AISF
-
ట్విట్టర్లో పోస్టులు తప్ప పాలన చేతకాని దద్దమ్మలు
-
చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంపై AISF విద్యార్థి సంఘాల ఆందోళన
-
సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు
నాంపల్లి (హైదరాబాద్): రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు కళ్లెం వేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఫ్ల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు వేర్వేరుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రసంగిస్తూ.. కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కార్యాల యం గేట్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు రజనీకాంత్, ఇతర నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఇంటర్మీడియెట్ బోర్డ్ కమిషనర్ శృతి ఓజాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాగా, రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల అక్రమాలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు నాగరాజు తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నేతల అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు పీఎస్ వద్ద ఉంచి వదిలిపెట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, అనుమతులు లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేయాలని కోరుతూ ముట్టడి నిర్వహించారు. -
విభజన హామీలపై 25న మానవహారం
వైవీయూ : విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా కోటిమందితో మానవహారం నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి. దస్తగిరి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహలు మానవహారంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేకప్యాకేజి, గిరిజన, సెంట్రల్, మైనింగ్ యూనివర్సిటీల ఏర్పాటు, పోలవరం పూర్తి, ఎయిమ్స్, మెట్రోలైన్స్, రాజధాని నిధులు తదితర హామీలను నెరవేర్చాలంటూ మానవహారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శివ, మధు, శివకుమార్, పుల్లయ్య, రాజేంద్ర, ప్రసాద్ పాల్గొన్నారు. కడప వైఎస్సార్ సర్కిల్ : విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరు తూ ఈనెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందితో మానవహారాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దీక్షలు చేయడం అధికారాన్ని దుర్విని యోగం చేయడమేనన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు సదస్సులు, చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో మైదుకూరులో సీపీఐ జిల్లా మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ సభల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేశు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, నాగసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం
సాక్షి, కేయూ క్యాంపస్: మతోన్మాద శక్తులపై, విద్యారంగ సమస్యలపై పోరాడాలని కేరళ మాజీ మంత్రి, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి భినయ్ విశ్వం పిలుపునిచ్చారు. అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జాతీయ సమితి సమావేశాలు కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగంలోని సెమినార్‌హాల్‌లో శనివారం ప్రారంభమయ్యా యి. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రీ అధ్యక్షత వహించిన ఈ సభలో బినయ్ విశ్వం ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల్లో మతోన్మాద శక్తుల దాడులు పెరిగిపోయాయని తెలిపారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన యూ నివర్సిటీల్లో కుల,మత రాజకీయాలు తగదన్నారు. దేశంలో అక్కడక్కడ బాబాలు, దొంగస్వాములు ఆశ్రమ విద్యాలయాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నా మోదీ ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా ఎఫ్‌డీఐ పేరుతో విదేశీ యూనివర్సిటీలను తీసుకొచ్చే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని ఐసీహెచ్ఆర్ చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన హిస్టరీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్‌రావును నియమించుకున్నారని ఆరోపించారు. 1992 డిసెంబర్ 6న హిందుత్వ మతోన్మాదులు బాబ్రీ మసీద్‌ను కూల్చివేశారన్నారు. శాస్త్రీయ విద్యావిధానం అవసరం న్యూ ఇండియా న్యూ ఎడ్యూకేషన్ తో దేశం ముందుకెళ్లాలంటే పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా, విద్యా వ్యతిరేక విధానాలను ఏఐఎస్ఎఫ్ జాతీ య సమితి సమావేశాల్లో చర్చించి పక్కా ప్రణా ళికతో మిలిటెంట్ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఏఐ ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలనుంచి తప్పుకునేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్, ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఢిల్లీకి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రహీలపర్వీన్ మాట్లాడారు. జాతీయ సమితి సమావేశాల్లో భవిష్యత్ పోరాటాలు చేసేందుకు ఉపక్రమించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వేణు, శివరామకృష్ణ, జాతీయ కార్యవర్గసభ్యులు స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, రంగన్న, పంజాబ్ రాష్ట్రకార్యదర్శి విక్కి మహేశ్వర్, రాజస్తాన్ రాష్ట్ర కార్యదర్శి నితిన్, రాష్ట్ర బాధ్యులు రంజిత్, అశోక్‌స్టాలిన్, రాజారాం, భానుప్రసాద్‌తో పాటు జిల్లా అధ్యక్షుడు కె నరేశ్, గడ్డం నాగార్జున తది తరులు పాల్గొన్నారు. కాగా ప్రారంభ సూచికగా శ్వేత అరుణ పతాకాన్ని ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు ఆవిష్కరించారు. ఈ నెల 7న సాయంత్రం ఈ సమావేశాలు ముగియబోతున్నాయి -
మెడికల్ సీట్ల కేటాయింపులో రూ.100 కోట్ల కుంభకోణం
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ నెల్లూరు(సెంట్రల్): మెడికల్ సీట్ల కేటాయింపులలో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు సుమారు రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ ఆరోపించారు. నెల్లూరులోని సీపీఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రుల కుంభకోణంతో పేద విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశం కోల్పోయారని పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గు చేటన్నారు. అలాగే పేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతిగహాల పరిరక్షణకు యువత ఉద్యమించే తరుణం ఆసన్నమైందన్నారు. పేదలపై కక్ష సాధింపు చర్యలు టీడీపీ ప్రభుత్వం పూనుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతిగహాలను మూసి వేయడం ద్వారా పేద, దళిత విద్యార్థులు విద్యకు దూరమవుతారన్నారు. కార్పొరేట్, ప్రైవేటు రంగాలకు తొత్తులుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ సంక్షేమ వసతిగహాలను మూసి వేయడం దుర్మార్గమన్నారు. ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి యామదాల మధు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించక పోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సునీల్, ఉపాధ్యక్షుడు శ్రీహరి పాల్గొన్నారు. -
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో
దేవరకొండ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ కన్వీనర్ బొమ్ము రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, అనిల్, వెంకటేష్, శివ, సిద్ధు తదితరులున్నారు. -
హోదా తెచ్చే బాధ్యత టీడీపీదే
తణుకు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై అధికార తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యమాలకు సన్నద్ధం కావాలని, హోదా బాధ్యత ఆ పార్టీదేనని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా అ««దl్యక్ష, కార్యదర్శులు కె.సుధీర్‌బాబు, టి.అప్పలస్వామి సూచించారు. ఆదివారం ఏఐఎస్ఎఫ్ సమావేశం దువ్వలో నరాల పెద్దిరాజు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ ఆం్ర««దlప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం గండి కొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు, రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రణాళిక లోటు భర్తీకు తగిన నిధులు తదితర ప్రధాన హామీలన్నింటినీ నీటిమీద రాతలుగా మార్చేందుకు కేంద్రం సిద్ధమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం హోదా ఉద్యమాలకై కలిసి రాకపోతే 13 జిల్లాల్లోనివిద్యార్థులు, నిరుద్యోగులు క్షమించరని సుధీర్‌బాబు అన్నారు. రాష్ట్రంలోని లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదానే మార్గమన్నారు. ఏఐఎస్ఎఫ్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మారిశెట్టి నాగరాజును ఎన్నుకున్నారు. వానపల్లి బుజ్జిబాబు, మద్దూరి బాలాజీ, వి.రాజు, మారం రామాంజనేమయులు పాల్గొన్నారు -
విద్యార్థులను విస్మరిస్తున్న సీఎం
కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా ముకరంపుర : స్వరాష్ట్రంలో విద్యార్థులకు సమస్యల్లేకుండా చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ విస్మరించారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బోనగిరి మహేందర్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ఎస్సీ బాలబాలికల కళాశాల నూతన హాస్టల్‌ను ప్రారంభించాలని కోరారు. హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ విద్యాసంవత్సరానికి 800లకు పైగా విద్యార్థులు హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకున్నా పాలకులు స్పందించడం లేదన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జేరిపోతుల జనార్దన్, బాలసాని లెనిన్, మచ్చ రమేశ్, సంగెం మధు, పులి రాకేశ్, అంబ్రిష్, అజయ్, బోయిని నరేశ్, కొంకటి ప్రశాంత్, వంశీ, శ్రావణ్, ఈశ్వర్, భాస్కర్, జ్యోతి, స్వప్న, సరిత, శారద తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి వార్డెన్లపై చర్య తీసుకోవాలి
అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గంలో సంక్షేమ వసతిగృహాల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి కె.బాలగౌడు అన్నారు. ఆదివారం అచ్చంపేట ఆర్అండ్బీ అతిథిగహంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ వార్డెన్లు అవినీతికి పాల్పడుతూ విద్యార్థుల పొట్టగొడుతున్నారని ఆరోపించారు. కొన్ని హాస్టల్ వార్డెన్లు విద్యార్థుల సంఖ్య అధికంగా రిజిస్టర్లలో నమోదు చేస్తూ వారిపేరుమీద డబ్బులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలో జిల్లా అధికారులు చొరవ చూపడంలేదని, హాస్టల్స్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మిషన్లు పనిచేయడంలేదని అన్నారు. మెనూప్రకారం భోజనం అందించడంలేదని, నాసిరకం ఆహారపదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారులకు తెలియజేస్తామని, పరిష్కారం కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజునాయక్, కుర్మయ్య, బిక్షపతి, శ్రీరామ్, రమేష్, నిరంజన్, శివ, మల్లేష్ పాల్గొన్నారు. -
విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి
భూపాలపల్లి: స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. సమాఖ్య 81వ ఆవిర్భావ వేడుకలను భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. సమాఖ్య జెండాను ఆవిష్కరించిన అనంతరం 80 మీట ర్ల పతాకంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాని కి పూల మాలలు వేశారు. అనంతరం జూని యర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో శివరామక్రిష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానంటూ మభ్యపెడుతూ ఆంధ్రా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిన్నారపు రోహిత్, ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్, నాయకులు మట్టి సర్వేష్, భగత్, వెంకటేష్, నవీన్, రాజేందర్, మహేందర్, సీపీఐ నాయకులు రాజ్‌కుమార్, రమేష్ పాల్గొన్నారు. -
విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి
భూపాలపల్లి: స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. సమాఖ్య 81వ ఆవిర్భావ వేడుకలను భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. సమాఖ్య జెండాను ఆవిష్కరించిన అనంతరం 80 మీట ర్ల పతాకంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాని కి పూల మాలలు వేశారు. అనంతరం జూని యర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో శివరామక్రిష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానంటూ మభ్యపెడుతూ ఆంధ్రా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిన్నారపు రోహిత్, ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్, నాయకులు మట్టి సర్వేష్, భగత్, వెంకటేష్, నవీన్, రాజేందర్, మహేందర్, సీపీఐ నాయకులు రాజ్‌కుమార్, రమేష్ పాల్గొన్నారు. -
హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి
– ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ మహబూబ్‌నగర్ విద్యావిభాగం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు దుర్భరమైన పరిస్థితుల్లో గడుపుతున్నారని వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టళ్లను ఏఐఎస్ఎఫ్ ఆ«ధ్వర్యంలో సందర్శించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ హాస్టళ్లను అభివద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు అమలుచేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారని, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ హాస్టళ్లలో మాత్రం దొడ్డుబియ్యం పాలిష్‌చేసి వడ్డిస్తున్నారని ఆరోపించారు. ఇరుకుగదుల్లో, అద్దె భవనాల్లో హాస్టళ్లు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేతూరి ధర్మతేజ, డి.రాము, జిల్లా నాయకులు కష్ణ, ప్రత్యూష్, నాగరాజు, యువజన సంఘం నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్య కాషాయీకరణ
ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రి గుంటూరు వెస్ట్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్య కాషాయీకరణ వేగవంతమైందని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రి తెలిపారు. ఏఐఎస్ఎఫ్ 80వ వార్షికోత్సవం శనివారం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి లాడ్జిసెంటర్‌లోని మహిమా గార్డెన్స్ వరకు ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో వలి ఉల్లాఖాద్రి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హర్యానా రాష్ట్రంలో దొంగబాబా చర్రితను పాఠ్యాంశాల్లో చేర్చడాన్ని ఖండించారు. విశ్వవిద్యాలయాలకు ఆర్ఎస్ఎస్ వ్యక్తులను వీసీలుగా నియమిస్తూ విద్యావ్యవస్థను మత పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థి సంఘ నాయకులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశంలో సుమారు లక్ష పాఠశాలలను మూసివేయించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన విమర్శించారు. విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి.. పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ దేశంలో కలుషితమైన రాజకీయాల నుంచి ప్రజలను విముక్తి చేసే సత్తా విద్యార్థులకే ఉందన్నారు. పాలకులు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను విద్యార్థులు ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించి, యువతకు అన్యాయం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ మాజీ వైస్ చాన్సలర్ వియన్నారావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు బయ్యన్న, ప్రజానాట్య మండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు గని, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె.రామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, తక్షణమే ఏపీకి హోదా ప్రకటించాలని తదితర తీర్మానాలను సభలో ఆమోదించారు. -
‘వ్యాపారమయంగా విద్యారంగం’
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : సీఎం కేసీఆర్ పాలనలో విద్యారంగం పూర్తిగా వ్యాపారీకరణగా మారిందని, ఎంట్రెన్స్ పరీక్షలన్నీ లీకేజీలతో కొ ట్టుమిట్టాడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట ప్రధా న కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. ఏఐ ఎస్ఎఫ్ 81వ వార్షికోత్సం సందర్భంగా శనివా రం జిల్లా కేంద్రంలో ‘కేసీఆర్ పాలనలో విద్యారంగం ఎదుర్కొంటున్న స వాళ్లు’ అనే అంశంపై జిల్లా అధ్యక్షుడు కేతూరి ధర్మతేజ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంసెట్–2 లీకేజీ వ్యవహారంలో దోషులను పక్కన బెట్టి విద్యార్థులను, బ్రోకర్లను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వి ద్య, ఆరోగ్యశాఖ మంత్రులను మంత్రివర్గం నుం చి తొలగించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జి ల్లా ప్రధాన కార్యదర్శి డి.రాము, కార్యదర్శి సురే‹ Ù, జిల్లా ఆఫీసు బేరర్స్ గిరిగౌడ్, అంజి, కృష్ణ, ప్రత్యూష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రులను అరెస్ట్ చేయాలి
కొల్లాపూర్ : ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేతూరి ధర్మతేజ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. లీకేజీ వ్యవహారం బయటకు వచ్చాక ప్రభుత్వం దోషుల పట్ల మెతక వైఖరి అవలంబిస్తుందన్నారు. ఎంసెట్‌ను రద్దు చేయడం సరైన ప్రక్రియ కాదన్నారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో దోషులుగా తేలిన విద్యార్థుల ర్యాంకులు రద్దు చేస్తే సరిపోతుందన్నారు. కొంతమంది కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను రోడ్డున పడేయడం సరికాదన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నరేష్, మల్లేష్, అమర్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్–2ను రద్దుచేస్తే ఉద్యమిస్తాం
అచ్చంపేట రూరల్: తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి బాలగౌడ్ ఆరోపించారు. గురువారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎంసెట్–2ను రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్–2లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మల్లేష్, రాజు, శివ, కృష్ణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రాజీనామా చేయలంటూ ర్యాలీ
యాదగిరిగుట్ట : ఎంసెట్–2 లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిలు రాజీనామా చేయాలని కోరుతూ గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైకుంఠ ద్వారం నుంచి అమరవీరుల స్థూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. లీకేజీతో ర్యాంకులు పొందిన వారిని అనర్హులుగా ప్రకటించి, మిగతా విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ, తెలంగాణ యూనివర్సిటీల కన్వీనర్ శంకర్లు కోరారు. ఈ ర్యాలీలో తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన 350 ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
యాదగిరిగుట్ట : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్ధి లోకమంతా ఏకమై ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్ కుమార్ అన్నారు. యాదగిరిగుట్టలో మూడు రోజులుగా జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ముగింపు రోజైన గురువారం ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. మతోన్మాద విధానాలకు, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమించాలన్నారు. విశ్వవిద్యాలయాలను పూర్తి స్థాయిలో నిధులు కేటాయించ కుండా వాటిని నిర్వీర్యం చేస్తూ, ప్రవేట్, విదేశీ యూనివర్సిటీలను ఈ దేశంలోకి తీసుకురావాలని పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యను మరిచి విద్యార్థులకు చదువును దూరం చేస్తుందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు కొమ్ముకాస్తూ నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందకుండా కుట్ర చేస్తుందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలకు పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, కార్పొరేట్, ప్రైవేట్ వ్యక్తులు, సారా వ్యాపారులపై ఉన్న ఆసక్తి విద్యా రంగంపై లేదని ఆరోపించారు. శిక్షణ తరగతుల్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శివరామకృష్ణ, అధ్యక్షులు ఎం.వేణు, రాజారాం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చేపూరి కొండల్, బరిగె వెంకటేష్, ఉదయ్‌కుమార్, బబ్బూరి శ్రీధర్, లలిత, రాధిక, అశ్వీని, భారతీ, బండి జంగమ్మ, గాదెగాని మాణిక్యం తదితరులున్నారు. -
మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం
యాదగిరిగుట్ట: ప్రస్తుతం విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ ఆరోపించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో ప్రచురించిన పాఠ్యపుస్తకాల్లో ఒక వర్గానికి చెందిన మతాలకే అధిక ప్రాధాన్యమిచ్చి, మరో మతం మనోభావాలను దెబ్బతీసేలా యత్నించిందన్నారు. విద్యాహక్కు చట్టాలను తుంగలో తొక్కి బలహీన వర్గాలకు విద్యను అందని ద్రాక్షలా మారుస్తోందని విమర్శించారు. కులం, మతం పేరుతో విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, తెలంగాణ యూనివర్సిటీల కన్వీనర్ ఆర్.ఎన్.శంకర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండల్, వెంకటేష్, బబ్బూరి శ్రీధర్‌గౌడ్ ఉన్నారు. -
మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోన్న కేంద్ర సర్కార్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉమర్ ఖాద్రి విమర్శించారు. యాదగిరిగుట్టలోని భవ్య ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో మాట్లాడుతూ..కులం మతం పేరుతో విద్యార్థుల మధ్య కేంద్రం చిచ్చు పెడుతున్నదని దుయ్యబట్టారు. విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదన్నారు.తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యను గాలికి వదిలేసి ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, తెలంగాణ యూనివర్సీటీల కన్వీనర్ శంకర్, తదీతరులు పాల్గొన్నారు. -
ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ ర్యాలీ
వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగార నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలంటూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువత సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగులు రాయచోటిపట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ..జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే పొందుపరిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరించి వైఎస్సార్ జిల్లాపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాయలసీమలో ఎర్రచందనం, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని వాటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. కడపలో హైకోర్టు శాఖ ఏర్పాటు చేయడంతో పాటు, మూతపడిన నందలూరు ఆల్వీన్, చెన్నూరు చక్కెర, ప్రొద్దుటూరు పాల కర్మాగారాలు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
26 నుంచి ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులు
నల్లగొండ టౌన్ : యాదగిరిగుట్టలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని బరిగెల వెంకటేష్ పిలుపునిచ్చారు. బుధవారం శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవంలబిస్తున్న విద్యా, వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సయ్యద్ జమీర్, ఇ.వెంకటేష్, అశోక్, మందుల శేఖర్, మధు, లింగస్వామి, సుధాకర్, రాజీవ్, రవి పాల్గొన్నారు. -
ఏఐఎస్ఎఫ్ నేతలపై కేసులు
విజయవాడ: విజయవాడలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ సభలో జరిగిన ఘటనపై 30 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ సభలో తనపై ఏఐఎస్ఎఫ్ నేతలు దాడి చేశారని, తను ప్రదర్శించిన జాతీయ జెండాను చించివేశారంటూ బీజేవైఎం నేత అనిల్ కుమార్ శుక్రవారం గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు... ఏఐఎస్ఎఫ్ నేత లెనిన్ సహా 30 మందిపై 324, 323, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
కొట్టుకున్న విద్యార్థి సంఘాల నాయకులు
అనంతపురం జిల్లా ఉరవకొండలో విద్యార్థి సంఘాల ఆందోళ ఘర్షణకు దారితీసింది. ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ నాయకులు పరస్పరం దాడులకు దిగారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్నయ్య పై కేసుకు నిరసనగా.. ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఏబీవీపీ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో మాట మాట పెరిగి ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. చివరకు అక్కడున్న పాత్రికేయులు జోక్యం చేసుకుని వారిని విడిపించాల్సి వచ్చింది. -
విద్య కాషాయికరణను వ్యతిరేకించండి
- ఏఐఎస్ఎఫ్ పిలుపు విజయవాడ (గాంధీనగర్) విద్య ప్రైవేటీకరణ, కాషాయీకరణను వ్యతిరేకించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ 46వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహాసభల తొలిరోజు విజయవాడ జింఖానా మైదానంలో జరిగిన బహిరంగ సభలో విశ్వజిత్ మాట్లాడారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విద్యావ్యవస్థపై రుద్దుతోందన్నారు. విశ్వవిద్యాలయాల్లోకి హిందుత్వశక్తులను చొప్పించి కలుషితం చేస్తున్నారన్నారు. కాషాయీకరణకు అనుకూలంగా వ్యవహరించేవారినే వైస్చాన్సలర్లుగా నియమిస్తోందన్నారు. దేశ సమైక్యతకు విఘాతం కలిగించేశక్తులపై పోరాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం తగ్గిపోతుందన్నారు. యువత రాజకీయాల్లో ప్రవేశించడం ద్వారా దేశానికి సరైన నాయకత్వం లభిస్తుందన్నారు. ప్రభుత్వరంగంలో విద్యను బలోపేతం చేయాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు నెలకొల్పేందుకు అనుమతిస్తూ తీసుకున్ని నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని, యూనివర్సిటీలను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ నవసమాజ నిర్మాణానికి విద్యార్థులు నడుంబిగించాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి మతోన్మాద శక్తులే కారణమన్నారు. చై.నా చేతుల్లోకి విద్యావ్యవస్థ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చై.నా( చైతన్య, నారాయణ) సంస్థల చేతుల్లో పెట్టారన్నారు. మంత్రి పి.నారాయణకు విద్యారంగాన్ని దోచుకోవడమే తప్ప ఇంకేమీ పట్టదన్నారు. ధనికులు మాత్రమే చదువుకొనేందుకు వీలుగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తెచ్చారన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ముంచుకొస్తోందన్నారు.. ప్రభుత్వం ఓవైపు ప్రభుత్వ పాఠశాలలను మూసివేయిస్తూ, మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు పరోక్షంగా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఉద్యమాలు, పోరాటాల ద్వారా విద్యావ్యవస్థను పరిరక్షించుకోవాలని సూచించారు. నిరంతర పోరాటాలతో హక్కులు సాధించుకోవాలన్నారు. మహాసభలకు 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, విద్యార్థులు హాజరయ్యారు. తొలుత ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్‌కు నివాళులర్పించారు. -
'ఎస్సీ బాలుర హాస్టలును కొనసాగించాలి'
బేతంచెర్ల: కర్నూలు జిల్లా బేంతచెర్ల చుట్టుపక్కల గ్రామీణ విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ ను మూసివేయాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఐ అనుబంధ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. విద్యార్థులతో కలిసి బుధవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు భార్గవ్ మాట్లాడుతూ దళితులు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి అని ప్రచారం చేసి నేడు అధికారం చేపట్టగానే దళితుల నడ్డి విరిచే విధంగా ప్రణాళికలు రుపొందించడం దారుణమని బాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. రేపో, మాపో పడినోయే అద్దెభవనంలో వసతి గృహాన్ని నిర్వహిస్తూ కనీస మౌలిక వసతులు కల్పించకుండా నిత్యం సమస్యలు తాండ విస్తుంటే విద్యార్థులు అందులో ఎందుకు చేరతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల పట్ల నిరంకుశధోరణితో వ్యవహిరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ హనుమంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. -
డిగ్రీలో సెమిస్టర్ విధానం వద్దు: ఏఐఎస్ఎఫ్
అనంతపురం అర్బన్ : డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానం అమలు ఆలోచనను విరమించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పలువురు విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు. ఈ విధానంతో గ్రామీణ విద్యార్థులు నష్టపోయే అవకాశమున్నందున, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు కోరారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. -
పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి : ఏఐఎస్ఎఫ్
అనంతపురం : ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో అటు ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు. మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్‌తో మంగళవారం అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జాన్సన్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే అన్నారు. యాజమాన్యాలతో అధికారులు లాలూచిపడి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో శ్రీరాములు, మురళీ, పవన్, సాయి, రాజశేఖర్, చరణ్, దాదాపీరా, హరికృష్ణ, కుమార్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు. -
'బాబు'కు మద్యాభిషేకం
నెల్లూరు (సెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి నెల్లూరులో ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్యంతో అభిషేకం చేశారు. పాఠశాలలు, వసతిగృహాల సమీపంలో మద్యం షాపుల ఏర్పాటును నిరసిస్తూ నెల్లూరు గాంధీబొమ్మ సెంటరులో శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాబు చిత్రపటాన్ని మద్యంతో అభిషేకించారు. -
కార్పొరేట్ విద్యా వ్యాపారాలపై కన్నెర్ర
'సాక్షి' కథనంతో కదలిన విద్యార్థి సంఘాలు అనంతపురం (గుంతకల్లు): విద్యా వ్యాపారానికి డోర్లు తెరిచిన కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేశాయి. శుక్రవారం 'సాక్షి' దినపత్రికలో 'ఫీజులుం' విద్యా వ్యాపారినికి డోర్లు తెరిచిన స్కూళ్లు' అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు స్పందించారు. అక్రమ డొనేషన్లు, విచ్చలవిడిగా ఫీజుల వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేయడాన్ని నిరసిస్తూ వారు శ్రీచైతన్య-2, భాష్యం, విజ్ఞాన్ స్కూళ్ల వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆయా పాఠశాలల యాజమాన్యాలతో వాదనకు దిగారు. ఆయా స్కూళ్ల ఫ్లెక్సీలను చించేశారు. అనంతపురం పట్టణం ధర్మవరం గేట్ వద్దనున్న విజ్ఞాన్ స్కూల్ భవనంలో అనధికారికంగా నిర్వహిస్తున్న విఘ్నేశ్ బుక్స్‌కౌంటర్ సీజ్ చేయాలని బైఠాయించారు. మండల విద్యాధికారి కుళ్లాయప్ప విజ్ఞాన్ స్కూల్ వద్దకి చేరుకుని అక్రమంగా రప్పించి విఘ్నేశ్ బుక్‌స్టాల్‌ను సీజ్ చేయించారు. కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యలతో కుమ్మక్కయ్యారని ఎంఈఓ పై విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వానికి, విద్యాధికారులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బాసిద్, రమేష్‌లు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వాటిని ఖాతరు చేయకుండా స్కూళ్లను తెరిచి అక్రమంగా అడ్మిషన్లను నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రవేట్ పాఠశాలల్లోనే బుక్స్‌స్టాల్స్‌ను నిర్వహించడమే కాకుండా అత్యధిక ధరలను నిర్ణయించి పుస్తకాలను అమ్మే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చేరే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వేలకు వేలు డొనేషన్లు, వివిధ రకాల ఫీజులను వసూలు చేస్తున్నా విద్యాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని వారు దుయ్యబట్టారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రూ.1 లక్షకు పైగా విలువ చేసే పుస్తకాలు కలిగిన విఘ్నేశ్ బుక్స్ కౌంటర్‌ను ఎంఈఓ సీజ్ చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు పోలీసుల జోక్యంతో విద్యార్థి నాయకులు ఆందోళన విరమించారు. కాగా భాష్యం స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఆ స్కూల్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన పలువురు విద్యార్థి నాయకులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
కార్పొరేట్ పాఠశాలల్లో ఫర్నిచర్ ధ్వంసం
గుంతకల్: కార్పొరేట్ పాఠశాలల్లో అక్రమంగా పెద్ద ఎత్తున డొనేషన్లు వసూలు చేస్తున్నారంటూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. పుస్తకాలను అధిక ధరలకు విద్యార్థులకు విక్రయిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు కార్పొరేట్ పాఠశాలల్లోకి విద్యార్థి నాయకులు చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యపై మోదీ మారాలి
హిమాయత్‌నగర్ : విద్యారంగంలో మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా విదేశాలు తిరిగేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇష్టపడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్ కుమార్ విమర్శించారు. విద్యారంగానికి మోడీ ప్రభుత్వం కేటాయిం చిన నిధులు కేవలం రెండు శాతమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా నడుస్తున్న ఏఐఎస్ఎఫ్ విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా శిబిరాలు గురువారంతో ముగిశాయి. హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూంభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వజిత్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మోదీ వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యకు ఒనగూడిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఇప్పటికీ 40శాతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో మంచినీరు, మరుగుదొడ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడిదార్లకు విద్యావ్యవస్థను హస్తగతం చేసేందుకు ద్వారాలు తెరుస్తున్నారని ఆరోపించారు. -
21 నుంచి ఏఐఎస్ఎఫ్ జాతీయ సమావేశాలు
హైదరాబాద్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ సమావేశాలు ఈనెల 21 నుంచి తిరుపతిలో జరుగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ ప్రారంభించనున్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నేతలు బయ్యన్న, స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. 23 రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారని చెప్పారు. సమావేశాల్లో కేంద్రం అనుసరిస్తున్న విద్యార్థి వ్య తిరేక విధానాలపై చర్చించనున్నామన్నారు. అలాగే విద్య కాషాయికరణ, మైనారిటీ విద్యాసంస్థలపై దాడులు, విద్య వ్యాపారీకరణ తదితర అంశాలపై చర్చి స్తామన్నారు. సర్కారీ విద్య నుంచి పేద విద్యార్థులను దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సమాయత్తమవుతున్నట్లు వెల్లడించారు. -
కదిలించిన ‘సాక్షి’ కథనం
కామారెడ్డి: ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దిన కామారెడ్డి ప్రభుత్వ కళాశాల దీనస్థితికి చేరుకున్న వైనంపై గత డిసెం బర్ 13న ‘సాక్షి’లో ‘కూలుతున్న విద్యా వృక్షం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం విద్యార్థులను కదిలించింది. ఉద్యమబాట పట్టించి విజయబాటలో పయనించేలా చేసింది. పలువురు ‘సాక్షి’ కథనం క్లిప్పింగులను సామాజిక ప్రసార మాద్యమాలలో ఉంచి షేరింగ్ చేయడంతో, దేశ,విదేశాలలో ఉన్న ఈ ప్రాంతవాసులు సైతం కాలేజీని కాపాడాలంటూ కామెంట్లు పెట్టారు. మొదట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలు కాగా, తరువాత మిగతా సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి దీక్షలలో కూర్చున్నాయి. నెల రోజులుగా దీక్ష లతోపాటు రాస్తారో కోలు, ధర్నాలు నిర్వహించారు. ఆందోళనకు జేఏసీ, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. డిగ్రీ కాలేజీ దీనస్థితిపై ఎప్పటికప్పుడు ‘సాక్షి’లో కథనాలు వెలువడడం, విద్యార్థుల ఆందోళనలతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించి కలెక్టర్ రొనాల్డ్ రాస్తో మాట్లాడారు. దీంతో ఆయన డీసీఓ శ్రీహరిని విచారణకు పం పించారు. శుక్రవారం విప్ జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలను తీసుకుని సీఎంను కలిసి కాలేజీ గురించి చర్చించారు. కాలేజీ యాజమాన్యం ఆస్తులను అప్పగిస్తే వారిని సన్మానిద్దామని, అప్పగించకుంటే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుందామని సీఎం తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్య కమిటీ సభ్యులు ఇప్పటికే ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించడానికి ముందుకు వచ్చారు. ఈ నెల 22న కామారెడ్డిలో సీఎం పర్యటన సందర్భంలో పూర్తి రికార్డులను ప్రభుత్వానికి అప్పగించనున్నారు. విద్యార్థుల్లో హర్షం కాలేజీని స్వాధీనం చేసుకోవడడానికి సీఎం హామీ ఇవ్వడంతో విద్యార్థులలో హర్షం వ్యక్తమవుతోంది. దీంతోపాటు విద్యాభివృద్దికి చర్యలు తీసుకుంటామని సీఎం ప్ర కటిం చిన దరిమిలా విద్యార్థి సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాలేజీని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునేంతవరకు దీక్షలు కొనసాగుతాయని విద్యార్థి జేఏసీ నేతలు పేర్కొన్నారు. -
బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి
గజపతినగరం: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన నయ వంచకులను తక్షణమే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బొండపల్లి మండలం బోడసింగిపేట గ్రామానికి బి. ఆనంద్ అనే విద్యార్థి అదే గ్రామానికి చెందిన విద్యార్థినిని ప్రేమించి పెళ్లి చే సు కుంటానని చెప్పి మోసం చేశాడని ప్రస్తుతం అవిద్యార్థి వయస్సు 17సంవత్సరాలని చెబుతూ తప్పించుకు తిరుగుతన్నాడని మండిపడ్డారు. సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించి నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దత్తిరాజేరు మండలంలోని చిన చామలాపల్లిలో మోసానికి గురైన యువకుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి గర్భం తొలగించిన గజపతినగరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రసన్నలక్ష్మిని, అలాగే పెదమానాపురం ఎస్సై మహేష్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో జిల్లా అంతటా ఆందోళనలను ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ, వి. చంద్రశేఖర్ మాట్లాడుతూ బాధితులకు తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఆందోళనకారుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి,బుగత ఆశోక్, ఏఐఎస్ఎఫ్, జిల్లా సహయ కార్యదర్శి సాయికిరణ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాయిరమణమ్మ, ఎల్, పుణ్యవతి, ఎస్.కె. చాంద్ బీబీ తదితరులు పాల్గొన్నారు. -
ధ్రువీకరణ పత్రాల మంజూరులో జాప్యం
అనంతపురం రూరల్: ఆన్లైన్లో వివిధ ధ్రువీకరణ పత్రాల మంజూరు ప్రక్రియ(ఆన్లైన్)లో జరుగుతున్న జాప్యంపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట వి ద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదా పు రెండు గంటలపాటు బైఠాయించి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయంలో ఆన్లైన్ నమోదు ఆలస్యమవుతోందన్నారు. ఓవైపు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుచేసుకోడానికి గడువు సమీపిస్తోందన్నారు. ఇందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లభించక విద్యార్థులు ఆందోళనకు గురవున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నేతలు, విద్యార్థులు మొదటగా డెప్యూటీ తహశీల్దార్ కుమారస్వామితో వాగ్వాదానికి దిగారు. తహశీల్దార్‌కు మీ సమస్యలు చెప్పుకోవాలని ఆయన సమాధానం ఇ వ్వడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశా రు. అధికారుల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. త్రీ టౌన్ సీఐ దేవానంద్, ఎస్ఐలు తమీమ్, శంకర్‌రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు. అయినా వారు శాంతించలేదు. చివరకు తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషా వచ్చి ఏఐఎస్ఎఫ్ నాయకులతో మాట్లాడారు. 7 వేల మందికి పైగా అభ్యర్థులకు సంబంధించి ఆన్లైన్ చేయాల్సి ఉందన్నారు. మూడు రోజులుగా సర్వర్ డౌన్ కావడం వల్ల జాప్యం అవుతోందన్నారు. వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల వరకు సమయం ఉంటుందన్నారు. అలాంటిది రెండు మూడు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తున్నామన్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందలేనివారు తనను కలిస్తే మాన్యువల్‌గా సంతకం చేసి అందజేస్తామన్నారు. -
ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలి : ఎఐఎస్ఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్ : సాయం కోరుతూ వెళ్లిన అమ్మాయిపై లైంగి క దాడికి పాల్పడిన ఎంఐఎం జిల్లా కన్వీనరు ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలని ఎఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక సప్తగిరి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తె లియజేశారు. ఈ సందర్భంగా ఎఐ ఎస్ఎఫ్ నగర కమిటీ ప్రధానకార్యదర్శి కె.మనోహర్ మాట్లాడుతూ ఇ టీవల కదిరి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని సాయం కోరుతూ ఎంఐఎం జిల్లా కన్వీనరు ఇలియాజ్ వద్దకు వెళ్లిం దని, ఆ సమయంలో బాలికను బెది రించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. పది రోజుల కిందట తాడిమర్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఫలితంగా తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటివి పునరావృతం అవుతున్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పం దించి ఇలియాజ్పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో ఎఐఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు రమణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి కుళ్లాయప్ప, నాయకులు అనిల్, గి రి, మురళీ, అప్పస్వామి, రామాంజి, రవి, నాగేంద్ర పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన విద్యార్థులు
బొబ్బిలి : ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. జిల్లా కార్యదర్శి కోట అప్పన్న ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్దకు ర్యాలీగా చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరగతులకు రానివ్వడం లేదని, కోర్సులు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన వల్ల రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఇచ్చిన గడువు కంటే విద్యార్థులు ఎక్కువ సేపు ఆందోళన చేపట్టడంతో ఎస్సైలు నాయుడు, శేఖర్ సిబ్బందితో అక్కడకు వచ్చి ఆందోళన విరమించాలని కోరారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించమని విద్యార్థులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు విద్యార్థులను బలవంతంగా లేవనెత్తడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు బస్సులు, పోలీస్ వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకుని తర్వాత సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. లాఠీచార్జీ వల్ల నలుగురు విద్యార్థులు గాయపడ్డారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న తెలిపారు. కాగా పోలీసుల తీరుపై సీపీఐ నాయకుడు ఒమ్మి రమణ నిరసన వ్యక్తం చేశారు. సాలూరులో రాస్తారోకో .. సాలూరు:ఫీజు రీయింబర్స్మెంట్,ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహిం చారు. జిల్లా కార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు స్థానిక బోసుబొమ్మ జంక్షన్‌వద్ద ఆందోళనచేపట్టి వాహన రాకపోకలను అడ్డు కున్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ, గురువారం చేపట్టిన ఆందోళనలో తమ నాయకులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు రిబిక, గౌరి, మహేష్, ప్రేమ్‌కుమార్, బాలు, త్రివేణి, వినీత, తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. మాట తప్పొద్దు
- ఇంటికో ఉద్యోగం హామీకి కట్టుబడాలి - డీఎస్సీకి డీఎడ్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయులకు అవకాశం కల్పించాలి - కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయిన విద్యార్థులు - పోలీసుల లాఠీచార్జి.. పలువురి అరెస్టు కర్నూలు(న్యూసిటీ): ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు విమర్శించారు. డీఎస్సీ-2014లో డీఎడ్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు స్థానిక సి.క్యాంప్ నుంచి మద్దూరునగర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ధర్నానుద్దేశించి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. ఇంటికో ఉద్యోగం మాటకు బాబు కట్టుబడాలని.. ఛాత్రోపాధ్యాయులకు డీఎస్సీలో అవకాశం కల్పించకపోతే రెండు సంవత్సరాలు వృథా అవుతాయనే విషయం గ్రహించాలన్నారు. 2008లో అధికారంలోని కాంగ్రెస్ పార్టీ మెగా డీఎస్సీలో ఛాత్రోపాధ్యాయులకు అవకాశం కల్పించిందన్నారు. రానున్న డీఎస్సీలో వీరికి అవకాశం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేశారు. విద్యార్థులు జి.రంగన్న, ఎం.మనోహర్, రమేష్, సోమన్నలను అరెస్టు చేసి మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ధర్నాలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి ఎం.మనోహర్, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి రమేష్, ఏఐఎస్ఎఫ్ నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమన్న, నాయకులు రామానాయుడు, రాజు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం
హైదరాబాద్ : కౌన్సెలింగ్ తేదీలను తక్షణమే ప్రకటించాలంటూ విద్యార్ధులు బుధవారం ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు విద్యార్థులను మధ్యలోనే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చేస్తున్న అన్ని కోర్సుల కౌన్సెలింగ్ తేదీలను ప్రభుత్వం ప్రకటించాలని, అలాగే ప్రకటించిన కౌన్సిలింగ్ తేదీలను వాయిదా వేయటం సరికాదన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. -
టీ సచివాలయం ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
-
ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర విద్యార్థి
మరో నలుగురు జాతీయ కార్యవర్గంలోకి హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలీ ఉల్లా ఖాద్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి నలుగురికి జాతీయ కార్యవర్గంలో చోటు లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ 28వ జాతీయ మహాసభలు శనివారం ముగిశాయి. అనంతరం జాతీయ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వలీ ఉల్లాఖాద్రీని ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఖాద్రీ కాకతీయ వర్సిటీ కామర్స్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బయ్యన్న (అనంతపురం), స్టాలిన్ (మహబూబ్‌నగర్), అయ్యన్న స్వామి(విశాఖపట్టణం), శివరామకృష్ణ (ఖమ్మం) నియమితులయ్యారు.