75 వేల మంది విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న మెరుపు సమ్మెపై సాయంత్రంలోగా స్పష్టత ఇవ్వాలని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ఛైర్మన్ సత్యానందం ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయాల్సిన పాలసీ రాష్ట్రం విడిపోయాక సాధ్యం కాదన్నారు. పీఆర్సీ అంశం తేలేవరకు సమ్మె విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై గవర్నర్ వెంటనే స్పందించాలని సత్యానందం డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి జూన్ 2వ తేదీ అపాయింట్మెంట్ డే. ఈ నేపథ్యంలో ఆ తేదీ కంటే మందుగానే తమకు పీఆర్సీ అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు మొరుపు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అమలు చేసిన విధానాన్ని విభజన తర్వాత సాధ్యం కాదని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.