employees strike
-
బాబుకు బిగ్ షాక్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్
-
శాంసంగ్ కొత్త ఎత్తు! వెనక్కితగ్గని ఉద్యోగులు
చెన్నైలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. మెరుగైన వేతనాలు, తమ యూనియన్‌కు గుర్తింపు కోసం దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తున్నారు. సమ్మె ఆపాలని యాజమాన్యం ఎంత హెచ్చరించినా వెనక్కితగ్గడం లేదు. దీంతో కంపెనీ కొత్త ఎత్తు వేసింది.శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్-సీఐటీయూ నేతృత్వంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో గృహోపకరణాల విక్రయానికి కీలకమైన పండుగ సీజన్‌కు ముందు ఉత్పత్తి 80 శాతం తగ్గిపోయింది. సమ్మె ఇప్పుడు నాల్గవ వారానికి చేరుకోవడంతో ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకుని సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు వారి ఇళ్లకు ‘స్నాక్ కిట్’లను పంపుతోందని ఫ్రంట్‌లైన్ నివేదించింది.తమిళనాడులోని శాంసంగ్ ప్లాంట్‌లో దాదాపు 1,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 1,000 మందికి పైగా కార్మికులు సెప్టెంబర్ 9 నుండి సమ్మెలో ఉన్నారు. తమ యూనియన్ను గుర్తించాలని, మూడేళ్ల జీతం రూ.36,000 పెంచాలని, షిఫ్ట్ అలవెన్స్‌ను రూ.150 నుండి రూ.250కి పెంచాలని, పితృ సెలవులను మూడు నుండి ఏడు రోజులకు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సమానమైన అర్హతలు, విధులు ఉన్న కార్మికులకు సమాన వేతనం అమలుచేయాలని కోరుతున్నారు.2007లో ఇక్కడ ఏర్పాటైన శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ గత 16 సంవత్సరాలుగా యూనియన్ లేకుండా పని చేస్తోంది.శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ మద్దతుతో గత సంవత్సరం ఏర్పడింది. అయితే దీనికి కంపెనీ నుండి అధికారిక గుర్తింపు లేదు.కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నిరసనను కొనసాగిస్తే వేతనాలు ఆపేస్తామని, విధుల నుంచి తొలగిస్తామని గత నెలలో కంపెనీ హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. ఇప్పుడు ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా వారికి పండ్లు, చాక్లెట్లతో కూడిన స్నాక్ కిట్లను పంపుతోంది. అంతేకాకుండా కంపెనీ ప్రతినిధులు నేరుగా కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా ఫ్రంట్‌లైన్ పేర్కొంది. అయితే ఈ వార్తలను శాంసంగ్ యాజమాన్యం ఖండించింది. -
150 మంది సామ్సంగ్ ఉద్యోగులు అరెస్టు
వేతనాలు పెంచాలని నిరసనకు దిగిన 150 మంది సామ్సంగ్ ఉద్యోగులను సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో కార్మికులు ర్యాలీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి మంజూరైన అనుమతులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దాంతో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేసేందుకు దాదాపు 400కుపైగా కార్మికులు సోమవారం కాంచీపురం కలెక్టరేట్‌కు బయలుదేరారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన 150 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన ఇండియా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ నాయకుడు ముత్తు కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు కార్మికులు తెలిపారు.సామ్సంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వేతన సవరణ కోరుతూ సమ్మెకు దిగారు. ఇప్పటికే సమ్మె ప్రారంభించి ఎనిమిది రోజులు అయింది. అయినా సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో ర్యాలీ నిర్వహించాలని భావించి కలెక్టర్ అనుమతి కోరారు. చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం..‘కాంచీపురంలోని సామ్సంగ్ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలి సమ్మె. స్థానికంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్‌లో దాదాపు 1,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి వేతనాలు ఇతర సంస్థల్లోని అదే స్థాయి ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 16 సంవత్సరాలుగా ఈ కార్మికులకు ఎలాంటి రిజిస్టర్డ్ యూనియన్ లేదు. వేతనాలు సవరించాలని సంస్థకు ఎన్నిసార్లు లేఖలు రాసినా లాభం లేకుండాపోయింది. సంస్థ వేతనాలపై స్పందించకపోగా కార్మికులపై పనిభారం మోపుతోంది. సామసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ పేరుతో సమ్మెకు దిగాం. సంస్థలో 25 శాతం మంది అప్రెంటిస్ కార్మికులున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్లైన్స్భారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె
-
జొమాటోకు షాకిచ్చిన ఉద్యోగులు.. భారీ ఎత్తున నిలిచిపోయిన సేవలు!
‘ఆలస్యం విషం, వేగమే అమృతం’.. దేశంలోని ప్రముఖ డెలివరీ స్టార్టప్స్ ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. ఉదయాన్నే వంటింట్లో నుంచి ఘుమఘుమలు ఇంటిల్లాపాదిని పలకరిస్తుంటే కూరలోకి ఉప్పు లేకపోతే.. గాభరా పడాల్సిన పన్లేదు. స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డర్ చేస్తే కుతకుతమని ఉడికేలోగా లవణం లావణ్యంగా ఇంటికి వచ్చేస్తుంది. ‘మాటకు పది నిమిషాలని అంటున్నాం కానీ, మా సగటు డెలివరీ సమయం ఎనిమిది నిమిషాల పైచిలుకే’ అంటున్నాయి డెలివరీ సంస్థలు. ఇదంతా బాగానే ఉన్నా బైక్ పంక్చర్, ట్రాఫిక్ సిగ్నల్,అన్నిటికీ మించి స్పీడ్ బ్రేకర్ల కన్నా స్పీడుగా బ్రేకులు వేయించే గుంతలతో వ్యయప్రయాసలకు ఓర్చి పది నిమిషాల్లో డెలివరీ చేసే ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? అంటే లేదనే అంటున్నారు జొమాటోకి చెందిన ‘బ్లింకిట్’ ఉద్యోగులు. బ్లింకిట్ యాప్‌కు చెందిన సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు. డెలివరీ చేయడం మానేశారు. దీంతో ఆ సంస్థ దేశ వ్యాప్తంగా 400 స్టోర్ల నుంచి సర్వీసుల్ని అందిస్తుండగా.. ఉద్యోగుల నిర్ణయంతో వాటిలో పదుల సంఖ్యలో స్టోర్లు మూత పడ్డాయి. మరోవైపు సిబ్బంది ఆందోళన చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల బ్లింకిట్ కొత్త చెల్లింపుల పద్దతిని అమలు చేసిందని, ఆ నిర్ణయం వల్ల గతంలో డెలివరీ చేసిన ఆర్డర్లకు పొందే వేతనాలు బాగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జొమాటో మెయిల్ కాగా,ఉద్యోగులకు జొమాటో మెయిల్ పెట్టింది. ఆ మెయిల్లో రైడర్ల కోసం కొత్త చెల్లింపుల పద్దతిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ పద్దతిలో చేసే డెలివరీల ఆధారంగా చెల్లింపులు ఉంటాయని, షట్‌డౌన్ చేసిన స్టోర్లను తిరిగి ప్రారంభించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసింది. చదవండి👉 జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా! -
చర్చలు సఫలం.. మెట్రో ఉద్యోగుల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: మెట్రో సిబ్బంది చేస్తున్న సమ్మె బాట వీడారు. తమ డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో మెట్రో టికెటింగ్ ఉద్యోగులు సమ్మె విరమించారు. అయితే, వేతనాల అంశంలో మెట్రో టికెటింగ్ ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వీరి సమ్మెపై కియోలిన్ అధికారులు స్పందించారు. వేతనం రూ. 20వేలు పెంచేదిలేదని స్పష్టం చేశారు. ఇక, ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు. -
హైదరాబాద్: మెరుపు సమ్మెపై మెట్రో యాజమాన్యం స్పందన
సాక్షి, హైదరాబాద్: జీతాల పెంపు పేరుతో మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెపై హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు ధర్నాలో పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. ఐదేళ్లుగా తమ జీతాల్లో పెరుగుదల లేదని ఆరోపిస్తూ.. అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్యోగుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే.. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు కచ్చితంగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం రూ. 11 వేలుగా ఉన్న జీతాన్ని.. కనీస వేతనం కింద రూ. 18 వేలకు పెంచాలంటూ టికెటింగ్ ఉద్యోగులు విధుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు. రెడ్ లైన్(మియాపూర్-ఎల్బీనగర్) మధ్య టికెట్ కౌంటర్ల వద్ద సిబ్బంది కొరతతో క్యూ లో టికెట్ల కోసం ప్రయాణికులు అవస్తలు పడుతున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
-
మూడో ఏడాదీ నష్టపోతే ఇక పిల్లల చదువులు ఏం కావాలి?: సీఎం జగన్
సమ్మె ఎవరికి కావాలంటే.. ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ, కడుపుమంట ఉన్నవారికి మాత్రమే సమ్మె కావాలి. పార్టీల పరంగా ఎర్రజెండాల వారికి కావాలి.. చంద్రబాబు దత్తపుత్రుడికి కావాలి.. మీడియా ముసుగులో వ్యక్తుల పరంగా నడుపుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కే సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతోందంటే వారికి పండగే. కానీ సంధి జరగడంతో ఏడుపు ముఖం పెట్టారు. సమ్మె విరమించారని తెలియగానే పచ్చజెండాల ముసుగులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు తోశారు. ఎదుట ఎర్రజెండా.. వెనుక పచ్చ అజెండా.. ఇదీ పరిస్థితి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ వల్ల రాష్ట్రంలో రెండేళ్లు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉత్పన్నం కాగా ఇప్పుడు కొందరు టీచర్లను రెచ్చగొడుతూ రోడ్డెక్కిస్తే పిల్లల చదువులు ఏం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఆందోళనకు దిగుతున్న వారు తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మూడో ఏడాదీ చదువులను గాలికి వదిలేస్తారా? అని మండిపడ్డారు. రెచ్చగొట్టే నాయకులు, ఎల్లో మీడియా వీళ్లంతా నిజంగా మనుషులేనా? అని ధ్వజమెత్తారు. ఇంత మంచి చేస్తున్నా ప్రభుత్వంపై బురదజల్లడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ధర్మమేనా? అని ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. జగనన్న చేదోడు పథకం ద్వారా మంగళవారం లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. గత రెండేళ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు గణనీయంగా వేతనాల పెంపుతో పాటు నిరుద్యోగ యువతకు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల వివరాలను ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఒక్క విషయం... ఇక్కడ ఒక విషయం ఆలోచించమని సవియనంగా కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరు కోరుకుంటారు? ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు కోరుకోరు. నేను ఇంతగా ప్రేమించే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కూడా కోరుకోరు. ఈ రెండున్నరేళ్లలో నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా లంచాలు, వివక్షకు తావులేకుండా రూ.1.27 లక్షల కోట్లు అందుకున్న ఏ కుటుంబమూ కోరుకోదు. ఏ ఒక్క సామాజిక వర్గమూ కోరుకోదు. సంతోషంగా సంతకాలు చేసి మళ్లీ.. ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా పరిష్కారమయ్యాక ఆ ప్రక్రియలో భాగస్వాములైన వామపక్షాలకు సంబంధించిన సంఘాలు సంతకాలు చేసి సంతోషాన్ని వెలిబుచ్చాయి. కానీ మరుసటి రోజు వామపక్షాల యూనియన్లు, పచ్చ పార్టీల యూనియన్లు పోరుబాట పడతామని, రోడ్డెక్కుతామని అంటుంటే బాధనిపిస్తోంది. చదువులు ఏం కావాలి? కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. కేవలం పాస్ చేస్తూ పోతున్నాం. ఇది మూడో సంవత్సరం. పరీక్షల సమయం సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు కొంతమంది టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల చదువులేం కావాలి? వాటి బాధ ఏమిటంటే... ఆశా కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారని ఈరోజు ఈనాడులో ఫోటో వేశారు. వాళ్లను ఈడుస్తున్నట్లు ఫోటో వేశారు. ఇది ఆ అక్కచెల్లెమ్మల మీద ప్రేమ ఉందని చూపించుకునే అభూత కల్పన. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారని ఈనాడు గుండెలు బాదుకోవడం వెనుక పచ్చ అజెండా దాగుంది. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో చానళ్ల బాధ అంతా ఇంతా కాదు. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆందోళన చేయండి.. మీకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి.. మా బాబు పాలనే బాగుందని చెప్పండి.. మీకు మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు జెండాలు పట్టుకోండి.. ఇదే వాటి బాధ. వీడియోకాన్ఫరెన్స్‌లో లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిని తిడితే మంచి కవరేజ్ ముఖ్యమంత్రిని తిడితే మంచి కవరేజ్ ఇస్తాం. బాగా హైలెట్ చేస్తాం. సోషల్ మీడియాలో ఎవరైనా రాస్తే దాన్ని ప్రధాన వార్తగా కూడా ప్రచురిస్తాం. టీవీల్లో కూడా చూపిస్తాం.. ఇదీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ధోరణి. నిజంగా ఇవి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు చాలా బాధ కలిగినా.. ఇంత దిగజారిపోయిన పరిస్థితి చూస్తున్నప్పుడు ఆ బాధలోనుంచి నవ్వు కూడా వస్తుంది. ఈ స్ధాయికి వీళ్లు దిగజారిపోయేలా దేవుడు నన్ను హెచ్చించాడు అని సంతోషంగా ఉంటుంది. రెండున్నరేళ్లలో కొత్తగా 1,84,264 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ మీద్వారా కొన్ని విషయాలు అందరికీ చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు అంటే మన ప్రభుత్వం ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 3.97 లక్షల మంది ఉన్నారు. ఈ రెండున్నరేళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమిచ్చిన ఉద్యోగాలు మీరే చూడండి. మన కళ్లెదుటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 1.25 లక్షల మంది కనిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగులు కన్న కలలను నెరవేరుస్తూ దాదాపు 51 వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. ఇక మిగిలినవాటిని కలుపుకొంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,84,264 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు 3.97 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉండగా ఈ రెండేళ్లలోనే మనం 1,84,264 ఉద్యోగాలు ఇచ్చామంటే ఏకంగా 50 శాతంపై చిలుకు ఉద్యోగాల పెరుగుదల కనిపించడం లేదా? నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్న వారికి, మాట్లాడుతున్న వాళ్లకి ఇవి కనిపించడం లేదా? మెరుగైన, మంచి జీతాల కోసం ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మోసపోకూడదు, జీతాల కోసం లంచాలిచ్చే పరిస్థితి రాకూడదు, దళారీల బెడద ఉండకూడదు, కమీషన్లు లేకుండా వారికి మెరుగైన, మంచి జీతాలు ఇచ్చే పరిస్థితి రావాలని ఆప్కాస్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. దాదాపు లక్షమందికి పైగా ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ అందిస్తున్న ప్రభుత్వం మనది. ఇతర రాష్ట్రాల్లో పట్టించుకున్నారా? ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం పడుతున్నా చిరునవ్వుతో స్వీకరిస్తున్న ప్రభుత్వం మనది. పక్కనే తెలంగాణ, ఇతర రాష్ట్రాలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కి ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా మమ్మల్ని విలీనం చేసుకోవాలని కోరితే ఒక్క ప్రభుత్వం అయినా పట్టించుకుందా? అని అడుగుతున్నా. గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగాలని కోరుతున్నా. టైం స్కేల్‌పై బాబు వంచన.. చంద్రబాబు ఐదేళ్ల పాలన చూశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇస్తామని ఆశ పెట్టారు కానీ ఒక్కరికైనా చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తున్న ప్రభుత్వం మనది. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు ఏ ఉద్యోగులకు ఎంత జీతం ఇచ్చారో, ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఎంత ఇస్తుందో అందరికీ తెలిసినా మరోసారి గుర్తు చేస్తున్నా. ఎక్కడ రూ.1,198 కోట్లు? ఎక్కడ రూ.3,187 కోట్లు? మన ప్రభుత్వం రాకముందు వరకు 3.07 లక్షల మంది ఉద్యోగులకు సంవత్సరానికి జీతాల ఖర్చు రూ.1,198 కోట్లు అయితే ఈరోజు మన ప్రభుత్వం భరిస్తున్న ఖర్చు రూ.3,187 కోట్లు. ఎక్కడ రూ.1,198 కోట్లు?... ఎక్కడ రూ.3,187 కోట్లు? ఇంత పెద్ద ఎత్తున ఇస్తుంటే ఆందోళన బాట పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు కలసి రాజకీయాలను కల్మషం చేసి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు ఇన్ని జరుగుతున్నా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ బలాన్ని దేవుడు ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలు తోడుగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయం నుంచి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రామోజీరావుకు ముద్దుబిడ్డ... చంద్రబాబు దత్తపుత్రుడు
-
చర్చలకు వచ్చిన 48 గంటల్లోనే సమస్య క్లోజ్: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
-
‘చిన్న సమస్యను ఉద్యోగులు రాద్ధాంతం చేయడం సరికాదు’
సాక్షి, ప్రకాశం: చర్చల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఉద్యోగులు వచ్చి చర్చిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. చిన్న సమస్యను ఉద్యోగులు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని మంత్రి బాలినేని అన్నారు. విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నా విద్యుత్ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా అవకాశం ఉన్నంతమేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెలో ట్విస్ట్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెలో సందిగ్ధం నెలకొంది. విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె విరమించామని ప్రకటించగా.. విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీ మాత్రం సమ్మె కొనసాగుతుందని ప్రకటించడంతో గందరగోళం మొదలైంది. ఎందుకిలా..! మంత్రి జగదీష్‌రెడ్డితో కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ చర్చలు సఫలమయ్యాయనీ, తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చినందున సమ్మె విరమిస్తున్నామని యూనియన్ నేతలు ప్రకటించారు. కార్మికులంతా విధుల్లో చేరాలని చెప్పారు. కాగా, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు తమను చర్చలకు పిలవలేదనీ, సమ్మె కొనసాగుతుందని విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. రేపు సమావేశమై సమ్మె కొనసాగింపుపై నిర్ణయం తీసకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు. -
నేటి నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్(ఆర్టిజన్లు) కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. విద్యుత్ శాఖలో తమను విలీనం చేసుకోవాలనే ప్రధానమైన డిమాండ్‌తో పాటు 16 రకాల డిమాండ్లపై తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గత నెలలో సమ్మె నోటీస్ ఇచ్చింది. శుక్రవారం ఈ డిమాండ్లపై యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ గౌడ్, సాయిలుతో కార్మిక శాఖ అధికారులు చర్చలు జరిపారు. కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి గంగాధర్ సమక్షంలో జరిగిన చర్చలకు ట్రాన్స్‌కో సంయుక్త కార్యదర్శి శోభరాణి , ఎస్పీడీసీఎల్ ప్రతినిధి లోక్యానాయక్లు హాజరయ్యారు. డిమాండ్లు పరిష్కరించలేం... కోర్టులో ఈ వివాదం ఉన్నందున డిమాండ్లను ఆమోదించడం కోర్డు ధిక్కారమే అవుతుందని, న్యాయ వివాదం తేలేదాకా డిమాండ్లను పరిష్కరించలేమని డిస్కమ్‌ల ప్రతినిధులు స్పష్టం చేశారు. డిమాండ్లేవీ పరిష్కారం కాకపోవడంతో శనివారం నుంచి ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్లలోని 18 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్తారని, సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టం–1947 ప్రకారం ఆర్టిజన్లకు సమ్మె చేసే అధికారం లేదని చేప్పే అధికారులు, ఆ చట్టంలోని ఎస్మా ఏ విధంగా అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. సమ్మె చట్ట విరుద్ధం:ట్రాన్స్‌కో జేఎండీ జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్లో ఆర్నెల్ల పాటు సమ్మెపై నిషేధం ఉందని, కార్మికులు సమ్మెలో పాల్గొంటే ఎస్మా అమలు చేస్తామని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు హెచ్చరించారు. 18 వేల మంది సమ్మెలోకి... డిస్కమ్‌లలో 23 వేల మంది ఉండగా, 18 వేల మంది సమ్మెలోకి వస్తున్నారని, సబ్స్టేషన్లలో విధులు, కరెంట్ స్తంభాలు, ఎమర్జెన్సీ సర్వీసులకు దూరంగా ఉంటా మన్నామని అధ్యక్షడు శ్రీధర్‌గౌడ్ తెలిపారు. డిమాండ్లను పరిష్కరించే దాకా సమ్మె కొనసాగుతుందన్నారు. కార్మికులను శాంతింపచేయడానికి శనివారం రాత్రి ఎస్పీడీసీఎల్ సీంఎడీ రఘుమారెడ్డి రంగంలోకి దిగారు. డిమాండ్లు పరిష్కరించలేని అనివార్య స్థితిలో ఉన్నామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. డిస్కమ్‌లో గ్రేడ్–4 ఆర్టిజన్లు సాంకేతిక విధులు నిర్వహిస్తుంటే వారి విదార్హతల ఆధారంగా ప్రత్యేక అలవెన్సు వర్తింపచేస్తామని హామీ ఇవ్వగా.. విలీనంపై స్పష్టత ఇచ్చేదాకా సమ్మె కొనసాగుతుందని కార్మికులు తేల్చి చెప్పారు. -
బ్యాంక్‌లు బంద్ ; ఏటీఎంలపై తీవ్ర ప్రభావం
-
బ్యాంకుల సమ్మె; ముందే జీతాలు వేసినా..
న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకు ఉద్యోగులు మే 30, 31 తేదీల్లో ఈ బంద్‌లో పాల్గొననున్నారు. ఈ రెండు రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నెల ముగింపు కావడంతో, ఉద్యోగుల వేతనాలు పడేది కూడా ఈ రోజుల్లోనే. మే 30, 31 తేదీల్లో బ్యాంకుల బంద్ కాబట్టి, కంపెనీలు లేదా ఆర్గనైజేషన్స్ తమ ఉద్యోగుల వేతనాలను ఈ రోజే(మంగళవారమే) క్రెడిట్ చేసే అవకాశముంది. ఉద్యోగుల వేతనాలు నేడే క్రెడిట్ అయినప్పటికీ, వాటిని ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వీలు లేకుండా..ఈ బంద్ దెబ్బకొట్టనుంది. ఈ బంద్‌లో ఏటీఎం గార్డులు కూడా పాలుపంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎంలు మూతపడబోతున్నాయి. దీంతో వేతన విత్‌డ్రాయల్స్ కష్టతరంగా మారనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. థర్డ్ పార్టీతో కలిసి బ్యాంకులు ఏటీఎంలను నింపినప్పటికీ, ఏటీఎంల సెక్యురిటీ మాత్రం ప్రశ్నార్థకమే. దీంతో నగదు విత్‌డ్రాయల్స్‌లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బంద్ నేపథ్యంలో కస్టమర్లు భారీ ఎత్తున్న నగదు విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో నగదు కొరత కూడా ఏర్పడుతుందని అపెక్స్ బ్యాంకు యూనియన్ ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. అయితే ఈ రెండు రోజులు మాత్రం ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కేవలం 2 శాతం వేతన పెంపును మాత్రమే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆఫర్ చేయడాన్ని నిరసిస్తూ.. బ్యాంకు యూనియన్లు ఈ బంద్ చేపడుతున్నాయి. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. గత రెండు నుంచి మూడేళ్లుగా బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం జన్‌ధన్, డిమానిటైజేషన్, ముద్రా, అటల్ పెన్షన్ యోజన వంటి వాటిని ఎంతో కృతనిశ్చయంతో అమలు చేస్తూ వస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని యూనిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ల కన్వినర్ దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు. 2017 నవంబర్ నుంచి వేతనాల పున:సమీక్ష పెండింగ్‌లో ఉందని, వెంటనే వాటిని సమీక్షించాలని డిమాండ్ చేశారు. -
20న హెల్త్ మిషన్ ఉద్యోగుల సమ్మె
కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న డిమాండ్తన్నీ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో హెల్త్ మిష¯ŒS ఉద్యోగులందరూ పాల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియ¯ŒS జిల్లా అధ్యక్షుడు జీవీ రమణ కోరారు. స్థానిక కచేరిపేట సీఐటీయూ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో నిర్వహిస్తున్న సమ్మె చేస్తున్నట్టు చెప్పారు. రెగ్యులర్ ఏఎ¯ŒSఎంలతో సమానంగా పనిచేస్తున్న సెకండ్ ఏఎ¯ŒSఎం, లాబ్ టెక్నిషీయ¯Œ్స, ఫార్మాసిస్టులకు రూ.21,230 జీతం, స్టాఫ్‌నర్స్‌లకు రూ.25,140 ఇవ్వాల్సి ఉండగా, యాభై శాతం తక్కువ ఇస్తూ ప్రభుత్వం శ్రమ దోపీడీ చేస్తోందని యూనియ¯ŒS ఏపీ ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డీఏ రత్నరాజు, సెకెండ్ ఏఎ¯ŒSఎంల యూనియ¯ŒS జిల్లా కార్యదర్శి జి.వరలక్ష్మి, 104 యూనియ¯ŒS కార్యదర్శి కేపీ నాయుడు, జీజీహెచ్ శాఖ అధ్యక్షురాలు శ్యామల, పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
12,13 తేదీల్లో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల ప్రతిపాదిత విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు నిరసనగా జూలై 12,13 తేదీల్లో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ)బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలంకావడంతో తాము గతంలో ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేయనున్నట్లు ఆల్ అండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం చెప్పారు. జూలై 12న కేవలం ఐదు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేస్తారని, ఆ మరుసటిరోజు జూలై 13న ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని ఆయన వివరించారు. -
సరోజినీదేవి ఆస్పత్రి ఉద్యోగుల ధర్నా
మెహిదీపట్నం (హైదరాబాద్): రెండు నెలలుగా జీతాలు సరిగా ఇవ్వక పోవడంతో సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కాంట్రాక్టు సిబ్బంది శుక్రవారం విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బంది ఆస్పత్రి ప్రధాన ద్వారం ముందు కూర్చుని తమ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు నెలల నుంచి జీతాలు అందక పోవడంతో కుటుంబం గడిచే పరిస్థితి లేదని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే మరింతగా ఉద్యమిస్తామన్నారు. కాగా, రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.కె.వినోద్‌కుమార్ తెలిపారు. -
దేవునికి హారతిచ్చేవారేరీ?
ఆలయాల్లో నిలిచిపోయిన ఆర్జిత సేవలు * రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో మొదలైన సమ్మె * హామీ ఇచ్చేదాక విరమించేది లేదని జేఏసీ స్పష్టీకరణ * కావాలనే కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపణలు * భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలకు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరుతూ దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులు, ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరగలేదు. ఉదయం, సాయంత్రం పూట జరపాల్సిన నిత్య పూజలతో సరిపుచ్చారు. చివరికి దేవుడికి హారతిచ్చే వారు కూడా లేకపోవటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గత జూన్‌లో సమ్మె చేసిన సమయంలో అర్చకులు, ఆలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ల పరిశీలనకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ ఇవ్వకపోవడంతో అర్చకులు, ఉద్యోగుల జేఏసీ మళ్లీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈసారి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు గంగు భానుమూర్తి, రంగారెడ్డి తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగానే ఉన్నప్పటికీ కొందరు అడ్డుతగులుతున్నారని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కమిటీ నివేదిక అందించేందుకు వివరాలు ఇవ్వడంలో దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ సంఘీభావం.. మంగళవారం చిక్కడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుంచి కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఆర్ఐ సమీపంలోని హనుమదాలయం వద్ద వంటావార్పు నిర్వహించారు. భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలను సమ్మె నుంచి మినహాయించారు. సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం, ఉజ్జయిని మహంకాళి ఆలయం, బాసర సరస్వతీ దేవి ఆలయం తదితర పెద్ద దేవాలయాల్లో పూజారులు ఆర్జిత సేవలు నిర్వహించి సమ్మెకు సంఘీభావం తెలిపారు. కాగా, సమ్మెలో పాల్గొనే అర్చకులు, ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తామని దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారని జేఏసీ నేతలు తెలిపారు. సమ్మెలో పాల్గొనే వారి వివరాలను మధ్యాహ్నం వరకు ప్రధాన కార్యాలయానికి పంపుతామని, అక్కడి నుంచి వారి పేరుతో మెమోలు జారీ అవుతాయని ఈవోలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
ఆరోగ్యశ్రీ సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు బీమా పథకం పెట్టాలని కోరారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం తగదన్నారు. ఒక సదాశయంతో వైఎస్ పెట్టిన పథకాన్ని మరింత మెరుగులు దిద్ది రోగులకు చేరువ చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించటం తగదన్నారు. నిండు శాసనసభలో ప్రకటించిన లక్షకు పైచిలుకు ఉద్యోగాలకూ, శనివారం సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన 15 శాఖల్లోని 15 వేల ఉద్యోగాలకూ పొంతన లేదన్నారు. మిగతా ఉద్యోగాలు మాటేమిటని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. -
కొత్తకొత్తగా..
- జిల్లాకు 77 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు - వచ్చే నెలాఖరుకు సిద్ధం - తొలి ప్రాధాన్యంగా పుష్కరాల కోసం కేటాయింపు సాక్షి, విజయవాడ : జిల్లాకు మరో 77 కొత్త బస్సులు మంజూరయ్యాయి. ఈ ఏడాది మొదటి అర్థ సంవత్సరానికి జేఎన్ఎన్యూ ఆర్ఎం కింద ఈ బస్సులు మంజూరయ్యాయి. వాస్తవానికి రెండు నెలల కిందటే మంజూరైనప్పటికీ ఆర్టీసీ విభజన ప్రక్రియ, ఉద్యోగుల సమ్మె, ఇతర కారణాలతో కేటాయింపుల్లో కొంత ఆలస్యం జరిగింది. ఈ క్రమంలో ఎట్టకేలకు కేటాయింపు ప్రక్రియ ఖరారు కావడంతో వచ్చే నెలాఖరుకు బస్సులు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అన్నీ విజయవాడ పరిధిలోకే.. జిల్లాలో ఇప్పటికే జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు దాదాపు 300 వరకు ఉన్నాయి. కాలంచెల్లిన బస్సుల్ని తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సుల్ని నడుపుతున్నారు. గత ఏడాది దశలవారీగా జిల్లాకు 150కుపైగా కొత్త బస్సులు మంజూరయ్యాయి. ఈ ఏడాది మొదటి ఆర్థిక సంవత్సరం నిధుల ద్వారా 90 బస్సుల్ని కేటాయించారు. వీటిలో 13 ఏసీ సర్వీసులు, మిగిలినవి 77 లోకల్ సబర్బన్ బస్సులు. ఏసీ బస్సులు మూడు నెలల కిందటే సిద్ధం కావడంతో వాటిని జిల్లాకు కేటాయించారు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు, గవర్నర్‌పేట, ఆటోనగర్ డిపోలకు కేటాయించారు. వచ్చే నెలాఖరులో వచ్చే 77 కొత్త బస్సులను కూడా నగరంలోని డిపోలకే మంజూరు చేయనున్నారు. వీటిని మెట్రో సర్వీస్ రూట్లో నడపనున్నారు. విజయవాడ-గుంటూరు, విజయవాడ-ఏలూరు, విజయ వాడ-గుడివాడ, విజయవాడ, నందిగామ, విజయవాడ- తెనాలి తదితర రూట్లతో పాటు నగరంలో సిటీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా ఇవి నడుస్తాయి. పాత బస్సుల స్థానే.. నగరంలో ఇప్పటికే 520 సిటీ సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ ఆర్డినరీ, డీలక్స్, మెట్రో సర్వీసులు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 12 నుంచి 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల్ని నిలిపివేసి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేయాలి. అలా ప్రస్తుతం 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు నగరంలో 25 ఉన్నాయి. ఈ క్రమంలో నూతనంగా మంజూరయ్యే 77 బస్సుల్లో 30 బస్సుల్ని సిటీ సర్వీసుకే కేటాయించనున్నారు. నగరంలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సగటున 70 శాతం వరకు ఉంటుంది. ఆక్యుపెన్సీ పెంచే దిశగా ఆర్టీసీ కొత్త సర్వీసుల ద్వారా ఎక్కువ స్టాప్స్ ఏర్పాటుచేసి సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రస్తుతం పుష్కరాలకు ఎక్కువ రద్దీ, వందల సంఖ్యలో అదనపు సర్వీసులు అవసరం ఉండటంతో ఇప్పటికే సిద్ధమైన బస్సులను తొలి ప్రాధాన్యతగా తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారు. -
జనవరిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై: తమ వేతనాల పెంపుపై సత్వర పరిష్కారాన్ని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు జనవరిలో ఐదు రోజుల సమ్మెకు దిగనున్నారు. జనవరి 7న ఒక రోజు సమ్మెతో నిరసన తెలియజేయాలని ఈ నెల 17న ముంబైలో జరిగిన ఉద్యోగ సంఘాల (యూఎఫ్‌బీయూ) భేటీలో నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రకటించింది. జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సమ్మె తలపెట్టామని, అప్పటికీ పరిష్కారం లభించకుంటే మార్చి 17 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొంది. వేతన పెంపునపై చర్చల్లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కాలయాపన ధోరణిపై భేటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. -
7న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
ఇటీవలే సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టబోతున్నారు. వచ్చేనెల ఏడో తేదీ ఒకరోజు సమ్మెకు అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రెండోదఫా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగుల సంఘ నాయకులు తెలిపారు. ఆ నాలుగు రోజుల సమ్మెకు సైతం స్పందించకపోతే మార్చి 16వ తేదీ నుంచి బ్యాంకు ఉద్యోగులు నిరవధిక సమ్మెలో వెళ్లబోతున్నారు. -
షూటింగ్‌లు బంద్..చాంబర్లో చర్చలు..
