
సాక్షి,నల్లగొండజిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు దద్దమ్మ మంత్రులున్నారని మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సాగర్ జలాలపై ఈ మంత్రులకు అవగాహన లేకపోవడంతో ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేటలో మంగళవారం(సెప్టెంబర్24) నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు.
ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు అధికంగా తరలించడం వల్లనే ఎడమ కాల్వకు గండి పడిందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న మంత్రుల మాటలు విని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ ఇంకా 30 శాతం కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సాగర్‌కాలువ గండి పూడ్చడం చేతకాదా..?
Comments
Please login to add a commentAdd a comment