వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
Published Sun, Sep 4 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
హన్మకొండ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని విలేజీ రెవిన్యూ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్కల ప్రవీణ్ కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ డైరెక్టు రిక్రూట్ అయిన వీఆర్‌ఏలు హన్మకొండలోని ఏకశిల పార్కువద్ద చేపట్టిన దీక్షలు శనివారం మూడో రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా వీఆర్‌ఏలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ వీఆర్‌ఏ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్కల ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ పట్ల చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన రాతlపరీక్ష ద్వారా ఎంపికైన తమకు కనీస వేతనం చెల్లించడం లేదని ఆరోపించారు.కనీస వేతనం చెల్లించాలని, మూడు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి పదోన్నతులు కల్పించాలని, మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని, పదోన్నతుల వాటా 30 నుంచి 70 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుల్ల కరుణాకర్, ఇజ్జిగిరి సతీష్, రమేష్, సురేష్, రాము, శరత్, కృష్ణ, మండల దేవిక, కంది శిరీష తదితరులు పాల్గొన్నారు.
Advertisement