
సాక్షి, హైదరాబాద్: జీతాల పెంపు పేరుతో మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెపై హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు ధర్నాలో పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. ఐదేళ్లుగా తమ జీతాల్లో పెరుగుదల లేదని ఆరోపిస్తూ.. అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే.. ఉద్యోగుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే.. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు కచ్చితంగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం రూ. 11 వేలుగా ఉన్న జీతాన్ని.. కనీస వేతనం కింద రూ. 18 వేలకు పెంచాలంటూ టికెటింగ్ ఉద్యోగులు విధుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు.
రెడ్ లైన్(మియాపూర్-ఎల్బీనగర్) మధ్య టికెట్ కౌంటర్ల వద్ద సిబ్బంది కొరతతో క్యూ లో టికెట్ల కోసం ప్రయాణికులు అవస్తలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment