
సాక్షి,సూర్యాపేట జిల్లా: ఆరు గ్యారంటీలు అని చెప్పుకోవడానికే తప్ప ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో సోమవారం(జులై 23) జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఉచిత బస్సు అని నమ్మించి మోసం చేసి బస్సులు తగ్గించారు.
మహిళలు ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకునేలా చేశారు. రైతుల రుణమాఫీ కంటే ఫ్లెక్సీలు, పాలాభిషేకాలకే ఖర్చు ఎక్కువైంది. ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పని.
24 గంటల కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. గోదావరికి వరద వచ్చినా కాళేశ్వరం ఎక్కడికీ పోలేదు క్షేమంగా ఉంది. అక్కడ మీరు స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది’అని జగదీష్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment