కాంగ్రెస్‌కు కూల్చివేతలు తప్ప పూడ్చివేత తెలియదు
ప్రభుత్వ వైఫల్యంతో 3 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి
త్వరలో ఖమ్మం జిల్లాకు వెళ్లి రైతులకు మనోధైర్యం ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండు తున్నా 22 రోజులుగా నాగార్జున సాగర్ కాలువకు పడిన గండిని పూడ్చ డం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావ డం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కృష్ణా నది నిండుకుండలా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలను ఎండ బెడుతోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగే శ్వరరావు గండి పడిన కాలువ పక్క నుంచే వెళ్తున్నా మరమ్మతులు జరగడం లేదని ఎద్దేవా చేశారు.
దీంతో ‘సీఎంను క్షమించు.. రైతులను రక్షించు’అంటూ భద్రాచలం సీతారామచంద్ర స్వామిని వేడుకుంటున్నామని హరీశ్‌రావు అన్నా రు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభా కర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ తరఫున త్వరలో ఖమ్మం జిల్లాలో పర్యటించి రైతులకు మనోధైర్యం కల్పిస్తామన్నారు.
రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు..
‘పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియో జకవర్గాల్లో రైతులు పార్టీలకు అతీతంగా నాగా ర్జునసాగర్ ప్రాజెక్టు ఆఫీసులను ముట్టడిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం అనే డైలాగులు కొడు తున్న రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులకు కాలువ గండి పూడ్చటం చేతకావడం లేదా. 3 లక్షల ఎకరాలు ఎండుతున్నా కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చి వేతలు తప్ప పూడ్చివేత రాదా? వరదల్లో కొట్టు కుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వకుండా రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
‘వరదల కారణంగా సాగర్ పరీవాహక ప్రాంతంలో 60 వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకంతో లక్ష ఎకరాలు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు నీళ్లిచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. పంటలను కాపాడుకునేందుకు రైతులు జనరే టర్లు, డిజిల్, ట్రాక్టర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన వారికి ఇస్తున్న పరిహారం రూ.10 వేలు ఏ మూలకూ సరిపోవడం లేదు’అని అన్నారు. రాష్ట్రంలో గూండాయిజం పెరిగి, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రెండు వేల అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని హరీశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment