సమస్యల పరిష్కారానికి చర్యలు
సమస్యల పరిష్కారానికి చర్యలు
Published Fri, Sep 9 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
నెల్లూరు(క్రైమ్): సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. గురువారం జిల్లా పోలీసుకార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది. నగరంలోని చిల్ర్డన్స్‌పార్కు ప్రాంతానికి చెందిన వాస్తు రామచంద్రయ్య ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ, మైత్రీసంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన షకీలా సర్వశిక్ష అభియాన్ అధికారులు బిల్లులు ఇవ్వకుండా తనను ఇబ్బందులు పెడుతున్నారనీ, కావలికి చెందిన నాగరాజు కావలి ఏరియా హాస్పిటల్ వద్ద ఆక్రమణల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయనీ, సుబేదార్‌పేటకు చెందిన సురేష్‌బాబు రాధాటాకీస్ సందులో వ్యభిచారిణిలు ఇబ్బందులు పెడుతున్నారనీ తదితర ఫిర్యాదులు అందాయి. దీంతో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు బి. శరత్‌బాబు, పి. సూరిబాబు, క్రైం ఓఎస్‌డీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు ఎన్. కోటారెడ్డి, జి. వెంకటరాముడు, కె. శ్రీనివాసాచారి. ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మాణిక్యరావు, ఎస్‌ఐ బి. శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Advertisement