జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
Published Mon, Aug 22 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
మంచిర్యాల టౌన్ : జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీయూడబ్లు్యజే(ఐజేయూ అనుబంధం) ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవోకే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేసి, ఆర్డీవో కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీయూడబ్లు్యజే జిల్లా అధ్యక్షుడు రూపిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మద్దతుగా జేఏసీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు గురిజాల రవీందర్‌రావు, బాబన్న, అందుగుల శ్రీనివాస్, మేరడిగొండ శ్రీనివాస్, పుట్ట మదు, చిట్ల సత్యనారాయన, గరిగంటి కొమురయ్య, శ్రీపతి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమలాకర్‌రావు, నరేడ్ల శ్రీనివాస్, వంగల దయానంద్, విద్యార్థి సంఘాల నాయకులు తిరుమల్‌రావు, చిప్పకుర్తి శ్రీనివాస్ తదితరులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
టీయూడబ్లు్యజే జిల్లా ప్రధాన కార్యదర్శి యెర్రం ప్రభాకర్, కోశాధికారి చొక్కారపు శ్రీనివాస్, ఐజేయూ సభ్యుడు మంగపతి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఎండి. రహమాన్, పుల్యాల రాజు, నాయకులు లాక్కకుల శ్రీనివాస్, సంజీవరెడ్డి, డేగ సత్యం, సంతోశ్, వినోద్, రఫీక్ అహ్మద్, కార్యవర్గ సభ్యులు రమేశ్, దేవరాజ్, కాచం సతీశ్, తూర్పుజిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
ర్యాలీ, కలెక్టర్‌కు వినతి
ఆదిలాబాద్ రూరల్ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ చేరుకొని జిల్లా కలెక్టర్ జగన్మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఏమాజీ, విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, తదితరులు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుల సంఘాల నాయకులు మహేందర్‌రెడ్డి, అనిల్‌రావ్, షాహిద్ తావకల్, శ్రీనివాస్, రవిందర్, చంద్రశేఖర్, అజయ్ ఉన్నారు.
Advertisement