PRC allowances
-
పీఆర్సీ కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని( పీఆర్సీ) నియమించారు. ఇద్దరు సభ్యులతో మొదలైన ఈ కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్(రిటైర్డ్ ఐఎఎస్), సభ్యులుగా బి. రామయ్య(రిటైర్డ్ ఐఎఎస్) లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ 6 నెలల్లోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇది కూడా చదవండి: చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు -
పీఆర్సీ పై కోన్ని ఉద్యోగ సంఘాల్లో భేదాభిప్రాయాలు : బొత్స
-
జగన్ పీఆర్సీ నిర్ణయంతో ఉద్యోగుల పాలాభిషేకం
-
హెచ్ఆర్ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న పీఆర్సీలో ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తగ్గిస్తూ వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏను యథాతథంగా కొనసాగించాలని కోరుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు హెచ్ఆర్ఏ 30 శాతం ఉండగా దాన్ని 24 శాతానికి తగ్గిస్తూ పీఆర్సీ సిఫారసు చేసింది. అలాగే 2 లక్షల జనాభా కంటే ఎక్కువున్న పట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 20 శాతం హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 17 శాతానికి తగ్గించింది. ఇక 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో 14.5 శాతం హెచ్ఆర్ఏ ఉండగా దాన్ని 13 శాతానికి, మండల కేంద్రాలు, గ్రామాల్లో 12 శాతం హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 11 శాతానికి తగ్గించింది. దీంతో హెచ్ఆర్ఏ తగ్గింపు వల్ల తమకు చేకూరాల్సిన ప్రయోజనం రాకుండా పోతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే ప్రస్తుతం హెచ్ఆర్ఏను యథావిధిగా కొనసా గించాలని కోరుతున్నాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. దానిపై ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, పాత పీఆర్సీలో హెచ్ఆర్ఏ గరిష్టంగా రూ. 15 వేల వరకే సీలింగ్ ఉంది. దీని ప్రకారం ఉద్యోగుల హెచ్ఆర్ఏ ఒకవేళ రూ. 15 వేలకు మించినా రూ. 15 వేలే ఇస్తారు. కానీ ప్రస్తుత పీఆర్సీలో ఆ సీలింగ్ లేదు. అయితే రూ. 15 వేల కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న వారికి మాత్రం హెచ్ఆర్ఏలో తగ్గుదల తప్పదు. -
ఉద్యోగులకు జూలై ఝలక్!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ(పీఆర్సీ) ఏర్పాటులో తీవ్ర జాప్యం చేశారు. ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన మధ్యంతర భృతినీ ప్రకటించడంలో నాన్చుడు ధోరణి అవలంబించారు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాజేసింది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఈ అసంతృప్తి జ్వాలలు టీడీపీ విజయావకాశాలను మసి చేస్తాయని భయపడిన సర్కారు హడావుడిగా 20 శాతం ఐఆర్ ఇస్తున్నట్లు ప్రకటించేసింది. కానీ.దాన్ని వచ్చే జూలై నుంచి అమలు చేస్తారట!.. తక్షణమే చెల్లించాల్సిన ఐఆర్‌ను ఐదు నెలల తర్వాత నుంచి అమలు చేయడమేమిటని ఉద్యోగులు మండిపడుతున్నారు. జూలైలో అమలు చేసేదాన్ని ఇప్పుడే హడావుడిగా ప్రకటించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. పీఆర్సీ అమలులో జాప్యం కారణంగా రగిలిపోతున్న ఉద్యోగులను మభ్యపెట్టి, మచ్చిక చేసుకోవడం ద్వారా ఎన్నికల్లో వారి ఓట్లు పొందాలన్న రాజకీయ లక్ష్యమే తప్ప సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. ఐఆర్ ప్రకటనతో స్పష్టమవుతోందని ఉద్యోగులు అంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. లేనిగొప్పలు చెబుతూ సమీక్షలు, సమావేశాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో పని చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక గుండెపోటుకు గురై మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. పోనీ ఎంత కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు, గౌరవం దక్కడం లేదు. సకాలంలో పదోన్నతులు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. గద్దెనెక్కగానే పక్కనే ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిందన్న ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించి ఆ మేరకు బాండ్లు ఇచ్చారు. ఇదిగో ఇస్తాం..అదిగో ఇస్తాం అంటూ నాలుగేళ్ల పాటు ఊరించి చివరకు గతేడాది జీపీఎఫ్ ఖాతాలో కాగితాలపై సర్దుబాటు చేశారే చప్ప చేతికిచ్చిన పాపాన పోలేదు. 11వ పేరివిజన్ కమిషన్(పీఆర్సీ) వేతనాలు 2018 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలి. అలా అమలు చేయాలంటే ఈ కమిషన్ 2017లోనే ఏర్పాటు చేయాలి. కానీ పీఆర్సీ కమిషన్ సకాలంలో ఏర్పాటు చేస్తే ఎక్కడ నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సి వస్తోందన్న ఆలోచనతో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటును వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు ఉద్యోగ సంఘాల ఒత్తిడి తట్టుకోలేక గతేడాది మేలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అసితోష్ మిశ్రా చైర్మన్‌గా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రిపోర్టు ఆరు నెలల్లో ఇవ్వాల్సి ఉంది. కానీ దాదాపు పది నెలలు కావస్తున్నా కమిషన్ నివేదిక ఇవ్వలేదు. దీంతో కనీసం మధ్యంతర భృతైనా ఇవ్వండంటూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇవ్వలేమని ప్రభుత్వం తెగేసి చెప్పింది. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకైనా ఓ మాటైనా చెప్పండి చాలు అంటూ ఏపీ ఎన్జీవో సంఘం మాజీ నేత పరుచూరి అశోక్‌బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆ బాధ్యతలు అప్పగించారు. యనమలతో జరిగిన చర్చల్లో 20 శాతం ఐఆర్‌కు పరుచూరి అండ్‌కో అంగీకరించడం.. ఆ వెంటనే చిట్టచివరి కేబినెట్లో ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటిస్తున్నాం. అమలు మాత్రం జూలై నుంచి చేస్తాం అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం మేతో ముగియనుంది. పైగా మరో వారం పది రోజుల్లో ఎన్నికల కోడ్ అమలుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం తమను మభ్య పెట్టేందుకే ప్రభుత్వం ఐఆర్‌ను ప్రకటించిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 31,452 మంది ఉద్యోగులున్నారు. వారిలో 2,708 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 39,297 మంది పని చేస్తుండగా, వారిలో 2956 మంది మహిళలున్నారు. ఇక స్థానిక సంస్థలైన లోకల్ బోర్డుల్లో 11,232 మంది పని చేస్తున్నారు, వీరిలో 2,679 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇక 15 వేల మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. వీరంతా ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. గతంలో ఐఆర్ ఎప్పుడు ప్రకటించిన ఆ మరుసటి నెల నుంచే సర్దుబాటు చేసేవారని, కానీ ఇలా ప్రకటించిన ఆరు నెలలకు ఐఆర్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదంటున్నారు. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉంటుందో? పోతుందో? తెలియదు. అలాంటప్పుడు ఇలా అర్థంపర్థం లేని మధ్యంతర భృతిని ప్రకటించి ఉపయోగమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి గిమ్మిక్కులు ఎన్ని చేసినా చంద్రబాబును మాత్రం ఈసారి నమ్మే ప్రసక్తే లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు తేల్చి చెబుతున్నాయి. -
ఉద్యోగులకు పీఆర్సీ అలవెన్సులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పదో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) సిఫార్సు ల ప్రకారం వివిధ రకాల అలవెన్సులు వర్తింపజే స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫార్సుల ప్రకా రం అలవెన్సులకు సంబంధించిన జీవోలు ఇవ్వాలని ఉద్యోగులు నెలల తరబడి కోరుతున్నా, ప్రభుత్వం సమీక్షల పేరుతో నాన్చుతూ వచ్చిం ది. ఈ నెల 17 నుంచి అసెం బ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై విపక్షం వైఎస్సార్ సీపీ నిలదీస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల ఉద్యోగులకు పీఆర్సీ సిఫార్సుల ప్రకారం పలు రకాల భత్యాలు (అలవెన్సులు) అమల్లోకి తెస్తున్నట్లు ఆర్థికశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది. ఇవీ అలవెన్సులు: ఉద్యోగుల పర్యటనల రవాణా భత్యం (టీఏ), బదిలీ రవాణా భత్యం (టీటీఏ), లీవ్ ట్రావెలింగ్ అలవెన్సు (ఎల్టీసీ), ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్సు (ఎఫ్‌టీఏ), న్యాయశాఖ సిబ్బందికి మిషన్ అలవెన్సు, గ్రేహౌండ్స్ - స్పెషల్ ఇంటెలిజెన్స్- కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు స్పెషల్ అలవెన్సు, ఆర్మ్డ్ పోలీసు హెడ్ కానిస్టేబుళ్లు - కానిస్టేబుళ్లకు ఇన్సెంటివ్ అలవెన్సు, ఉపాధ్యాయులకు స్కౌట్ అలవెన్సు, ఉద్యోగులకు రిస్క్ అలవెన్సు, ఎన్జీవోలకు క్లరికల్ అలవెన్సు, క్లినిక్ అలవెన్సు, నైట్ డ్యూటీ అలవెన్సు వర్తింపజేస్తున్నట్లు వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే థియేటర్ అలవెన్సు, వికలాంగ ఉద్యోగులకు కన్వేయన్స్ అలవెన్సు, జమేదార్లు- డ్రైవర్లు- లిఫ్ట్ ఆపరేటర్లు- నాలుగో తరగతి ఉద్యోగులకు స్టిచ్చింగ్ ఛార్జీలు, ఈఎస్ఐ అలవెన్సు, బ్లడ్ బ్యాంకు అలవెన్సు, రేషన్ అలవెన్సు, లెప్రసీ అలవెన్సు, కబేళా (శ్లాటర్ హౌస్) అలవెన్సు, సూపర్వైజరీ అలవెన్సు, సబ్‌జైలు అలవెన్సు, నిర్వహణ భత్యం, స్పెషల్ పేస్ అలవెన్సు వర్తింప జేస్తున్నట్లు శుక్రవారం రాత్రి జారీ చేసిన 21 జీవోల్లో పేర్కొంది.