విద్యపై మోదీ మారాలి
హిమాయత్‌నగర్ : విద్యారంగంలో మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా విదేశాలు తిరిగేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇష్టపడుతున్నారని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్ కుమార్ విమర్శించారు. విద్యారంగానికి మోడీ ప్రభుత్వం కేటాయిం చిన నిధులు కేవలం రెండు శాతమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా నడుస్తున్న ఏఐఎస్‌ఎఫ్ విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా శిబిరాలు గురువారంతో ముగిశాయి.
హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూంభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వజిత్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మోదీ వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యకు ఒనగూడిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఇప్పటికీ 40శాతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో మంచినీరు, మరుగుదొడ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడిదార్లకు విద్యావ్యవస్థను హస్తగతం చేసేందుకు ద్వారాలు తెరుస్తున్నారని ఆరోపించారు.