సోమవారం తెలుగు సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. చలనచిత్ర సీమకు చెందిన కార్మికుల వేతనాలు, ఇతర అంశాలపై ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులకూ, నిర్మాతలకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ సోమవారం నుంచి షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్‌లకు అవాంతరం ఏర్పడడంతో సోమవారం సాయంత్రం నుంచి ఇరు వర్గాల మధ్య హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిలింఛాంబర్లో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. దీనిపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి. కొందరు నిర్మాతల్లో మిశ్రమ స్పందన కనిపించినా... సినీ కార్మికులకు అనుకూలంగానే ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. సోమవారం చర్చ ఆసాంతం కార్మికుల పనివేళలు, బేటాల పైనే జరిగింది. ఆ వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి రాలేదు. ఇంకా వేతనాలు, తదితర అంశాల గురించి చర్చించాల్సి ఉంది’’ అని వివరించారు. ఈ వార్త ప్రచురించే సమయానికి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ‘‘మంగళవారం కూడా షూటింగ్‌ల బంద్‌ను కొనసాగించాలా, వద్దా అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అది రాత్రి పొద్దుపోయాక వచ్చే చర్చల ఫలితాన్ని బట్టి ఉంటుంది’’ అని వెంకటేశ్ చెప్పారు. -
విద్యుత్ సంక్షోభం దిశగా రాష్ట్రం!
హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల మెరుపు సమ్మెతో విద్యుత్ సంక్షోభం దిశగా రాష్ట్రం ప్రయాణిస్తోంది. సమ్మెపై ఉద్యోగులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దాంతో చేసేదేమిలేక విద్యుత్ అధికారులు, యాజమాన్యాలు పరిశ్రమలన్నింటికి పవర్ కట్ ట్రాన్స్‌కో చేసింది. ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలను ట్రాన్స్‌కో పెంచింది. ఆర్టీపీపీ, వీటీపీఎస్, కేటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో విద్యుత్ కొరత ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి 11000 నుంచి 6000 మెగావాట్లకు ఉత్పత్తి పడిపోయింది. -
కరెంటుకు సమ్మె షాక్
సాక్షి, రాజమండ్రి :అసలే విద్యుత్ కోతలతో సతమతమవుతున్న వినియోగదారులకు ఆ శాఖ ఉద్యోగుల సమ్మెతో పుండు మీద కారం జల్లినట్టైంది. ఆదివారం ఉదయం నుంచీ జిల్లావ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులందరూ మెరుపు సమ్మెకు దిగడంతో ప్రజల కరెంటు కష్టాలు రెట్టింపయ్యాయి. సాయంత్రం జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయాలు అధికమయ్యాయి. తలెత్తుతున్న సమస్యలను ఈపీడీసీఎల్ అధికారులు తాత్కాలిక సిబ్బందితో పరిష్కరించగలిగినా సరఫరా లోటును అధిగమించలేక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సుమారు 1700 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పూనుకున్నారు. ఈ ప్రభావం 140కి పైగా సబ్స్టేషన్ల పరి ధిలో విద్యుత్ పంపిణీపై పడింది. గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇంజనీర్లు కాంట్రాక్టు సిబ్బంది సహకారంతో సరఫరాను పునరుద్ధరించడానికి పగలు ప్రయత్నించినా సాయంత్రానికి చేతులెత్తేశారు. జెన్కో సిబ్బంది కూడా సమ్మెలో ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రానికి 800 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడ్డట్టు అధికారులు వెల్లడించారు. జెన్కో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రభావం మధ్యాహ్నం నుంచి జిల్లాపై కూడా పడింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రాత్రి ఏడు గంటల నుంచి మూడు గంటలపాటు కోత విధించారు. అమలాపురం, రాజోలు, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి మూడు గంటల పాటు సరఫరా నిలిపి వేశారు.పరిశ్రమలకు సరఫరా బంద్విద్యుత్ కొరత మరింత పెరిగే అవకాశాలుండడంతో ఈపీడీసీఎల్ అధికారులు జిల్లాలోని పరిశ్రమలకు సాయంత్రం ఆరుగంటల నుంచి పూర్తిగా సరఫరా నిలిపివేశారు. ఉత్పత్తి గాడిలో పడేవరకూ పరిశ్రమలకు సరఫరా పునరుద్ధరించకూడదని నిర్ణయించారు. సిబ్బంది సమ్మె ప్రభావం గృహ వినియోగదారులపై పడకుండా జాగ్రత పడుతున్నామని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు గంగాధర్ చెప్పారు. వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘం దూరం కాగా సమ్మెకు వైఎసా్సర్ కాంగ్రెస్ విద్యుత్ ఉద్యోగుల సంఘం దూరంగా ఉంది. మిగిలిన యూనియన్లు సమ్మె విషయంలో తమను కలుపుకొనిపోకుండా ఒంటెత్తు పోకడలతో వ్యవహరించడమే అందుకు కారణమని యూనియన్ ప్రతినిధి ప్రభాకర్ నాయుడు చెప్పారు. ఆ సంఘం సభ్యులు విధులకు హాజరై అత్యవసర పనులను నిర్వర్తిస్తున్నారు. దాంతో సమ్మె తొలిరోజు అధికారులు కాస్త ఊపిరి పీల్చుకోగలిగారు. సమ్మెలో జెన్కో సిబ్బంది వై.రామవరం, న్యూస్‌లైన్ : వేతన సవరణ వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ డొంకరాయిలోని ఏపీ జెన్కో జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ఆదివారం సుమారు వందమంది సిబ్బంది విధులను బహిష్కరించారు. ఇద్దరు అధికారులు మాత్రమే జలవిద్యుత్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం. కాగా ఆదివారం రాత్రి తమ రాష్ట్ర యూనియన్ నాయకులు ప్రభుత్వంతో నిర్వహిస్తున్న చర్చలు సఫలం కాకపోతే సోమవారం నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు. -
'మెరుపు సమ్మెపై సాయంత్రంలోగా స్పష్టత ఇవ్వాలి'
75 వేల మంది విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న మెరుపు సమ్మెపై సాయంత్రంలోగా స్పష్టత ఇవ్వాలని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ఛైర్మన్ సత్యానందం ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయాల్సిన పాలసీ రాష్ట్రం విడిపోయాక సాధ్యం కాదన్నారు. పీఆర్సీ అంశం తేలేవరకు సమ్మె విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై గవర్నర్ వెంటనే స్పందించాలని సత్యానందం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి జూన్ 2వ తేదీ అపాయింట్మెంట్ డే. ఈ నేపథ్యంలో ఆ తేదీ కంటే మందుగానే తమకు పీఆర్సీ అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు మొరుపు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అమలు చేసిన విధానాన్ని విభజన తర్వాత సాధ్యం కాదని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
ట్రాన్స్‌కో ఉద్యోగుల సమ్మె వాయిదా
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా చేపట్ట తలపెట్టిన నిరవధిక సమ్మె ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేయాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. దానికి బదులుగా జిల్లాలోని ఈ శాఖ ఉద్యోగులు బుధవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించనున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉన్న ట్రాన్స్‌కో ఉద్యోగ సంఘాల నాయకులు సోమవారం విశాఖలో సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు. రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన ఈ సమావేశంలో సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 17 నుంచి అన్ని విభాగాల్లోనూ నిరవధిక సమ్మె చేపట్టాలని మొదట భావించినప్పటికీ పార్లమెంటులో విభజన బిల్లు సంగతి తేలిన తర్వాత దీనిపై తుది నిర్ణ యం తీసుకోవాలని, ప్రస్తుతానికి బుధవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. -
ఈ పరిస్థితుల్లో మున్సి‘పోల్స్’ అసాధ్యం
‘సుప్రీం’ తలుపుతట్టాలని ప్రభుత్వ నిర్ణయం హైకోర్టు ఆదేశాలపై ఎస్ఎల్పీ దాఖలుకు సిద్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నివేదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికలను నాలుగు వారాల్లో నిర్వహించాలంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేయడానికి సిద్ధమైంది. తాము ఆదేశాలిచ్చినా మున్సిపల్ ఎన్నికలను అడ్డుకుంటోందెవరు? పేర్లు వెల్లడించండంటూ హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు పురపాలక శాఖ అధికారులు మూడ్రోజుల కిందట పంపిన ఫైలును ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఆయన ఆదేశాలతో అధికారులు ఎస్ఎల్పీని గురువారమే సిద్ధం చేసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఆమోదం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రతి అధికారికంగా అందిన వెంటనే ఈ ఎస్ఎల్పీని సుప్రీంకోర్టులో దాఖలు చే యనున్నారు. వాయిదాకే సీఎం మొగ్గు... రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు 2010 సెప్టెంబర్ నుంచి ఎన్నికలు లేవు. వాటి నిర్వహణ కోసం పలువురు కోర్టుకెళ్లినా... ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన, సాధారణ ఎన్నికలతో సంబంధం లేకుండా మున్సి‘పోల్స్’ నిర్వహించడానికి తాము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలోనే నాలుగు వారాల్లో నిర్వహించాలంటూ హైకోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 146 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 9 నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ ఎన్నికల వాయిదాకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మొగ్గు చూపించారు. -
ఉద్యోగుల సమ్మె
సాక్షి, గుంటూరు :రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్జీవోలు గురువారం ఉదయం నుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం 12 ప్రభుత్వ శాఖలకు చెందిన 10 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. రోజు వారీ విధులకు గైర్హాజరై కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు నిర్ణయించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఎన్జీవో సంఘ కార్యాలయంలో జరిగిన సమైక్య ఉద్యోగ జేఏసీ సమావేశంలో ఈ మేరకు నాయకులు నిర్ణయం తీసుకున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా ఎన్జీవో సంఘ నాయకులు సమ్మెబాట పట్టారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, వ్యవసాయ, ట్రెజరీ, వైద్య ఆరోగ్య, కమర్షియల్ ట్యాక్సు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, ఫారెస్టు, కార్మిక, మహిళా సంక్షేమం విభాగాలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. విద్యుత్ జేఏసీ నాయకులు మాత్రం గురువారం ఎన్జీవోలు నిర్వహించే నిరసన ప్రదర్శనలో పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించనున్నారు. ఆర్టీసీ, ఉపాధ్యాయ, ఇరిగేషన్ శాఖల ఉద్యోగులు ఇంకా ఏ విషయాన్నీ వెల్లడించలేదు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లో సమైక్య ప్రదర్శన నిర్వహించి శుక్రవారం సమైక్య ఉద్యమాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్టు ఎన్జీవో సంఘ నేత రామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకుడు వెంకయ్య, మున్సిపల్ ఉద్యోగుల సంఘం నేత నమ్రతకుమార్, సర్వే విభాగం నేత లక్ష్మీనారాయణ, ఈశ్వరప్రసాద్ (ఆర్ అండ్ బీ), సత్యనారాయణ (ఎక్సైజ్), కోటేశ్వరరావు (సాంఘిక సంక్షేమశాఖ), మస్తాన్‌రావు (ఉమెన్ వెల్ఫేర్), రహమాన్ (వ్యవసాయ)తో పాటు నగర కమిటీ నేతలు దయానందరాజు, ప్రభాకరరావులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తాం: అశోక్‌బాబు
సమ్మెలో కొనసాగుతూనే తుపాను ప్రాంతాల్లో సేవలందిస్తాం 17 నుంచి బ్యాంకుల మూసివేత.. కేంద్ర కార్యాలయాల దిగ్బంధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించేవరకూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెను తుపాన్ ముప్పు ఎదుర్కొంటున్న కోస్తాంధ్రలో తమ ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతూనే సేవలందిస్తున్నారని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 15వతేదీన మండల స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. 13వతేదీ నుంచి 15 వరకు చెన్నై వెళ్లి డీఎంకే, ఏఐడీఎంకె పార్టీల అధినేతలను కలసి ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరతామన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి 19 వరకు బ్యాంకుల మూసివేత, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్భంధం చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్తు ఉండదు రాష్ట్ర విభజన వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలపై కనీస అవగాహనలేని కేంద్ర మంత్రులతో కమిటీ వేయడం, వారు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండడం తెలుగు ప్రజల దురదృష్టమని అశోక్‌బాబు పేర్కొన్నారు. మంత్రుల కమిటీ(జీవోఎం) లోపభూయిష్టంగా ఉందని, ఇరు ప్రాంతాల వారిని మోసగించేలా అది ఏర్పాటైందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రజలను ప్రభుత్వం మోసగిస్తుండడం ఇదే ప్రప్రథమమన్నారు. కోట్లాది మంది ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేనట్లేనని స్పష్టం చేశారు. రాజకీయ భవిష్యత్తు కోరుకునే పార్టీలు విభజన నిర్ణయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్‌రెడ్డి, వీరేంద్రబాబు, సీవీ రమణ, రత్నకుమారి, జానకి తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ మాగుంట రాజీ‘డ్రామా’పై ఉద్యోగుల ఫైర్
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి మరోసారి సమైక్యాంధ్ర సెగ గట్టిగా తగిలింది. పదవికి రాజీనామా చేయకుండా నాటకాలాడుతూ ప్రజలను, ఉద్యోగులను మభ్యపెడుతున్నాడంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు ఎంపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలవని ఎంపీ మాగుంట వ్యవహార శైలిపై ఇప్పటికే ఉద్యోగులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఒంగోలు వచ్చిన ఎంపీ మాగుంట కు ఉద్యోగుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి స్థానిక రామ్‌నగర్‌లోని ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎంపీ వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీ మాగుంట స్పందిస్తూ.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను చాలా రోజుల క్రితమే రాజీనామా చేశానని వివరించే ప్రయత్నం చేశారు. లోక్‌సభ స్పీకర్ తన రాజీనామా ఆమోదించడం లేదని, ఎంపీ కోటా కింద వచ్చే ఏ సౌకర్యాలనూ తాను పొందడం లేదని చెప్పుకొచ్చారు. ఉద్యోగులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు అబ్దుల్‌బషీర్, బండి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, కృష్ణారెడ్డి, స్వాము లు, ప్రకాశ్, కేఎల్ నరసింహారావు, మస్తాన్‌వలి, తోటకూర ప్రభాకర్, నరశింహారావు, శ్యామ్, నాగేశ్వరరావు, నహేమియా, జిలానీ, ఏడుకొండలు, శోభన్‌బాబు, రోజ్‌కుమార్, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులకు పిండ ప్రదానం.. తెలంగాణ బిల్లును కేబినేట్ ముందుకు రానివ్వకుండా అడ్డుకుంటామని చెప్పి సీమాంధ్ర ప్రజలను మోసం చేసిన కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ.. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు ఒంగోలు నగరంలో శవయాత్ర నిర్వహించారు. స్థానిక ముంగమూరురోడ్డులోని సాగర్ కాల్వ వద్ద కేంద్ర మంత్రులకు పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్ మాట్లాడుతూ.. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రజలను నిలువునా ముంచారని దుయ్యబట్టారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులంతా భౌతికంగా నేడు భూస్థాపితం అయ్యారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరో 20 మంది ఎమ్మెల్యేలను పోగు చేశారని, రాష్ట్రం విడిపోవడానికి బొత్స సత్తిబాబే ప్రధాన కారణమని విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు విద్యార్థి జేఏసీ అండగా ఉంటుందన్నారు. విద్యుత్ ఉద్యోగులు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. పిండ ప్రదానం చేసిన వారిలో నగర కన్వీనర్ చెన్నుబోయిన అశోక్‌యాదవ్, వరప్రసాద్, జగన్నాథం మహేష్, జాన్‌పాల్, మురళి తదితరులు ఉన్నారు. -
మా జీతాలు కాదు.. జీవితాలు ముఖ్యం!!
ఆరు పదుల రోజులు దాటిపోయాయి. ఇప్పటివరకు వారికి జీతాలు లేవు.. పొయ్యిలో పిల్లి లేవట్లేదు. ఆకలి కడుపులను అలాగే కట్టుకుంటున్నారు. అయినా, ఉద్యమ స్ఫూర్తిని మాత్రం వదలబోమంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పెద్దలు ఏ ముహూర్తంలో రాష్ట్ర విభజన నిర్ణయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారో.. ఆ క్షణం నుంచే సీమాంధ్ర కాస్తా ఉద్యమాంధ్ర అయ్యింది. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఉద్యమబాట పట్టారు. ఏ నాయకుడూ పిలుపునివ్వకుండానే, ఎవరూ చెప్పకుండానే అందరూ రోడ్ల మీదకు వచ్చేశారు. వారందరికీ రెండు నెలలుగా జీతం రాళ్లు అందట్లేదు. ఇంట్లో పిల్లా జెల్లా ఏం తింటున్నారో తెలీదు. అయినా.. జీతాలు ముఖ్యం కాదు, కోట్లాది మంది రాష్ట్రవాసుల జీవితాలు ముఖ్యమనుకున్నారు. కలిసి కదిలారు.. ఒక్క గొంతై నినదించారు. తమకు కావాల్సింది తెలుగు జాతి ఐకమత్యమే కానీ, తెలుగు గడ్డ విచ్ఛిన్నం కాదన్నారు. రెండు నెలలుగా తమ జీతాలను కూడా కాదనుకుని సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారు ఉద్యోగులు. ఆర్టీసీలో కండక్టర్‌గా చేస్తున్న రాజు తమకు కావాల్సింది సమైక్యాంధ్ర, పిల్లల భవిష్యత్తు అని చెప్పారు. తమకుటుంబాలకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే అయినా సమైక్యాంధ్ర వచ్చేవరకు ఉద్యమిస్తామంటున్నారు ఏపీఎన్జీవోల కుటుంబ సభ్యులు. పిల్లలను గుడి దగ్గర కూర్చోనైనా పెంచుకుంటాం కానీ.. సమ్మె మాత్రం విరమించం అంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. దిగ్విజయ్ సింగ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. విభజన నిర్ణయం ఎందుకు వెనక్కి తీసుకోరో చూస్తామంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టుకున్నామని, పక్క ఇంటి వాళ్ల దగ్గర అప్పు తెచ్చుకున్నామని రాజమండ్రికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి రాజు చెప్పారు. దయతో ఇచ్చిన వాటిని స్వీకరించడానికి ఇష్టమే గానీ సమ్మె మాత్రం విరమించేది లేదన్నారు. తాత్కాలిక ప్రలోభాలకు లొంగితే భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. తమ ఇంట్లో ఆడవాళ్ల బంగారాన్ని తాకట్టు పెట్టి రెండు నెలలుగా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తిరుపతికి చెందిన ఆర్టీసీ కండక్టర్ తాజుద్దీన్ చెప్పారు. రాష్ట్రం విడిపోతే వచ్చే కష్టాల కంటే.. ఈ కష్టాలు తక్కువేనన్నారు. ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉందని తాజుద్దీన్ భార్య హసీనా చెప్పింది. చాలీచాలని జీతాలతో నెట్టకొచ్చే తాము రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తిరుపతి ఆర్టీసీ కార్మికులు చెప్పారు. అయితే.. సమైక్యాంధ్ర కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తామని చెబుతున్నారు. -
సీమాంధ్ర సమ్మెపై సర్కారు ఎస్మాస్త్రం
సీమాంధ్ర జిల్లాల్లో రెండు ప్రధాన ప్రభుత్వ శాఖలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా అస్త్రం ప్రయోగించింది. దాదాపు 60 రోజుల నుంచి ఉధృతంగా సమ్మె సాగుతుండటం, ఒక్క కార్యాలయం కూడా తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ముఖ్యంగా ట్రెజరీ, అకౌంట్స్ శాఖల సిబ్బంది కూడా ఉధృతంగా సమ్మె చేయడం వల్ల ప్రభుత్వానికి కాళ్లు, చేతులు ఆడని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎస్మా అస్త్రాన్ని ప్రభుత్వం బయటకు తీసింది. సీమాంధ్ర జిల్లాల్లో ట్రెజరీ, అకౌంట్స్ విభాగాల సిబ్బంది ఎవరూ సమ్మెలు చేయడానికి వీల్లేదని, అలాగే బంద్ చేయడాన్ని కూడా నిషేధిస్తున్నామని ఈ ఉత్తర్వులలో పేర్కొంది. అత్యవసర విభాగాలు మినహా సీమాంధ్ర 13 జిల్లాల్లో ఉన్న మొత్తం అన్ని విభాగాల సిబ్బంది సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. మునిసిపాలిటీలలో కూడా పారిశుధ్య సిబ్బంది తప్ప అంతా సమ్మెలోనే ఉంటున్నారు. -
ఉద్యోగుల సమ్మెపై వాదనలు ముగిసినట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో దాదాపుగా వాదనలు ముగిశాయి. గత రెండు వారాలుగా సాగిన వాదనలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని, అయితే అవి రెండు పేజీలకు మించరాదని అటు పిటిషనర్లకు, ఇటు ప్రతివాదులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఏపీ ట్రెజరీ సర్వీసు అసోసియేషన్ తరఫున న్యాయవాది ఎమ్మెస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ... సొంత ప్రయోజనాలను ఆశించి దాఖలు చేసే ఇటువంటి వ్యాజ్యాలను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే పలు తీర్పులు వెలువరించిందని చెప్పారు. శాంతిభ్రదతల సమస్య తలెత్తితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఇప్పటికే అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ చెప్పారని, ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏమీ లేవు కాబట్టి, ఈ వ్యవహారంలో కోర్టుల జోక్యం అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ‘సమ్మె విషయంలో కోర్టు సానుకూల ఉత్తర్వులు ఇస్తే దానివల్ల కేవలం పిటిషనర్ మాత్రమే లబ్ధి పొందుతారా..? ప్రజలకు ఉమశమనం కావాలి కదా? సమ్మెను ఆదిలోనే ఆపేందుకు ప్రయత్నించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు’ అని వ్యాఖ్యానించింది. రెండు వారాలుగా ఉద్యోగుల తరఫున పలువురు న్యాయవాదులు చేసిన వాదనలకు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి సమాధానం ఇస్తూ.. సమ్మెను కొనసాగించడంవల్ల ఉద్యోగులు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకోసం కాకుండా ఉద్యోగుల కోసం పనిచేస్తున్నట్లుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నామని పిటిషనర్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ ప్రకటనకు మీరు కట్టుబడి ఉన్నారా..?’ అని ప్రశ్నించగా, తాము కట్టుబడి ఉన్నామని సత్యంరెడ్డి తెలిపారు. అయితే ఆ ప్రకటన ఆధారంగానే ఈ వ్యాజ్యంలో తమ నిర్ణయం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేయగా... అలాగైతే తమ అఫిడవిట్‌లోని ఆ ప్రకటనను తొలగించాలని సత్యంరెడ్డి కోరారు. దీంతో ధర్మాసనం ఆయన అభ్యర్థనను రికార్డ్ చేసుకుంది. వాదనలు విన్న ధర్మాసనం, ఇరుపక్షాలను కూడా ఇప్పటి వరకు జరిగిన వాదనలను రాతపూర్వకంగా రెండు పేజీలకు మించకుండా కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రాతపూర్వక వాదనలను పరిశీలించిన తరువాత ఈ మొత్తం వ్యవహారంలో ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసే అవకాశం ఉంది. -
‘సమైక్యం’కోసం సమ్మెబాట
* బుధవారం అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయుల సమ్మె * రేపు అర్ధరాత్రి నుంచి గెజిటెడ్ ఉద్యోగుల సమ్మె * గుంటూరులో జరిగిన సీమాంధ్రలోని 13 జిల్లాల అధికారుల భేటీలో నిర్ణయం * నేడు సీఎస్‌కు సమ్మె నోటీసు * సమ్మెలోకి 56 ప్రభుత్వ శాఖల అధికారులు * సీఎస్‌కు సమ్మె నోటీసిచ్చిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు * డిమాండ్ పరిష్కారానికి సెప్టెంబర్ 2 వరకు గడువు * లేదంటే అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె సాక్షి, గుంటూరు/ హైదరాబాద్: సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఎన్జీవోల బాటలోనే పలు ఉద్యోగ సంఘాలు సమ్మెబాట పడుతున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాల ఉపాధ్యాయులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్లు గెజిటెడ్ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వచ్చే నెల రెండో తేదీలోగా వెనక్కి తీసుకోకపోతే అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నేతలు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి నోటీసు అందజేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన 56 ప్రభుత్వ శాఖల ప్రభుత్వ గెజిటెడ్ అధికారులు ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆఫీసర్స్ క్లబ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో నిర్వర్తించాల్సిన పాత్రపై చర్చించుకున్న అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు పిడుగు బాబూరావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ గత నెల 30న కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన తరువాత సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం నిర్మితమైందని చెప్పారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏపీఎన్జీవో, రెవెన్యూ అసోసియేషన్లకు చెందిన అన్ని ప్రభుత్వశాఖలకు చెందిన నాన్-గెజిటెడ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా నిరవధిక సమ్మెలోకి దిగారని వివరించారు. వారికి మద్దతుగా సమైక్యరాష్ట్ర సాధనకోసం గెజిటెడ్ అధికారులుగా తమ వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు నిరవధిక సమ్మెకు సన్నద్ధమయ్యామని తెలిపారు. ఇప్పటికే సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో అదనపు సంయుక్త కలెక్టర్ల సారధ్యంలో డీఆర్వోల అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీల ద్వారా గెజిటెడ్ అధికారులను సమ్మెకు సమాయత్తం చేశామనీ, ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోకుండా చేయడమే తమ లక్ష్యమని వివరించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా ఇతర అధికారులెవ్వరూ ప్రభుత్వ విధుల్లో పాల్గొనే అవకాశం లేదని తేల్చిచెప్పారు. వాణిజ్యపన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మురళీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు వాటిల్లే నష్టం ఊహించజాలమని, ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వానికి వాణిజ్య పన్నులద్వారా ఏటా రూ.42వేల కోట్ల ఆదాయం వస్తుండగా, అందులో రూ.27వేల కోట్లు ఒక్క హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌తో పాటు అన్నిశాఖల అధిపతులకు గురువారం ఉదయం 11 గంటలకు సమ్మె నోటీసు ఇస్తున్నామని, సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకూ నిరవధిక సమ్మెలోనే ఉంటామని స్పష్టం చేశారు. 13 జిల్లాల నుంచి సమావేశానికి హాజరైన గెజిటెడ్ అధికారులు చేతులు కలిపి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మేకా రవీంద్రబాబు, ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర నాయుడు, కార్యదర్శి ధర్మచంద్రారెడ్డి, సహాయ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పులిపాక రాణి, కడప డీటీసీ కృష్ణవేణి, భూ పరిపాలన డిప్యూటీ కలెక్టర్ ఎ.ప్రభావతి, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షుడు కె.వెంకయ్య, వివిధ జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లు, కమిషనర్లు, గెజిటెడ్ అధికారులు పాల్గొన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె నోటీసు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నేతలు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి నోటీసు అందజేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని యూపీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల రెండో తేదీలోగా వెనక్కి తీసుకోవాలని గడువు విధించారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకుంటే.. అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. సీఎస్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం ఫోరం నాయకులు కేవీ కృష్ణయ్య, మురళీమోహన్‌తో కలిసి చైర్మన్ యు.మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ... తమ డిమాండ్ పరిష్కారమయ్యేంతవరకూ ఎన్ని నెలలైనా సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. తమను వలసవాదులని సంబోధిస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె ఎలా చేపడతారని రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తమ న్యాయవాదులు ధర్మాసనానికి వివరణ ఇస్తారని తెలిపారు. కొనసాగిన నిరసన విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కూడా సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి సచివాలయంలో నిరసన కొనసాగించారు. ఎల్ బ్లాక్ వద్ద ధర్నా చేసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ ఎదురుగా బైఠాయించి.. తాము వలసవాదులం కాదని, సమైక్యవాదులమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేడు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల రక్తదాన శిబిరం రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలో భాగంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నేడు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో సచివాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఫోరం కార్యదర్శి కె.వి కృష్ణయ్య తెలిపారు. -
‘విభజన’పై సమ్మెచేస్తారా?
* ఉద్యోగ సంఘాలను ప్రశ్నించిన హైకోర్టు * రాజకీయ అంశాలతో మీకేం సంబంధం..? * సమ్మెను ఎలా సమర్థించుకుంటారంటూ ప్రశ్న * ఉద్యమం చేయాలనుకుంటే.. ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలని సూచన * విభజనపై నిర్ణయం తీసుకున్నారా..? లేదా..? చెప్పండి * కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం * సమ్మెను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..? * రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయమూర్తులు * కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణ 26వ తేదీకి వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన వ్యవహారంలో ఉద్యోగులు సమ్మె ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. విభజన నిర్ణయం రాజకీయ అంశమని, రాజకీయ అంశాలతో ఉద్యోగులకు ఏమి సంబంధమని, ఆ విషయమై సమ్మె ఎలా చేస్తారని నిలదీసింది. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనవచ్చునని సూచించింది. విభజన నేపథ్యంలో చేస్తున్న సమ్మెను ఏ విధంగా సమర్ధించుకుంటారో తెలియచేయాలని పేర్కొంటూ ఏపీఎన్జీవో, సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల ఫోరం నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర విభజనపై నిర్ణయం ఏదైనా తీసుకున్నారా..? లేదా..? స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమ్మెను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఉద్యోగ సంఘాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశంపై సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్ ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించి ఏపీఎన్జీవో, సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల ఫోరం ప్రతినిధులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. బుధవారం మరోసారి పిల్ ను విచారించింది. విచారణ ప్రారంభం కాగానే తాము కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని ఉద్యోగ సంఘాల తరఫు న్యాయవాదులు కోరారు. ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘మీపాటికి మీరు కౌంటర్లు దాఖలు చేస్తాం.. సమయం ఇవ్వండని అంటున్నారు. ఇంతకీ అసలు కేసేమిటో చెప్పండి.’ అని అన్నారు. ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి తెలిపారు. ఎందుకు సమ్మె చేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించగా.. తాము సమ్మె ఎందుకు చేస్తున్నామో, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో కౌంటర్లో చెబుతామని ఎన్జీవోల తరఫు న్యాయవాది చెప్పారు. సమ్మె నోటీసును పరిశీలించిన చీఫ్ జస్టిస్.. ‘ఈ నోటీసును చూస్తుంటే ఉద్యోగపరమైన సమస్యల వల్ల సమ్మె చేయడం లేదని నాకు అర్థమవుతోంది. ఉద్యోగుల సమస్యల మీద తప్ప మిగిలిన అంశాలపై సమ్మె చేసే అధికారం మీకు లేదు కదా..?’ అని వ్యాఖ్యానించారు. తమది రిజిస్టర్డ్ బాడీ అని ఎన్జీవోల న్యాయవాది చెప్పగా, ‘రిజిస్టర్ కావచ్చు.. కాకపోవచ్చు. అది ఇక్కడ విషయం కాదు. సమ్మె చేసేం దుకు మీరు కార్మికులు కాదు. అలాంటప్పుడు మీకు సమ్మె చేసే ప్రాథమిక హక్కు ఎక్కడిది..? వెంటనే సమ్మెను విరమించండి’ అని జస్టిస్ సేన్‌గుప్తా అన్నారు. గడువిస్తే పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో కోర్టు ముందుంచుతామన్న ఎన్జీవోల న్యాయవాది, సమ్మె భావవ్యక్తీకరణ హక్కులో భాగమని చెప్పారు. భావవ్యక్తీకరణా..! దానికీ సమ్మెకు ఏ మాత్రం సంబంధం లేదన్న ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ కార్యకలాపాలను ఎందుకు స్తంభింప చేస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజనపై నిర్ణయం ఏదైనా తీసుకున్నారా..? లేదా..? పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్‌ను ఆదేశించారు. సమ్మెను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం, విచారణను ఈ 26వ తేదీకి వాయిదా వేసింది. -
జాతీయ రహదారిపై వంట-వార్పు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరింది. వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ 214వ జాతీయ రహదారిపై వంటా- వార్పు కార్యక్రమం నిర్వహించారు. రోడ్లపైనే సామూహిక భోజనాలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్లు డి.టి.వి. రమణ, స్టీవెన్సన్, ఇతర గెజిటెడ్ అధికారులు కూడా రోడ్లపైనే భోజనాలు చేశారు. యూనియన్ నాయకులు పి.వినయ్ కుమార్, రామనాథం, మాధవి, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. -
పని చేయకపోతే వేతనం లేదు...
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ‘నో వర్క్-నో పే’ అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఉద్యోగుల చేపట్టిన సకల జనుల సమ్మెపై 2011లో ప్రయోగించిన జీవో-177ను ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం ప్రయోగించింది. జీవో-177ను తూచా తప్పకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ప్రత్యేకంగా ఈ నెల 8వ తేదీనే ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నెల నాలుగో తేదీన అత్యవసరంగా విజయవాడలో సమావేశమై రాష్ట్ర విభజన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసు ఇచ్చారని ఆదేశాల్లో సీఎస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై 2011 ఏప్రిల్ నాలుగో తేదీన జారీ చేసిన జీవో-177 ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని, తదుపరి ఆదేశాల కోసం వేచి చూడవద్దని స్పష్టం చేశారు. సచివాలయంలోని అన్ని శాఖలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు సమ్మె కాలంలో సాధారణ పరిపాలన వ్యవహారాలకు, అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగుల హాజరు నివేదికను ప్రతిరోజూ సచివాలయానికి పంపించడంతో పాటు సమ్మె చేస్తున్న ఉద్యోగులపై జీవో-177 ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, రాష్ట్ర వర్క్స్ ప్రాజెక్ట్స్ అండ్ అకౌంట్స్, ట్రెజరీ విభాగాల సబార్డినేట్ సర్వీసెస్‌లలో సమ్మెను నిషేధిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.భాస్కర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సేవలను అత్యవసర సేవల పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని, ఆరు నెలల పాటు సమ్మె నిషేధం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాంతియుతంగా సమ్మెచేస్తే ఎలాంటి చర్యలు చేపట్టబోమని ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చిన హామీకి విరుద్ధంగా ట్రెజరీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ ఎస్మాలన్నీ సమైక్య సమ్మె ముందు భస్మమవుతాయని, తుదివరకు ఏపీఎన్జీవోలతోపాటే నడుస్తామని తెలిపారు. జీవో-177లోని అంశాలు... ఉద్యోగుల ఆందోళన మీద రోజువారీ నివేదికలను జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్)కి పంపించాలి. ఆందోళన చేస్తున్నప్పుడు హాజరు రిజిస్టర్లలో సంతకాలు చేసి సాధారణ విధులకు హాజరుకాని ఉద్యోగుల వివరాలు సేకరించి ప్రత్యేక రికార్డుల్లో నమోదు చేయాలి. ఆందోళనలో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే ఉద్యోగులకు భద్రత కల్పించాలి. ఆందోళన జరిగే సమయంలో... విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఇబ్బంది(డిస్టబెన్స్) కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులు, బృందాలు, సంఘాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలుగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలి. ఆందోళనలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆటలాడటం, డ్రమ్ములు వాయించడం, విధి నిర్వహణకు వీలుకాని విధంగా ఇబ్బంది కలిగించే ఉద్యోగుల మీద తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి అధికారవర్గాలు ఉపక్రమించాలి. ఆందోళన కొనసాగించినంతకాలం... అందులో పాల్గొన్న ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జీతభత్యాలు చెల్లించకూడదు. ‘నో వర్క్ -నో పే’ విధానాన్ని కచ్ఛితంగా అమలు చేయాలి. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు అతిక్రమించే ఉద్యోగుల మీద చట్టప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. -
ఎస్మాలకు భయపడేది లేదు.. సమ్మె యథాతథం: సీమాంధ్ర ట్రెజరీ ఉద్యోగులు
ఎస్మాలకు తాము భయపడేది లేదని, సీమాంధ్ర జిల్లాల్లో సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా (ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) ప్రయోగించింది. ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెపై నిషేధం విధిస్తూ 238 జిఓ జారీ చేసింది. అయితే.. సమ్మెను యథాతథంగా కొనసాగిస్తాం తప్ప ఎస్మాలకు భయపడేది మాత్రం లేనే లేదని ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికుమార్ స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, అందువల్ల రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని విభజించవద్దని ఈనెల 13వ తేదీ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నో వర్క్ నో పే అమల్లోకి తెస్తూ ఈ ఉదయమే 177 జీఓను జారీ చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘సమైక్య’ ప్రకటన వెలువడే వరకూ సమ్మె
-
కేంద్రం నుంచి ‘సమైక్య’ ప్రకటన వెలువడే వరకూ సమ్మె
* ఏపీఎన్జీవోల సంఘం స్పష్టీకరణ * 19 నుంచి దశల వారీగా ఉద్యమాలు * త్వరలో హైదరాబాద్‌లో సమైక్య మహాసభ * కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాల్సిందే * ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడిపితే అడ్డుకుంటాం * సమ్మెలోకి అనేక ఇతర ఉద్యోగ సంఘాలు సాక్షి, గుంటూరు/హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కానుంది. సోమవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకుని కేంద్రం సమైక్య రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన చేసే వరకూ సీమాంధ్రలో సమ్మె కొనసాగుతూనే ఉంటుందని ఏపీఎన్జీవోలు ప్రకటించారు. కేంద్రం దిగి రాకుంటే దిగొచ్చేలా ఆందోళనా కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటం తరువాత ఆ స్థాయిలో అన్ని జిల్లాల్లో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్య ఉద్యమాలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సంఘం నేతలు పేర్కొన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నెల 19వ తేదీ నుంచి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. శుక్రవారం గుంటూరులోని ఎన్జీవో హోంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏపీఎన్జీవో సమైక్య జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి ఎన్జీవో సంఘ నేతలు, ఆర్టీసీ, మున్సిపల్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ జరిగిన భేటీలో నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబుతో పాటు వివిధ విభాగాల ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని సమావేశం తీర్మానించిందని తెలిపారు. ర్యాలీలు.. రోడ్ల దిగ్బంధం ఈ నెల 19 మొదలు వివిధ రకాల ఆందోళనలు నిర్వహించనున్నామని అశోక్‌బాబు చెప్పారు. 19న అన్ని జిల్లాల్లోనూ భారీ నిరసన ర్యాలీలు జరుగుతాయన్నారు. 20న ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ ఉన్న అన్ని రహదారుల్ని పూర్తిస్థాయిలో నిర్బంధిస్తామని, ఎన్జీవోలు రోడ్లపై బైఠాయించి రాస్తారోకోలు నిర్వహిస్తారని తెలిపారు. 21న ఉదయం 10-11 గంటల మధ్య అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ‘జై సమాక్యాంధ్ర’ నినాదంతో మానవహారాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే రోజు సాయంత్రం 6-7 గంటల మధ్య ఆయా జిల్లాల్లో కాగడాలు, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 22, 23 తేదీల్లో రిలేదీక్షలు జరుగుతాయనీ, మండల, డివిజన్, జిల్లాస్థాయిల్లో మూడంచెలుగా ఈ దీక్షల్ని నిర్వహించేందుకు తీర్మానం చేశామని వివరించారు. 24 నుంచి నెలాఖరు వరకూ జరిగే వివిధ రకాల నిరసన కార్యక్రమాలు, ఆందోళనల్లో ఎన్జీవోల కుటుంబసభ్యులు, బంధువుల్ని కూడా భాగస్వాముల్ని చేయనున్నామన్నారు. త్వరలో ‘హైదరాబాద్ మనది’ రాజధాని నడిబొడ్డున ‘హైదరాబాద్ మనది’ అన్న నినాదంతో త్వరలో భారీ సమైక్య సదస్సును నిర్వహిస్తామని అశోక్‌బాబు తెలిపారు. దీనికంటే ముందు శ్రామికవర్గాలతో ప్రత్యేక అవగాహన సభను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సదస్సు పెట్టి తీరతామని తేల్చిచెప్పారు. తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచే రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో మంచి ఆదరణ ఉండేలా చూస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు సమైక్య వాదంతో పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు బస్సులు నడిపితే సహించం తిరుపతిలో కొందరు ఉన్నతాధికారులు ఆర్టీసీ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తిరుమల కొండపైకి బస్సులు నడిపేలా బెదిరింపులకు దిగుతున్నారనీ, దీన్ని ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చేందుకు ప్రత్యేక జీవో జారీ చేసిందని, దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడిపితే శనివారం నుంచి అడ్డుకుంటామని అశోక్‌బాబు హెచ్చరించారు. 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ప్రత్యేక ఫోరంగా ఏర్పడి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమయ్యార ని తెలిపారు. ఆంటోనీ కమిటీ చర్చల కోసం ఢిల్లీ రమ్మని పిలిస్తే అన్ని సంఘాలను పిలవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు ప్రసాదరావు మాట్లాడుతూ, కోస్తా జిల్లాల్లో ప్రైవేటు ఆపరేటర్ల లాబీయింగ్ ఎక్కువగా ఉంటుందనీ, లాభాపేక్షతో ఎవరైనా బస్సులు నడిపితే సహించబోమని హెచ్చరించారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాల్సిందే విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణాయాదవ్ మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసి ఉద్యమంలోనికి రావాల్సిందేనన్నారు. లేకుంటే వారిళ్ల ముందే వారి దిష్టిబొమ్మల్ని తగులబెడతామన్నారు. ఇంకా అవసరమైతే వారికి బొందబెట్టి వారి స్థానంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో జరిగే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామన్నారు. సమైక్యాంధ్ర కోసం ఇప్పటివరకు టెస్ట్‌మ్యాచ్‌లు ఆడిన తాము ఇకపై ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడతామన్నారు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సంఘ ప్రతినిధి శ్యాంసుందర్ మాట్లాడుతూ, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సమ్మెలోనికి వెళ్తున్నట్లుగా శుక్రవారం మేనేజ్మెంట్కు నోటీసు ఇచ్చామన్నారు. శనివారం నుంచి రాష్ట్రంలోని 58,850 మంది గెజిటెడ్ అధికారులు సమ్మెకు దిగుతున్నట్లు ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి కృష్ణమోహన్‌రావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత గోపరాజు, ఏపీ గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఉపాధ్యక్షుడు బషీర్, కోశాధికారి వీరేంద్రబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 2 నుంచి ‘విద్యుత్’నిరవధిక సమ్మె రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు సమైక్య ఆంధ్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఎస్‌ఏవీఈ (సేవ్) జేఏసీ 29) ప్రకటించింది. ట్రాన్స్‌కో, జెన్కోతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్లలో సమ్మెకు దిగనున్నట్టు సేవ్ జేఏసీ చైర్మన్ ఆర్.సాయిబాబా, కన్వీనర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందాతో పాటు జెన్కో ఎండీ విజయానంద్‌కు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు నర్సింహులు, రవిశంకర్, మురళీకృష్ణారెడ్డి, ప్రత్యూష, అనురాధ, సముద్రాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం దశలవారీగా ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. ఈ నెల 17, 18వ తేదీల్లో ప్రధాన కార్యాలయాల వద్ద ర్యాలీలు చేపడతారు. 19, 20, 21 తేదీల్లో జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బైకు ర్యాలీలు, 22, 23, 24 తేదీల్లో రాస్తారోకోలు, 25న జిల్లా కేంద్రాల్లో వంటావార్పు, 26 నుంచి 28 వరకూ మౌన ప్రదర్శనలు నిర్వహిస్తారు. 29 నుంచి 31వ తేదీ వరకు రాజీనామా చేయని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని, సెప్టెంబర్ 1న వంటావార్పు చేపడతామని జేఏసీ నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. రవాణా చెక్‌పోస్టులు బంద్ రవాణా శాఖ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆర్టీఓలు అడ్హాక్ కమిటీగా ఏర్పడి సీమాంధ్రలోని చెక్‌పోస్టులన్నింటినీ బంద్ చేయాలని నిర్ణయించినట్లు కమిటీ చైర్మన్ జె.రమేష్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 13 జిల్లాల్లోని ఎనిమిది చెక్‌పోస్టులు మూతపడ్డాయని తెలిపారు. శుక్రవారం నుంచి సీమాంధ్రలో ఉన్న 300 మంది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, 15 మంది ఆర్టీఓలు నిరవధిక సమ్మెకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా కందుకూరు ఎంవీఐ డీవీ రావు నియమితులయ్యారు. రేపు అర్ధరాత్రి నుంచి న్యాయశాఖ ఉద్యోగుల సమ్మె ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి నుంచి సీమాంధ్ర జిల్లాలోని న్యాయశాఖ ఉద్యోగులంతా సమ్మెకు దిగుతున్నట్లు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.వై.నరసింహం తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే హైకోర్టుకు సమ్మె నోటీసు ఇచ్చినట్లు ఆయన శుక్రవారం విశాఖపట్నంలో వెల్లడించారు. నేడు లైట్లు ఆర్పి నిరసన సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలు ఆర్పివేసి నిరసన తెలుపాలని జేఏసీ చైర్మన్ సాయిబాబా ప్రజలకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేంతవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. -
ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సీమాంధ్ర
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర ప్రదేశ్ పరిరక్షణే లక్ష్యంగా నినదిస్తున్న ప్రజకు ఇప్పుడు ఉద్యోగుల సమ్మె తోడవడంతో సీమాంధ్ర స్తంభించింది. మంగళవారం నుంచి మొదలైన సకలజనుల బంద్‌కు తోడు ప్రజలు వివిధరూపాల్లో ఆందోళనలు హోరెత్తించారు. రాష్ట్ర విభజన యత్నాలను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. రెండు వారాలుగా వెల్లువలా సాగుతున్న ఉద్యమానికి ఊపునిస్తూ మంగళవారం నాడూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. మారుమూల పల్లెల్లో సైతం గ్రామస్తులు వినూత్నరీతిలో నిరసనలు చేపట్టడం ఉద్యమరూపు ఏ స్థాయి వరకు విస్తరించిందో అవగతమవుతోంది. సూర్యనమస్కారాలతో అర్చకుల నిరసన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానం అర్చకులు స్థానిక పొట్టిశ్రీరాములు జంక్షన్లో సూర్య నమస్కారాలు చేసి నిరసన తెలిపారు. బలగ ప్రాంతంలో సర్వమత ప్రార్థనలు జరిపి అక్కడే వేల మందికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పట్టణంలో మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో చేపల బుట్టలు పట్టుకొని ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎచ్చెర్లలో బి.ఆర్.అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించడంతో కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రజకులు ఇస్త్రీపెట్టెలు చేతపట్టి రోడ్డుపైకి వచ్చి బట్టలు ఇస్త్రీచేసి తమ నిరసన తెలిపారు. పల్లెవాసుల ధర్నాలు కృష్ణాజిల్లా కలిదిండి మండలం గుర్వాయిపాలెం వద్ద గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. మద్వానిగూడెం వద్ద కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ మాచవరంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో, మచిలీపట్నం కోనేరుసెంటరులో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని సారధ్యంలో వేలాదిమందితో వంటావార్పు నిర్వహించారు. ఆటోడ్రైవర్ల ర్యాలీలు ఒంగోలులో ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో కేసీఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి, చెప్పులతో కొడుతూ మద్యం బాటిళ్లు మెడకు కట్టి నగర వీధులలో ఊరేగించారు. జిల్లాలో మున్సిపల్ ఉద్యోగుల సమ్మెకు వైఎస్ఆర్ సీపీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి సంఘీభావం ప్రకటించారు. కలెక్టరేట్ ఎదురుగా వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఎన్జీవోల అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. నాయూబ్రాహ్మణుల వినూత్న నిరసన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సామూహిక క్షురకర్మలు చేసి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పురోహితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన మహిళలు సమైక్యాంధ్ర కంకణాలు ధరించారు. కడపలో గెజిటెడ్ ఉద్యోగులు స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి భారీర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి సమైక్య ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. ఎర్రగుంట్లలో 3800 మంది ఆర్టీపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. రాజంపేటలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. రాయచోటిలో జాతీయ రహదారిపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వంటా వార్పు చేపట్టారు. పాస్టర్ల ప్రదర్శన తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 300 సంఘాలతో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో తోలు బొమ్మలాట వృత్తి కళాకారుల సమాఖ్య తోలుబొమ్మల ప్రదర్శన చేస్తూ సమైక్యాంధ్రపై ప్రజలను చైతన్యం చేశారు. ఏజెన్సీలో స్తంభించిన పర్యాటకం విశాఖ ఏజెన్సీలో పర్యాటకం పూర్తిగా స్తంభించిపోయింది. పర్యాటకులు లేక అరకు బోసిపోయింది. విశాఖ నగరంలోని జీవీఎంసీ వద్ద ఉద్యోగులు న్యాయవాదులు దీక్షలు కొనసాగిస్తున్నారు. వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు సిరిపురం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురంలో రైల్‌రోకో విజయనగరం జిల్లా పార్వతీపురం స్టేషన్లో రాయగడ నుంచి విశాఖ వెళ్లే రైలును సమైక్య వాదులు కొద్దిసేపు అడ్డుకున్నారు. విజయనగరంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్, వీఆర్సీ, గాంధీబొమ్మ సెంటర్లలో రోడ్డుపైన అల్పాహారం తిని, తలకిందులుగా నడిచి నిరసన వ్యక్తం చేశారు. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నెల్లూరులో మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సమైక్యవాదులు అడ్డుకున్నారు. తిరుపతిలో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, వంటావార్పు, నిరాహార, రిలేదీక్షలు కొనసాగాయి. అలిపిరి వద్ద ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా విద్యార్థులతో మాక్ స్కూల్ నిర్వహించారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది డప్పులు వాయిస్తూ ర్యాలీ చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. చిత్తూరు నుంచి కాణిపాకం వరకు న్యాయశాఖ ఉద్యోగుల పాదయాత్ర న్యాయశాఖ ఉద్యోగులు చిత్తూరు నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించి రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాలని ప్రార్థించారు. అనంతరం ఈనెల 18 నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తిలో వైఎస్సార్సీపీ నేతల ర్యాలీ, ఆలయ పూజారులు హోమం నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల సమాధికి పోలీసుల బ్రేక్ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలకు సమాధి కట్టేందుకు ఆందోళనకారులు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. డోన్‌లో వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరులో నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీలు జరిగాయి. నేడు సమైక్య సింహ గర్జన విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం సమైక్య సింహ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవింద్ తెలిపారు. జెండా ఎగరేసే అర్హత మంత్రులకు లేదు: సమైక్యాంధ్ర జేఏసీ సీమాంధ్రుల ప్రయోజనాలను, ఆకాంక్షలను కాపాడలేని ఈ ప్రాంత మంత్రులకు ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసే అర్హత లేదని సమైక్యాంధ్ర జేఏసీ స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గత 14 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు వారి ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో నిందించారు. మంత్రులు జెండాలు ఎగురవేస్తే విద్యార్థి ఉద్యోగ సంఘాలు, ప్రజలు వారిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ ప్రభంజనం తట్టుకోలేకే.... వేర్పాటుకు కిరణ్, బాబు పచ్చజెండా ధ్వజమెత్తిన శోభానాగిరెడ్డి రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకోలేకే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎంఎల్ఏ శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలో వేలాదిమంది సమైక్యవాదులతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిరణ్, చంద్రబాబుల చేతకాని తనమే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి కారణమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏల తరహాలోనే ఆ రెండు పార్టీల శాసనసభ్యులు రాజీనామాలు చేసినట్లయితే తెలంగాణ ప్రకటన వెలువడేది కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలపై జనాగ్రహం విభజన నిర్ణయాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యతిరేకించని టీడీపీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. సోనియా, చంద్రబాబు, టీఆర్ఎస్ అధనేత కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు ఎక్కడికక్కడ జరగ్గా, పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి ఎన్జీవోల ఆగ్రహం చవిచూడాల్సివచ్చింది. పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని అడ్డుకుని రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ప్రధాన కారణమంటూ ఆయనపై మండిపడ్డారు. గుంతకల్లులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తాను సమైక్యవాదులు అడ్డుకుని రాజీనామా చేయాలని పట్టుబట్టగా, ఆయన వారినుద్దేశించి బ్లడీ ఫూల్స్ అంటూ దూషించడం వివాదాస్పదంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. విశాఖలో చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు కార్యాలయాన్ని విద్యార్ధులు ముట్టడించారు. చిత్తూరులో సత్యవేడులో టీడీపీ ఎమ్మెల్యే హేమలతను అడ్డుకోవటంతో తప్పని పరిస్థితిలో ర్యాలీలో పాల్గొన్నారు. గడికోట, రవీంద్రనాథ్‌ల నిరశనకు నీరా ‘జనం’ రెండోరోజుకు చేరిన దీక్షలు సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీమేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండవరోజుకు చేరుకుంది. వేలసంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తరలివచ్చి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు ఎస్.రఘురామిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీకర్ కె.సురేష్‌బాబు దీక్షాశిబిరాన్ని సందర్శించారు. సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా పర్చూరులో వైఎస్సార్ సీపీ నేత గొట్టిపాటి నర్సయ్య కుమారుడు భరత్ చేపట్టిన ఆమరణ దీక్ష నాలుగోరోజుకు చేరింది. విశాఖ జిల్లా ఆనందపురంలో వైఎస్సార్సీపీ నేత కోరాడ రాజబాబు చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. విజయనగరం జిల్లా గజపతినగరంలో వైఎస్ఆర్ సీపీ నాయకుడు మక్కువ శ్రీధర్ మంగళవారం నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. -
ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగుల సమ్మె బాట
సాక్షి, కడప : ఉద్యోగుల సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. సమైక్యాంధ్ర సాధనే ధ్యేయమంటూ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో ప్రభుత్వ సేవలు నిలిచిపోనున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కనున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించనుంది. జన జీవనం అతలాకుతం కానుంది. మొత్తం మీద జిల్లాలో పాలన అటకెక్కనుంది. గెజిటెడ్ ఉద్యోగులు సైతం వివిధ రూపాల్లో ఆందోళనలు తెలియజేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఉపాధ్యాయులు సైతం ఎన్జీఓలు, వివిధ సంఘాల ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతూ ఆందోళనల్లో పాల్గొనాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్టీసీ డిపోల పరిధిలో 4200 మంది కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. దీంతో 760 బస్సులు రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 7500 మందిఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. వీరు ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టడంతోపాటు ఉద్యమానికి సంబంధించి ప్రత్యేక కార్యచరణను సైతం రూపొందించారు. దీనికి సంబంధించి ఆర్టీపీపీలో 3800 మంది, ట్రాన్స్‌కోలో 1200, ఎస్పీడీసీఎల్లో 2500 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏపీఐఐసీ, హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. డీఆర్డీఏ, డ్వామా, పీఏఓ ఉద్యోగులతోపాటు జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు సమ్మెపై త్వరలో నిర్ణయం తీసుకోనుండడంతో జిల్లాలో పాలన స్తంభించనుంది. ఇందులో 2680 మంది పోలీసులు సమ్మెకు దూరంగా ఉంటున్నారు. 2155 మంది గెజిటెడ్ ఉద్యోగులు ప్రస్తుతానికి సమ్మెలో పాల్గొనడం లేదు. దీంతోపాటు ఉపాధ్యాయులు సైతం సమ్మెకు సంబంధించి కార్యచరణ రూపొందించే పనిలో ఉన్నారు.