సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పదో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) సిఫార్సు ల ప్రకారం వివిధ రకాల అలవెన్సులు వర్తింపజే స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫార్సుల ప్రకా రం అలవెన్సులకు సంబంధించిన జీవోలు ఇవ్వాలని ఉద్యోగులు నెలల తరబడి కోరుతున్నా, ప్రభుత్వం సమీక్షల పేరుతో నాన్చుతూ వచ్చిం ది. ఈ నెల 17 నుంచి అసెం బ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై విపక్షం వైఎస్సార్ సీపీ నిలదీస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల ఉద్యోగులకు పీఆర్సీ సిఫార్సుల ప్రకారం పలు రకాల భత్యాలు (అలవెన్సులు) అమల్లోకి తెస్తున్నట్లు ఆర్థికశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది.
ఇవీ అలవెన్సులు: ఉద్యోగుల పర్యటనల రవాణా భత్యం (టీఏ), బదిలీ రవాణా భత్యం (టీటీఏ), లీవ్ ట్రావెలింగ్ అలవెన్సు (ఎల్టీసీ), ఫిక్స్‌డ్ ట్రావెలింగ్ అలవెన్సు (ఎఫ్‌టీఏ), న్యాయశాఖ సిబ్బందికి మిషన్ అలవెన్సు, గ్రేహౌండ్స్ - స్పెషల్ ఇంటెలిజెన్స్- కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు స్పెషల్ అలవెన్సు, ఆర్మ్‌డ్ పోలీసు హెడ్ కానిస్టేబుళ్లు - కానిస్టేబుళ్లకు ఇన్‌సెంటివ్ అలవెన్సు, ఉపాధ్యాయులకు స్కౌట్ అలవెన్సు, ఉద్యోగులకు రిస్క్ అలవెన్సు, ఎన్‌జీవోలకు క్లరికల్ అలవెన్సు, క్లినిక్ అలవెన్సు, నైట్ డ్యూటీ అలవెన్సు వర్తింపజేస్తున్నట్లు వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే థియేటర్ అలవెన్సు, వికలాంగ ఉద్యోగులకు కన్వేయన్స్ అలవెన్సు, జమేదార్లు- డ్రైవర్లు- లిఫ్ట్ ఆపరేటర్లు- నాలుగో తరగతి ఉద్యోగులకు స్టిచ్చింగ్ ఛార్జీలు, ఈఎస్‌ఐ అలవెన్సు, బ్లడ్ బ్యాంకు అలవెన్సు, రేషన్ అలవెన్సు, లెప్రసీ అలవెన్సు, కబేళా (శ్లాటర్ హౌస్) అలవెన్సు, సూపర్‌వైజరీ అలవెన్సు, సబ్‌జైలు అలవెన్సు, నిర్వహణ భత్యం, స్పెషల్ పేస్ అలవెన్సు వర్తింప జేస్తున్నట్లు శుక్రవారం రాత్రి జారీ చేసిన 21 జీవోల్లో పేర్కొంది.
ఉద్యోగులకు పీఆర్సీ అలవెన్సులు
Published Sat, Dec 12 2015 3:27 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement