jagadeeshreddy
-
రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఎలక్టోరల్ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం(జనవరి6) తెలంగాణభవన్‌లో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి ఏం సంబంధం అని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.‘గ్రీన్ కో కంపెనీ దేశంలో 7,8 పార్టీలకు ఎలక్ట్రోలర్ బాండ్లు ఇచ్చింది.కేసు రూ. 55 కోట్లు ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించింది.ఇక్కడ గ్రీన్ కో కంపెనీకి ఎక్కడా లాభం జరగలేదు.ఏసీబీ కేసుకు ,గ్రీన్ కో కంపెనీకీ ఏం సంబంధం.రైతు భరోసా ఎగగ్గొట్టిన విషయం డైవర్ట్ చేయడానికే కేటీఆర్‌కు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయన్నారు.ఈ డైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేడు.గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రో బాండ్లు చట్టం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి.ఇందులో దాపరికాలు ఏం లేవు.రేవంత్‌రెడ్డి ఇందులో కనిపెట్టింది ఏం లేదు. కేటీఆర్‌పై కుట్ర కేసులో ప్రభుత్వానికి ప్రతిసారి షాక్ తగులుతోంది.ప్రభుత్వం బొక్క బోర్లా పడుతోంది. కేటీఆర్‌పై పనికిమాలిన చెత్త కేసు పెట్టి,చిల్లర ప్రయత్నం చేసింది ప్రభుత్వం.ప్రభుత్వం వద్దే అన్ని ఫైల్స్ ఉన్నాయి.కేటీఆర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేసి ఏవో ఫైల్స్ దొరికాయని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయాలని ఏసీబీ ప్రయత్నం చేస్తోంది.చట్టం,రాజ్యాంగం పట్ల గౌరవంతో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా ఈ రోజు కుదరలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: ఇది రేవంత్ టీఎం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్ -
కేసీఆర్,కేటీఆర్‌ను కాకుండా రైతులను పట్టించుకోండి: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా:తెలంగాణ ప్రభుత్వం, మంత్రులపై మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత జగదీష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో గుడుగుండ్లలో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ హయాంలో ప్రతి రంగంలో విధ్వంసం జరుగుతోంది.తెలంగాణలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది తక్కువ దిగుబడి వచ్చింది.మంత్రులు శ్రీధర్‌బాబు,తుమ్మల,ఉత్తమ్ చెప్పినవన్నీ తప్పులే. కాళేశ్వరం నీళ్ల ద్వారానే ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఏ రోజు ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో చెప్పడం లేదు. ఇంతవరకు సబ్సిడీ ఎంత ఇచ్చిందో చెప్పట్లేదు.రైతు భరోసా,రైతు బంధు ఇంత వరకు అమలు చేయలేదు. రుణమాఫీ కేవలం 12వేల కోట్లు మాత్రమే జరిగింది. కేసీఆర్,కేటీఆర్ గురించి కాకుండా రైతులు గురించి పట్టించుకోండి’అని జగదీష్‌రెడ్డి చురకంటించారు. -
ఆ ఇద్దరు మంత్రులు దద్దమ్మలు: జగదీష్‌రెడ్డి
సాక్షి,నల్లగొండజిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు దద్దమ్మ మంత్రులున్నారని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సాగర్ జలాలపై ఈ మంత్రులకు అవగాహన లేకపోవడంతో ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేటలో మంగళవారం(సెప్టెంబర్24) నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు.ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు అధికంగా తరలించడం వల్లనే ఎడమ కాల్వకు గండి పడిందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న మంత్రుల మాటలు విని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ ఇంకా 30 శాతం కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: సాగర్‌కాలువ గండి పూడ్చడం చేతకాదా..? -
మోసం చేయడమే కాంగ్రెస్ పని: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేట జిల్లా: ఆరు గ్యారంటీలు అని చెప్పుకోవడానికే తప్ప ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో సోమవారం(జులై 23) జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఉచిత బస్సు అని నమ్మించి మోసం చేసి బస్సులు తగ్గించారు.మహిళలు ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకునేలా చేశారు. రైతుల రుణమాఫీ కంటే ఫ్లెక్సీలు, పాలాభిషేకాలకే ఖర్చు ఎక్కువైంది. ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పని. 24 గంటల కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. గోదావరికి వరద వచ్చినా కాళేశ్వరం ఎక్కడికీ పోలేదు క్షేమంగా ఉంది. అక్కడ మీరు స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది’అని జగదీష్‌రెడ్డి అన్నారు. -
కేంద్రానిది కక్ష సాధింపే: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి ముమ్మాటికీ కక్ష సాధింపే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా తెలంగాణకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే ఈ తంతు అర్ధమవుతుందన్నారు. సోమవారం శాసనమండలిలో ‘కేంద్ర విత్యుత్ బిల్లు–పర్యవసానాలు’పై జరిగిన లఘు చర్చలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన సంక్షేమ పథకాలకు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు గుజరాత్ ప్రజలు సైతం కితాబిస్తున్నారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు ఉత్తర భారత ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓర్వలేక రాష్ట్రంపై విషం కక్కే చర్యలకు దిగుతోందని విమర్శించారు. రాష్ట్రాలను నిర్వీర్యం చేయడమే ఎజెండా స్వదేశీ బొగ్గును కాదని, విదేశీ బొగ్గు వినియోగించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమని మంత్రి పేర్కొన్నారు. స్వదేశీ బొగ్గు మెట్రిక్ టన్ను రూ.3,800కు దొరుకుతుంటే, విదేశీ బొగ్గును రూ.35 వేలు వెచ్చించి కొనుగోలు చేయాలనడంఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యుత్ నిర్వహణలో ఉత్పత్తి, విక్రయ కంపెనీలను కాకుండా కేంద్రం, రాష్ట్రం, ఆర్బీఐని భాగస్వామ్యం చేస్తూ కమిటీలను ఏర్పాటు చేయడం కూడా అర్థరహితమని అన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగాలను తన చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, అన్ని అధికారాలను తన చేతుల్లోకి తీసుకుని రాష్ట్రాలను నిర్వీర్యం చేయడమే ఎజెండాగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇదీ చదవండి: 20 లక్షల ఉద్యోగాలు ఊడతాయ్! -
ఉత్తమ్, రేవంత్ తోడు దొంగలు
సాక్షి, హుజూర్నగర్ రూరల్ : ఉత్తమ్, రేవంత్‌రెడ్డి ఇద్దరు తోడుదొంగలని, వారు ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శనివారం హుజూర్‌నగర్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఓటుకు నోటు కేసులో రూ.50లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది ఒకరని, గత ఎన్నికల్లో రూ.3 కోట్లు కారులో కాలబెట్టుకున్న దొంగ మ రొకరని రేవంత్, ఉత్తమ్‌నుద్దేశించి ఆరోపించారు. ఇద్దరూ తోడు దొంగలని.. వారిద్దరూ కలిసి హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దాలు చెప్పడం, విమర్శలు చేయడమే తప్ప ని యోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి హామీలూ ఇ వ్వలేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో మా యమాటలు చెప్పి ప్రజలను తనవైపు తిప్పుకున్నారని, ఇప్పుడే జరిగే ఉపఎన్నికల్లో చెప్పడానికి ఏమీ లేక ఆధికారులు, ప్రభుత్వం, ఆభ్యర్థిపై విమర్శలకు దిగాడని విమర్శించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మా పార్టీ అభ్యర్థి ఇక్కడ లేడంటూ, భూకజ్జాలు చేశాడం టూ ఉత్తమ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. సైదిరెడ్డి ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉండి వారి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై ఉత్తమ్ విమర్శలు, ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల్లో ఎవరి వెంట రౌడీలు ఉన్నారో ప్రజలుకు తెలుసన్నారు. 20 ఏళ్లుగా పెంచి పోషించిన ఆ రౌడీలే ప్రజల అస్తులను దోచుకొని, భూములను ఆక్రమించి శాంతిభద్రతలను నాశనం చేశారని ఆరోపించారు. వారి ఆగడాలను భరించలేక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వస్తున్నారని పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టులో నిజంగా ముం పునకు గురయ్యే వ్యవసాయ భూములను వది లిపెట్టి ముంపునకు గురికాని, 20 ఫీట్లలోతు నీ రు వచ్చిన మునిగిపోని పీక్లానాయక్‌తండాను తన అనుచరుల కట్టబెట్టేందుకు కోట్లాది రూపాయలను దోచిపెట్టారని విమర్శించారు. డబ్బు, భూ మాఫియాకు పాల్పడేది నువ్వేనని ఉత్తమ్ నుద్దేశించి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు ఎంతో మంది కుంభకోణాలకు పాల్పడిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని ఆరోపించారు. ఉత్తమ్ బీజేపీతో మిలాఖత్ అయ్యాడని విమర్శించారు. పద్మావతికి టికెట్ వద్దని, కుటుంబపాలన చేస్తున్నావని విమర్శించిన వ్యక్తితో నేడు ఇక్కడ ప్రచారం చేయిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని, మీ దివాళా కోరుతనమే మీ ఓటమి కారణం కాబోతుందని ఎద్దేవా చేశారు. ఈసారి మోసపోవడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరని, సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడని పే ర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకా రం ప్రచారం పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తీసుకువచ్చి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను ఆపి తనిఖీ చేయించినా బాధ్యత గల పౌరులుగా తాము అధికారులకు సహకరించామని పేర్కొన్నారు. తాము చేసిన ఫిర్యాదులను తీసుకోకపోయినా చాలా ఓపికగా ఉన్నామని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ తమ వైపే ఉన్నారని అన్నారు. 20 రోజులుగా చేసిన ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వివరించిన సమస్యలపై ఆలోచించి టీఅర్ఎస్ ఆభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగు లింగయ్య యాద వ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కూటమిని ప్రజలు నమ్మే స్థితిలో లేరు
-
పద్మనాభరెడ్డి సేవలు మరువలేనివి
తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినగొప్ప వ్యక్తి సంకెపల్లి పద్మనాభరెడ్డి అని.. ఆయన సేవలు మరువలేనివని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కొనియాడారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మాజీ ఎంపీపీ పద్మనాభరెడ్డి సంతాపసభకు మంత్రి హాజరై నివాళులర్పించి మాట్లాడారు. పదవుల కోసం పాకులాడకుండా నిస్వార్థంగా సేవలందించిన వ్యక్తి పద్మనాభరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, వేముల వీరేశం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పాశం విజయయాధవరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఎస్.రఘునందన్‌రెడ్డి, ఉప్పలయ్య, ఎంపీపీ కొమ్మినేని సతీష్, జెడ్పీటీసీ పేరాల పూలమ్మ, మార్కెట్ కమిటీ వైస్‌చెర్మన్ యుగేంధర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సంకెపల్లి మృతి..కాంగ్రెస్‌కు తీరని లోటు : ఎమ్మెల్సీ మాజీ ఎంపీపీ సంకెపల్లి పద్మనాభరెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం పద్మనాభరెడ్డి సంతాప సభకు హాజరైన అనంతరం స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. తిరుమలగిరిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వ్యవసాయ మార్కెట్, వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకు పద్మనాభరెడ్డి ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నియోజక ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య, చెవిటి వెంకన్న యాదవ్, సంకెపల్లి కొండల్‌రెడ్డి, సీహెచ్ రాజగోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, రాజయ్య, రాంబాబు, హఫీజ్, నరేష్, సోమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు కూడా హాజరై నివాళులర్పించారు. -
వెంకట్రామరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలి
సూర్యాపేట : రాజబహదూర్ వెంకట్రామరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి 148వ జయంతి సందర్భంగా నిర్వహించిన స్మారక క్రీడోత్సవాల్లో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం పట్టణంలోని రెడ్డి హాస్టల్లో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెంకట్రామరెడ్డి ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రెడ్డి హాస్టల్లో కేవలం ఒకే కులానికి కాకుండా అందరికి వసతి కల్పించడం అభినందనీయమన్నారు. రెడ్డి హాస్టల్లో యూత్ లీడర్షిప్ అవసరముందన్నారు. హాస్టల్లో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు హాస్టల్ గుర్తుండేలా చేయాలని చెప్పారు. ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు వస్తే తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక, సోమా భరత్‌కుమార్, మర్రి లక్ష్మారెడ్డి, వెదిరె రాంమోహన్‌రెడ్డి, పోరెడ్డి మధుసూదన్‌రెడ్డి, యానాల యాదిగిరిరెడ్డి, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, బైరు దుర్గయ్యగౌడ్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, కక్కిరేణి నాగయ్యగౌడ్, కోడి సైదులుయాదవ్, నల్లపాటి అప్పారావు, పటేల్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మల్లన్నసాగర్’ను అడ్డుకోవడం అవివేకం
