి 11:30 గంటలకు ఎల్బీనగర్, నాగోల్ మార్గాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 4లక్షల మార్కును చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని, అక్టోబర్‌లో హైటెక్‌సిటీ–రాయదుర్గం మార్గంలోనూ మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. -
మెట్రో రైళ్లలో చేయకూడని పనులివీ..
సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): గ్రేటర్‌వాసుల కలల మెట్రో జర్నీకి సిటీజన్ల నుంచి ఆదరణ పెరుగుతోన్న విషయం విదితమే. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్(29కి.మీ.), నాగోల్–హైటెక్‌సిటీ(28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు రూట్లలో నిత్యం సుమారు మూడు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వీరిలో కొందరు కొత్తవారు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో జర్నీలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెట్రో అధికారులు ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆ వివరాలివీ. స్టేషన్లు, రైలులో చేయాల్సిన పనులివీ.. మీ చేతిలో లేదా బ్యాగులోని చెత్త, చెదారాన్ని విధిగా చెత్తకుండీలోనే వేయాలి. స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిదీ. మెట్రోస్టేషన్ పరిసరాలకు చేరుకున్న తరవాత మీ ప్రయాణానికి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వినిపించే అనౌన్స్మెంట్లను జాగ్రత్తగా వినాలి. మీకేదైనా సహాయం కావాలంటే కస్టమర్ సర్వీస్ బృందం, స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి. మెట్రో స్టేషన్ లేదా భోగీలో నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలున్నట్లు అనుమా నిస్తే సిబ్బందికి వెంటనే తెలియజేయాలి. స్టేషన్‌లోపలికి వెళ్లే సమయంలో వ్యక్తిగత, బ్యాగేజీ తనిఖీ విషయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలి. తోటి ప్రయాణీకులు,మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్‌తో మర్యాదగా ప్రవర్తించండి. మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లపై వెళుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీరు దిగాల్సిన స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోవాలి. ఎస్కలేటర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎడమవైపున మాత్రమే ఉండాలి. భోగీలో హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని నిలబడాలి. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూర్చునేందుకు మీ వంతుగా సహకరించాలి. చిన్నారులను తీసుకొచ్చే బేబీ బగ్గీస్, వీల్చైర్లలో వచ్చేవారు విధిగా ఎలివేటర్లలో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లాలి. ఎస్కలేటర్ దిగిన వెంటనే దానికి దూరంగా జరగాలి. టిక్కెట్ కౌంటర్, టిక్కెట్ విక్రయ యంత్రాలు, ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్లో నిలబడాలి. ప్రయాణిస్తున్నప్పడు సిబ్బంది టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపమని తనిఖీ చేసినపుడు వారికి సహకరించాలి. టిక్కెట్ లేని ప్రయాణీకులపై కఠిన చర్యలు తప్పవు. అత్యవసర అనౌన్స్మెంట్ వినిపించినపుడు హడావుడిగా రైలు దిగాలి. రైలు ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే భోగీలోనికి ప్రవేశించాలి. రైలు కోసం పరుగెత్తరాదు. రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఉండే సందులో ఎలాంటి వస్తువులు, కాళ్లను పెట్టరాదు. చేయకూడని పనులివీ.. స్టేషన్లు, భోగీలు, పరిసరాల్లో ఉమ్మివేయడం, చూయింగ్‌గమ్ ఊయడం, సిగరెట్లు తాగడం, పాన్ నమలరాదు. రైలులోనికి ప్రవేశించిన తరవాత ఫొటోలు తీయడం నిషిద్ధం. నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు. మీ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషేధం.. ప్రమాదకర వస్తువులు, అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్ పరిసరాలు, భోగీల్లోకి తీసుకురావద్దు. ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోరాదు. ప్లాట్‌ఫాంపై వేచిఉండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి ముందుకు రావద్దు. మీ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో విడిచిపెట్టరాదు. -
అయ్యో..మర్చిపోయా..
సాక్షి, హైదరాబాద్ : టిఫిన్ బాక్సులు, బ్యాగులు, పెన్నులు, బిరియానీ ప్యాకెట్.. వస్తువేదైతేనేం.. అయ్యో మరిచిపోయా అని అనుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందట.. మెట్రో జర్నీలో సిటీజనం తరచూ వస్తువులను మరిచిపోతున్నారట. అయితే.. వారి వస్తువులను మెట్రో సిబ్బంది భద్రంగా అప్పజెప్పుతున్నారు.. ఇందుకోసమే మెట్రో లాస్ట్ అండ్ ప్రాపర్టీ ఆఫీస్ పనిచేస్తోంది. నగరంలోని మెట్రో రూట్లలో నిత్యం 3 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.. వీరిలో నెలకు కనీసం 200 మంది తమ వస్తువులను పోగొట్టుకుంటున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రయాణ సమయంలో హడావుడి, సమయానికి ఆఫీసుకు చేరుకోవాలన్న తొందరలో చాలా మంది లగేజీ స్కానింగ్ యంత్రాల వద్దనే తమ వస్తువులను మరచిపోతున్నారట. అప్పజెప్పుతున్నారిలా.. లగేజీ స్కానర్ల వద్ద వస్తువులను మరిచిపోతే.. స్టేషన్ కంట్రోలర్ మైక్‌లో అనౌన్స్ చేస్తారు. అప్పటికీ.. సంబంధిత వ్యక్తులు రానట్లయితే.. వాటిని జాగ్రత్తగా ట్యాగ్ చేస్తున్నారు. 3రోజులపాటు సదరు స్టేషన్ కంట్రోలర్ రూమ్‌లో ఉంచుతున్నారు. ఆ వ్యక్తి అప్పటికీ స్టేషన్లో సంప్రదించని పక్షంలో.. వాటిని లాస్ట్ అండ్ ప్రాపర్టీ ఆఫీస్(ఎల్పీఓ)కు పంపుతున్నారు. ప్రయాణికులు మరచిపోయే వస్తువుల్లో ఆహార పదార్థాలు ఉంటే.. అవి చెడిపోయే ప్రమాదమున్నందున వాటిని మాత్రం ఎప్పటికప్పుడు పడేస్తారు. ఆభరణాలు మరిచిపోయారు.. ఇటీవల శివ అనే అతను మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఒక బ్యాగ్ మరచిపోయారు. మెట్రో సిబ్బంది ఆ బ్యాగ్‌ను భద్రపరిచారు. ఇందులో సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. ఈ బ్యాగును సదరు ప్రయాణికునికి అప్పజెప్పినట్లు మెట్రో అధికారులు తెలిపారు. అదే సమయంలో పర్సులో ఇమిడే కత్తులు, ఇతర మారణాయుధాలు, డ్రగ్స్ తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించే విషయంపై మెట్రో భద్రతా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని కోసం లగేజీ స్కానింగ్ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. అలాగే.. మద్యం తాగి వచ్చేవారికి భద్రతా సిబ్బంది నో ఎంట్రీ చెబుతున్నారు. ప్రయాణికున్ని క్షుణ్ణంగా తనిఖీ చేసే సమయంలో మద్యం వాసన గుప్పుమంటే సదరు మందుబాబులను వెనక్కి పంపేస్తున్నారు. -
కాంబో కథ కంచికేనా?
సాక్షి, సిటీబ్యూరో: మేడిపల్లికి చెందిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ నిపుణుడు. హైటెక్ సిటీలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగి. మెట్రో రాకముందు ప్రతిరోజు క్యాబ్‌లో వెళ్లేవాడు. ఉప్పల్ నుంచి అమీర్‌పేట్ మీదుగా హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత... అతని రవాణా సదుపాయాల్లో మార్పులు వచ్చాయి. మేడిపల్లి నుంచి ఉప్పల్ క్రాస్‌రోడ్స్ వరకు సిటీ బస్సులో వస్తాడు. అక్కడి నుంచి మెట్రోలో హైటెక్ సిటీకి వెళ్తాడు. ఇందుకోసం అతడు రెండుసార్లు టికెట్ తీసుకోవాల్సి వస్తోంది. తిరుగు ప్రయాణంలో హైటెక్ సిటీ నుంచి ఎంఎంటీఎస్ రైలులో సికింద్రాబాద్ వరకు వస్తాడు. అక్కడి నుంచి సిటీ బస్సు/మెట్రోలో వెళ్తాడు. ఈ మూడు రకాల ప్రయాణాలకు మూడు టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పైగా ఎంఎంటీఎస్ స్టేషన్లో, మెట్రో స్టేషన్లో టికెట్ కోసం కొంత సమయం వెచ్చించక తప్పదు. ఇది ఒక్క శ్రీకాంత్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. చాలామంది ప్రయాణికులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఒక రకమైన రవాణా సదుపాయం నుంచి మరో రకమైన రవాణా సదుపాయంలోకి మారేందుకు ఒకే టికెట్‌పై ప్రయాణం చేసే అవకాశం లేకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. పైగా ప్రయాణికులు కొన్ని రాయితీలు, సదుపాయాలనూ కోల్పోవాల్సి వస్తోంది. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్.. ఈ మూడింటిలోనూ పనిచేసే విధంగా కామన్ టికెట్ ప్రవేశపెట్టాలని సంకల్పించినప్పటికీ... అది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇది అమల్లోకి వస్తే ప్రయాణికులకు ఉమ్మడి రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. ప్రయాణం ఏకీకృతం గ్రేటర్ ప్రజా రవాణాలో ఇప్పటికీ ఆర్టీసీనే అతి పెద్ద సంస్థ. సుమారు 3,850 బస్సులతో ప్రతిరోజు 32లక్షల మందికి పైగా రవాణా సదుపాయం అందజేస్తోంది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన మార్గాల్లో అనివార్యంగానే కొన్ని ట్రిప్పులను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లికి వెళ్లే మార్గంలో ఏసీ బస్సులను ఉపసంహరించుకున్నారు. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే ఏసీ బస్సులు కూడా దాదాపు రద్దయ్యాయి. మెట్రో రైలుకు సమాంతరంగా ఉన్న మార్గాల్లో సిటీ బస్సులకు కొంతమేర ఆక్యుపెన్సీ తగ్గింది. ప్రస్తుతం మెట్రో రైళ్లలో ప్రతిరోజు 3లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు తిరుగుతున్నాయి. రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అలాగే మరో 5లక్షల మంది ఆటోరిక్షాలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.3 లక్షల ఆటోలు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. అయితే అన్ని రకాల ప్రజా రవాణా సాధనాల్లో రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా ఒకే స్మార్ట్ కార్డు (కామన్ టికెట్)ను అందుబాటులోకి తేవాలని ఏడాది క్రితమే ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ తరహా అన్ని రవాణా సదుపాయాల్లో వినియోగించుకొనే స్మార్ట్‌కార్డును తయారు చేసి అందజేసేందుకు అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటిచింది. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. రాయితీలతో ప్రయోజనం ఆర్టీసీ, మెట్రో కంటే ఎంఎంటీఎస్‌లో ప్రయాణం ఎంతో చౌక. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు కేవలం రూ.10. ప్రయాణం చేసే దూరాన్ని బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు ఎంఎంటీఎస్ నెలవారీ పాస్‌లు ఉన్నాయి. కానీ అన్ని రూట్లలో ఎంఎంటీఎస్ లేదు కదా! అలాగే స్మార్ట్‌కార్డులపై మెట్రో 10 శాతం రాయితీ అందజేస్తోంది. ఏరోజుకారోజు టికెట్ తీసుకొని ప్రయాణం చేయడం కంటే.. ఇది ఎంతో ప్రయోజనం. సిటీ బస్సుల్లోనూ వివిధ రకాల పాస్‌లు ఉన్నాయి. రోజువారీ టికెట్లపై 25శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఈ మూడు రకాల సదుపాయాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక స్మార్ట్‌కార్డు (కామన్ టికెట్) రూపంలో ఉమ్మడి ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తే... ప్రయాణికుడికి మూడు సదుపాయాలు లభించడమే కాకుండా వివిధ సంస్థలు అందజేసే రాయితీలతో చార్జీలు తగ్గే అవకాశం ఉంది. పైగా ఆన్లైన్ చెల్లింపుల వల్ల కూడా కొంత రాయితీ లభించవచ్చు. ప్రయాణికుడు ఏ రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకుంటే ఆ సంస్థ ఖాతాలోకి చార్జీలు జమయ్యే విధంగా ఈ కామన్ కార్డు ఉంటుంది. ప్రస్తుతం మెట్రో స్టేషన్లలో స్మార్ట్ కార్డులను వినియోగిస్తున్న ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ ఎంట్రీ గేట్ల తరహాలో ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సిటీ బస్సుల్లో అయితే ఈ తరహా సదుపాయాన్ని డోర్స్ వద్ద ఏర్పాటు చేస్తారు. లేదా కండక్టర్లకే ఆటోమేటిక్ టిక్కెట్ ఫేర్ కలెక్షన్ యంత్రాలను అందజేయాల్సి ఉంటుంది. -
మెట్రో రూట్లో ఊడిపడుతున్న విడిభాగాలు..
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ మెట్రో రైలు వేగానికి తరచూ బ్రేకులు పడుతున్నాయి. స్టేషన్లు, ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై ఏర్పాటు చేసిన విడిభాగాలు చిన్న గాలి దుమారానికే ఊడిపడుతున్నాయి. ఇక మెట్రో మార్గంలో సుమారు వంద వరకు ఉన్న భారీ హోర్డింగ్‌లు.. వాటిపై ఏర్పాటు చేసిన పీవీసీ ఫ్లెక్సీలు చిరిగి విద్యుత్ తీగలపై పడితే రైలు నిలిచిపోతోంది. తాజాగా శనివారం అసెంబ్లీ మెట్రోస్టేషన్ సమీపంలో మెట్రో ట్రాక్‌పై లైటనింగ్ అరెస్టర్ రాడ్(పిడుగు పాటును నిరోధించేది) ఊడిపడడంతో రైలును అరగంట పాటు నిలిపేయాల్సి వచ్చింది. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి కిందకు దించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఇరవై నెలల్లో సాంకేతిక సమస్యల కారణంగా సుమారు యాభై మార్లు మెట్రో రైళ్ల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. నగర మెట్రో రైళ్లలోని సాంకేతికత వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీటీసీలో లోపాలెన్నో.. డ్రైవర్ అవసరం లేని సాంకేతికత.. ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచే ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్ సిటీ ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకల నియంత్రణ.. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్(సీబీటీసీ) వ్యవస్థకు ఇప్పటి దాకా ఉన్న మంచిపేరు. లండన్, సింగపూర్ వంటి నగరాల్లో అమల్లో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు మన మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తోంది. వాతావరణంలో దుమ్ము, ధూళి కాలుష్యం పెరగితే ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే రూట్లో రెడ్ లైట్లు ఆన్ అవుతున్నాయి. దీంతో కొన్నిసార్లు రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. అంతేకాదు కొన్నిసార్లు గంటకు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లే రైళ్ల వేగం కాస్తా.. 25 కేఎంపీహెచ్‌కు పడిపోతోంది. ఇటీవల ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ రూట్లో 25 రెడ్ సిగ్నల్స్ ఒకేసారి వెలిగాయి. ఈ పరిణామంతో పలు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ఈ రెడ్‌లైట్‌లను మ్యాన్యువల్‌గా ఆఫ్ చేశారు. సాంకేతిక సమస్యలు బోలెడు నగరంలో తలెత్తే వాతావరణ మార్పులతో దుమ్ము, ధూళి కాలుష్యం ఘనపు మీటరు గాలిలో 100 మైక్రో గ్రాములు మించుతోంది. ఈ స్థాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారీ మెట్రో రూట్లలో రెడ్ సిగ్నల్స్ ఆన్ అవుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రోగ్రాముల లోపల ఉంటేనే సీబీటీసీ సాంకేతికత పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే, రెడ్‌లైట్లు ఆన్ అవుతుండడంతో మెట్రో రైలు రిస్టిక్టెడ్ మోడ్(నియంత్రిత స్థాయి)కు వస్తోంది. దీంతో కొన్నిసార్లు రైళ్లు నిలపాల్సి వస్తోంది. సీబీటీసీ సాంకేతిక అత్యాధునిక, అత్యంత భద్రమైనదని మెట్రో అధికారులు చెబుతున్నా గ్రేటర్ వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని హెచ్ఎంఆర్ అధికారులు ఈ సాంకేతికతను అందించిన థేల్స్(లండన్) కంపెనీకి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. గతంలో నాగోల్–అమీర్‌పేట్ రూట్లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ♦ మెట్రో రైళ్లు, స్టేషన్ల నిర్వహణను చూస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్ సంస్థ పనితీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో స్టేషన్లు, మెట్రో మార్గాల్లో ఏర్పాటు చేసిన భద్రతకు సంబంధించిన విడిభాగాలు చిన్న గాలికే ఊడి పడుతుండడంతో దీర్ఘకాలంలో ఎలాంటి విపత్తులు ఎదురవుతాయోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సాంకేతిక ఇబ్బందులే.. ♦ టిక్కెట్ వెండింగ్ యంత్రాలు నూతన రూ.50, రూ.100, రూ.10 నోట్లను స్వీకరించడం లేదు. ♦ నాలుగు పాత కరెన్సీ నోట్లతో కలిపి ఒక కొత్త నోటును యంత్రంలోకి ప్రవేశపెడితే పాతనోట్లు కూడా యంత్రంలోనే ఉండిపోతుండడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ♦ స్టేషన్ మధ్యభాగంలో ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ యంత్రాలుండే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద స్మార్ట్ కార్డులను స్వైప్‌చేస్తే కొన్నిసార్లు యంత్రాలు మొరాయిస్తున్నాయి. ప్రయాణికుల విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాయి. ♦ ప్లాట్‌ఫాంపైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ చెక్ వద్ద మొబైల్‌ను కూడా స్కానింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తుండడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ♦ మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతిరూట్లో ఆరు నిమిషాలకో రైలు అని ప్రకటించినా కొన్నిసార్లు 10–12 నిమిషాలకు పైగా పడుతోంది. ♦ సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే కనీసం 30 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేస్తున్నారు. ♦ హైటెక్‌సిటీ–అమీర్‌పేట్ రూట్లో మెట్రో అధికారులు ఎన్ని సాంకేతిక ఇబ్బందులున్నట్లు ప్రకటించినా.. ఈ మార్గంలో మెట్రో జర్నీ నత్తనడకను తలపిస్తోందని, తాము కార్యాలయాలకు వెళ్లడం ఆలస్యమవుతోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. ♦ పార్కింగ్ లాట్ వద్ద ద్విచక్ర వాహనానికి నెలవారీ పాస్ రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ రుసుం అధికంగా ఉండడంతో సిటీజన్లు మెట్రో పార్కింగ్ లాట్‌కు దూరంగా ఉంటున్నారు. ♦ మెట్రో కారిడార్‌లో పిల్లర్లకు లైటింగ్ లేకపోవడంతో ఈ రూట్లలో రాత్రి వేళల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. వర్షాకాలంలో లైటింగ్ లేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ♦ మెట్రోరైళ్ల గమనంలో సడన్బ్రేక్లు వేస్తుండడంతో ప్రయాణికులు తూలి పడిపోతున్నారు. ♦ రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని సార్లు శబ్దకాలుష్యం శృతిమించుతోందని కొందరు ప్రయాణికులు వాపోతున్నారు. ♦ స్టేషన్ల వివరాలను అనౌన్స్మెంట్ చేసే యంత్రాలు తరచూ మొరాయిస్తుండడంతో సరైన సమాచారం అందక, దిగాల్సిన స్టేషన్లో కాకుండా మరో స్టేషన్లో దిగి తలపట్టుకుంటున్నారు. -
మెట్రో రైలుకు తప్పిన ప్రమాదం,ఖండించిన మెట్రో రైల్ ఎండీ
హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలుకు శనివారం తృటిలో ప్రమాదం తప్పినట్లు వచ్చిన వార్తలను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఖండించారు. వివరాల్లోకి వెళితే.. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లాల్సిన మెట్రో రైలు పొరపాటున మరో ట్రాక్‌లోకి వెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలపై ఎన్వీఎస్ రెడ్డి వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ఇవాళ మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా ఈదురు గాలుల ధాటికి ట్రాక్‌పై రాడ్ పడిపోవడంతో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తున్న రైలు అసెంబ్లీ స్టేషన్ దాటి లక్డికాపూల్ వద్దకు రాగానే నిలిచిపోయింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ సందర్భంగా రైలులో ఉన్న ఓ ఆస్తమా పేషెంట్ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో, తోటి ప్రయాణికులు ఈ సమాచారాన్ని సిబ్బందికి తెలిపారు. దీంతో బ్యాటరీ పవర్ సాయంతో రైలును రివర్స్ తీసుకువెళ్లి అసెంబ్లీ స్టేషన్లో నిలిపారు. అయితే రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో రైలు వేరే ట్రాక్‌లోకి వెళ్లిందంటూ పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మెట్రో రైలుకు తప్పిన ముప్పు అంటూ వదంతులు వ్యాపించాయి. ప్రస్తుతం మెట్రో రైలు సేవలు యథాతథంగా నడుస్తున్నాయి. ప్రమాద వార్తను ఖండించిన మెట్రో రైలు ఎండీ కాగా మెట్రో రైలు ప్రమాద ఘటనపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. రాంగ్ రూట్లో మెట్రో రైలు వెళ్లిన వార్తలను ఆయన ఖండించారు. మరమ్మతుల కోసమే అరగంట పాటు మెట్రో సేవలలో ఇబ్బందులు తలెత్తినట్లు ఓ ప్రకటన చేశారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దంటూ సూచించారు. ‘వాస్తవాలు తెలియకుండా ఈ రకమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దు. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ గాలి పీడనం కారణంగా అసెంబ్లీ స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై మెరుపు అరెస్టర్ రాడ్ పడింది. ముందు జాగ్రత్త చర్యగా, ఓవర్ హెడ్ ఎలెక్ట్రికల్ పవర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. అలాగే పడిపోయిన రాడ్ తొలగించాం. రైలుకు ఓహెచ్ఈ (OHE) శక్తి లేకపోవడం, అది బ్యాటరీతో నడిచింది. మెట్రో రైలులో ఆస్తమాతో బాధపడుతున్నో ప్రయాణీకుడు ఫిర్యాదు చేయడంతో....ప్రయాణీకులను అసెంబ్లీ స్టేషన్ నుండి కొన్ని మీటర్ల దూరంలో ఖాళీ చేసి ప్లాట్‌ఫామ్‌కు తీసుకువెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా అరగంటపాటు మెట్రో సేవలను నిలిపివేయడం అయింది’ అని తెలిపారు. చదవండి: పట్టాలపై నిలిచిపోయిన మెట్రో -
పట్టాలపై నిలిచిపోయిన మెట్రో
హైదరాబాద్ : నగరంలోని మెట్రో ప్రయాణికులకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ సమీపంలో రైలు నిలిచిపోయింది. ఉదయం పూట కావడంతో మెట్రోలో జనాలు అధికంగా ఉన్నారు. మెట్రో ట్రాక్‌పై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడినట్టుగా సమాచారం. మెట్రో రైలు పట్టాలపై నిలిచిపోవడంతో పలువురు సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మెట్రోరైలు వైపు పరుగులు పెడుతున్న సిటీజనం
-
మెట్రోకు కాసుల వర్షం
సాక్షి, హైదరాబాద్: వాన.. మెట్రోకు కాసుల వర్షం కురిపించింది. శుక్రవారం భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్నీ గంటల తరబడి ట్రాఫిక్‌జామయ్యాయి. దీంతో ప్రయాణికులు మెట్రోబాట పట్టారు. గతంలో ఒక్కరోజే 2.89 లక్షల మంది ప్రయాణించినట్టు రికార్డు ఉండగా శుక్రవారం ఆ రికార్డును అధిగమించి 3.06 లక్షల మంది ప్రయాణించారు. ముఖ్యంగా నగరంలోని హైటెక్‌సిటీ, దుర్గంచెరువు, మాదాపూర్ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో కొన్నిగంటలపాటు ఓలా, ఊబెర్ సర్వీసులు నిలిచిపోయాయి. కొన్ని సాప్ట్వేర్ సంస్థలు కూడా రెగ్యులర్ బస్సు, కార్ సర్వీసులను రద్దు చేశాయి. ఐటీ ఉద్యోగులతోపాటు ఇతరులంతా మెట్రోలో ప్రయాణించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపారు. సమయం పొడిగించి రాత్రి 11–45 గంటల వరకు చివరి రైల్‌ను నడిపారు. దీంతో ఒకేరోజు రికార్డు స్థాయిలో మెట్రోలో ప్రయాణించిన వారి సంఖ్య పెరిగింది. వారానికి 8 వేల నుంచి 10వేలు.... మెట్రోకు ప్రజాదరణ బాగా పెరుగుతోంది. దీనిని రుజువు చేస్తూ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య ప్రతి వారం 8 వేల నుంచి 10 వేల వరకు పెరుగుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అధిక శాతం మంది ప్రతిసారీ క్యూలైన్లో నిల్చుని టికెట్ తీసుకునే అవసరం లేకుండా ప్రవేశపెట్టిన స్మార్ట్‌కార్డులను తీసుకుని ప్రయాణిస్తున్నారని అన్నారు. -
మరో ‘మెట్రో’
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ ఉద్యోగుల రద్దీ అధికంగా ఉండడంతో అమీర్‌పేట్ – హైటెక్‌సిటీ మార్గంలో అదనంగా మరో మెట్రో రైలును నడపనున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైటెక్‌సిటీ, దుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకునేందుకు వీలుగా పలు ఐటీ కంపెనీలు షటిల్ బస్సులను నడుపుతుండడంతో రద్దీ పెరిగింది. ప్రధానంగా తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ ఈస్ట్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండడంతో అదనపు రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11గంటల మధ్య ఈ రూట్లో సుమారు 14వేల మంది ఉద్యోగులు ప్రయాణిస్తుండడంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయని పేర్కొన్నారు. రద్దీ అధికంగా ఉండడంతో అదనపు రైలు ఏర్పాటు చేశామన్నారు. హైటెక్‌సిటీ వద్ద మెట్రో రైలు రివర్సల్ సదుపాయం పూర్తయ్యే వరకు అదనపు రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రస్తుతం రివర్సల్ సదుపాయం లేకపోవడంతో ప్రతి 8 నిమిషాలకో రైలు ఈ మార్గంలో అందుబాటులో ఉందన్నారు. జూలై చివరి నాటికి రివర్సల్ సదుపాయం పూర్తవుందని.. దీంతో రైళ్ల ఫ్రీక్వెన్సీని తగ్గిస్తామని తెలిపారు. ఆగస్టులో రాయదుర్గం (మైండ్‌స్పేస్ జంక్షన్) వరకు మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయని, ఈ మార్గంలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం నిత్యం ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – హైటెక్‌సిటీ రూట్లో 2.75 లక్షల మంది జర్నీ చేస్తున్నారని తెలిపారు. -
అవే తిప్పలు!
సాక్షి,సిటీబ్యూరో: మరో వారం రోజుల్లో రుతుపవనాలు సిటీని పలకరించనున్నాయి. ఈదురుగాలులు భారీగా వీచే ప్రమాదం పొంచి ఉంది.. ఈ తరుణంలో మెట్రో రైళ్లకు భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్ వాటిపైనున్న ఫ్లెక్సీలు గండంలా పరిణమించాయి. ఈదురుగాలులు వీచిన ప్రతిసారి ఫ్లెక్సీలు ఎగిరిపోయి మెట్రో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడుతుండడంతో తరచూ రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ఎల్భీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లలో ఇలాంటివి ఏకంగా 95 భారీహోర్డింగ్‌లు, యూనిపోల్స్ మెట్రో రైళ్లకు శాపంగా మారాయి. వీటిని తొలగించాలని కోరుతూ హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు బల్దియా అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ విషయమై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్యారడైజ్–బేగంపేట్ మార్గంలో ఓ భారీ ఫ్లెక్సీ చిరిగి మెట్రో మార్గంలోని ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడడంతో మెట్రో రైళ్లు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి. ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడిన ఫ్లెక్సీలను తొలగించడం మెట్రో రైలు అధికారులకు కత్తిమీద సాములా మారింది. హైటెన్షన్ తీగలు కావడం ..25 కెవి విద్యుత్ ప్రసారం అవుతుండటంతో సుమారు 5 కి.మీ మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో సుమారు 20–30 నిమిషాల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి ఫ్లెక్సీలను తొలగించాల్సి వస్తోందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆయా రూట్లలో మెట్రో రైళ్లు తరచూ నిలిచిపోతుండడంతో ప్రయాణీకుల విలువైన సమయం సైతం వృథా అవుతుండడం గమనార్హం. అనుభవాల నుంచి పాఠాలు నేర్వని వైనం.. గతంలో తార్నాక, మెట్టుగూడా, అమీర్‌పేట్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లకున్న ఫెక్సీలు చిరిగిపోయి మెట్రో రైలు ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాలపై అధ్యయనం చేసిన మెట్రో రైలు అధికారులు సుమారు 95 భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను గుర్తించారు. వీటిని వేరొకచోటికి తరలించాలని బల్దియా అధికారులకు పలుమార్లు విన్నవించారు. అయితే సదరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మెట్రో రైళ్ల రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణీకుల విలువైన సమయం వృథా అవుతోంది. తక్షణం ఆయా రూట్లలో భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను తొలగించాలని మెట్రో ప్రయాణీకులు,హెచ్ఎంఆర్ అధికారులు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ సైతం వీటిని తొలగించాలని బల్దియా యంత్రాంగానికి సూచించినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం. కాంబి టికెట్‌పై వీడని సందిగ్ధం... ఆర్టీసీబస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా కాంబిటికెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆయా విభాగాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. దీంతో కాంబిటిక్కెట్ అంశంపై నెలకొన్న సందిగ్ధం వీడడంలేదు. ఈ కాంబి టికెట్‌తో తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని..ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉండటంతో ఆర్టీసీ వర్గాలు విముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఏడు కోట్లు దాటిన మెట్రోప్రయాణికులు.. మెట్రో ప్రయాణీకులు ఏడు కోట్ల మార్క్‌ను దాటారు. గ్రేటర్ నగరంలో 2017 నవంబరు 29 నుంచి మెట్రో రాకపోకలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి నేటి వరకు సుమారు ఏడు కోట్ల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ప్రతివారం ఐదు వేల చొప్పున ప్రయాణికుల సంఖ్యలో పురోగతి ఉన్నట్లు పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం నాగోల్–హైటెక్‌సిటీ, ఎల్భీనగర్–మియాపూర్ రూట్లో నిత్యం 3 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారని తెలిపాయి. అధికారుల అంచనాల ప్రకారం ఈ రెండు రూట్లలో నిత్యం 6 లక్షలమంది రాకపోకలు సాగిస్తారని మెట్రో ప్రారంభానికి ముందు అంచనా వేయగా..అందులో సగం మార్కును దాటకపోవడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో వాణిజ్యకార్యకలాపాలు మెట్రో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి. లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి అవే తిప్పలు.. ఇక మెట్రో స్టేషన్ల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణీకులకు కష్టాలు తప్పడంలేదు. స్టేషన్లలో దిగి క్యాబ్‌లు, ఆటోల్లో ఇంటికి చేరుకునేందుకు రూ. వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. మెట్రో ఛార్జీలకంటే ఈ బాదుడు రెట్టింపు స్థాయిలో ఉంది. ఉదాహరణకు ఎల్భీనగర్ నుంచి మెట్రోరైలులో మియాపూర్ మెట్రో స్టేషన్లో దిగిన వ్యక్తి అక్కడి నుంచి లింగంపల్లికి క్యాబ్‌లో బయలుదేరితే సుమారు రూ.200 చెల్లించాల్సి వస్తోంది. మెట్రో టిక్కెట్ ఛార్జీ రూ.60 కాగా..క్యాబ్ చార్జీ అంతకు మూడింతలకు పైగానే ఉండడం గమనార్హం. గతంలో మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు మెర్రీ గో అరౌండ్ బస్సులను నడపాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఆచరణలో సాధ్యపడలేదు. దీంతో సిటీజన్లకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ తిప్పలు తప్పడంలేదు. -
హైదరాబాద్ మెట్రో మరో రికార్డ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు శుక్రవారం మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులో ఏకంగా 2.95 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి మరో అడుగు ముందుకేసింది. వీకెండ్ రోజుల్లో అత్యధికంగా సాధారణ ప్రయాణికులు సైతం తమ విందు, వినోదం, షాపింగ్‌ల కోసం మెట్రో స్టేషన్లను ఎంచుకుంటున్నట్లు తాజా లెక్కలు వెల్లడించాయి. వివిధ రకాల మాల్స్ ఏర్పాటైన అమీర్‌పేట స్టేషన్ నుండి శుక్రవారం ఒక్క రోజే 19 వేల మంది ప్రయాణికులు నమోదు కాగా.. ఇటీవలే ప్రారంభమైన హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి 17,201 మంది ప్యాసింజర్లు మెట్రో సేవలను ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేసే రోజుల్లో 2 మెట్రో రూట్లలో 2.65 మంది ప్యాసింజర్లు సగటున ప్రయాణాలు చేస్తుండగా, వీకెండ్లో మాత్రం రోజూ వచ్చిపోయే వారు కాకుండా సాధారణ ప్రయాణికులు (మెట్రో కార్డులు లేనివారు) మెట్రో సేవల వైపు మొగ్గుతుండటం శుభపరిణామమని హెచ్ఎంఆర్ పేర్కొంటోంది. వారానికి 5 వేలు అదనంగా.. రెండు మాసాల క్రితం వరకు వారానికి 4 వేల మంది ప్యాసింజర్స్ చొప్పున పెరిగిన మెట్రో గత 2 వారాల నుంచి 5 వేల మందికి పెరిగినట్లు ప్రకటించింది. ఇందులో సాధారణ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటాన్ని స్వాగతించింది. నగరంలో శుక్రవారం నాటి పరిస్థితి చూస్తే అమీర్‌పేట, హైటెక్ సిటీలతోపాటు ఎల్బీ నగర్లో 16 వేలు, మియాపూర్‌లో 14 వేలు, కేపీహెచ్బీలో 13 వేలు, ఉప్పల్‌లో 10 వేలు, పరేడ్ గ్రౌండ్లో 7 వేల మంది ప్రయాణాలు చేశారు. ఉప్పల్, పరేడ్‌గ్రౌండ్ స్టేషన్లలో జిల్లాల నుంచి వస్తోన్న ప్రయాణికుల సందడి అధికంగా కనిపిస్తోంది. లక్ష్యం సాధిస్తాం: ఎన్వీఎస్రెడ్డి, ఎండీ మెట్రో రైల్ హైదరాబాద్ మెట్రో ఆశించిన లక్ష్యం దిశగా పరుగులు పెడుతోంది. వారానికి 5 వేల మంది చొప్పున ప్రయాణికులు అదనంగా యాడ్ అవుతున్నారు. మెట్రో స్టేషన్లు నగరంలో మరో కొత్త హ్యాంగవుట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతున్నాయి. ఇప్పటికే అమీర్‌పేట స్టేషన్ పూర్తి వ్యాపార, వినోద కేంద్రంగా మారిపోయినట్లు ప్రయాణికుల లెక్కలే చెబుతున్నాయి. -
బస్తీకి బంద్?
సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: పాతబస్తీకి మెట్రో రైలు ప్రయాణం కలగానే మిగలనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. పనులు చేపట్టేందుకు ఇప్పటికే అలైన్మెంట్ (మార్గం) పరిశీలన జరిగినప్పటికీ సవాలక్ష సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎంజీబీఎస్ – ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు దాదాపు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. మరో 69 ప్రార్థనా స్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించాలి. పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే స్థలాన్ని సేకరించాలి. ఇవన్నీ నిర్మాణ సంస్థకు కత్తిమీద సాములా మారాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలో మెట్రో పనులు చేపట్టేందుకు ఎల్అండ్టీ విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆస్తుల సేకరణలో భాగంగా నష్టపరిహారం చెల్లించేందుకు దాదాపు రూ.100 కోట్లకు పైగా అవసరం. ఇక ఎంజీబీఎస్ – ఫలక్‌నుమా మార్గంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం.. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, షంషీర్గంజ్ ప్రాంతాల్లో ఐదు స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు రూ.1250 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. మరోవైపు ఆస్తుల సేకరణ ఆలస్యమైతే పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే స్థల సమస్యల కారణంగా ప్రాజెక్టు నిర్మాణ గడువు మరో రెండేళ్లు పెరిగే అవకాశం ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుంది. ఇక ఈ రూట్లో దాదాపు 69 ప్రార్థనా స్థలాలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా మెట్రో మార్గాన్ని బహదూర్‌పురా, కాలపత్తర్, ఫలక్‌నుమా మీదుగా మళ్లించాలని గతంలో డిమాండ్లు వినిపించిన విషయం విదితమే. ఈ సమస్యల కారణంగానే ఎల్అండ్టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా ఖర్చులతో రూ.4వేల కోట్లు నిర్మాణం వ్యయం పెరిగిందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని ఎల్అండ్టీ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మెట్రో కోసం పోరాటం... పాతబస్తీకి మెట్రో కోసం రాజకీయ పార్టీలు పోరాటం కూడా చేశాయి. అయితే ప్రాజెక్టు మార్కింగ్‌లకే పరిమితవగా, ఇప్పటి వరకు ఒక్క పిల్లర్ ఏర్పాటు కాలేదు. మూసీనదిలో ఎంజీబీఎస్ వద్ద మాత్రమే రైలు రివర్సల్ సదుపాయం కోసం రెండు పిల్లర్లు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో వెంటనే మెట్రో పనులను ప్రారంభించాలని కోరుతూ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ జాయింట్ యాక్షన్ కమిటీ గతంలో ఎన్నో ఆందోళనలు చేసింది. మజ్లిసేతర పార్టీల నాయకులందరూ ఏకమై 2017 నవంబర్ 21న జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ సహా మిగతా పార్టీల నాయకులు ఈ జేఏసీలో భాగమై పాతబస్తీలో మెట్రో అవసరం, ప్రాధాన్యాన్ని వివరిస్తూ హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 2017 డిసెంబర్ 17న మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో 2018 ఆగస్టు 25న మెట్రో రైలు అలైన్మెంట్ పనులను ప్రారంభించడానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు పాతబస్తీలో పర్యటించారు. గతంలో ప్రతిపాదించిన విధంగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు పనులు చేపట్టడానికి ప్రాజెక్టు అధికారుల బృందం మార్గాన్ని పరిశీలించింది. ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్‌చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరిబౌలి, శాలిబండ, సయ్యద్ అలీ ఛబుత్రా, అలియాబాద్, షంషీర్గంజ్ ద్వారా ఫలక్‌నుమా వరకు పనులు ప్రారంభిస్తామని హడావుడి చేసినా... ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. ఆలస్యం ఎందుకు? పాతబస్తీలో మెట్రో పనులు చేపట్టకపోవడం సరైంది కాదు. గతంలో మెట్రో పనులను మజ్లిస్ అడ్డుకోవడంతో ఆలస్యమైంది. ప్రస్తుతం మజ్లిస్ పనుల ప్రారంభానికి ముందుకొచ్చింది. ఇప్పుడు కూడా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రభుత్వం పాతబస్తీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.– ఇ.టి.నర్సింహ, జేఏసీ నాయకులు (సీపీఐ) పనులు ప్రారంభించాలి ముందుగా ప్రకటించినట్లుగానే దారుషిఫా నుంచే మెట్రో రైలు పనులు ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. గడువు లోగా మెట్రో పనులు ప్రారంభించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించాలి. – కె.వెంకటేశ్, జేఏసీ నాయకులు (కాంగ్రెస్) -
పర్యావరణ హితం మన మెట్రో
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పర్యావరణ పరిరక్షణకు మెట్రో రైళ్లు ఇతోధికంగా సాయపడుతున్నాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 6.8 కోట్ల మంది మెట్రో జర్నీ చేశారన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్రో రైళ్లతో నగర పర్యావరణానికి కలిగిన ప్రయోజనాలను ఆయన తెలిపారు. మెట్రోతో పర్యావరణ పరిరక్షణ ఇలా.. ♦ గత రెండేళ్లుగా మెట్రో రైళ్లలో 6.8 కోట్ల మంది ప్రయాణించారు. ♦ మెట్రో కారణంగా 57 కోట్ల కిలోమీటర్ల మేర కార్లు,ద్విచక్రవాహనాలు తిరిగే అవసరం తప్పింది. అంటే అన్ని కిలోమీటర్ల మేర ఆదా జరిగినట్లే. ♦ కార్లు, ద్విచక్రవాహనాల వినియోగం తగ్గడంతో 39000 టన్నుల కార్భన్‌డయాక్సైడ్ ఉద్గారాలను మెట్రో తగ్గించింది. ఆమేరకు ఉద్గారాలు పర్యావరణంలో కలవకుండా నిరోధించినట్లైంది. ♦ 1.7 కోట్ల లీటర్ల ఇంధనాన్ని మెట్రో రైళ్లతో ఆదా జరిగింది. ♦ మెట్రో రైళ్ల గమనంలో వేసే బ్రేకులతో ఉత్పత్తయిన శక్తితో 2.2 కోట్ల కిలోవాట్‌హవర్స్ మేర ఇంధనాన్ని ఉత్పత్తి చేశారు. ♦ మెట్రో మార్గాల్లో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా 2 కోట్ల లీటర్ల వర్షపునీటిని ఒడిసిపట్టారు. ♦ 12 మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. -
మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం..
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లకు ఫ్లెక్సీలు గండంగా మారాయి. తరచూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈదురుగాలులు వీచినప్పుడు ఫ్లెక్సీలు ఎగిరిపోయి మెట్రో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడుతుండడంతో రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ఇందుకు కారణమవుతున్న భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్ ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్ సీటీ రూట్లలో ఏకంగా 95 ఉన్నాయి. వీటిని తొలగించాలని హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) అధికారులు ఇప్పటికే పలుమార్లు జీహెచ్ఎంసీకి విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను తరలించే విషయంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆదివారం ఈదురు గాలులకు ఓ భారీ ఫ్లెక్సీ ఎగిరొచ్చి ప్యారడైజ్ – బేగంపేట్ మార్గంలోని మెట్రో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడింది. దీంతో మెట్రో రైళ్లు 20 నిమిషాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడుతున్న ఫ్లెక్సీలను తొలగించడం మెట్రో రైలు అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇవి హైటెన్షన్ (25 కేవీ) తీగలు కావడంతో దాదాపు 5 కి.మీ మార్గంలో విద్యుత్ సరఫరా నిలిపేయాల్సి వస్తోంది. 20–30 నిమిషాలు శ్రమించి ఫ్లెక్సీలను తొలగించాల్సి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తరచూ జరుగుతుండడంతో అటు ప్రయాణికులు, ఇటు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలోనూ... గతంలో తార్నాక, మెట్టుగూడ, అమీర్‌పేట్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లకు ఉన్న ఫ్లెక్సీలు చిరిగిపోయి మెట్రో రైలు ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాలపై అధ్యయనం చేసిన మెట్రో రైలు అధికారులు సుమారు 95 భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను గుర్తించారు. వీటిని వేరొ చోటుకు తరలించాలని బల్దియా అధికారులకు విన్నవిస్తూ లేఖలు రాశారు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాటికి స్పందించలేదు. దీంతో తరచూ మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికుల విలువైన సమయం వృథా అవుతోంది. తక్షణం ఆయా రూట్లలో భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను తొలగించాలని ప్రయాణికులు, హెచ్ఎంఆర్ అధికారులు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పని చేసిన కేటీఆర్ సైతంవీటిని తొలగించాలని బల్దియా యంత్రాంగానికి సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంగమనార్హం. -
ప్యారడైజ్-బేగంపేట మధ్య నిలిచిపోయిన మెట్రో సర్వీసులు
-
హైదరాబాద్ మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం తప్పడం లేదు. మరోసారి ఫ్లెక్సీలు మెట్రో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించాయి. ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు వీయడంతో ప్యారడైజ్-బేగంపేట మార్గంలో మెట్రో రైళ్ల వైర్లపై ఫ్లెక్సీలు పడ్డాయి. గాలులకు ఎగిరివచ్చిన ఫ్లెక్సీలు తీగలపై పడటంతో దాదాపు అరగంట పాటు రైళ్లు ఆగిపోయాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లెక్సీని తొలగించాక రైళ్లు యధావిధిగా నడస్తున్నాయని మెట్రో అధికారులు ప్రకటించారు. మెట్రో మార్గంలో భారీ ఫ్లెక్సీలు లేకుండా చూసుకుంటామన్న ప్రభుత్వ అధికారుల హామీ అమలుకు నోచుకోకపోవడంతోనే ప్రతిసారి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్యారడైజ్-బేగంపేట మధ్య నిలిచిపోయిన మెట్రో -
ఏడేళ్లలో సరాసరి రోజుకో పిల్లర్ నిర్మాణం
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో తొలి దశలో తుది ఘట్టం ఆవిష్కృతమైంది. ఎల్బీనగర్ – మియాపూర్, జేబీఎస్ – ఎంజీబీఎస్, నాగోల్ – హైటెక్ సిటీ మార్గాల్లో (66 కి.మీ) చిట్టచివరి పిల్లర్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ అరుదైన ఘట్టానికి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) చిరునామాగా నిలిచింది. ఇక్కడి మెట్రో స్టేషన్ సమీపంలోనే తుది పిల్లర్ (నెంబర్ 2599)ను ఇటీవల ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అనేక సవాళ్లు, ప్రతిబంధకాలు, ఆస్తుల సేకరణసమస్యలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని కారుచీకటిలోకాంతిపుంజంలా దూసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టు నగరంలో ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం కొనసాగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి పిల్లర్‌ను 2012 ఏప్రిల్ 19న ఉప్పల్ జెన్‌ప్యాక్ట్ (పిల్లర్ నెంబర్ 19) వద్ద ఏర్పాటు చేశారు. అప్పట్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఎలాంటి హడావుడి లేకుండా లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ... ఇటీవల ఎంజీబీఎస్ వద్ద ఏర్పాటు చేసిన చివరి పిల్లర్‌తో పూర్తయింది. తొలి దశలో భాగంగా పాతనగరం ఎంజీబీఎస్ – ఫలక్‌నుమా (6 కి.మీ) మినహా అన్ని రూట్లలో పిల్లర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవడంపై ఎన్వీఎస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెట్రో ప్రాజెక్టుల శకంలో ఏకంగా 66 కిలోమీటర్ల మార్గంలో అన్ని పిల్లర్లు ఏర్పాటు చేసిన ఎల్అండ్టీ సంస్థ ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. మెట్రో తొలి పిల్లర్ ఏర్పాటైనప్పటి నుంచి లెక్కిస్తే సరాసరి ఏడేళ్లలో రోజుకో పిల్లర్ ఏర్పాటు చేయడం మెట్రో ప్రాజెక్టు ఆవిష్కరించిన సరికొత్త రికార్డని హెచ్ఎంఆర్ తెలిపింది. కాగా పాతనగరంలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా (6 కి.మీ) మార్గం మినహా మెట్రో తొలి దశ ప్రాజెక్టు త్వరలో పూర్తికానుందని పేర్కొంది. ఇక మెట్రో పిల్లర్లను ప్రధాన రహదారి మధ్యలో, అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి రావడంతో పలు చోట్ల విభిన్న ఆకృతుల్లో అమర్చారు. మెట్రో ప్రాజెక్టును సాకారం చేయడంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ ఇంజినీరింగ్ హెడ్స్ ఎంపీ నాయుడు, శంకర్లింగం, కేఎం రావు, ఇతర ఇంజినీర్లు జియాఉద్దీన్, విష్ణువర్దన్‌రెడ్డి, రాజేశ్వర్, ఎ.బాలకృష్ణ తదితరులు విశేష కృషి చేశారు. సవాళ్లు, రికార్డులివీ... ♦ ప్రధాన రహదారులపై పిల్లర్ల ఏర్పాటుకు జాతీయ రహదారుల సంస్థ నుంచి అనుమతుల కోసం మూడేళ్లు, రక్షణ శాఖ అనుమతుల కోసం నాలుగేళ్లు, రైల్వే అనుమతులకు నాలుగేళ్ల సమయం పట్టింది. ♦ 3 వేల ఆస్తుల సేకరణకు 370 కేసులను ఎదుర్కొని విజయం సాధించారు. ♦ 380 చోట్ల 200 కి.మీ మార్గంలో హెచ్‌టీ, ఎల్టీ విద్యుత్ కేబుల్స్‌ను తరలించారు. 25 కి.మీ రూట్లో సీవరేజీ లైన్లు, వాటర్లైన్లు, 5 వేల విద్యుత్ స్తంభాలను తరలించారు. ♦ నిర్మాణ సమయంలో ఎదురైన అనేక ఆందోళనలను చర్చల ద్వారా పరిష్కరించారు. ♦ 2,100 భారీ వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్ విధానంలో వేరే చోటుకు తరలించి వాటిని పరిరక్షించారు. మెట్రో కారిడార్లలో 6 లక్షల మొక్కలు నాటారు. ♦ మియాపూర్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి వీలుగా వంపు తిరిగిన ప్రధాన రహదారిని సరళ మార్గంలో సవరించారు. ♦ హైదర్‌నగర్, నిజాంపేట్ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లేందుకు వీలుగా బైపాస్ దారులను ఏర్పాటు చేశారు. ♦ జేఎన్టీయూ ప్రాంతంలో దేవాలయాలను తరలించి వేరొక చోట నిర్మించారు. ♦ కేపీహెచ్‌బీ, మూసాపేట్ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను వేరొక చోటుకు తరలించారు. ♦ ఐడీఎల్ దర్గా వద్ద 50 ఫీట్ల దారిని 140 అడుగులకు విస్తరించారు. ♦ ఐడీఎల్ చెరువు వద్ద మతపరమైన కట్టడాలను వేరొక చోటుకు తరలించారు. ♦ బాలానగర్‌లో సర్వీసు రహదారిని ఏర్పాటు చేశారు. ♦ మలక్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ, బేగంపేట్ ప్రాంతాల్లో అనేక అడ్డంకులను అధిగమించారు. ♦ మూసాపేట్ ఆర్టీసీ డిపో వద్ద వరదనీటి కాల్వను డైవర్షన్ చేశారు. ♦ భరత్‌నగర్ వద్ద భారీ కూరగాయల మార్కెట్‌ను వేరొక చోటుకు తరలించారు. ♦ సుందర్‌నగర్‌కాలనీ వద్ద సర్వీసు రహదారిని విస్తరించారు. ♦ ఈఎస్ఐ ఆస్పత్రి, విజయలక్ష్మి థియేటర్ వద్ద సర్వీసు రహదారిని విస్తరించారు. ♦ ఎస్ఆర్నగర్ మక్బరా వద్ద 50 ఫీట్ల దారిని 140 అడుగులకు విస్తరించారు. ♦ అమీర్‌పేట్ కాజ్‌వేను భారీగా విస్తరించి ఇంటర్‌ఛేంజ్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. ♦ ఖైరతాబాద్ ఏడుగుళ్ల కూడలి వద్ద బైపాస్‌రోడ్డు ఏర్పాటుచేసి భారీ మెట్రో స్టేషన్‌ను నిర్మించారు. ♦ రవీంద్రభారతి జంక్షన్ నుంచి పోలీస్‌కంట్రోల్ రూమ్ మార్గంలో అమరవీరుల స్తూపం, అసెంబ్లీ గౌరవానికి భంగం వాటిల్లకుండా మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేశారు. ♦ పబ్లిక్‌గార్డెన్ వద్ద నిజాం హయాంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ నాలాను దారిమళ్లించి పిల్లర్లు నిర్మించారు. ♦ ఎంజీబీఎస్ వద్ద దోభీఘాట్, ఆర్టీసీ వర్క్‌షాప్‌లను తరలించి భారీ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌ను నిర్మించారు. ♦ సుల్తాన్‌బజార్, బడీచౌడీ వద్ద వ్యాపారులతో సానుకూలంగా చర్చలు జరిపి మెట్రో పిల్లర్లు ఏర్పాటు చేశారు. వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ♦ గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ మార్గంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను అధిగమించారు. ♦ ఒలిఫెంటా బ్రిడ్జీతో పాటు పలు రైల్వే బ్రిడ్జీల వద్ద అనేక ఇంజినీరింగ్ సవాళ్లను ఎదుర్కొని పిల్లర్లను ఏర్పాటు చేశారు. మెట్రో పిల్లర్లు ఇవీ.. రకం సంఖ్య సాధారణ పిల్లర్లు 1569 కాంటీలీవర్ 224 స్టేషన్ పిల్లర్లు 602 సుత్తె ఆకృతి 51 పోర్టల్ పిల్లర్లు 153 మొత్తం 2,599 -
అందుబాటులోకి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రోరైల్ స్టేషన్
-
మెట్రో జర్నీ ఎంతో హాయి
నాంపల్లి: రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇంట్లోంచి బయటకు రావాలంటేనే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలో ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. నగరంలో ఎక్కువగా రవాణాకు ఆర్టీసీతో పాటుగా ఎంఎంటిఎస్ రైళ్లు, ఆటోలు, క్యాబ్, ఓలా వంటి వాహనాలు ఉన్నప్పటికి ప్రయాణంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. మెట్రో రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు మెరుగ్గా ఉండటం చేత రాకపోకలు సులభంగా సాగిస్తున్నారు. రద్దీగా మెట్రో రైల్వే స్టేషన్లు... మెట్రో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. స్టేషన్లలో ప్రయాణించే మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైలులో కూర్చోవడానికి కూడా వీలులేనంతగా ఎక్కేస్తున్నారు. సుదూర ప్రయాణమైనా నిల్చొని ప్రయాణిస్తున్నారు. మియాపుర్ నుంచి ఎల్బీనగర్కు వెళ్లే రైళ్లన్నీ రద్దీగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రైళ్లలో ఏసీని వినియోగించడం, రైల్వే స్టేషన్లలో లిప్టులు, ఎస్కలేటర్లు, మంచినీరు, ఏటీఎం, పార్కింగ్ వంటి సౌకర్యాలను సమకూర్చడంతోనే ఎక్కువ మంది మెట్రో రైళ్లలో ప్రయాణం సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో తగ్గిన జనం... ఎండలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గుతోంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చాలా వరకు బస్సులు ఖాళీగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోడ్లపై ఉండే బస్టాపుల పరిస్థితి అలాగే ఉంది. ఈ డొక్కు బస్సుల్లో ప్రయాణించలేమని పేర్కొంటున్నారు. బస్సు ఎక్కితే ఉక్కపోత తప్పదంటున్నారు. కిటికీలు సైతం సరిగా ఉండటం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు ఎప్పుడు రద్దీగా ఉంటాయో తెలియదు.. ఎప్పుడు ఖాళీగా వెళయో తెలియని పరిస్థితుల్లో సగటు ప్రయాణికుడు అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో మెట్రోలో డబ్బులు ఎక్కువైనా సరే ఏసీలో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణం ముగించుకుంటూ ఇంట్లోకి చేరుతున్నారు. ఎండలో ఎంతో హాయినిస్తోంది ఎండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయలేకున్నాం. ఆటోలో వెళ్తే వడగాల్పులు వీస్తున్నాయి. ఎండకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఆరోగాన్ని కాపాడుకోవాలంటే మెట్రో రైలు ఎంతో మేలు. అందుకే మెట్రో రైలులో వెళ్తాను. హాయిగా ఇంటికి చేరుకుంటాను. మరో పక్షం రోజులు పరిస్థితి ఇలానే ప్రయాణించక తప్పడం లేదు. – ప్రదీప్ కుమార్, ప్రయాణికుడు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా మెట్రో రైలు ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకుంటున్నా. అంతేకాదు ఎండకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా. సాధారణ రోజుల్లో ఆర్టీసీలో వెళితే ట్రాఫిక్ సమస్య వస్తుంది. వేసవి కాలంలో ఆర్టీసీలో ప్రయాణించే సదుపాయాలే ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రైలు నాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. – రషీద్, ప్రయాణికుడు -
మోనో వేస్ట్.. మెట్రోనే బెస్ట్
సాక్షి,సిటీబ్యూరో: జేఎన్టీయూ–గచ్చిబౌలి(17 కి.మీ)మార్గంలో మోనోరైలు ప్రాజెక్టు కంటే మెట్రో రైలు ఏర్పాటే బెస్ట్ అని టీఎస్ఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. ఒకవేళ మెట్రో కాదనుకుంటే ఎలివేటెడ్ మార్గం లో బస్‌ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్టీఎస్)ఏర్పాటు చేస్తేనే మేలని టీఎస్ఐఐసీ తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ రూట్లో మోనో రైల్ మార్గం ఏర్పాటుపై అధ్య యనం చేయాలని టీఎస్ఐఐసీకి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ నివేదిక సమర్పించింది. ప్రధానంగా మోనో రైల్లో జర్నీ చేసే ప్రయాణికుల సామర్థ్యం కంటే మెట్రో రైలు లేదా బీఆర్టీఎస్ మార్గం ఏర్పాటు చేస్తేనే గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాకు రాకపోకలు సాగించే ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుందని తాజా నివేదికలో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్(29 కి.మీ), గచ్చిబౌలి–శంషాబాద్(22 కి.మీ)మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమైనా..నిధుల కొరత నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టు ఎప్పటికి సాధ్యపడుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జేఎన్టీయూ–గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా మెట్రో రూటు ఇలా.. ఈ మార్గంలో మొత్తంగా 17 కి.మీ మార్గంలో మెట్రో రైలు లేదా ఎలివేటెడ్ మార్గంలో బస్‌ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్టీఎస్)ఏర్పాటుచేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని టీఎస్ఐఐసీ తాజా నివేదికలో పేర్కొంది. జేఎన్టీయూ–మియాపూర్–హైటెక్స్–కొత్తగూడ–కొండాపూర్–గచ్చిబౌలి రూట్లో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ మెట్రో మార్గం ఇదీ.. బీహెచ్ఈఎల్ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్ వరకు తీసుకొచ్చి ప్రస్తుత మెట్రో లైనులో కలిపేలా డీపీఆర్ సిద్ధమైంది. ఈ మార్గం మొత్తంగా 29 కి.మీ ఉంటుంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్ఎల్)లతోపాటు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. బీహెచ్ఈఎల్ దగ్గర మెట్రోరైలు ఎక్కితే చందానగర్ మీదుగా ఆల్విన్ క్రాస్ రోడ్డు వరకు జాతీయ రహదారిలో ప్రయాణం సాగుతుంది. తర్వాత హఫీజ్‌పేట వైపు తిరుగుతుంది. కొత్తగూడ, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, కాజగూడ, విస్పర్‌వ్యాలీ, టోలీచౌక్, రేతిబౌలి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్ మీదుగా లక్డీకాపూల్ చేరుకుంటుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న మెట్రోలైనులో కలుస్తుంది. ఇక మియాపూర్ నుంచి ఆల్విన్ కాలనీ వరకు కూడా మియాపూర్ ప్రధాన స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ లైనును అనుసంధానించేందుకు వీలుగా మియాపూర్ నుంచి ఆల్విన్ కాలనీ వరకు దాదాపు రెండు కిలో మీటర్ల మేర కొత్త లైను నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ కొత్త లైను పూర్తి చేస్తే బీహెచ్ఈఎల్ స్టేషన్లో ఎక్కిన ప్రయాణికుడు మియాపూర్ మీదుగా ఎల్బీనగర్ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు స్టేషన్‌ను మెట్రో జంక్షన్ స్టేషన్‌గా మార్చబోతున్నారు. బీహెచ్ఈఎల్ నుంచి ఒక వైపు ఎల్బీనగర్ వరకు, మరోవైపు గచ్చిబౌలి వరకు వెళ్లేలా రెండు రూట్లు ఏర్పడతాయి. గచ్చిబౌలి–శంషాబాద్ మెట్రో రూటు ఇదీ.. గచ్చిబౌలి–రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 22 కిలో మీటర్ల పొడవున మెట్రో లైనును నిర్మించడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీనిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. కాగా ఈరూట్లో గచ్చిబౌలి–రాయదుర్గం–బయోడైవర్సిటీ జంక్షన్–ఖాజాగూడా–తెలంగాణా పోలీస్ అకాడమీ–రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు ఏర్పాటుచేయనున్నారు. ఈ మార్గంలో బుద్వేల్ లేదా శంషాబాద్ ప్రాంతాల్లో 60 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో ఏర్పాటు కోసం కేటాయించనున్నారు. ఈ మార్గంలో హైస్పీడ్ రైలును నడపనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు విలువైన సమయం ఆదా కానుంది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు రెండోదశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా.. కాగా ప్రస్తుతం రెండోదశ ప్రాజెక్టుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినప్పటికీ గతంలో మరో ఐదు మార్గాల్లో రెండోదశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఈ కింది మార్గాల్లో మెట్రో అనుమానమే అన్న సందేహాలు వ్యక్తమౌతుండడం గమనార్హం. 1.ఎల్బీనగర్–హయత్‌నగర్ 2.ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 3.మియాపూర్–పటాన్చెరు 4.తార్నాక–ఈసీఐఎల్ 5.జేబీఎస్– మౌలాలి -
మెట్రో ప్రయాణీకులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. నగర వాసుల మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షటిల్ బస్సు సర్వీసులను ఎల్అండ్టీ మెట్రో సంస్థ ప్రారంభించనుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా స్టేషన్ల నుండి ఆఫీసులవరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని వివిధ ఐటీ కంపెనీలకు షటిల్ బస్సు సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చారు. -
మెట్రో స్టేషన్లలో 'ఈ' పాయింట్స్
సాక్షి,సిటీబ్యూరో: కాలుష్యం లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నగర మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ కార్లు, ఇతరవాహనాల చార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. పలు స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ కార్లు, బైక్‌ల చార్జింగ్ పాయింట్లను ఫిన్‌ల్యాండ్ ప్రభుత్వానికి చెందిన ఫోర్టమ్ బహుళ జాతి కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు గురువారం ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిస్టో పెంటినిన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ రోన్‌బ్లాడ్.. హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. విశ్వవ్యాప్తంగాపలు అభివృద్ధి చెందిన దేశాలుకర్బన ఉద్గారాల ఆనవాళ్లు లేకుండా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచుతున్నాయనిఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇటీవలే తమ సంస్థ భారత్‌లో పలు నగరాల్లో ఎలక్ట్రికల్ కార్ల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ నగరంలోని బేగంపేట్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ బైక్‌లు,ఆటోలు వాహనాల చార్జింగ్‌ను ఉచితంగా చేస్తుందన్నారు. కిలోమీటరుకు రూ.2 మాత్రమే ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్న తరుణంలో మెట్రో నగరాల సిటీజన్లు కాలుష్య అవస్థలు, ఇంధన భారం లేని ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రతి కిలోమీటర్‌కు ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తే రూ.2 మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఇక కారును చార్జింగ్ చేసుకునేందుకు 45 నుంచి ఒక గంట సమయం మాత్రమే పడుతుందన్నారు. కాగా, ప్రస్తుతం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మియాపూర్, బాలానగర్ మెట్రో స్టేషన్ల వద్ద మూడు ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ కేంద్రాల్లో ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలను మాత్రమే చార్జింగ్ చేస్తున్నామన్నారు. నగర మెట్రో ప్రాజెక్టులో ప్రవేశపెట్టిన వినూత్న సాంకేతిక విధానాల పట్ల ఆకర్షితులైన ఫోర్టమ్ కంపెనీ ప్రతినిధులు నగరంలో మరిన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో ఫోర్టమ్ ఇండియా ఎండీ సంజయ్ అగర్వాల్, అవధీష్ ఝా, హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్‌రాజు, ఎస్ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, జీఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మార్చిలో హైటెక్ సిటీకి మెట్రో
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్–హైటెక్ సిటీ (10 కి.మీ)మార్గంలో మార్చి మూడో వారంలో మెట్రో రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉన్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్గంలో కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ అధికారుల బృందం భద్రత పరీక్షలు నిర్వహిస్తోంది. సుమారు 18 రకాల పరీక్షలు కీలకదశకు చేరుకున్నట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. రైళ్లకు ప్రధానంగా లోడ్, స్పీడ్, ట్రాక్, ట్రాక్షన్, సిగ్నలింగ్ తదితర అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెట్రో రైళ్ల ఆలస్యం.. ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో బుధవారం విద్యుత్ సంబంధ అంతరాయాల కారణంగా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఒక చివరి నుంచి మరో చివరకు 52 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా..75 నిమిషాలు పట్టినట్లు ప్రయాణికులు వాపోయారు. పలు స్టేషన్లలో నిమిషానికి పైగా రైళ్లను నిలిపారు. రైళ్ల ఆలస్యం సర్వసాధారణమేనని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో వర్గాలు స్పష్టం చేశాయి. కాగా నిత్యం ఈ రూట్లో సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. -
స్పీడ్‌గా స్థిరాస్తి
సాక్షి,సిటీబ్యూరో: స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ మహానగరానికి దేశంలోనే ప్రత్యేకమైన స్థానం. ఎప్పుడూ సరికొత్త పోకడలతో విస్తరిస్తూనే ఉంది. భాగ్యనగరం పరిధిలో సొంత ఇల్లు ఉండాలని కల గనేవారు.. దాన్ని నెరవేర్చుకునేవారు ఎప్పటి కప్పుడు వస్తూనే ఉన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువ కావడంతో స్థిరాస్తి రంగం శరవేగంగా విస్తరిస్తూ ప్రభంజనంగా మారింది. దీంతో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా దండిగా ఆదాయం సమకూరుతోంది. గ్రేటర్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా గడిచిన తొమ్మిది నెలల్లో రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. కొంత కాలంగా గృహ, వాణిజ్య నిర్మాణాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. అదే స్థాయిలో కొనుగోలుదారుల్లోనూ ఆసక్తి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా గల ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు హైదరాబాద్ అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందడంతో ‘ఆఫీస్’ స్థలాలకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. నగర శివారులోని ఆదిభట్లలో టాటా ఏరోస్పేస్, టీసీఎస్ ఐటీ పరిశ్రమ నిర్మాణం, ముచ్చర్లలో ఫార్మాసిటీల నిర్మాణం స్థిరాస్తి రంగానికి మరింత ఊపునిచ్చాయి. మరోవైపు నగరం చుట్టూ కొత్తకొత్త టౌన్‌షిప్‌లు ఏర్పాటుతో పెద్ద ఎత్తున వాణిజ్య నిర్మాణాలకు కూడా డిమాండ్ ఏర్పడింది. దీంతో స్థిరాస్తి వ్యాపారులు భూయజమానులతో ఒప్పందం చేసుకుని స్థలాలను అభివృద్ధి చేస్తున్నారు. భూ యజమానుల వాటాకు కొంత వాణిజ్య స్థలాన్ని ఇవ్వడంతో పరిస్ధితులు మరింత సానుకూలంగా మారాయి. శివారు చుట్టూ డిమాండ్.. నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు ప్లాట్స్, ఫ్లాట్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇండిపెండెంట్ గృహాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి ఊపొచ్చింది. పలు ప్రాంతాల్లో ఈ ఏడాదిలో 20 వేల చదరపు మీటర్ల నుంచి లక్ష చదరపు మీటర్ల వరకు గల ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చింది. మరో 30 ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రెండేళ్ల క్రితం 8,704 భవన నిర్మాణాలకు అనుమతి లభించగా, గతేడాది మరో 15 వేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హయత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో ఇండిపెండెంట్ గృహాలకు, శేరిలింగంపల్లి, చందానగర్, యూసుఫ్‌గూడ, రామచంద్రాపురంలో అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల పంట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతుండడంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. స్థిరాస్తి లావాదేవీలు అంచనాలకు మించి పెరుగుతుండడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలనెలా పైకి ఎగబాకుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలాఖరుకు అంటే తొమ్మిది నెలల్లోనే ఆ శాఖకు రూ.3,045 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే రూ.584 కోట్ల ఆదాయం అధికంగా సమకూరినట్లు రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రం మొత్తంమీద ఈ ఆర్థిక సంవత్సరం రూ.4,21 కోట్ల ఆదాయం సమకూరగా ఒక్క గ్రేటర్ నుంచే రూ.3,045 కోట్ల ఆదాయం రావడం ఇక్కడి స్థిరాస్తి లావాదేవీల ప్రభంజనాన్ని సూచిస్తోంది. నగర పరిధిలో మొత్తం 46 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. స్థిరాస్తి రంగం లావాదేవీలతో పాటు రాబడిలో రంగారెడ్డి ఆర్వో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో మల్కాజిగిరి–మేడ్చల్, మూడో స్థానంలో హైదరాబాద్ (సౌత్), నాల్గో స్థానంలో హైదరాబాద్ ఆర్వోలు నిలిచాయి. అత్యధికంగా కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఫరూరుక్నగర్, మహేశ్వరం, గచ్చిబౌలి, చంపాపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మేడ్చల్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, గండిపేట పరిధుల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరిగాయి. స్థిరాస్తి రంగం ఇలా.. ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల పలు కంపెనీలు తరలివచ్చాయి. దీంతో వాటి సమీప ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం విస్తరించింది. కొండాపూర్, కోకాపేట్, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. ఈ ప్రదేశాలు ఐటీ కేంద్రాలకు చేరువలో ఉండడంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాయి. ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ వరకు కొనుగోలుకు ఐటీ ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారు. ♦ మెట్రో రవాణా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది దృష్టి ఉప్పల్ మార్గం వైపు పడింది. ఇక్కడి నుంచి వరంగల్ రహదారి మార్గంలో ఘట్కేసర్ వరకు వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. పశ్చిమంలోని ఐటీ కేంద్రానికి సైతం గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో ఉద్యోగులు ఇటువైపు ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ♦ జాతీయ రహదారి మీదున్న ఈ ప్రాంతానికి ఈ ఏడాది మెట్రో రవాణా సదుపాయం అందుబాటులోకి రావడంతో నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగింది. ♦ రైల్వే కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు నివాస ప్రాంతాలు విస్తరించాయి. మౌలాలి, తిరుమలగిరి, ఈసీఐఎల్, సైనిక్‌పురి, ఏ.ఎస్.రావునగర్, కొంపల్లి, శామీర్‌పేట, దమ్మాయిగూడెం, కాప్రా వరకు బహుళ అంతస్తుల నిర్మాణాల్లో వేగం పుంజుకుంది. ♦ ఐటీ కేంద్రానికి దగ్గరలో ఉన్న ‘అప్పా’ ప్రాంతంలో నిర్మాణాలు పెరిగాయి. బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, అప్పా వరకు అభివృద్ధి విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డు సదుపాయం ఉండడంతో ఎక్కడికైనా సులువుగా చేరుకునే వెలుసుబాటు ఉండడంతో ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. -
మెట్రో అలర్ట్
సాక్షి,సిటీబ్యూరో: మారణాయుధాలు, ప్రాణాంతక వస్తువులు ఇటీవల ఉప్పల్, మలక్‌పేట్, ఎల్బీనగర్ సహా పలు మెట్రో స్టేషన్లలో భద్రతా తనిఖీల్లో బయటపడడంతో మెట్రో అధికారులు అలర్ట్ అయ్యారు. శత్రుదుర్భేద్యంగా ఉన్న ఈ స్టేషన్లలో ఇటీవల పర్సులో ఇమిడిపోయే కత్తి.. చిన్నారుల ఆటబొమ్మలా కనిపించినా ప్రాణాలు తీసే తుపాకీ.. కుర్రకారును మత్తుతో చిత్తుచేసే హుక్కా గన్.. జనం ప్రాణాలను పొట్టనబెట్టుకునే రసాయనాలు.. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే లిక్విడ్స్.. డ్రగ్స్ వంటివి గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మారణాయుధాలు, మత్తు పదార్థాలను గుర్తించేలా స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణనివ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘మొబైల్ ట్రైనర్ వ్యాన్’గా పిలిచే దీన్ని ఆదివారం బేగంపేట్‌లోని హెచ్ఎంఆర్ కార్యాలయం వద్ద హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాహనాన్ని నేరుగా ఆయా స్టేషన్ల వద్దకు తీసుకెళ్లడంతో పాటు భద్రతా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎక్కడికక్కడే అవగాహన కల్పించే వెసులుబాటు ఉంది. దేశంలో ఇలాంటి ప్రయోగం నగర మెట్రో ప్రాజెక్టులోనే చేపట్టినట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ వ్యాన్ ద్వారా భద్రతా సిబ్బందికి హెచ్ఎంఆర్ఎల్ భద్రతా విభాగండీసీపీ బాలకృష్ణ నేతృత్వంలో శిక్షణనివ్వాలని ఆదేశించారు. ఈ వాహనంలో టీవీసెట్స్, సీసీటీవీ కెమెరా, ఫైర్ ఎక్విప్మెంట్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లున్నాయి. ఇక స్టేషన్లలో భద్రతా విధులు నిర్వహిస్తున్న 900 మంది సిబ్బందికి ఆడియో–వీడియో చిత్రాలు, పీపీటీ ప్రజెంటేషన్లు, పోస్టర్లు, బోర్డ్స్, హ్యాండ్‌బుక్‌ల ద్వారా భద్రతా సమాచారాన్ని, తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. శిక్షణ ప్రక్రియను సైతం నేషనల్ కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ వాహనంలోని హార్డ్‌డిస్క్ అధునాతన జీపీఆర్ఎస్ సాంకేతికత ఆధారంగా పనిచేయనుంది. దీంతో ఈ వాహనం ఎక్కడ ఉంది.. ఏయే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తుందన్న అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇటీవలికాలంలో లెదర్ పర్సుల్లో ఉన్న కత్తులు, ప్రమాదాలకు ఆస్కారం కల్పించే రసాయనాలు, నిషేధిత డ్రగ్స్‌ను మెట్రో స్టేషన్లలో పలువురు ప్రయాణికుల వద్ద కనుగొనడంతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక మెటల్ డిటెక్టర్లు, డీఎఫ్ఎండీ స్క్రూటినీ తదితరాలను పకడ్బందీగా నిర్వహించాలని హెచ్ఎంఆర్ ఎండీ ఆదేశించారు. ఇటీవల మెట్రో స్టేషన్ల వద్ద నిర్వహించిన భద్రతా తనిఖీల్లో పట్టుబడిన మారణాయుధాలపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని హెచ్ఎంఆర్ భద్రతా సిబ్బందిని ఎన్వీఎస్రెడ్డి ఆదేశించారు. ప్రయాణికులతో స్నేహపూర్వక సంబంధాలు నెరుపుతూనే భద్రతను మరింతగా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ అధికారులు డీవీఎస్‌రాజు, లక్ష్మణ్, ఆనంద్ మోహన్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీఎన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నెలాఖరున హైటెక్ సిటీకి మెట్రో రైళ్లు అమీర్‌పేట్–హైటెక్‌సిటీ(10 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలను ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు హెచ్ఎంఆర్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల భద్రతా పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. హైటెక్ సిటీకి మెట్రోరైళ్లు కూత పెట్టనుండడంతో ఐటీ, బీపీఓ, కేపీఓ తదితర రంగాల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోకుండానే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. -
