మెహిదీపట్నం (హైదరాబాద్): రెండు నెలలుగా జీతాలు సరిగా ఇవ్వక పోవడంతో సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కాంట్రాక్టు సిబ్బంది శుక్రవారం విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బంది ఆస్పత్రి ప్రధాన ద్వారం ముందు కూర్చుని తమ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రెండు నెలల నుంచి జీతాలు అందక పోవడంతో కుటుంబం గడిచే పరిస్థితి లేదని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే మరింతగా ఉద్యమిస్తామన్నారు. కాగా, రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.కె.వినోద్‌కుమార్ తెలిపారు.
సరోజినీదేవి ఆస్పత్రి ఉద్యోగుల ధర్నా
Published Fri, Oct 2 2015 8:35 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM
Advertisement