పీఆర్సీ కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం  | Telangana Government Announces PRC Committee For Govt Employees | Sakshi
Sakshi News home page

పీఆర్సీ కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం 

Published Mon, Oct 2 2023 8:39 PM | Last Updated on Tue, Oct 3 2023 10:36 AM

Telangana Government Announces PRC Committee  - Sakshi

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని( పీఆర్సీ) నియమించారు. ఇద్దరు సభ్యులతో మొదలైన ఈ కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్(రిటైర్డ్ ఐఎఎస్), సభ్యులుగా బి. రామయ్య(రిటైర్డ్ ఐఎఎస్) లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ 6 నెలల్లోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement