మొదటికొచ్చిన ఏఎన్‌ఎంల పంచాయితీ | Sarkar did not solve the problems even after the strike was called off | Sakshi

మొదటికొచ్చిన ఏఎన్‌ఎంల పంచాయితీ

Published Fri, Oct 6 2023 1:54 AM | Last Updated on Fri, Oct 6 2023 1:54 AM

Sarkar did not solve the problems even after the strike was called off - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సుల్తాన్‌ బజార్‌: రెండో ఏఎన్‌ఎంల ఆందోళన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసి అధికారుల హామీతో విరమించిన ఏఎన్‌ఎంలు... హామీలు నెరవేరకపోవడంతో తిరిగి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌ ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గత కొన్నాళ్లుగా ఏఎన్‌ఎంలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 16 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవగా ప్రభుత్వం నాలుగుసార్లు వారితో చర్చలు జరిపింది.

సెప్టెంబర్ ఒకటిన యూనియన్‌ నేతలతో జరిగిన చర్చల్లో ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించింది. దీంతో ఒప్పందం ప్రకారం అదే నెల నాలుగో తేదీ నుంచి ఏఎన్‌ఎంలు సమ్మె విరమించారు. ఒప్పందంలో భాగంగా సెపె్టంబర్‌ నెల 15గా పీఆర్సీ బకాయిలతోపాటు సమ్మె కాలపు వేతనాన్ని ఈ నెల జీతంతో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ సమ్మె విరమించి నెల రోజులైనా ఇప్పటివరకు తమ డిమాండ్లను పరిష్కరించలేదని ఏఎన్‌ఎంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆందోళనకు దిగారు. 

ఇవీ ప్రధాన డిమాండ్లు... 
♦ నోటిఫికేషన్లో ఇచ్చిన బేసిక్‌ పేతో 100 శాతం గ్రాస్‌ శాలరీ ఇవ్వాలి. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, ఏఎన్‌ఎంలు దురదృష్టవశా త్తూ మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేíÙయాను అందించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి 6 నెలల్లోగా కారుణ్య నియామకం కింద కాంట్రాక్ట్‌ ఉద్యోగాన్ని ఇవ్వాలి. 
♦ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత పూర్తి కాలానికి గ్రాట్యుటీ చెల్లించాలి. 
♦ సమ్మె కాలానికి సంబంధించిన జీతం విడుదల చేయాలి. 
♦ కరోనాకాలంలో మరణించిన రెండో ఎఎస్‌ఎంలను గుర్తించి వారి కుటుంబాలకు రూ. 5 లక్ష ల ఎక్స్‌గ్రేíÙయా చెల్లించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి కాంట్రాక్ట్‌ బేసిక్‌ లోనైనా సరే కారుణ్య నియామకం చేపట్టాలి. 
♦  యూపీహెచ్‌సీల్లో పనిచేసే వారికి కూడా íపీహెచ్‌సీ వాళ్లకు ఇచ్చినట్లే రెండు మార్కుల వెయిటేజీ ఇవ్వాలి.  
♦ నవంబర్‌ 10న జరిగే పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా అక్టోబర్‌ 10 నుంచి నవంబర్‌ 10 వరకు వేతనంతో కూడిన ప్రిపరేషన్‌ హాలిడేస్‌ ఇవ్వాలి. 
♦  పీహెచ్‌సీల్లో ఫస్ట్‌ ఏఎస్‌ఎంలు లేని సబ్‌ సెంటర్లలో పనిచేస్తున్న రెండో ఏఎస్‌ఎంకు రూ. 10 వేల అదనపు వేతనాన్ని అందించాలి. 
♦   8 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైనా రిపోర్టు పంపాలని ఒత్తిడి చేయకూడదు. 
♦  యూనిఫాం అలవెన్స్‌ కింద రూ. 4,500 ఇవ్వాలి. 
♦  లక్ష్యాలను నిర్దేశిస్తూ జీతాలను నిలిపే ప్రక్రియను ఆపాలి. 
♦  సమ్మె సందర్భంగా ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను ఉపసంహరించుకోవాలి. 
♦  వివాహం కాకముందు ఉద్యోగంలో నియమితులైన ఏఎస్‌ఎంలను వారి భర్తల సొంత మండలాలకు బదిలీ చేయడానికి అవకాశం కల్పించాలి. ∙పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే ఓఎంఆర్‌ షీట్‌తో నిర్వహించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement