విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి | Conservation education to rid the | Sakshi
Sakshi News home page

విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి

Published Sat, Aug 13 2016 12:19 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Conservation education to rid the

భూపాలపల్లి: స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో  విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. సమాఖ్య 81వ ఆవిర్భావ వేడుకలను భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. సమాఖ్య జెండాను ఆవిష్కరించిన అనంతరం 80 మీట ర్ల  పతాకంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహాని కి పూల మాలలు వేశారు. అనంతరం జూని యర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో శివరామక్రిష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానంటూ మభ్యపెడుతూ ఆంధ్రా కార్పోరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గిన్నారపు రోహిత్, ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్, నాయకులు మట్టి సర్వేష్, భగత్, వెంకటేష్, నవీన్, రాజేందర్, మహేందర్, సీపీఐ నాయకులు రాజ్‌కుమార్, రమేష్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement