భోజనాన్ని పరిశీలిస్తున్న ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకష్ణ
హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి
Published Sun, Aug 7 2016 9:30 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
– ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు దుర్భరమైన పరిస్థితుల్లో గడుపుతున్నారని వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టళ్లను ఏఐఎస్‌ఎఫ్ ఆ«ధ్వర్యంలో సందర్శించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ హాస్టళ్లను అభివద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు అమలుచేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారని, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ హాస్టళ్లలో మాత్రం దొడ్డుబియ్యం పాలిష్‌చేసి వడ్డిస్తున్నారని ఆరోపించారు. ఇరుకుగదుల్లో, అద్దె భవనాల్లో హాస్టళ్లు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేతూరి ధర్మతేజ, డి.రాము, జిల్లా నాయకులు కష్ణ, ప్రత్యూష్, నాగరాజు, యువజన సంఘం నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement