సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి
Published Fri, Aug 19 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
షాద్‌నగర్‌రూరల్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట సెకండ్ ఏఎన్‌ఎంలు చేపట్టిన సమ్మె గురువారం 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ కమిటీభ్యులు యాదగిరి మాట్లాడుతూ సెకండ్ ఏఎన్‌ఎంలు 32రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచి ఎమ్మెల్యేలకు లక్షల్లో వేతనాలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.. కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయడంతోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షేక్‌వలీ, శివ, లింగం, ఎఎన్‌ఎంలు నిర్మల, సంతోష, సరళ, జ్యోతి, తిరుపతమ్మ, సులోచన పాల్గొన్నారు.
Advertisement
Advertisement