సాక్షి,సూర్యాపేటజిల్లా:తెలంగాణ ప్రభుత్వం, మంత్రులపై మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ నేత జగదీష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో గుడుగుండ్లలో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ హయాంలో ప్రతి రంగంలో విధ్వంసం జరుగుతోంది.తెలంగాణలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది తక్కువ దిగుబడి వచ్చింది.
మంత్రులు శ్రీధర్‌బాబు,తుమ్మల,ఉత్తమ్ చెప్పినవన్నీ తప్పులే. కాళేశ్వరం నీళ్ల ద్వారానే ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఏ రోజు ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో చెప్పడం లేదు. ఇంతవరకు సబ్సిడీ ఎంత ఇచ్చిందో చెప్పట్లేదు.
రైతు భరోసా,రైతు బంధు ఇంత వరకు అమలు చేయలేదు. రుణమాఫీ కేవలం 12వేల కోట్లు మాత్రమే జరిగింది. కేసీఆర్,కేటీఆర్ గురించి కాకుండా రైతులు గురించి పట్టించుకోండి’అని జగదీష్‌రెడ్డి చురకంటించారు.
Comments
Please login to add a commentAdd a comment