విద్యుత్ సంక్షోభం దిశగా రాష్ట్రం!
హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల మెరుపు సమ్మెతో విద్యుత్ సంక్షోభం దిశగా రాష్ట్రం ప్రయాణిస్తోంది. సమ్మెపై ఉద్యోగులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దాంతో చేసేదేమిలేక విద్యుత్ అధికారులు, యాజమాన్యాలు పరిశ్రమలన్నింటికి పవర్ కట్ ట్రాన్స్‌కో చేసింది.
ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలను ట్రాన్స్‌కో పెంచింది. ఆర్‌టీపీపీ, వీటీపీఎస్, కేటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో విద్యుత్ కొరత ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి 11000 నుంచి 6000 మెగావాట్లకు ఉత్పత్తి పడిపోయింది.