
జాతీయ రహదారిపై వంట-వార్పు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరింది. వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ 214వ జాతీయ రహదారిపై వంటా- వార్పు కార్యక్రమం నిర్వహించారు.
రోడ్లపైనే సామూహిక భోజనాలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్లు డి.టి.వి. రమణ, స్టీవెన్సన్, ఇతర గెజిటెడ్ అధికారులు కూడా రోడ్లపైనే భోజనాలు చేశారు. యూనియన్ నాయకులు పి.వినయ్ కుమార్, రామనాథం, మాధవి, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.