విశాఖ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో ఆమెదం పొందిన అనంతరం సీమాంధ్ర నేతలకు నిరసన సెగలు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేయడం, అనంతరం ఆ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించడంతో సీమాంధ్ర లో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి . కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను విశాఖ నగరానికి తీసుకురావడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. బాలరాజును నగర కాంగ్రెస్ అధ్యక్షుడ్ని కార్యకర్తలు అడ్డుకుని సమైక్య ద్రోహి అయిన జైరాం రమేష్ ను విశాఖకు ఎందుకు తీసుకువచ్చారని నిలదీశారు. సమైక్య ద్రోహులకు సీమాంధ్రలో అడుగుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.