సీమాంధ్ర జిల్లాల్లో రెండు ప్రధాన ప్రభుత్వ శాఖలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా అస్త్రం ప్రయోగించింది. దాదాపు 60 రోజుల నుంచి ఉధృతంగా సమ్మె సాగుతుండటం, ఒక్క కార్యాలయం కూడా తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ముఖ్యంగా ట్రెజరీ, అకౌంట్స్ శాఖల సిబ్బంది కూడా ఉధృతంగా సమ్మె చేయడం వల్ల ప్రభుత్వానికి కాళ్లు, చేతులు ఆడని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎస్మా అస్త్రాన్ని ప్రభుత్వం బయటకు తీసింది.
సీమాంధ్ర జిల్లాల్లో ట్రెజరీ, అకౌంట్స్ విభాగాల సిబ్బంది ఎవరూ సమ్మెలు చేయడానికి వీల్లేదని, అలాగే బంద్ చేయడాన్ని కూడా నిషేధిస్తున్నామని ఈ ఉత్తర్వులలో పేర్కొంది. అత్యవసర విభాగాలు మినహా సీమాంధ్ర 13 జిల్లాల్లో ఉన్న మొత్తం అన్ని విభాగాల సిబ్బంది సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. మునిసిపాలిటీలలో కూడా పారిశుధ్య సిబ్బంది తప్ప అంతా సమ్మెలోనే ఉంటున్నారు.
సీమాంధ్ర సమ్మెపై సర్కారు ఎస్మాస్త్రం
Published Fri, Sep 27 2013 2:21 PM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement