
‘మల్లన్నసాగర్’ను అడ్డుకోవడం అవివేకం
ఆలేరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంతో ఉన్నత ఆశయంతో సీఎం కేసీఆర్ తెలంగాణలోని బీడు భూములకు నీరందించేందుకు చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజñ క్టు చేపడితే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోతున్న వారిని మార్కెట్ రేటు ప్రకారం పరిహార ం చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి ఆలోచిస్తుందన్నారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా ఏపీ లబ్ధిపొందితే తెలంగాణలోని ఎన్నో గ్రామాలు మునిగినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అప్పుడు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి తీరుతుందని చెప్పారు. నల్గొండ జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరును అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల కాలంలో జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని.. వ్యవసాయ బావుల వద్ద రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇంటి దగ్గర కూడా విద్యుత్ వినియోగదారులు నిర్లక్ష్యంగా ఉండరాదని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఆకవరం మోహన్‌రావు, నాయిని రామచంద్రారెడ్డి, మొరిగాడి ఇందిరా, దూడం మధు, ముస్తాఫా, దానియల్, మొగులగాని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.