ఆలేరు : తెలంగాణలోని 6, 7 జిల్లాలు సస్యశ్యామలం అయ్యేందుకు నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూడడం అవివేకమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఆలేరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంతో ఉన్నత ఆశయంతో సీఎం కేసీఆర్ తెలంగాణలోని బీడు భూములకు నీరందించేందుకు చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజñ క్టు చేపడితే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోతున్న వారిని మార్కెట్ రేటు ప్రకారం పరిహార ం చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి ఆలోచిస్తుందన్నారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా ఏపీ లబ్ధిపొందితే తెలంగాణలోని ఎన్నో గ్రామాలు మునిగినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అప్పుడు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి తీరుతుందని చెప్పారు. నల్గొండ జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరును అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల కాలంలో జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని.. వ్యవసాయ బావుల వద్ద రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇంటి దగ్గర కూడా విద్యుత్ వినియోగదారులు నిర్లక్ష్యంగా ఉండరాదని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఆకవరం మోహన్‌రావు, నాయిని రామచంద్రారెడ్డి, మొరిగాడి ఇందిరా, దూడం మధు, ముస్తాఫా, దానియల్, మొగులగాని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
30లోగా పనులు పూర్తి చేయాలి
- పుష్కరాలకు వచ్చే ఏ ఒక్కరికీ ఇబ్బందులు రానివ్వొద్దు –ఏర్పాట్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు –ముఖ్యమంత్రి డేగ కన్ను పెట్టారు.. అధికారులు జాగ్రత్తగా ఉండాలి –కృష్ణా పుష్కర పనులపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కృష్ణా పుష్కరాల పనులను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వచ్చే నెల 12నుంచి జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో జరుగుతున్న వివిధ పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, దాదాపు కోటిన్నర మంది భక్తులు వస్తారన్న అంచనాతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పుష్కర స్నానం కోసం వచ్చే ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా తిరిగి వెళ్లాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అయితే, పుష్కరాల ఏర్పాట్ల విషయంలో కొంత జాప్యం జరుగుతోందని, అధికారులు అలసత్వంగా ఉంటే సహించేది లేదని, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. పుష్కరాలు పూర్తయ్యేంతవరకు అధికారులకు సెలవులు ఇచ్చేది లేదని తాను కూడా ఇక్కడే ఉండి పనులు చూసుకుంటానని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఏమాత్రం అలతస్వం వహించినా అధికారులకు పనిష్మెంట్ తప్పదని హెచ్చరించారు. దేవరకొండ డివిజన్లో జరుగుతున్న పనులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్కింగ్ స్థాలు, హోల్డింగ్ పాయింట్ల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పుష్కర ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని, ముఖ్యమంత్రి ఈ పనులపై డేగకన్ను పెట్టారన్న విషయాన్ని అధికారులంతా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్. ఎన్. సత్యనారాయణ, అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అటవీశాఖ అదనపు చీఫ్ కన్జర్వేటర్ పర్గేన్, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కరరావుతో పాటు పలువురు జిల్లా అధికారులు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు : మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష సమావేశం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2004 పుష్కరాల సందర్భంగా కేవలం 11 ఘాట్లలో మాత్రమే భక్తుల స్నానాలకు ఏర్పాట్లు చేశారని, ఈసారి జిల్లా వ్యాప్తంగా 28 పుష్కర ఘాట్లు అందుబాటులోకి తెస్తున్నట్ల చెప్పారు. పుష్కర పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయని, రహదారుల నిర్మాణం 65 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రత్యేక పార్కింగ్ కోసం నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లిలో 544 ఎకరాల స్థలాన్ని సేకరించినట్లు మంత్రి వివరించారు. ఇకపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను తానే పర్యవేక్షిస్తానని, పుష్కరాలు పూర్తయ్యేవరకు అధికారులతో పాటు తాను కూడా ఉంటానని చెప్పారు. -
రేవంత్‌నే కాదు బాబునూ విచారించాలి:జగదీష్ రెడ్డి
-
పోలీసులు ధైర్య౦గా పోరాడారు : జగదీశ్‌రెడ్డి