ఒక్కరోజే.. 2.25 లక్షల మంది మెట్రో జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించ డం వల్ల ఒకేరోజు 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లు నడిపారు. దీని కారణంగా ఒకేరోజు మెట్రోలో ప్రయాణించిన వారిసంఖ్య తొలిసారి 2 లక్షల మార్క్‌ను దాటిందని హెచ్‌ఎమ్మార్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో 1.65 లక్షల మంది, నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో సుమారు 60 వేల మంది మెట్రో ప్రయా ణం చేసినట్లు ఆయన వెల్లడించారు. అమీర్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, ఉప్పల్ స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయన్నారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12.30 గం. వరకు ఈ రద్దీ కొనసాగిందన్నారు. ఆరు నిమిషాలకో రైలు: రోజూ 1.50 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఎల్బీనగర్–మియాపూర్, అమీర్‌పేట్–నాగోల్ రూట్లలో ప్రతి ఆరు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. జనవరి నెలాఖరులోగా అమీర్‌పేట్–హైటెక్‌సిటీ (10 కి.మీ)రూట్లోనూ మెట్రోరైళ్ల వాణిజ్య రాకపోకలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ మార్గం ప్రారంభమయితే.. నిత్యం నగరంలో మెట్రో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య మూడు లక్షలు దాటుతుందని మెట్రోరైల్ అధికారులు అంచనావేస్తున్నారు. హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో పూర్తయితే ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ఈ రూట్లోని స్టేషన్ల నిర్మాణం, సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గం కూడా పూర్తయితే నిత్యం మూడు మార్గాల్లో సుమారు 16 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తారని మెట్రో అధికారులు అంచనావేస్తున్నారు. -
‘డబుల్’ వే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని కొన్ని మార్గాల్లో ఒక వరుసలో రోడ్డు, మరో వరుసలో మెట్రో రైలు మార్గాలు రానున్నాయా..? అంటే అన్నీ అనుకూలిస్తే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జైపూర్‌లోని ‘ఎలివేటెడ్ రోడ్, మెట్రో ట్రాక్’ తరహాలో ఒకే పిల్లర్లపై రెండు వరుసల్లో ఒక వరుసలో సాధారణ వాహనాల కారిడార్, మరో వరుసలో మెట్రో రైల్ ట్రాక్ నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. మెట్రో రెండో దశలో భాగంగా మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో ట్రాక్ రానుంది. ఇదే మార్గంలో ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన వివిధ పనులున్నాయి. ఎన్ఎఫ్సీఎల్ నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు దాదాపు 22 కి.మీ.ల మేర మేజర్ కారిడార్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్లు తదితర పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. వీటిల్లో టోలిచౌకి ఓయూ కాలనీ, బొటానికల్ గార్డెన్, నానల్‌నగర్, ఖాజాగూడ, గచ్చిబౌలి, కొండాపూర్, బయో డైవర్సిటీపార్క్, జీవీకే మాల్, మెహదీపట్నం తదితరమైనవి ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల ఇప్పటికే పనులు ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయం కలిగిన ఈ మేజర్ కారిడార్ పనుల్లో ఇప్పటికే దాదాపు రూ.800 కోట్ల మేర మంజూరై పనులు జరుగుతున్నాయి. ఈ మేజర్ కారిడార్ మార్గంలోనే మెట్రో రెండో దశ కూడా రానుండటంతో భూసేకరణ ఇబ్బందులు, ఖర్చు తదితరమైనవి పరిగణనలోకి తీసుకుని ఎస్సార్డీపీ పనుల ఫ్లై ఓవర్లు, మెట్రోట్రాక్‌లు వేర్వేరుగా కాకుండా రెండింటినీ రెండంతస్తుల్లో నిర్మిస్తే ఎలా ఉంటుందని సంబంధిత అధికారులు యోచించారు. జైపూర్‌లోని ఇలాంటి ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకొని నగరంలో సాధ్యాసాధ్యాలపై యోచిస్తున్నారు. వీలైన ప్రాంతాల్లో దిగువ వరుసలో ఎలివేటెడ్ కారిడార్, పై వరుసలో మెట్రో ట్రాక్ నిర్మించవచ్చునని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జీవీకే మాల్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.10, 12, మాసాబ్‌ట్యాంక్, ఎన్ఎండీసీ, మెహదీపట్నం మార్గంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కారిడార్‌లో రోజుకు సగటున రెండు లక్షల వాహనాలు ప్రయాణిస్తుండటటాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ, మెట్రోరైలు అధికారుల సంయుక్త సమావేశంలో దీనికి సంబంధించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. -
జంట నగరాల ప్రయాణికులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రయాణికులకు తీపికబురు. మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించడానికి కామన్ మొబిలిటీ కార్డ్(సీఎంసీ) త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై ఉన్నతాధికారులు బేగంపేటలోని హెచ్ఎంఆర్ఎల్ కార్యాలయంలో మంగళవారం చర్చలు జరిపారు. జంట నగరాల్లో కామన్ మోబిలిటీ కార్డ్ అమలుపై సమీక్షించారు. ఎస్బీఐ/హిటాచీ కన్సార్టియం ద్వారా దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం వారంలో ఎస్బీఐతో చర్చలు జరిపి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. 2019 జనవరి చివరికి కనీసం 100 ఆర్టీసీ బస్సులు, 50 ఆటోస్ మెట్రో క్యాంపెన్షన్ ప్రాంతాల ద్వారా 2 మెట్రో స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. పురోగతిని పరిశీలించిన తర్వాత జంట నగరాల్లోని అన్ని మెట్రో స్టేషన్లకు విస్తరించాలని యోచిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ) పురుషోత్తమ నాయక్, ఎస్బీఐ అధికారి ఓబుల్ రెడ్డి, ఆటో డ్రైవర్స్ యూనియన్ కన్వీనర్ ఖాన్, హెచ్ఎంఆర్ఎల్ సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
‘హైటెక్’కు వాయిదా!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ సిటీ వరకు మెట్రోరైలు నూతన సంవత్సరంలోనే పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో ఎస్ఆర్డీపీ పనుల కారణంగా రైళ్లు ఒక చివరి నుంచి మరో చివరకి వెళ్లి వెనక్కి వచ్చేందుకు రివర్సల్ ట్రాక్ సదుపాయం లేదు. దీంతో మెట్రో రైలు ఒక గమ్యం నుంచి మరో గమ్యస్థానానికి ఒకే ట్రాక్‌లో వెళ్లి తిరిగి అక్కడి నుంచి వచ్చేందుకు ట్విన్ సింగిల్‌ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే ఈ రూట్లో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలు ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ, మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్గానికి సంబంధించి రైలు వేగం, బ్రేకులు, కమ్యూనికేషన్‌బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్‌వ్యవస్థ, ట్రాక్, సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్ తదితర 18 రకాల భద్రతా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని పరీక్షల్లోనూ మెట్రో రైళ్లు విజయం సాధించినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ మార్గంలోని 8 స్టేషన్ల వద్ద కూడా మిగిలిన పనులను వడివడిగా పూర్తిచేస్తామని పేర్కొన్నాయి. ఈ రూట్లో మెట్రో స్టేషన్ల పరిస్థితి ఇదీ.. అమీర్‌పేట్–హైటెక్‌సిటీ రూట్లో మొత్తం 8 స్టేషన్లున్నాయి. ఇందులో మధురానగర్ స్టేషన్ వద్ద పనులు పూర్తిచేసి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇక యూసుఫ్‌గూడా స్టేషన్ వద్ద సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్‌నెం.5 స్టేషన్ వద్ద ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. పెద్దమ్మగుడి స్టేషన్ వద్ద పనులు తుది అంకానికి చేరుకున్నాయి. మాదాపూర్ స్టేషన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దుర్గం చెరువు స్టేషన్‌కు మెట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇక హైటెక్‌సిటీ స్టేషన్ పనులతోపాటు సుందరీకరణ పనులు పూర్తిచేయడంతో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. నిత్యం రెండు లక్షలమంది మెట్రో జర్నీ.. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ)మార్గంలో నిత్యం సుమారు 1.50 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవుదినాల్లో రద్దీ 1.95 లక్షల వరకు ఉంది. ఇక నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ)మార్గంలో నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణిస్తుండగా..సెలవురోజుల్లో రద్దీ 80 వేల వరకు ఉంటుంది. అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్లు జనవరిలో అందుబాటులోకి వస్తే నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య మూడులక్షల మార్కును దాటే అవకాశాలున్నట్లు మెట్రో రైలు వర్గాలు అంచనావేస్తున్నాయి. జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గం వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు.ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో జనవరిలో పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరిలోగా మెట్రో మార్గాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. -
అమీర్‌పేట్–హైటెక్‌సిటీ రూట్లో ట్రయల్ రన్ షురూ
సాక్షి,సిటీబ్యూరో: నగర ప్రజలకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చి నవంబర్ 29 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మెట్రో మరో మైలు రాయిని అందుకునేందుకు సిద్ధమైంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న హైటెక్‌సిటీ రూట్లో రైళ్లు వచ్చేనెలలో పరుగులు తీయనున్నాయి. ఇందుకోసం గురువారమే అమీర్‌పేట్–హైటెక్ సిటీ(10 కి.మీ) రూట్లో ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఈ ట్రయల్ రన్‌ను హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మార్గంలో మెట్రో రైళ్లలో ప్రయాణించి రైళ్ల సామర్థ్యం, ఇతర సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 10 కి.మీ. దూరం ఉండే ఈ మార్గంలో మధురానగర్(తరుణిమెట్రో స్టేషన్), యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్‌నెం.5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ పేర్లతో మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించామని, ఆస్తుల సేకరణ కోసం సుదీర్ఘ న్యాయ పోరాటంచేయాల్సి వచ్చిందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రూట్లో ట్రైడెంట్ హోటల్ ప్రాంతంలో రైలు రివర్సల్ సదుపాయం ఏర్పాటు చేసేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందన్నారు. అప్పటి దాకా ‘ట్విన్ సింగిల్ లైన్ మెథడ్’ విధానంలో రైళ్లు హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెనక్కి వస్తాయని వివరించారు. మెట్రో రైళ్లకు రెండువైపులా ఇంజిన్లు ఉండడంతో ఇది పెద్ద సమస్య కాబోదన్నారు. నగర మెట్రో రైలు వ్యవస్థలో సంప్రదాయ రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు అధునాతన కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ వ్యవస్థ అందుబాటులో ఉండడంతో ఈ విధానంలో రైళ్లను నడపడం తేలికేనన్నారు. నగర మెట్రో ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమని ఎల్అండ్టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి తెలిపారు. ఈ ట్రైల్ రన్లో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్‌రాజు, ఎస్ఈ విష్ణువర్థన్‌రెడ్డి, ఎంపీ నాయుడు, బాలకృష్ణ, ఎ.కె.షైనీ తదితరులు పాల్గొన్నారు. ఏడాదిగా 3.20 కోట్ల మంది జర్నీ గతేడాది నవంబరు 28న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా మెట్రో ప్రారంభమై మరుసటి రోజు నుంచి నగరవాసులకు మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.గురువారానికి మెట్రో అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో 3.20 కోట్ల మంది మెట్రోల్లో జర్నీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నాగోల్–అమీర్‌పేట్ (17కి.మీ), ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ) రూట్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు మార్గాల్లో సరాసరిన నిత్యం 2 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. డిసెంబర్ నెలలో హైటెక్‌సిటీ మెట్రో మార్గం ప్రారంభమైతే రద్దీ మరో లక్ష వరకు పెరుగుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జేబీఎస్–ఎంజీబీఎస్(10కి.మీ) మార్గంలోనూ మెట్రో ప్రారంభమవుతుందన్నారు. 2019 చివరి నాటికి పాతనగరానికి సైతం మెట్రో రైళ్లు వెళతాయని స్పష్టం చేశారు. మెట్రో రెండోదశకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. -
హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన గృహిణి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఎన్టీఆర్ నగర్‌కు చెందిన స్వప్న అనే గృహిణి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో స్వప్న చెయి విరగడంతో పాటు.. స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈజీ జర్నీ
సాక్షి,సిటీబ్యూరో: మహానగర వాసులకు ప్రయాణ సదుపాయాలు మరింత చేరువయ్యాయి. తక్కువ సమయంలోనే ప్రజలు ప్రజా రవాణాను అందుకోగలుగుతున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, విస్తృతమవుతోన్న మెట్రో రైళ్ల సేవలతో ప్రయాణ సదుపాయాలు మెరుగుపడుతున్నట్లు ‘ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్, ఓలా థింక్ ట్యాంక్’ సంస్థల తాజా అధ్యయనంలో వెల్లడైంది. క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాక నగరంలో ప్రయాణం కోసం ఎదురు చూసే సమయం బాగా తగ్గిపోయినట్టు ఆ సంస్థలు గుర్తించాయి. అతి తక్కువ కాలినడక దూరంలో ప్రయాణ సదుపాయాలు గల నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఈ అంశంలో ఢిల్లీ, ముంబై నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, మూడో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఓలా సంస్థ దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, తిరువనంతపురం తదితర 20 నగరాల్లో ప్రయాణ సదుపాయాలపై ఇటీవల సర్వే నిర్వహించింది. మొత్తం 43 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నివేదికను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు రోజుల క్రితం వెల్లడించారు. పర్యావరణ ప్రియమైన రవాణా సదుపాయాలను ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారని, అతి తక్కువ సమయంలో, కాలుష్యం, వాహనాల రద్దీ లేని రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందజేయడంపై రవాణా సంస్థలు, ప్రజా రవాణా రంగంలో ఉన్న భాగస్వామ్య సంస్థలు దృష్టి సారించాల్సి ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రజారవాణాయే ప్రధానం.. ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన మార్గాలు, నగరంలో అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు, ప్రజల కొనుగోలుశక్తి, సంస్కృతి, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేశారు. ఓలా చేసిన సర్వే ప్రకారం హైదరాబాద్‌లో ప్రయాణ సదుపాయాల కల్పనలో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్లే ప్రధాన ప్రజారవాణా సాధనాలుగా నిలిచాయి. నగరంలో (సొంత వాహనాల్లో ప్రయాణం చేసేవారు కాకుండా) అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను వినియోగించుకుంటున్న వారిలో 64 శాతం మంది బస్సులు, రైళ్లను ఎంపిక చేసుకుంటుండగా, 33 శాతం మంది షేర్ క్యాబ్‌లను వినియోగిస్తున్నారు. మిగతావారు ఆటోలు వంటి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సుమారు 3,850 బస్సులతో నగరంలోని అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలను అందజేసే సామర్థ్యం ఉన్న ఆర్టీసీకి 87 శాతం వినియోగదారులు ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. నగరంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా సరే కేవలం 15 నిమిషాల కాలినడక దూరంలో ప్రజా రవాణాను చేరుకోగలుగుతున్నట్టు సర్వేలో గుర్తించారు. పర్యావరణ సహిత వాహనాలకే జై.. మరోవైపు నగరవాసులు ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్, సీఎన్జీ వంటి ఇంధనాలను వినియోగించే పర్యావరణ ప్రియమైన వాహనాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో పర్యారవణ ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. 2030 నాటికి నగరంలో పూర్తిగా ఈ తరహా సదుపాయాలు అందుబాటులోకి రాగలవని చాలామంది విశ్వాసం వ్యక్తం చేశారు. సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసుల్లో పయనిస్తున్న వారిలో 50 శాతం మేర పాస్‌లు, స్మార్ట్ కార్డులనే వినియోగిస్తున్నారు. ఇటీవల మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్‌కార్డుల వినియోగం బాగా పెరిగింది. అలాగే ఎంఎంటీఎస్ రైళ్లలోనూ ఉద్యోగులు, రెగ్యులర్‌గా రాకపోకలు సాగించేవారు నెలవారీ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ‘‘ప్రయాణ సదుపాయాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇది కీలకమైన మలుపు కానుంది’’ అని ఓలా సహ వ్యవస్థాపకులు, సీఈఓ భవీష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. రవాణా రంగంలో అద్భుతమైన ప్రాజెక్టులు చేపట్టేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
బైక్ భళా... క్యాబ్ దివాలా!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు రాకతో నగరంలో క్రమంగా రవాణా సదుపాయాల ముఖచిత్రం మారుతోంది. అతి పెద్ద ప్రజా రవాణా సంస్థగా వెలుగొందే ఆర్టీసీ ఇప్పటికే ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో ఏసీ సర్వీసులను తగ్గించింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ఈ రూట్లో ఆర్టీసీ ఆక్యుపెన్సీ తగ్గుముఖం పట్టింది. తాజాగా క్యాబ్‌లు సైతం సిటీ బస్సుల బాటలో నడుస్తున్నాయి. రాత్రింబవళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండే ఓలా, ఉబర్ తదితర సంస్థలకు చెందిన క్యాబ్ సర్వీసులకు ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో 30 శాతం వరకు డిమాండ్ పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ రూట్లో క్యాబ్ డ్రైవర్లు బుకింగ్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. మెట్రో రైలునడిచే ఉప్పల్ –సికింద్రాబాద్–అమీర్‌పేట్ రూట్లో కొంతకాలంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్లు ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో దివాలా తీశారు. మరోవైపు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు క్యాబ్ డ్రైవర్లను మరింత కుంగదీశాయి. దీంతో ఎల్బీనగర్–మియాపూర్ రూట్ అంటేనే డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు. భారీగా పెరిగిన డీజిల్ ధరల కారణంగా ప్రతి నెలా ఇంధనం వినియోగంపైన కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకవైపు బుకింగ్‌లు లేక, మరోవైపు ఆదాయం బాగా పడిపోయి, ప్రయాణికుల ఆదరణ కొరవడుతూండడంతో క్యాబ్ డ్రైవర్లు సైతం రూట్ మారుస్తున్నారు. ఎల్బీనగర్–అమీర్‌పేట్–కూకట్పల్లి–మియాపూర్ మార్గంలో క్యాబ్ బుకింగ్‌లు తగ్గిపోవడంతో డ్రైవర్లు నగర శివార్ల వైపు దృష్టి సారిస్తున్నారు. మరికొందరు ఓలా, ఉబెర్ భాగస్వామ్యం నుంచి వైదొలగి దూరప్రాంతాలకు సర్వీసులను నడుపుతున్నారు. నిజానికి ఎల్బీనగర్–మియాపూర్ ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న రూట్. ఆర్టీసీ బస్సులే కాకుండా ఆటోలు, క్యాబ్‌లకు ఎంతో డిమాండ్ ఉండేది. కానీ మెట్రో రాకతో ఈ రూట్లో దూరం బాగా తగ్గిపోయింది. పైగా ప్రయాణికులు ఎలాంటి అలసట, ఒత్తిడి లేకుండా నిమిషాల్లో గమ్యం చేరగలుగుతున్నారు.‘ గతంలో ఈ రూట్లో ప్రతి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలకు ఒక బుకింగ్ చొప్పున లభించేది. ఇప్పుడు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది’ అని విస్మయం వ్యక్తం చేశారు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్దీన్. చాలా మంది డ్రైవర్లు క్యాబ్‌లను వదిలేసి ప్రత్యామ్నాయం వెదుక్కుంటున్నట్లు తెలిపారు. క్యాబ్‌ల స్థానంలో బైక్‌లు... అమీర్‌పేట్, పంజాగుట్ట, కూకట్పల్లి, తదితర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు చాలామంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులు క్యాబ్‌లను ఆశ్రయించేవారు. ఎల్బీనగర్–మియాపూర్, ఉప్పల్–అమీర్‌పేట్ వంటి మెట్రో సమాంతర మార్గాల్లో క్యాబ్‌లకు డిమాండ్ తగ్గినప్పటికీ ఐటీ కారిడార్లకు మాత్రం బాగానే ఉండేది. కానీ మెట్రో స్టేషన్ల నుంచి క్యాబ్ తరహాలో ఇప్పుడు బైక్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఈ ట్రాన్స్‌పోర్టు బైక్‌లనే ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ రద్దీ ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలను చేర్చే సదుపాయం బైక్‌ల వల్ల అందుబాటులోకి వచ్చింది. ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన సుమారు 500 బైక్‌లు ప్రస్తుతం మెట్రో స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బైక్‌లు ప్రతి రోజు 2000 నుంచి 3000 ట్రిప్పుల వరకు తిరుగుతున్నాయి. 3 కిలోమీటర్ల కనీస దూరం నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా బైక్ రైడింగ్ సదుపాయం వచ్చింది. అలాగే మెట్రో స్టేషన్లలో ఉండే ‘ మై బైక్’లకు కూడా క్రమంగా డిమాండ్ ఏర్పడుతుంది. మియాపూర్, పంజగుట్ట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ స్టేషన్లలో 60 మై బైక్‌లను అందుబాటులో ఉంచారు. ఇదీ పరిస్థితి... ♦ ఉప్పల్–సికింద్రాబాద్–అమీర్‌పేట్–మియాపూర్ రూట్లో రాకపోకలు సాగిస్తున్న మెట్రో ప్రయాణికులు : 50 వేలు ♦ ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో మెట్రో సేవలను వినియోగించుకుంటున్న వాళ్లు : 1.25 లక్షలు ♦ మెట్రో వల్ల రద్దయిన ఏసీ బస్సుల ట్రిప్పులు:100 నుంచి 120 ♦ మెట్రో ప్రభావం వల్ల తగ్గిన క్యాబ్‌లు 30 శాతం మెట్రో స్టేషన్ల నుంచి నడిచే బైక్‌ల ధరలు... ♦ మొదటి 3 కిలోమీటర్లకు రూ.20. ♦ 3 నుంచి 5 కిలోమీటర్లకు రూ.30 ♦ 5 నుంచి 8 కిలోమీటర్లకు రూ.50 చాలా కష్టంగా ఉంది చాలామంది డ్రైవర్లు క్యాబ్‌లు నడిపేందుకు భయపడుతున్నారు. మెట్రో వల్ల డిమాండ్ తగ్గడం ఒక కారణమైతే, డీజిల్ ధరలు పెరగడం మరో కారణం. ఒకప్పుడు నెలకు రూ.9 వేల వరకు డీజిల్ కోసం ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు అది రూ.13 వేల వరకు పెరిగింది. బుకింగ్‌లు తగ్గిపోవడంతో ఆదాయం రావడం లేదు. పైగా ఇప్పుడు ఉన్న డ్రైవర్ల ఉపాధికి దిక్కులేదంటే ఓలా, ఉబెర్ సంస్థలు ఎడాపెడా కొత్త క్యాబ్‌లను చేర్చుకుంటున్నాయి. దీంతో మరింత నష్టపోవాల్సి వస్తోంది.– సలావుద్దీన్, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ -
మెట్రో ట్రాక్ దాటితే రూ.500 ఫైన్
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు పట్టాలపై ఒక వైపు నుంచి మరో వైపునకు దాటే ప్రయాణికులపై మెట్రో యాక్ట్ ప్రకారం రూ.500 జరిమానా, ఆరునెలల జైలుశిక్ష తప్పదని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ, వేగం పెరిగినందున పట్టాలను నేరుగా దాటేవారు ప్రమాదాల బారిన పడతారని ఆయన హెచ్చరించారు. ఇటీవల కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద కొందరు మెట్రో పట్టాలపై ఒక వైపు నుంచి మరోవైపునకు దాటినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్లాట్‌ఫారంపై ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లాలనుకునేవారు మెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులను వినియోగించి మధ్యభాగం(కాన్కోర్స్)కు చేరిన తర్వాతే మరో వైపునకు మారాలని సూచించారు. పలు మెట్రో నగరాల్లో పట్టాలు దాటుతూ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఎల్బీనగర్ స్టేషన్ నెం.1
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జర్నీకి గ్రేటర్ సిటీజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఒక్క ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచే అత్యధికంగా నిత్యం 30 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రారంభమైన రూట్లలో ఈ స్టేషన్లో ఎక్కి..దిగే ప్రయాణికులే అత్యధికం కావడం విశేషం. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో అత్యంత రద్దీ వేళల్లో ప్రతి 3.15 నిమిషాలకు ఒక మెట్రోరైలు నడుపుతున్నామని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు.ఈ ఏడాది సెప్టెంబర్ 24న ఈ మార్గంలో మెట్రోను ప్రారంభించిన విషయం విదితమే. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ, అదనపు సౌకర్యాలు తదితర అంశాలపై మంగళవారం రసూల్‌పురాలోని మెట్రో రైలు భవన్లో హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మార్గంలో స్థానికుల నుంచి చిన్న ఫిర్యాదులు మినహా ఎలాంటి అభ్యంతరాలు, అసౌకర్యాలు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. మెట్రో జర్నీ పట్ల స్థానికులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎల్భీనగర్–మియాపూర్ మార్గంలో నిత్యం 21 రైళ్లు, నాగోల్–అమీర్‌పేట్ రూట్లో నిత్యం 12 రైళ్లు మొత్తంగా 33 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఈ రెండు మార్గాల్లోనూ రద్దీ వేళల్లో ప్రతి 3.15 నిమిషాలకో రైలును నడుపుతున్నామని..సాధారణ వేళల్లో ప్రతి ఆరున్నర నిమిషాలకో రైలును నడుపుతున్నట్లు తెలిపారు. రద్దీ అత్యల్పంగా ఉండే సమయాల్లో ప్రతి 8 నిముషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తోందన్నారు. ఎల్బీనగర్– మియాపూర్ (కారిడార్–1)ల మధ్య ప్రతి రోజూ 284 ట్రిప్పులు, నాగోల్–అమీర్‌పేట్(కారిడార్3) రూట్లో నిత్యం 266 ట్రిప్పులు..మొత్తంగా రెండు మార్గాల్లో మొత్తం 550 ట్రిప్పుల ద్వారా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని ఎల్అండ్టీ మెట్రో ఎండీ కెవిబి రెడ్డి తెలిపారు. రికార్డు స్థాయిలో మెట్రో జర్నీ.. మెట్రో కారిడార్–1లో ప్రతి రోజూ సరాసరిన 1.25 లక్షల మంది ప్రయాణికులు, కారిడార్– 3లో 50 వేల మంది ప్రయాణిస్తున్నారని ఆయన అన్నారు. అక్టోబరు 22న రెండు మెట్రో కారిడార్లలో రికార్డు స్థాయిలో 1.90 లక్షలమంది ప్రయాణించారని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు సర్వీసులను ప్రజలు మరింత విరివిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనీల్ సైనీ, హైదరాబాద్ మెట్రో రైలు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
అత్యంత రద్దీగల మెట్రోస్టేషన్ ఎల్బీ నగర్!
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీ నగర్-మియాపుర్ మార్గంలో అత్యంత రద్దీ సమయంలో ప్రతి 3.15నిమిషాలకు ఒక మెట్రోరైలును నడుపుతున్నామని, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ప్రతినిత్యం అత్యధికంగా ప్రయాణిస్తున్నారని హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో భవన్, హెచ్ఎమ్ఆర్ఎల్, ఎల్ అండ్ టి మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎన్వీయస్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో కారిడార్ 1లోని ఎల్బీ నగర్-మియాపూర్‌ల నడుమ ప్రతిరోజు 21రైళ్లు, కారిడార్3లోని నాగోల్-అమీర్‌పేట్‌ల నడుమ 12రైళ్లు, మొత్తంగా 33 రైళ్లు నడుపుతున్నామని తెలిపారు. సాధారణ రద్దీ సమయంలో ప్రతి ఆరున్నర నిముషాలకొకసారి నడుపుతున్నట్లు,ఇతర సాధారణ సమయాల్లో ప్రతి ఎనిమిది నిమిషాలకొక మెట్రో రైలును నడుపుత్నుట్లు పేర్కొన్నారు. కారిడార్ 1లో 284 ట్రిప్పులు, కారిడార్ 3లో 266 ట్రిప్పులు మొత్తంగా 550 ట్రిప్పులతో ప్రయాణీకులను గమ్యస్థానానికి చేరుస్తున్నామని అన్నారు. కారిడార్ 1లో సగటున 1.25లక్షలు, కారిడార్ 3లో యాభై వేల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. మెట్రో సర్వీసులను ప్రజలు మరింత విరివిగా వినియోగించుకోవాలని కోరారు. -
మెట్రో: లేడీస్ సీట్లో కూర్చుంటే రూ.500 జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రో రైళ్లలో మహిళలకు కేటాయించిన సీట్లలో పురుషులు, ఇతరులు కూర్చుంటే వారికి రూ.500 జరిమానా తప్పదని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్లో మెట్రో అధికారులు, ఎల్ అండ్‌టీ ఉన్నతాధికారులతో జరిగిన సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే వారికి జరిమానా విధించాలని ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. ఈ విషయంలో ప్రతి మెట్రో బోగీలో ఎల్అండ్టీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు నిఘాను పెంచాలని ఆదేశించామన్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులు తమకెదురైన అసౌకర్యాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ వాట్సప్ నంబరు కేటాయించాలని ఎల్అండ్టీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లు, పరిసర ప్రదేశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటాలని, స్టేషన్ పరిసరాలను అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం మెట్రో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పోలీసు అధికారులతో ఒక ప్రత్యేక ఎన్ఫోర్స్ మెంట్ టీంను ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని అధికారులు ఎప్పటికప్పుడు మెట్రో ప్రయాణికులకు, పాదచారులకు ఎలాంటి అసౌకర్యం కలగనిరీతిలో కృషి చేయాలని అన్నారు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకూ, నాగోల్– అమీర్‌పేట్ వరకూ గల మెట్రోమార్గంలో మెట్రో స్టేషన్ల పరిసరాలలో ఇంకా మిగిలివున్న సివిల్ పనులన్నింటినీ వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే తగిన అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులను మెట్రో ఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్అండ్ టీ మెట్రోరైలు మేనేజింగ్ డైరక్టర్, కె.వి.పి.రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎల్అండ్టీ మెట్రోరైలు అనిల్ సహాని, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనందమోహన్, హైదరాబాద్ మెట్రోరైలు ఉన్నతాధికారులు విష్ణువర్థన్, బి.యన్.రాజేశ్వర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాలానగర్ స్టేషన్లో నిలిచిన మెట్రోరైల్
-
కరెంట్ లేక ఆగిన మెట్రోరైల్
సాక్షి, హైదరాబాద్ : మియాపూర్-అమీర్ పేట్ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణీకులతో బయలు దేరిన మెట్రోరైలు ఆకస్మాత్తుగా కూకట్పల్లి వై జంక్షన్‌లోని డాక్టర్ అంబేడ్కర్ బాలానగర్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. మెట్రో పవర్ ప్లాంట్‌లో సమస్య తలెత్తడంతోనే రైలు నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. ప్రయాణీకులు మాత్రం విద్యుత్ అంతరాయం వల్లనే రైలు మార్గ మధ్యలో ఆగిపోయిందని ఆరోపించారు. రైలు ఆగిపోవడంతో ఆందోళన చేపట్టిన ప్రయాణీకులకు అధికారులు వారి టికెట్ ధర చెల్లించి పంపించేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు మియాపూర్ నుంచి ఎర్రగడ్డ వరకు మెట్రోసేవలు నిలిచిపోయాయి. ఒక ట్రాక్ వైర్ తెగిపడిపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు స్పష్టం చేశారు. రెండో ట్రాక్‌పై రైల్లు నడుస్తున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించగానే పూర్తి సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు మరమత్తు చర్యలు చేపట్టారు. -
‘వరల్డ్ పీపుల్స్ చాయిస్’ రేస్‌లో మెట్రో
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఘనతను సాధించే విషయంలో హైదరాబాద్ మెట్రో ప్రపంచవ్యాప్తంగా పలు భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులతో పోటీపడుతోంది. ఇదే క్రమంలో తాజాగా లండన్‌కు చెందిన ఐసీఈ సంస్థ ప్రదానం చేసే పీపుల్స్ చాయిస్ అవార్డు సాధించేందుకు కేవలం 2 వేల ఓట్ల దూరంలో గ్రేటర్ మెట్రో నిలిచినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ అవార్డు రేసులో నగర మెట్రో ప్రాజెక్టుతో న్యూజిలాండ్‌లోని మరో భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు పోటీపడుతోందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ఓటు వేసేందుకు https://www.ice. org.uk/what&is&civil&engineering/what&do&civil&engineers&do/hyderabad&metro&rail&project లింక్‌ను క్లిక్ చేసి ఓటు వేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు. -
మెట్రో-2 టిక్కెట్ల ధరలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు సేవలు సోమవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ మార్గంలో మెట్రో రైలు సర్వీసును ప్రారంభించారు. మొదటి రోజు కావడంతో ఇందులో ప్రయాణించేందుకు భాగ్యనగర వాసులు అమితాసక్తి చూపారు. అయితే టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. టిక్కెట్లు ధరలు ఇలా.. ఎల్బీనగర్-మియాపూర్ రూ. 60 ఎల్బీనగర్-అమీర్‌పేట రూ. 45 ఎల్బీనగర్- ఖైరతాబాద్, నాంపల్లి రూ. 40 ఎల్బీనగర్- గాంధీభవన్, ఎంజీబీఎస్ 35 ఎల్బీనగర్- మలక్‌పేట రూ. 30 ఎల్బీనగర్- దిల్‌షుఖ్‌నగర్ రూ. 25 -
ప్రారంభమైన అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రోరైలు
-
మెట్రో సేవలను వినియోగించుకోవాలి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలు మెట్రో సేవలను వినియోగించుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విజ్ఞప్తి చేశారు. సోమవారం అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రో కారిడర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలుష్యం తగ్గాలంటే మెట్రో ప్రయాణమే మంచిదన్నారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఉండదన్నారు. మెట్రో ప్రయాణం వల్ల అంబులెన్స్‌లు సహా అత్యవసర సేవల ప్రయాణాలకు ఆటంకం కలగదని తెలిపారు. మెట్రో స్టేషన్లలో అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ఒక్క స్మార్ట్ కార్డ్ ద్వారా అన్ని సౌకర్యాలు పొందేలా చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులకు సూచించారు. డిసెంబర్ 15 లోగా హైటెక్ సిటీ మార్గాన్ని కూడా పూర్తి చేయాలని కోరారు. ఇది మన మెట్రో అని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలోనే బెస్ట్ మెట్రో.. దేశంలోనే హైదరాబాద్ మెట్రో బెస్ట్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రస్తుతం నగరంలో మెట్రో సేవలు 46 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రతి స్టేషన్ వద్ద పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. భద్రతా అనుమతులు వల్ల నెలరోజులు ఆలస్యమైందన్నారు. -
ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రోరైలు ప్రారంభం
-
ప్రారంభమైన ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రోరైలు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్-అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు ప్రారంభమైంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొని.. మెట్రోరైలులో ప్రయాణించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రోరైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతాచోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్ బస్ డిపో, మలక్‌పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ–ఎంజీబీఎస్ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్ మెట్రోలో ఎంతమంది ప్రయాణించారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ఎంతమందిని చేరవేసిందో తెలుసా? జంట నగర వాసుల ఆదరణతో ఇప్పటివరకు 20 మిలియన్ల (రెండు కోట్ల మంది) ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ట్విటర్లో వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను షేర్ చేసింది. 2017, నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధాని స్వయంగా ఇందులో ప్రయాణించారు. నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో తన పరుగును ఆరంభించింది. మెట్రో రైలుపై నగర వాసుల భారీ ఆసక్తితో ఆరంభంలోనే భారీ ఆదరణను దక్కించుకుంది. కిక్కిరిసిన జనంతో మెట్రో రైలు పెద్ద విశేషంగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎల్బీనగర్-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు సేవలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Hyderabad Metro Rail is a convenient mode of transportation for 20 million riders. Reaching here would not be possible without you. Thank you for trusting and travelling with us. #MeeMetro #20MillionPassengers #ManaMetro pic.twitter.com/GxCpqnGrs1 — L&T HydMetroRail (@ltmhyd) September 5, 2018 -
మెట్రో స్టేషన్లలో ‘సాక్షి’
-
మెట్రో స్టేషన్లలో ‘సాక్షి’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు ప్రతినిత్యం సాక్షి దినపత్రిక అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న 24 మెట్రో కేంద్రాలలో ప్రయాణికుల కోసం ఇకనుంచి ప్రతిరోజూ సాక్షి దినపత్రిక అందుబాటులో ఉంచే కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ఏర్పాటుచేసిన తొలి "సాక్షి స్టాల్"ను ఆయన ప్రారంభించారు. బుధవారం నుంచి అన్ని మెట్రో కేంద్రాల్లో సాక్షి దినపత్రిక ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అందుకోసం మెట్రో స్టేషన్లలోని ఫ్లాట్‌ఫామ్స్‌కు ఇరువైపుల సాక్షి స్టాల్స్ ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వేలాదిమందికి సాక్షి దినపత్రికను అందుబాటులో తేవడం శుభపరిణామమని ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి అభినందించారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ప్రారంభమైన తొలి స్టాల్ నుంచి సాక్షి అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి చేతుల మీదుగా ‘సాక్షి’ ప్రతిని అందుకుని ఈ సరికొత్త ప్రయోగానికి ఎన్వీఎస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి, డైరెక్టర్ కార్పొరేట్ అఫేర్స్ రాణిరెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ వై ఈశ్వరప్రసాద రెడ్డి, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కమల్ కిషోర్ రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రతినిధి సారికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మర్యాద రామన్నలే!
గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైళ్లలో జర్నీ చేసే వారిలో అధిక శాతం మర్యాద రామన్నలే. తొమ్మిది నెలల మెట్రో జర్నీలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నమోదైన కేసులు కేవలం 12కు మించకపోవడంతో ఈ విషయం విస్పష్టమవుతోంది. పకడ్బందీ చర్యలు చేపట్టడంతో మెట్రో ప్రయాణం సురక్షితంగా మారిందని అవగతమవుతోంది. సాక్షి, సిటీబ్యూరో :మహానగరవాసుల ట్రాఫిక్ అవస్థలను దూరం చేసేందుకు మెట్రో రైళ్లను గత ఏడాది నవంబరు 29 నుంచి గ్రేటర్‌వాసులకు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. అత్యాధునిక భద్రతా ఏర్పాట్ల మధ్యన మెట్రో స్టేషన్లు, రైళ్లను ఏర్పాటు చేశారు. సుమారు రూ.100 కోట్ల ఖర్చుతో ఒక్కో మెట్రో స్టేషన్‌ను.. రూ.30 కోట్ల ఖర్చుతో ఒక మెట్రో రైలు (మూడు బోగీలను)ను తీర్చిదిద్దారు. వీటిలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పకడ్బందీగా సీసీ టీవీల నిఘా ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడంతో మెట్రో జర్నీ సురక్షితమైన ప్రయాణాన్ని సిటీజన్లకు సాకారం చేస్తోంది.కాగా నగరంలో ప్రస్తునికి నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో ఇటీవలికాలంలో నిత్యం సుమారు లక్షమంది రాకపోకలు సాగిస్తుండడం విశేషం. కాగా రైళ్లలో ప్రయాణించేందుకు వచ్చేవారు సిగరెట్లు వెలిగించుకునేందుకు లైటర్లు, అగ్గిపెట్టెలను కూడా వెంట తీసుకొస్తే మెట్రోస్టేషన్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సెక్యూరిటీ చెక్ ఇలా.. ⇔ ప్రతీ స్టేషన్లో ఎక్స్‌రే బ్యాగేజ్ స్కానర్లున్నాయి ⇔ డీఎఫ్‌ఎండీడోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌లున్నాయి ⇔ పదికేజీల లగేజినిమాత్రమే మెట్రో జర్నీకి అనుమతిస్తున్నారు ⇔ బ్యాగు నిడివి 60 సెం.మీ పొడవు, 45 సెం.మీ వెడల్పు, 25 సెం.మీ ⇔ ఎత్తున్న బ్యాగులనే జర్నీకి వినియోగించాలని నిబంధనలున్నాయి ఉల్లంఘన కేసులు ఇవీ.. ⇔ ఓ గుర్తుతెలియని వ్యక్తి లైసెన్సు లేని గన్‌తో మెట్రో స్టేషన్లోకి ప్రవేశించడంతో బ్యాగేజీ తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు ⇔ మెట్రో రైలులో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఘటనపై ఓ కేసు నమోదైంది ⇔ మెట్రో స్టేషన్లలో భద్రతా సిబ్బంది, టిక్కెట్ జారీచేసే సిబ్బంది, స్మార్ట్‌కార్డు రీచార్జి చేసే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినందుకు మరో మూడు కేసులు నమోదయ్యాయి ⇔ అత్యవసరం కాకపోయినా అత్యవసరంగా మెట్రో రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బటన్ నొక్కిన వైనంపై మరో కేసు నమోదైంది ⇔ అవగాహన రాహిత్యంతో మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించి ట్రాక్‌పై అనుమతి లేకుండా ప్రవేశించిన ఆరుగురిని భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్నారు నిషేధాలివీ.. ⇔ స్టేషన్లు, బోగీలు, పరిసరాల్లో ఉమ్మి వేయడం, చూయింగ్‌గమ్ ఊయడం, సిగరెట్లు తాగడం, పాన్ నమలడం ⇔ మెట్రో రైలు పరిసరాల్లో ఆల్కహాల్ తాగవద్దు ⇔ రైలులోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయొద్దు ⇔ వస్తువులను స్టేషన్లు, బోగీల్లో మరచిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ⇔ ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో నిషేధిత ప్రాంతాల్లో కూర్చోవద్దు ⇔ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు ⇔ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషేధం ⇔ ప్రమాదకర వస్తువులు,అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్ పరిసరాలు, బోగీల్లోకి తీసుకురావద్దు ⇔ ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోవద్దు ⇔ ప్లాట్‌ఫాంపై రైలుకోసం వేచిఉండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి ముందుకు రావద్దు ⇔ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా రైలు డోర్లు తెరవరాదు. డోర్లకు ఆనుకొని నిల్చోరాదు ⇔ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో విడిచిపెట్టవద్దు ⇔ స్టేషన్, బోగీ పరిసరాలను పాడుచేసిన వారు శిక్షార్హులు.. ఇలా తదితర నిషేధాజ్ఞలు ఉన్నాయి. -
మెట్రోరైల్ రెండో ఫేజ్‌కు అంతా సిద్ధం
-
కష్టకాలంలో గ్రేటర్ ఆర్టీసీ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ భారీ నష్టాల రూట్లో పరుగులు తీస్తోంది. వేలకొద్దీ బస్సులు, లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నా.. రోజుకు రూ.కోటి చొప్పున నష్టం వస్తోంది. ప్రయాణికులకు అందజేసే సేవల ద్వారా ప్రతిరోజు రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుంటే.. ఖర్చు మాత్రం రూ.4.5 కోట్లు ఉంటోంది. ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు ఆర్టీసీపై పిడుగుపాటుగా మారాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గ్రేటర్ నష్టాలు రూ.426 కోట్లకు చేరుకోగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే మరో రూ.96 కోట్ల నష్టాలు వచ్చాయి. నష్టాల రూట్లో వెళుతున్న గ్రేటర్ ఆర్టీసీపై మెట్రో రైలు దూసుకొస్తోంది. దీంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది. నిపుణుల కమిటీకి సవాలు.. పీకల్లోతు నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీకి సైతం గ్రేటర్ పరిణామాలు సవాల్‌గా మారాయి. ఈ నెల 10వ తేదీన బస్‌భవన్‌లో మొదటిసారి సమావేశమైన కమిటీ 21వ తేదీన మరోసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీపైనే ప్రధానంగా సమీక్షించనున్నారు. ఈ కమిటీ ఆర్టీసీపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సి ఉంది. ఈ నివేదిక ఆర్టీసీలో జవసత్వాలను నింపి లాభాల దిశగా నడిపిస్తుందా.. మెట్రో రైలు వంటి ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థ ముందుకొస్తున్న తరుణంలో నష్టాల నివారణకు నిపుణుల కమిటీ ఎలాంటి పరిష్కారాలను చూపుతుందనేది వేచి చూడాలి. నష్టాలకు కారణాలు అనేకం.. తెలంగాణలో మొత్తం 10 వేలకు పైగా బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. సూపర్ లగ్జరీలు, డీలక్స్‌లు, గరుడ, ఇంద్ర వంటి ఏసీ, నాన్ ఏసీ దూరప్రాంతాల బస్సులన్నీ లాభాల బాటలో పరుగులు తీస్తుండగా పల్లెవెలుగు బస్సులు, సిటీ బస్సులు మాత్రం తీవ్రమైన నష్టాల్లో ఉన్నాయి. పైగా తెలంగాణ అంతటా రూ.274 కోట్ల మేర నష్టాలు నమోదు కాగా ఒక్క హైదరాబాద్‌లోనే ఇవి రూ.426 కోట్లకు చేరాయి. అంటే ఆర్టీసీ మొత్తంనష్టాల్లో ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీకి గ్రేటర్ ఆర్టీసీని గట్టెక్కించడమే ముఖ్యమైన సవాల్‌గా మారింది. కమిటీ తొలి సమావేశంలో జోన్ల వారీగా లాభనష్టాలపై గణాంకాలను సేకరించింది. అన్ని జోన్లలో హైదరాబాద్ కీలకమైంది కావడం, పైగా నష్టాలు ఎక్కువగా ఇక్కడే ఉండడంతో 21వ తేదీన గ్రేటర్ ఆర్టీసీపైనే ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించింది. సిటీలో రోజుకు 3,550 బస్సులు తిరుగుతుండగా సుమారు 33 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు. దూరప్రాంతాల బస్సులు ఒక లీటర్ డీజిల్‌కు 5.5 కిలోమీటర్ల మేర దూసుకెళ్తుండగా సిటీ బస్సుల్లో ఇది 4 కిలోమీటర్లకే పరిమితమైంది. అడుగడుగునా ట్రాఫిక్ రద్దీ ఆర్టీసీకి బ్రేకులు వేస్తోంది. దీంతో 12 నుంచి 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఇంధన భారం భారీగా పెరుగుతోంది. గుంతల రోడ్లు, ట్రాఫిక్ రద్దీ, ఇంధన భారంతో పాటు విడిభాగాలు, బస్సుల నిర్వహణ, మరమ్మతులు కూడా ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దీంతో ప్రతి రోజు 3.5 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ అది ఈ నిర్వహణ ఖర్చును ఏ మాత్రం భర్తీ చేయలేకపోతోంది. ఇప్పుడు తప్పని మెట్రో పోటీ రోజుకు 820 బస్సులు రాకపోకలు సాగించే ఎల్బీనగర్–పటాన్చెరు రూట్ ఆర్టీసీకి ఎక్కువ ఆదాయాన్నిచ్చే మార్గం. ఈ రూట్లో త్వరలో మెట్రో ప్రవేశించనుంది. దీంతో ఆర్టీసీ మిగిలిన మార్గాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. అలాగే మెట్రోకు రెండు వైపులా ఉన్న కాలనీలకు బస్సులు దారి మళ్లించక తప్పదు. నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో పెద్దగా ప్రభావం కనిపించకపోయినా దశలవారీగా ఒక్కో మెట్రో కారిడార్ అందుబాటులోకి వచ్చేకొద్దీ ఆర్టీసీ మరింత సంక్షోభంలో పడనుంది. ఈ పరిస్థితుల్లో మెట్రోకు దీటుగా ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు నిపుణుల కమిటీ ఎలా దిశానిర్దేశం చేస్తుందనేది కూడా చర్చనీయాంశమే. కమిటీ సభ్యులు వీరే.. ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో బీఎంటీసీ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, ఆస్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసాచారి, ఏఎస్ఆర్టీయూ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ ఆనందరావు, ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్టు కన్సల్టెంట్ అంతోన్యకుమార్, ఆస్కీ అధ్యాపకులు డాక్టర్ పి. సుదర్శన్, సీఐఆర్టీలో పనిచేసిన హనుమంతరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఈడీ వేణు తదితరులు ఉన్నారు. టీఎస్ ఆర్టీసీ సెక్రటరీ పురుషోత్తం నాయక్ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మూడు నెలల పాటు ఆర్టీసీపై అధ్యయనం చేసి కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ నివేదికపై సీనియర్ ఐఏఎస్ అధికారులు మరోసారి భేటీ అవుతారు. ఉన్నతాధికారుల బృందమే తుది నివేదికను అందజేస్తుంది. దీని ఆధారంగా ఆర్టీసీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. -
పంద్రాగస్టుకు మెట్రో డౌటే!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజనులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో రైళ్ల రాకపోకలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం పంద్రాగస్టు(ఆగస్టు 15)రోజున ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయనుకున్నప్పటికీ... రైల్వే మంత్రిత్వశాఖ నుంచి రావాల్సిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ వారి భద్రతా ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో జాప్యమవుతోంది. దీంతో మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో రైళ్లకు స్పీడ్, లోడ్, సేఫ్టీ, ట్రాక్షన్, సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్ తదితర అంశాల్లో మొత్తంగా 18 రకాల ప్రయోగ పరీక్షలను దశలవారీగా నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరుకు భద్రతా ధ్రువీకరణ పత్రం అందుతుందని మెట్రో వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ ధ్రువీకరణ అందిన తర్వాతే మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో మెట్రో పట్టాలెక్కిన పక్షంలో నిత్యం సుమారు 2 లక్షలమంది ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ)మార్గంలో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ)మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా..వీటిల్లో నిత్యం 75 వేల మంది ప్రయాణిస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది నవంబరు నెల ప్రారంభంలో అమీర్‌పేట్–హైటెక్ సిటీ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని హెచ్ఎంఆర్ అధికారులు చెబుతున్నారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీకీ ఏర్పాట్లు.. మెట్రో స్టేషన్లలో దిగిన ప్రయాణికులు తిరిగి తమ గమ్యస్థానాలకుచేరుకునేందుకు వీలుగా పలు మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, అత్యాధునిక సైకిళ్లు, పెట్రోలు ఇంధనంగా నడిచే బైక్‌లను అద్దెకు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. వీటికి ప్రయాణికుల ఆదరణ క్రమంగా పెరుగుతోందని..మొబైల్యాప్ ద్వారా వీటిని అద్దెకు తీసుకోవడంతోపాటు చెల్లింపులను సైతం ఆన్లైన్లో చేసే అవకాశం ఉండడంతో ప్రయాణికులు వీటిని అద్దెకు తీసుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. దశలవారీగా నగరంలోని మూడు మెట్రోకారిడార్లు...ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మార్గాల్లోని 64 మెట్రో స్టేషన్లలో అద్దె వాహనాల సదుపాయం కల్పిస్తామని..అవకాశం ఉన్నచోట ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయం కల్పిస్తామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. మెట్రో మార్గా ప్రారంభోత్సవాలు ఇలా.. ఎల్బీనగర్–అమీర్‌పేట్: ఆగస్టు చివరి వారం– 2018 అమీర్‌పేట్–హైటెక్‌సిటీ: నవంబరు– 2018 మెట్రో రెండోదశ మార్గాలివే... మెట్రోరెండోదశ ప్రాజెక్టు సర్వత్రా చర్చనీయాంశమైన నేపథ్యంలో రెండోదశ ప్రాజెక్టుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధంచేసే బాధ్యతలను ప్రభుత్వం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులకు అప్పగించింది. ప్రస్తుతానికి డీఎంఆర్సీ అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వాని కి సమర్పించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. పాతనగరానికి మెట్రో జటిలం.... ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.5 కి.మీ) మార్గంలో మెట్రో ప్రాజెక్టుకు బాలారిష్టాలు ఎదురుకానున్నా యి. ఈ మార్గంలో సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, బాధితులకు రూ.కోట్లలో పరిహారం చెల్లింపు అంశం జఠిలంగా మారనుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పరిహారం చెల్లింపునకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారీ మొత్తంలో పరిహారం చెల్లింపులు ప్రభుత్వం ఎలా జరుపుతుందన్న అంశంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిర్మాణ సంస్థసైతం ఇదే అం శంపై మల్లగుల్లాలు పడుతుండడం గమనార్హం. -
పంద్రాగస్టుకు మెట్రో పరుగు..!
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు మరో రూట్లో పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న ఎల్బీనగర్–అమీర్‌పేట్(17 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక అమీర్‌పేట్–హైటెక్‌సిటీ రూట్లో అక్టోబర్‌లో.. ఎంజీబీఎస్–జేబీఎస్ రూట్లో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తుండగా.. నిత్యం సుమారు 75 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. తప్పిన ఆర్వోబీ చిక్కులు.. మెట్రో రైళ్ల రాకపోకల కోసం 8 రైల్వే ఓవర్ బ్రిడ్జీల(ద.మ.రైల్వే పట్టాలపైన ఏర్పాటు చేసినవి) నిర్మాణం పూర్తవడంతో మూడు మార్గాల్లో మెట్రో పరుగుకు లైన్ క్లియర్ అయ్యింది. అత్యంత కీలకమైన బోయిగూడా ఆర్వోబీ నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. ఈ ఆర్వోబీ నిర్మాణంతో జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో పనులకు మార్గం సుగమమైంది. బోయిగూడా ఆర్వోబీని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ భారీ స్టీలు వంతెనను అనేక వ్యయప్రయాసలకోర్చి నిర్మించామన్నారు. ఈ ప్రాంతంలో మెట్రో రైలు ట్రాక్ అత్యంత ఒంపు తిరిగిందని.. దీంతో 64 అడుగుల వెడల్పు.. 221 అడుగుల పొడవున ఈ బ్రిడ్జీని ఏర్పాటు చేశామన్నారు. ఈ వంతెన రహదారికి 40 అడుగుల ఎత్తున ఉందని, బాక్సు ఆకృతిలో దీనిని నిర్మించడం ద్వారా ఈ రూట్లో మెట్రో పరుగుకు అవకాశం కల్పించామన్నారు. ఈ స్టీలు వంతెనను ఘజియాబాద్‌లో తయారు చేశామని, ముక్కలుగా స్టీలు ప్లేట్లను తీసుకొచ్చి దశలవారీగా వారధిని 51 వేల హైస్ట్రెంత్ ఫ్రిక్షన్‌గ్రిప్ బోల్టులతో నిర్మించామన్నారు. ముందుగా వారధిని నిర్మించి.. హైడ్రాలిక్ జాక్‌లు, గైడింగ్ రోలర్ల సహాయంతో ముందుకు తీసుకెళ్లి నిర్ణీత ప్రదేశంలో వంతెనను అమర్చామని, దీంతో వంతెన నిర్మాణ సమయంలో ట్రాఫిక్ రద్దీని నివారించగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా వారధి కోసం పనిచేసిన ఇంజనీర్లను ఆయన అభినందించారు. బోయిగూడా వంతెన సాకారమైందిలా.. అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో ప్రత్యేక పరిస్థితులు, వినూత్న డిజైన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఉక్కు ప్లేట్లను అధిక కచ్చితత్వంతో ఒకదానితో మరోటి జత చేశారు. ఇందుకోసం ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసే నైపుణ్యంగల సిబ్బందిని నియమించారు. వంతెన నిర్మాణానికి పరిమిత స్థలంలో అధిక సామర్థ్యం ఉన్న క్రేన్లను చాకచక్యంగా ముందుకు కదిల్చారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏర్పాటు చేసిన ఆరు వరుసల ద.మ.రైల్వే పట్టాలపైన ఈ ఉక్కు వంతెనను నిర్మించారు. ద.మ.రైల్వే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వైర్లు అత్యంత సమీపంలో ఉన్నా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వంతెన నిర్మాణం పూర్తి చేశారు. బోయిగూడా వంతెన విశేషాలివే.. స్టీలు వారధి పొడవు : 221 అడుగులు స్టీలు వారధి వెడల్పు : 64 అడుగులు వంతెన పిల్లర్ల ఎత్తు : 1,417 అడుగులు ద.మ.రైల్వే పట్టాల పైనుంచి బ్రిడ్జీ ఎత్తు : 30 అడుగులు వంతెనను కదిల్చేందుకు వాడిన జాక్‌ల బరువు : ఒక్కోటి వంద టన్నులు వర్టికల్ లిప్టింగ్ జాక్ బరువు : 300500 టన్నులు మొత్తం వారధి బరువు : 960 మెట్రిక్ టన్నులు -
గవర్నర్.. మెట్రో జర్నీ
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలులో సాధారణ ప్రయాణికుడిలా జర్నీ చేసి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదర్శంగా నిలిచారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్, భద్రతా ఏర్పాట్లు లేకుండా ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు సతీసమేతంగా నగర మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బేగంపేట్ మెట్రో స్టేషన్‌కు సాధారణ ప్రయాణికుడిలా భార్యతో కలసి వచ్చిన ఆయన అమీర్‌పేట్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో దిగి మరో రైలులో మియాపూర్ వరకు(కారిడార్–1) వెళ్లారు. ఆయన రాకను గుర్తించిన మెట్రో అధికారులు హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్ఎంఆర్) ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డికి సమాచారమిచ్చారు. ఆయన వెంటనే మియాపూర్ మెట్రోస్టేషన్‌కు పరుగున వచ్చి గవర్నర్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. మెట్రో స్టేషన్లో ప్రయాణికులకు కల్పించిన వసతులను చూపారు. తన పర్యటన సందర్భంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దని గవర్నర్ ఆదేశించడం గమనార్హం. మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్ట్ సెంటర్, ఇనాగరల్ ప్లాజా, వాటర్‌లెస్ యూరినల్స్, ప్రజోపయోగ స్థలాలను గవర్నర్ దంపతులు పరిశీలించారు. స్టేషన్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రజోపయోగ స్థలాలు, అభివృద్ధి పనులను చూసి ముగ్ధులైన గవర్నర్ దంపతులు హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు ఓ మణిహారం అని, జీవించేందుకు అత్యంత అనువైన నగరమే కాదు, పీపుల్ ఫ్రెండ్లీ సిటీకి హైదరాబాద్ నిదర్శనంగా నిలుస్తోందని కొనియాడారు. మాస్కో తరహాలో మెట్రో స్టేషన్లను ఆర్ట్ మ్యూజియంలుగా తీర్చిదిద్దాలని ఎన్వీఎస్‌రెడ్డికి సూచించారు. -
గూగుల్ మ్యాప్‌తో మెట్రో పిల్లర్ నంబర్ల అనుసంధానం
-
గూగుల్ మ్యాప్‌తో ‘మెట్రో’ నంబర్ల అనుసంధానం
సార్.. మీకు కొరియర్ వచ్చింది.. మీ అడ్రస్ ఎక్కడ..? మెట్రో పిల్లర్ నంబర్ 1392 వద్దకు వచ్చేశావనుకో.. ఆ ఎదురు సందులో.. డాడీ క్యాబ్ బుక్ చేస్తున్నా.. సినిమా థియేటర్ అడ్రస్ ఎక్కడ..? మెట్రో పిల్లర్ నంబర్ 506.. దాని ఎదురుగానే షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్.. సాక్షి, హైదరాబాద్: త్వరలో నగరంలోని అడ్రస్‌లన్నింటికీ మెట్రో పిల్లర్లే మూలస్తంభంగా మారనున్నాయి. ఈ మేరకు మెట్రో రైలు పిల్లర్లను త్వరలో జీపీఎస్ సాంకేతికతతో గూగుల్ మ్యాప్ కు అనుసంధానించనున్నారు. వీటికి నంబర్లను కేటాయించడం ద్వారా పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్– ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మూడు మెట్రో కారిడార్లలో 66 కి.మీ. మార్గంలోని 2,541 మెట్రో పిల్లర్లకు దశలవారీగా నంబర్ల కేటాయింపు ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే ప్రకాశ్‌నగర్–రసూల్‌పురా మార్గంలో సీ1,300–సీ1,350 వరకు పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. నీలిరంగు బోర్డుపై తెలుపు అక్షరాలతో వీటిని చిన్నగా ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో పెద్ద పరిమాణంలో అందరికీ కనిపించేలా రేడియంతో ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. కాగా పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో మెట్రో పిల్లర్లు సైతం నగరవాసులకు ల్యాండ్‌మార్క్ చిహ్నలుగా మారనుండటం విశేషం. ఎల్బీనగర్ పిల్లర్ నం.1..? మెట్రో కారిడార్లలో ‘ఏ’కారిడార్‌గా పిలిచే ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.) మార్గంలో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు వద్ద పిల్లర్ నం.1 ఏర్పాటుకానుంది. ఈ మార్గంలో మొత్తం 1,108 పిల్లర్లున్నాయి. ఇక జేబీఎస్–ఫలక్‌నుమా (15 కి.మీ.) మార్గాన్ని ‘బీ’కారిడార్‌గా పిలుస్తున్నారు. ఈ మార్గంలో మొత్తం 588 పిల్లర్లున్నాయి. నాగోల్–రాయదుర్గం (28 కి.మీ.) మార్గంలో 845 పిల్లర్లున్నాయి. ఈ మార్గంలోనే ప్రస్తుతానికి ప్రకాశ్‌నగర్–రసూల్‌పురా మార్గంలోనే సి1300–సి1350 వరకు నంబర్లను కేటాయించారు. ఇక మెట్రో రెండోదశ కింద ఎబ్బీనగర్–నాగోల్, ఎల్బీనగర్–ఫలక్‌నుమా, రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్పోర్ట్ తదితర మార్గాల్లోనూ ఏర్పాటుచేసే పిల్లర్లతో వీటి సంఖ్య మరింత పెరగనుంది. జీపీఎస్‌తో అడ్రస్ ఈజీ... మూడు మెట్రో కారిడార్ల పరిధిలో ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు ఉన్నాయి. ఈ కారిడార్లకు రెండు వైపులా వేలాది కాలనీలు, బస్తీలున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లలో గ్రేటర్ సిటిజన్లే కాకుండా ఇతర జిల్లాల వాసులూ రాకపోకలు సాగిస్తారు. వీరికి ఇప్పుడు ఆయా కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలను తేలికగా గుర్తించేందుకు పిల్లర్ నంబర్లే ఆధారం కానున్నాయి. ఈ పిలర్ల నెంబర్లను జీపీఎస్ సాంకేతికతతో గూగుల్ మ్యాప్‌కు అనుసంధానం చేయనుండటంతో.. పిల్లర్ నంబర్ ఆధారంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. -
మెట్రో స్టేషన్లలో స్మార్ట్ పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: త్వరలో నగరవాసుల పార్కింగ్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో స్టేషన్లలో ‘పార్క్ హైదరాబాద్’పేరుతో అధునాతన స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ పార్కింగ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఆధారంగా మియాపూర్–అమీర్‌పేట్–నాగోల్ (30 కి.మీ) మార్గంలోని 24 మెట్రో స్టేషన్ల వద్ద ఈ వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.8 కోట్లతో ‘జృతి సొల్యూషన్స్, ఎగైల్ పార్కింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’సంయుక్త ఆధ్వర్యంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను సైతం 20 ఏళ్లపాటు ఈ రెండు సంస్థలే నిర్వహిస్తాయి. ఇందుకుగాను హెచ్ఎంఆర్ఎల్ సంస్థకు రూ.ఏడు కోట్ల పార్కింగ్ లైసెన్సు ఫీజును ఆయా సంస్థలు చెల్లించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొబైల్ యాప్‌తో పార్కింగ్ ప్లేస్ బుకింగ్.. ఈ స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థలో మీ వ్యక్తిగత ద్విచక్రవాహనం లేదా కారును పార్కింగ్ చేసుకునేందుకు అవసరమైన స్థలాన్ని మొబైల్ యాప్ ద్వారా నూ బుక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సమయంలో ఆయా స్టేషన్ల వద్ద పార్కింగ్ స్థలం అందు బాటులో ఉందా..? లేదా..? అన్న విషయాన్ని సైతం ఈ యాప్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. స్థలం అందుబాటులో ఉంటే మీ వాహనాన్ని జీపీఎస్ సాంకేతికత ఆధారంగా నేరుగా పార్కింగ్ కేంద్రానికి తీసుకెళ్లి పార్క్ చేయవచ్చు. ఇక 24 మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశాల్లో ఏకకాలంలో 4,000 ద్విచక్రవాహనాలు, 400 కార్లను పార్కింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. పార్కింగ్ ఫీజును సైతం ఆన్లైన్, మొబైల్ యాప్ ద్వారా చెల్లించే అవకాశం ఉండటం విశేషం. పార్కింగ్ కేంద్రాల్లో ఉచిత వై..ఫై.. వాహనాల పార్కింగ్ షెల్టర్లను అత్యాధునికత ఉట్టిపడేలా ఏర్పాటు చేయడంతోపాటు తీరైన ఆకృతు లు, పైకప్పులతో వీక్షకులను కట్టిపడేసేలా ఏర్పా టు చేయనున్నారు. వాహనాలు వర్షానికి తడవకుం డా.. ఎండకు ఎండకుండా షెల్టర్లను తీర్చిదిద్దను న్నారు. ఈ కేంద్రాల వద్ద కూర్చునే సదుపాయం కల్పించడంతోపాటు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. దశలవారీగా మిగతా మెట్రో స్టేషన్లలో ఏర్పాటు..? ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మూడు కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో మెట్రో ప్రాజెక్టును చేపడుతున్న విషయం విదితమే. మూడు మార్గాల్లో మొత్తం 65 మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతగా 24 స్టేషన్ల వద్ద స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రానున్నారు. మిగతా స్టేషన్ల వద్ద దశలవారీగా ఈ వసతి కల్పిస్తామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది ఆగస్టులో ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ.), అక్టోబరు నెలలో అమీర్‌పేట్–హైటెక్ సిటీ (11 కి.మీ.) రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనానికి రూ.3 కారుకైతే రూ.8 స్మార్ట్ పార్కింగ్ విధానంలో మీ ద్విచక్ర వాహనాన్ని మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేస్తే గంటకు రూ.మూడు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే కారుకైతే గంటకు రూ.ఎనిమిది చార్జీ వసూలు చేస్తారు. అన్ని పార్కింగ్ చెల్లింపుల లావాదేవీలను డిజిటైజేషన్ చేయనున్నారు. పార్కింగ్ ఉల్లంఘనలను సైతం సీసీటీవీలో రికార్డు చేయనున్నారు. ఈ కెమెరాలను పోలీసు కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంట్రల్‌కు అనుసంధానిస్తారు. పార్కింగ్ కేంద్రాల వద్ద వాహనాల భద్రతకుకు ప్రైవేటు సెక్యూరిటీతోపాటు ట్రాఫిక్ పోలీసులు రక్షణ కల్పించనున్నారు. -
జూలై 26 లేదా 27న అమీర్‌పేట్ టు ఎల్బీనగర్
-
యాదాద్రికి ఎంఎంటీఎస్ రైట్ రైట్!
సాక్షి, హైదరాబాద్: ఘట్కేసర్–రాయగిరి (యాదాద్రి) మార్గంలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎంఎంటీఎస్) రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. జంట నగరాల పరిధిలో ఇప్పటికే ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, యాదగిరి గుట్ట ఆలయాభివృద్ధి పనుల్లో భాగంగా ఘట్కేసర్–రాయగిరి మార్గంలో సైతం ఎంఎంటీఎస్ రైలు సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రెండో దశ కింద చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం కింద రూ.150 కోట్ల నిధులను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్)కు మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశ కింద ఘట్కేసర్–రాయగిరి మార్గంలో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి రూ.75 కోట్లు, జంట నగరాల్లో నిర్మిస్తున్న ఎంఎంటీఎస్ ప్రాజెక్టుల కోసం మరో రూ.50 కోట్లు, ఎంఎంటీఎస్ ప్రాజెక్టుల భవిష్యత్తు అవసరాలకు రూ.25 కోట్లను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు కేటాయిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రంలోని మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎంఎంఎస్ఆర్టీఎస్) ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.350 కోట్లను విడుదల చేయాలని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కోరడంతో, ప్రస్తుతానికి రూ.150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మెట్రో అనుసంధానంపై పరిశీలన హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేసి ప్రయాణికులకు చివరి మైలు వరకు కనెక్టివిటీ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెట్రో రైలు స్టేషన్లను, ఎంఎంటీఎస్ స్టేషన్లు, బస్ స్టాపులతో అనుసంధానం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఈ బాధ్యతలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించిన నిధులను హెచ్ఎంఆర్ఎల్ సంస్థకు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. -
జులైలో అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెండోదశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను బుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు మొదలైన ట్రయల్ రన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జులై చివరివారంలో అమీర్‌పేట- ఎల్బీనగర్ మార్గాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రోతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయని తెలిపారు. మెట్రోతో నాంపల్లి రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్‌ను అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా సెట్విన్ బస్సులను కూడా అనుసంధానం చేస్తామన్నారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎల్బీనగర్- అమీర్‌పేట మధ్యలో ఉన్న చారిత్రక సంపదని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని ఎల్అండ్టీ కంపెనీని కోరామన్నారు. హైటెక్ సిటీ మార్గాన్ని అక్టోబర్‌లో పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. Inspected the metro rail stations at Lakdi-ka-Pul, Nampally & MGBS stations and asked @hmrgov to prepare by end of July for the line to be opened till LB Nagar Also directed @ltmhyd and @hmrgov to develop a heritage precinct between Nampally station & Rangamahal station pic.twitter.com/EnVqrliJIb — KTR (@KTRTRS) June 20, 2018 -
3 కారిడార్లు.. 62 కిలోమీటర్లు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తొలి దశ ప్రాజెక్టును ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో చేపట్టినా రెండో దశ మాత్రం ప్రభుత్వ ప్రాజెక్టుగానే పట్టాలెక్కనుంది. తొలి దశ ప్రాజెక్టులోని కారిడార్లతో పోల్చితే రెండో దశలోని కారిడార్ల పరిధిలో జన సాంద్రత తక్కువగా ఉన్న నేపథ్యంలో పీపీపీ విధానంలో పెట్టుబడులు రాబట్టుకోవడం కష్టమని ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద మూడు మార్గాల్లో(కారిడార్లలో) మెట్రో నిర్మాణ పనులు జరుగుతుండగా.. రెండో దశ కింద రూ.9,378 కోట్ల అంచనా వ్యయంతో మరో మూడు మార్గాల్లో మొత్తం 62 కిలోమీటర్ల పొడవున ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. తొలి దశకు కొనసాగింపుగా.. మెట్రో తొలి దశ ప్రాజెక్టుకు సంబంధించి రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో మూడు కారిడార్ల పరిధిలో పనులు చేపట్టారు. తొలి కారిడార్‌లో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 29 కి.మీ.లు, రెండో కారిడార్‌లో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 15 కి.మీ.లు, మూడో కారిడార్‌లో నాగోల్ నుంచి రాయ్‌దుర్గ్ వరకు 28 కి.మీ.ల మెట్రో నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి. తొలి దశ కింద చేపట్టిన మూడు కారిడార్లకు కొనసాగింపుగా రెండో దశ కింద.. నాలుగో కారిడార్‌గా గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 30.7 కిలోమీటర్ల పొడవున ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఐదో కారిడార్‌లో భాగంగా బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ మీదుగా లక్డికాపూల్ వరకు 26.2 కిలోమీటర్ల మార్గం ఏర్పాటు కానుంది. తొలి దశలోని మూడో కారిడార్ (నాగోల్ నుంచి రాయ్‌దుర్గ్) విస్తరణలో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5.1 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు. కేంద్రానికి ప్రతిపాదనలు.. మెట్రో రెండో దశకు సంబంధించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక(పీపీఆర్), సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల రూపకల్పన బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ(డీఎంఆర్‌సీఎల్)కు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్) అప్పగించగా.. ఈ మేరకు పీపీఆర్‌ను డీఎంఆర్‌సీఎల్ సమర్పించింది. రూ.9,378 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ యాజమాన్య ప్రాజెక్టు(ఈక్వల్ ఓనర్షిప్ ప్రాజెక్టు)గా రెండో దశను చేపట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి వాటాలు పోగా మిగిలిన వ్యయాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఇటీవల కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. విదేశీ ఆర్థిక సంస్థల రుణాలను ఆకట్టుకునే సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల జాబితాలో మెట్రో రెండో దశను చేర్చేలా కేంద్ర విదేశాంగ శాఖకు ఈ లేఖను పంపించాలని(ఫార్వార్డ్ చేయాలని) విజ్ఞప్తి చేశారు. రెండు భాగాలుగా రెండో దశ మెట్రో రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం రెండు భాగాలుగా విభజించింది. రెండో దశ(ఏ) కింద బయోడైవర్సిటీ పార్క్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 4వ కారిడార్‌ను, రెండో దశ(బీ)లో భాగంగా బీహెచ్ఈఎల్ నుంచి లక్డికాపూల్ వరకు ఐదో కారిడార్‌ను, మూడో కారిడార్ విస్తరణ పేరుతో నాగోల్–ఎల్బీనగర్ మార్గాల్లో మెట్రోను నిర్మించనుంది. రూ.9,378 కోట్లతో రెండో దశ ప్రాజెక్టును చేపట్టనుండగా 22 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, 18 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ డిపాజిట్లు, 60 శాతం విదేశీ ఆర్థిక సంస్థల రుణాల ద్వారా నిధులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మహిళల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టేషన్ ఏర్పాటు
-
మహిళల కోసం ప్రత్యేక మెట్రో స్టేషన్
సాక్షి, హైదరాబాద్: మహిళల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టేషన్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రత్యేకంగా తరుణి పేరిట మధురానగర్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా మహిళల కోసం ఓ కోచ్‌లో కొంత భాగాన్ని కేటాయించామన్నారు. డిమాండ్‌ను బట్టి పూర్తి కోచ్‌ను కేటాయిస్తామని చెప్పారు. మెట్రో రైలు కేవలం రవాణా సాధనంగానే కాకుండా నగరాభివృద్ధిలో భాగస్వామ్యంగా మారుతుందని తెలిపారు. మెట్రో స్టేషన్లలో భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జులైలో ఎల్బీనగర్ - అమీర్‌పేట్, అక్టోబర్‌లో అమీర్‌పేట్ - హైటెక్ సిటీ లైన్‌ను పూర్తి చేస్తామన్నారు. 2019లో ఎంజీబీఎస్- జేబీఎస్ లైన్లు అందుబాటులోకి వస్తుందన్నారు. రెండో ఫేజ్‌లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మెట్రోను శంషాబాద్ వరకు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. -
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
-
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నగరంలోని మెట్రో రైళ్లు దూకుడు పెంచాయి. మియాపూర్- అమీర్‌పేట్- నాగోల్ మధ్య రద్దీ సమయాల్లో 7 నిమిషాలకో మెట్రో టైన్ నడవనుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్ఎస్) అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయం నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మియాపూర్ - అమీర్‌పేట్ - నాగోల్ మధ్య రేపు ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు మెట్రో రైలు, రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఓ రైలు నడవనుంది. Happy to announce CMRS has cleared the new signalling system & Hyderabad Metro will now run trains every 7 minutes during peak hours & every 8 minutes during non-peak on Miyapur - Ameerpet- Nagole stretches from tomorrow 6 am onwards — KTR (@KTRTRS) April 20, 2018 -
ఎల్బీనగర్ - అమీర్‌పేట్ మెట్రోలైన్ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ - అమీర్‌పేట్ మెట్రో లైన్ సేవల ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ఎల్బీనగర్- అమీర్‌పేట్ మెట్రో లైన్ ఈ జూన్‌లో ప్రారంభం కాదన్నారు. సీటీఎస్ టెక్నాలజీతో ఈ ఆగస్టులో ఈ ఆ మెట్రో లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అమీర్‌పేట్- హైటెక్ సిటీ మెట్రో లైన్‌ను అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నట్లు మెట్రోరైలు ఎండీ వివరించారు. అమీర్‌పేట్ నుంచి మియాపూర్ వరకు కొనసాగుతున్న మెట్రోరైలు వేగం బాగానే ఉందన్నారు. అయితే మెట్టుడూడ నుంచి అమీర్‌పేట్ వరకు సీబీటీ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో మెట్రో వేగం ఈ మార్గంలో కాస్త తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ప్రతిరోజూ 60 వేల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.